పది నెలల క్రితం ప్రేమ వివాహం.. ఆ తర్వాత ఏమైందంటే? | Dowry Harassment: Married Woman Death Tragedy In Khammam | Sakshi
Sakshi News home page

పది నెలల క్రితం ప్రేమ వివాహం.. ఆ తర్వాత ఏమైందంటే?

Published Wed, Jan 12 2022 10:33 AM | Last Updated on Wed, Jan 12 2022 10:34 AM

Dowry Harassment: Married Woman Death Tragedy In Khammam - Sakshi

లక్ష్మీపురంలో అత్తారింటి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు

సాక్షి, ఖమ్మం: ప్రేమ వివాహం చేసుకున్న పది నెలలకే సదరు యువతి బలవన్మరణానికి పాల్పడింది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బండి మౌనిక పది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఆర్‌.నరేంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. గత ఐదు నెలలుగా ఖమ్మంలోని వరదయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన మౌనిక ఆత్మహత్యాయత్నానాకి పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే.. ఆమె మెడపై గాట్లు ఉన్నాయని, వరకట్నం కోసం వేధించారని తండ్రి చార్లెస్‌ ఖానాపురంహ హవేలి స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నరేంద్రపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. 

లక్ష్మీపురంలో భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన
తల్లాడ: పోస్టుమార్టం అనంతరం మౌనిక మృతదేహాన్ని స్వగ్రామం లక్ష్మీపురం తీసుకెళ్లారు. భర్త నరేంద్ర పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి  నాలుగు రోజుల కిందటే ఊరు విడిచి వెళ్లిపోయారు. అటు తరఫు వారు రాలేదని మృతదేహాన్ని నరేంద్ర ఇంటిముందు రాత్రి 9 గంటల వరకు ఉంచడంతో ఉద్రిక్తత నెలకొంది. వైరా సీఐ వసంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో తల్లాడ, వైరా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 10గంటలదాకా సీఐ ఇరువైపుల పెద్దలతో చర్చించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement