Married woman died
-
తోటలో పనికి వెళ్లిన వివాహిత హత్య
దొడ్డబళ్లాపురం: తోటకు పనికి వెళ్లిన వివాహితను దుండగులు హత్యచేసి గుంతలో పడేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా అక్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చెన్నపట్టణ తాలూకా ద్యావపట్టణ గ్రామానికి చెందిన శ్వేత (24) హతురాలు. ఐదేళ్లుగా ద్యావపట్టణ గ్రామంలో నివసిస్తున్న శ్వేతకు 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త బెంగళూరులో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వారానికి ఒకసారి వచ్చి వెళ్లేవాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తోటలో కూలీ పనికి వెళ్లిన శ్వేత రాత్రయినా తిరిగిరాలేదు. మంగళవారం ఉదయం తోటలో ఒకచోట గుంతలో శ్వేత మృతదేహం లభించింది. ఎవరో దుండగులు ఆమెను హత్య చేసినట్లు తేలింది. అక్కూరు పోలీసులు చేరుకుని జాగిలాలతో ఆధారాల కోసం గాలించారు. -
ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య
దొడ్డబళ్లాపురం: తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో నవ వధువును కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. సౌమ్య (23)హత్యకు గురైన వివాహిత. సుబ్రమణ్య (25) హత్య చేసిన నిందితుడు. సౌమ్య, సుబ్రమణి ఇద్దరూ గతంలో బెంగళూరు నాగవార వద్ద ఉన్న కాఫీడేలో పనిచేసేవారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం సౌమ్య హఠాత్తుగా పనిమానేసింది. రెండు వారాల క్రితం వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సౌమ్య తనను మోసం చేసిందని పగతో రగిలిపోయిన సుబ్యమణ్య సమయం కోసం వేచి చూసాడు. ఇలా ఉండగా బుధవారం సౌమ్య అవతికి వచ్చింది. అదే రోజు రాత్రి సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన సుబ్యమణ్య ఇంట్లో జొరబడి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు పరుగున రావడంతో సుబ్రమణ్య ఇంటి వెనుక నుంచి గోడదూకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పొద్దెక్కిన పావని నిద్రలేవలేదు..శరీరం పచ్చగా మారడంతో) -
అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు..
జలుమూరు(శ్రీకాకుళం జిల్లా): ఆకలంటే అమ్మ తినిపించాలి.. భయం వేస్తే అమ్మను పట్టుకోవాలి.. ఏడిస్తే ఆ తల్లే ఓదార్చాలి. పొద్దస్తమానం అమ్మ కొంగు పట్టుకునే తిరగాలి. ఆరు, ఐదేళ్ల పిల్లల దినచర్య ఇది. కానీ ఇప్పుడా పిల్లలకు ఆకలంటే అమ్మ రాలేదు. భయం వేస్తే తల్లి ఓదార్చలేదు. ఎంత ఏడిచినా అమ్మ పలకడం లేదు. రెండేళ్ల కిందట తండ్రిని పోగొట్టుకున్న ఇద్దరు చిన్నారులకు ఇప్పుడు అమ్మ కూడా దూరమైపోయింది. మండలంలోని అల్లాడపేటకు చెందిన కోట రోహిణి(32) మంగళవారం చెరువులో పడి మృతి చెందారు. చదవండి: ‘అదృశ్యం’లో చిక్కుముడులు.. ‘బూచోడు కొట్టాడు’.. సమాధానం లేని ప్రశ్నలెన్నో? పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అల్లాడపేటకు చెందిన రోహిణికి ప్రకాశం జిల్లాకు చెందిన మదన్‌మోహన్‌తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి వెంకటేశ్(6), లాస్య(5)అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట రోహి ణి భర్త అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రోహిణి కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తున్నారు. పది రోజుల కిందటే కన్నవారింటికి వచ్చా రు. నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న రోహిణి మంగళవారం గ్రామ శివారున ఉన్న చెరువు వద్దకు స్నానం కోసం వెళ్లారు. చదవండి: కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..? బట్టలు ఉతికి చెరువులో దిగగా.. అదే చోట లోతుగా ఉండడంతో లోపలకు వెళ్లిపోయారు. అవతలి గట్టున ఉన్న రజకులు ఆమెను చూసి రక్షించేందుకు హుటాహుటిన ఈ ఒడ్డుకు వచ్చారు. అప్పటికే రోహిణి అధికంగా నీరు తాగేయడంతో ప్రాణాలు పోయాయి. మృతురాలి తల్లి రాజులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళి తరలించారు. తల్లి మృతదేహాన్ని చూసి పిల్లలు ‘అమ్మ లేవడం లేదేంటి’ అని అమ్మమ్మను అడుగుతుంటే చూసిన వారంతా కంటనీరు పెట్టుకున్నారు. రెండేళ్ల లోపే అమ్మానాన్నలను దూరం చేసుకున్న పిల్లలను చూసి అయ్యో అంటూ నిట్టూర్చారు. -
పది నెలల క్రితం ప్రేమ వివాహం.. ఆ తర్వాత ఏమైందంటే?
సాక్షి, ఖమ్మం: ప్రేమ వివాహం చేసుకున్న పది నెలలకే సదరు యువతి బలవన్మరణానికి పాల్పడింది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన బండి మౌనిక పది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన ఆర్.నరేంద్రను ప్రేమ వివాహం చేసుకుంది. గత ఐదు నెలలుగా ఖమ్మంలోని వరదయ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో ఈ నెల 3వ తేదీన మౌనిక ఆత్మహత్యాయత్నానాకి పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే.. ఆమె మెడపై గాట్లు ఉన్నాయని, వరకట్నం కోసం వేధించారని తండ్రి చార్లెస్ ఖానాపురంహ హవేలి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో నరేంద్రపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టారు. లక్ష్మీపురంలో భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన తల్లాడ: పోస్టుమార్టం అనంతరం మౌనిక మృతదేహాన్ని స్వగ్రామం లక్ష్మీపురం తీసుకెళ్లారు. భర్త నరేంద్ర పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి నాలుగు రోజుల కిందటే ఊరు విడిచి వెళ్లిపోయారు. అటు తరఫు వారు రాలేదని మృతదేహాన్ని నరేంద్ర ఇంటిముందు రాత్రి 9 గంటల వరకు ఉంచడంతో ఉద్రిక్తత నెలకొంది. వైరా సీఐ వసంత్‌కుమార్ ఆధ్వర్యంలో తల్లాడ, వైరా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 10గంటలదాకా సీఐ ఇరువైపుల పెద్దలతో చర్చించారు. -
పెళ్లయిన 42 రోజులకే.. నవ వధువు హత్య!.. మూఢనమ్మకాలతో భర్తే అలా చేశాడా?
కొమ్మాది(భీమిలి): ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన ఓ యువతి పెళ్లయిన 42 రోజులకే మృత్యుఒడికి చేరింది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 4వ వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి హరితో తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయమ్మ(26)కు 42 రోజుల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కాని నరసయమ్మ శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. తగరపువలసలో ఉంటున్న తన అన్నయ్య కోనాడ అప్పారావుతో ఆమె రోజూ ఫోన్లో మాట్లాడుతుండేది. శుక్రవారం ఉదయం నుంచి అప్పారావు ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి అతను మధ్యాహ్నం నరసయమ్మ ఇంటికి వచ్చేసరికి తన చెల్లి విగతజీవిగా పడి ఉంది. దీంతో హరిని నిలదీయగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాళ్లకు తాడు కట్టి.. నరసయమ్మ శుక్రవారం ఉదయమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడుకట్టి, ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. సీఐ వెంకటరమణ, ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూఢ నమ్మకాలతోనే.? హరికి మూఢనమ్మకాలపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేది చెబుతానంటూ ఏవో మంత్రాలు.. తంత్రాల వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. మూఢనమ్మకాల్లో భాగంగానే నరసయమ్మను చిత్ర హింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మరణం విని తండ్రి దుర్గయ్య విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. దుర్గయ్యకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు కాగా.. ఈమె చివరి కుమార్తె. ఆయన భార్య గతంలోనే చనిపోయింది. పెళ్లయి ఆనందంగా గడుపుతుందని భావించిన తన కూతురు ఇలా హత్యకు గురవుతుందని ఊహించలేదని వాపోయాడు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సాక్షి, డోన్ : మండల పరిధిలోని బొంతిరాళ్ల గ్రామానికి చెందిన ఓ వివాహిత పొలానికి వెళ్లే దారిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడివుంది. భర్త గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా తలపై గాయాలు ఉండటంతో అల్లుడే తమ కూతురిని హత్య చేశాడని మృతురాలి తల్లి, బంధువులు ఆరోపించారు. ఘటన వివరాలు.. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన హరిజన నడిపి ఎల్లయ్య, మారెమ్మ కుమార్తెను లలిత అలియాస్ పెద్ద మద్దక్క(29)ను పదేళ్ల క్రితం బొంతిరాళ్ల గ్రామానికి చెందిన హరిజన మారెప్ప, మంగమ్మల కుమారుడు అర్జున్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి సూర్యకళ (8), రాకేష్ (6), అక్షర (4) సంతానం. కాన్పు సమయంలో లలితకు ఆరోగ్యం దెబ్బతిని వినికిడి సమస్య ఏర్పడింది. బుధవారం ఉదయం భార్య, భర్త పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తన భార్య పొలం దారిలో మృతిచెంది ఉందని మృతదేహం తీసుకొని అర్జున్ ఇంటికి వచ్చాడు. కాగా తలపై రక్త గాయాలు ఉండటంతో మృతురాలి తల్లితో పాటు బంధువులు భర్తే హత్య చేశాడని ఆరోపించారు. గ్రామస్తులు కూడా మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ మధుసూదన్‌రావ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త అర్జున్‌తో పాటు అతని సోదరున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లలితను భర్తే పథకం ప్రకారం హత్య చేశాడా? సరిపోని వ్యక్తులెవరైనా హతమార్చారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లయిన నాలుగు నెలలకే..
సాక్షి, చిత్తూరు అర్బన్ : పెళ్లయిన నాలుగు నెలలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం కొంగారెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి భర్త పారిపోవడం, ఫోన్ తీయకపోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. నగరంలోని కొంగారెడ్డిపల్లెకు చెందిన దొరస్వామి, కళావతిల కుమార్తె ప్రియాంక(24)ను గంగాధరనెల్లూరు మండలం కె.వెంకటాపురానికి చెందిన మధు(28)కు ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 24న చిత్తూరులో పెళ్లి చేశారు. మధు కట్టమంచిలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం గంగాధరనెల్లూరు నుంచి దంపతులిద్దరూ కొంగారెడ్డిపల్లెకు వచ్చారు. మృతురాలి తల్లిదండ్రులు బయట కూలి పనికి వెళ్లారు. ఇక్కడ ఏం జరిగిందో ఏమో గానీ.. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రియాంక బంధువులు ఇంటికి వెళ్లి చూడగా.. స్నానాల గదిలో ఆమె ఆచేతనంగా పడుంది. మెడకు చున్నీ చుట్టి ఉన్నారు. చుట్టుపక్కల వారి సాయంతో ప్రియాంకను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈమె భర్త ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా తీయడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వన్‌టౌన్ సీఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులను విచారించారు. తన కూతుర్ని అల్లుడు మధునే చంపేశాడంటూ మృతురాలి బంధువులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. -
తొమ్మిది నెలల గర్భిణి నీటి తొట్టెలో పడి..
సాక్షి, వి.కోట(చిత్తూరు) : నీటి టబ్బులో పడి వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కె.కొత్తూరుకు చెందిన ఖలీల్ కుమార్తె షబానా(27)ను పలమనేరుకు చెందిన అఫ్రోజ్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. షబానకు మూర్ఛ వ్యాధి ఉన్నట్లు అత్తవారింటివారు గమనించారు. కొంతకాలంగా ఆమెను పుట్టినింటిలో ఉంచారు. ఈ తరుణంలో గురువారం మధ్యాహ్నం షబానా బాత్ రూంలో ఉన్న నీటి టబ్బులో పడి పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వి.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం షబాన 9 నెలల గర్భిణి. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూర్చవ్యాధి వచ్చి నీటిలో పడి మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరుకు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
హత్యా! ఆత్మహత్యా!!
పెళ్లై పదేళ్లు కాలేదు...ఇద్దరు పిల్లలు...ఏమైందో తెలియదు...భర్తను కాదని, పిల్లలను అనాథలుగా చేసి ఓ వివాహిత విగత జీవిగా మారింది. ఇది హత్యేనని కన్నవారింటి వారు...లేదు ఆత్మహత్యే చేసుకుందాని అత్తింటివారు ఎవరి వాదన వారు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సిందే! వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేటకు చెందిన ఎల్లపు లావణ్య(25) సోమవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారింది. కొత్తవలస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ సీతంపేట గ్రామంలో ఎల్లపు రవికుమార్, లావణ్యకు 2010లో వివాహమైంది. వీరికి నరేష్, జోషియా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవికుమార్ రెప్కో బ్యాంకులో కొంత కాలం పని చేసి ప్రస్తుతం విశాఖపట్నం టైకూన్ రెస్టారెంట్ సమీపంలో రివెగర్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రవికుమార్, లావణ్య వివాహ జీవితం సాఫీగానే సాగుతోందన్న క్రమంలో రవికుమార్ మూడో అన్న నరేష్ మృతి చెందడంతో తన వదినకు ఏ లోటు రాకుండా రవే చూసుకుంటున్నాడు. అక్కడే వీరి జీవితంలో మలుపులు తిరిగాయి. తన తోటికోడలపై చూపుతున్న ప్రేమ లావణ్యపై రవికుమార్ చూపకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తల్లి శ్రీదేవి తెలిపింది. పండగకి వచ్చినపుడు కూడా తనింటికి రాకుండా వదిన ఇంటికే తన అల్లుడు వెళ్లడంపై తాను, లావణ్య అత్తమామలను నిలదీశామని ఆమె చెప్పింది. దీన్ని తట్టుకోలేని అత్తింటి వారు తన కుమార్తె లావణ్యను కొన్నాళ్లుగా మానసికంగా వేధిస్తూ గృహ హింసకు పాల్పడ్డారని ఆరోపించింది. కొంత కాలంగా రవి భార్య లావణ్యతో మాట్లాడడం లేదని ఆయన పనిచేసే కార్యాలయంలో ఓ సహద్యోగితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడన్న అనుమానం లావణ్య వ్యక్తం చేసేదని తల్లి తెలిపింది. ఈ విషయంపై తన కుమార్తె లావణ్యను రోజూ హింసించేవారని తల్లి శ్రీదేవి తెలిపారు. తన మనవళ్లను అన్యాయం చేశారంటూ అల్లారు ముద్దుగా పెంచిన తర కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని కన్నీరుమున్నీరైంది. లావణ్యకు కడుపునొప్పి వచ్చిందని అత్తింటి వారు కబురు పంపగా వెళ్లేసరికే ఇంట్లోనే సోఫాలో లావణ్య మృతదేహం ఉండడం చూశామని బంధువు ఉమామహేశ్వరి రోదిస్తూ చెప్పారు. అత్తింటి వారే చంపేసి లావణ్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించే కట్టుకథలు అల్లుతున్నారని లావణ్య బంధువులు ఆరోపించారు. లావణ్యను అత్తింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఆమె బావ ప్రసాద్(తెలుగుదేశం పార్టీ కార్యకర్త) ప్రయత్నిస్తున్నారని గ్రామ మాజీ సర్పంచ్ భర్త పిల్లా అప్పలరాజు సహాయంతో కేసు తారుమారు చేసేందుకు పోలీసుల్ని మేనేజ్ చేస్తూ ప్రలోభపెడుతున్నారని లావణ్య మేనమామ వెలగ అప్పారావు విలేకరుల ముందు ఆరోపించారు. ఇదే విషయమై లావణ్య భర్త రవికుమార్‌ను సాక్షి వివరాలు కోరగా రాత్రి తొమ్మిది గంటలకు ఆఫీసు నుంచి వచ్చానని టిఫెన్ చేయమని కోరిందని తాను తినలేదని, రాత్రి ఒంటి గంట సమయంలో చూస్తే లావణ్య ఉరి వేసుకుని ఉందని తెలిపాడు. భయంతో లావణ్య మృతదేహాన్ని ఫ్యాన్ నుంచి దించి సోఫాలో పడుకోబెట్టానని తనకు ఏం తెలియదని పేర్కొన్నాడు. దర్యాప్తు చేస్తున్నాం... లావణ్య తల్దిండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇది హత్యా! ఆత్మహత్యా! అన్నది తేలాల్సి ఉందని చెప్పారు. రవికుమార్‌పై కేసు నమోదు చేశామని విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. -
రైలు ప్రమాదంలో వివాహిత మృతి
శ్రీకాకుళం, సరుబుజ్జిలి/భామిని: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో కొండవలస గ్రామానికి చెందిన సతివాడ క్రాంతి(24) మృతి చెందింది. మృతురాలి భర్త సతివాడ రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం... తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) ర్వేల్వే స్టేషన్ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో సింహాచలం దైవదర్శనంకు బయలుదేరారు. క్రాంతికి ఆకస్మికంగా వాంతులు రావడంతో ట్రైన్ డోరువద్ద తలబయటకు పెట్టి వాంతులు చేస్తుండగా విజయనగరం జిల్లా కోరుకొండ స్టేషన్ దాటిన తర్వాత అలమండ–భీమసింగి మధ్య బ్రిడ్జి వద్ద ఇనుప చువ్వలు తలకు బలంగా తగిలాయి. వెంటనే ట్రైన్లో కూలపడిపోవడంతో సమీపంలో ఉన్న మిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అందరితో కలివిడిగా ఉండే క్రాంతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతురాలు క్రాంతి భామినికి చెందిన పోతల శేషగిరి, జయమ్మ దంపతుల మూడవ కుమార్తె. రెండేళ్ల క్రితం కొండవలసకు చెందిన సతివాడ రామకృష్ణతో వివాహమైంది. మొదటి కాన్పులో బాబుకు జన్మనిచ్చిన ఈమె గతనెల భామిని నుంచి కొండవలసలోని అత్తవారింటికి వెళ్లింది. మరణ వార్త విన్న వెంటనే ఆమె బంధువులు విజయనగరం తరలివెళ్లారు. ఈమె మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేత లావేటి విశ్వేశ్వరరావు ప్రగాఢÉý సానుభూతి ప్రకటించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పశ్చిమగోదావరి, నరసాపురం: పట్టణంలోని వైఎస్సార్ నగర్ కాలనీలో శుక్రవారం ఘోరం జరిగింది. వివాహిత తిరుమాని తిరుపతమ్మ(19) అనుమానాస్పదంగా మృతి చెందింది. తిరుపతమ్మ మృతికి భర్త వేధింపులే కారణమని భావిస్తున్నారు. టౌన్ ఎస్సై కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన తిరుమాని నానితో తిరుపతమ్మకు గత అక్టోబర్ 17న వివాహం జరిగింది. నాని వడ్రంగి పని చేస్తుంటాడు. శుక్రవారం వైఎస్సార్ నగర్లో వీరు నివాసం ఉంటున్న ఇంటిలో తిరుపతమ్మ మంచంపై విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె భర్త నాని పరారీలో ఉన్నాడు. దీనిపై ఎస్సై మాట్లాడుతూ ఎలా మృతి చెందింది అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తెలుస్తుందని చెప్పారు. ఆమె భర్త కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రభుత్వాస్పత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. తిరుపతమ్మను భర్తే చంపేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. -
చెరువులో పడి వివాహిత మృతి
శ్రీకాకుళం, నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జలగల చెరువులో పడి కోవెల వీధికి చెందిన పెదిలాపు శాం తమ్మ (52) మృతి చెందింది. మంగళవారం ఉద యం ఈ ఘటన చోటుచేసుకుంది. రజక వృత్తి చేసుకునే శాంతమ్మ కొంతకాలంగా ఫిట్స్ వ్యాదితో బాధపడుతోంది. మంగళవారం దుస్తులను చెరువులో ఉతుకుతుండగా ఫిట్స్ వ్యాధి రావడం, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో మునిగి పోయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పది గంటల సమయంలో మిగి లిన రజకులు దుస్తులు ఉతుకుతుండగా శాంత మ్మ మృతదేహం కాలికి తగిలింది. వెంటనే ఆమె మృతదేహాన్ని బయటకుతీసి భర్త మల్లేసుకు సమాచారం అందించారు. శాంతమ్మ ఉదయం నుంచీ కనిపించకపోవడంతో పట్టణంలోకి వెళ్లిం దని భావించామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ మెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ వివా హాలు అయ్యా యి. శాంతమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణదాస్ పరామర్శ.. శాంతమ్మ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులతో చర్చించారు. ఈయన వెంట పార్టీ నాయకులు చింతు రామారావు, కోటిపల్లి శ్రీను తదితరులు ఉన్నారు. -
అమ్మా.. లేమ్మా!
రాత్రి అందరిలానే నిద్రపోయిన ఆ తల్లి ఇకలేవలేదు.. తెల్లారేసరికి కిటికీ ఊచలకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది. రాత్రి ఇంట్లోనే ఉన్న తండ్రి అయిపూఅజా లేకుండా పోయాడు.. అభం శుభం తెలియని ఆ పిల్లలు తల్లిలో చలనం లేక, తండ్రి కనిపించక తల్లడిల్లిపోయారు.. ఆరిలోవ రవీంద్రనగర్‌లో జరిగిన గృహిణి అనుమానాస్పద మృతి ఘటన.. పిల్లల ఆక్రందన స్థానికులను కలచివేసింది. ఆరిలోవ(విశాఖ తూర్పు): తెల్లారక ముందే టిఫిన్ తయారు చేసి బలవంతంగా నిద్ర లేపే అమ్మ.. ఈ రోజు ఎంత లేపినా ఎందుకు లేవడం లేదో ఆ చిన్నారులకు తెలియడం లేదు. వద్దు వద్దు అంటున్నా వెంట పడి తినిపించే తల్లి ఆకలేస్తోందని ఎంత ఏడుస్తున్నా కన్నెత్తి చూడడం లేదు. చిన్న అరుపు వినిపిస్తే ఏమైందోనని కంగారు పడి పరుగెత్తే అమ్మ గుక్కపట్టి ఏడుస్తున్నా పక్కకు కదలడం లేదు.. ఏమైందో చెప్పడానికి నాన్న కూడా కనపడకుండా పోయాడు.. మాటలైనా రాని ఆ పసివాళ్ల హృదయ ఘోష చుట్టూ ఉన్న వారి మనసును కలిచివేసింది.. ఓ గృహిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులకు తెలియజేసి పరారైన మృతురాలి భర్త తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి దరి పెంటలింగాపురానికి చెందిన బమ్మడిపాటి గోపీకృష్ణ కిరణ్‌కుమార్‌కు, అదే జిల్లా గరివిడి దరి పెదబంటుపల్లికి చెందిన ఉమ(26)తో 2012లో వివాహమైంది. గోపీకృష్ణ నగరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. వీరికి ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న సాయి, లడ్డూ అనే మగపిల్లలున్నారు. వీరంతా కొన్నాళ్లుగా మూడో వార్డు పరిధి రవీంద్రనగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఇంట్లో చిన్నచిన్న గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుండేవని స్థానికులు చెప్పారు. అయితే ఈ గొడవలు పెద్దల వరకు చేరలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారేసరికి ఉమా చీరతో కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఆమె భర్త గోపీకృష్ణ వరసకు తోడల్లుడు అయ్యే బంధువుకు ‘ఉమా ఆత్మహత్య చేసుకొంది.. వెంటనే రావలెను’ అని సెల్ఫోన్లో మెసేజ్ చేశారు. అనంతనం అక్కడే మృతదేహాన్ని, నిద్రపోతున్న చిన్నారులను వదిలేసి పరారయ్యాడు. తెల్లవారి లేచిన పిల్లలు తల్లిన లేపినా లేవకపోవడంతో ఆకలితో గోలపెట్టారు. ఇంతలో ఫోన్ మెసేజ్ ద్వారా నగరంలో అందుబాటులో ఉన్న వారి బంధువులు చేరుకుని ఆ చిన్నారులను చేరదీశారు. అనంతరం విజయనగరం నుంచి మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ రామచంద్రరావు, ఆరిలోవ సీఐ సీహెచ్.తిరుపతారావు, ఎస్ఐ పాపారావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. బంధువుల అనుమతితో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అల్లుడే చంపేసి ఉంటాడు.. తన కుమార్తె ఉమా(26)ను అల్లుడు గోపీకృ ష్ణ చంపేసి ఉంటాడని, అందుకే పిల్లల్ని సైతం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయాడని మృతురాలి తండ్రి ఎన్.సూర్యప్రకాష్ ఆరిలోవ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తగిన విధంగా కట్నకానుకులు ఇచ్చుకొన్నామ ని, అయినా కట్నం సరిపోక అదనంగా మరిం త కట్నం అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నా రు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానా స్పద కేసుతో పాటు మృతురాలి భర్తపై 498ఏ కేసు నమోదు చేసినట్టు సీ.ఐ తిరుపతిరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపడుతున్నామన్నారు. -
ఆమెది గుండెపోటు కాదు.. హత్యే!
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం, పిల్లలు లేరనే కారణంగా పాపోలు నాగలక్ష్మి (25)అనే వివాహితను అత్తమామలు, భర్త హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆదివారం ఉదయం నాగలక్ష్మి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటు కారణంగానే నాగలక్ష్మి చనిపోయిందంటూ నమ్మించిన అత్తింటివారు.. కంగారుగా ఆమె మృతదేహాన్ని ఖననం చేశారనీ... కట్నం కోసం నాగలక్ష్మిని ఆమె భర్త కిరణ్ తరచూ వేధించేవాడని బంధువులు అంటున్నారు. పోస్టుమార్టం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు ఆందోళనకు దిగారు. కాగా, తహసీల్దార్, పోలీసుల సమక్షంలో ఖననం చేసిన మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొంతకాలం క్రితం భార్య పేరు మీద కిరణ్ 12 లక్షల రూపాయల బీమా చేయడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
గుంటూరు, యడ్లపాడు: నాదెండ్ల మండలంలోని చందవరం గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చిరుమామిళ్ల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు షేక్ అమీర్‌కు యడ్లపాడు గ్రామానికి చెందిన పి.మాబుసుభాని, దిల్షాద్బేగం దంపతులు కుమార్తె పర్వీన్ (22)తో వివాహమైంది. గతేడాది కాలంలో వీరు వైద్యవృత్తి కోసం చందవరం గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. భార్య పర్వీన్పుట్టింటికి వెళ్లాలనడంతో దంపతులిద్దరు శుక్రవారం యడ్లపాడుకు వచ్చారు. శనివారం ఉదయం తిరిగి చందవరం వెళ్తుండగా సాతులూరు నుంచి తూబాడు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలవ్వడంతో కోమాలోకి వెళ్లింది. స్థానికులు గమనించి వారిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పర్వీన్ మృతి చెందింది. దీంతో రెండు గ్రామాల్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి. -
వైద్యం వికటించి వివాహిత మృతి
కానూరు (పెనమలూరు) : మోకాలికి గాయం అవ్వటంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన వివాహిత.. వైద్యం వికటించటంతో మృతి చెందింది. మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట బుధవారం ధర్నా చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు, పెద్దలు చర్చలు జరిపి మృతురాలి కుటుంబానికి పరిహారం ఇవ్వటంతో వివాదం సమసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యనమలకుదురు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఎండీ హనీమా (23) నాలుగేళ్ల క్రితం నజీబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. రెండు నెలల క్రితం హనీమా స్కూటీ నేర్చుకుంటూ కిందపడింది. ఆమె మోకాలికి గాయమైంది. మోకాలు నొప్పి తగ్గకపోవటంతో ఈ నెల 26న కానూరు అశోక్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్ష చేయించుకుంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేయటానికి 27వ తేదీ మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోమాలోకి వెళ్లింది. ఆమెను ఐసీయూలో ఉంచారు. ఆమె ఆరోగ్యం ఏమైందని కుటుంబ సభ్యులు అడుగగా ఆస్పత్రి యాజయాన్యం సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమె చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆందోళనకు దిగిన బంధువులు వైద్యం వికటించి హనీమా చనిపోయిందని, దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఆస్పత్రిని మూయించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ దామోదర్, ముస్లీం పెద్దలు వచ్చి ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. పరిహారం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించటంతో బాధితులు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వటానికి రాజీ కుదిరినట్లు సమాచారం. -
అమ్మా.. మాట్లాడమ్మా..!
బుక్కపట్నం: ‘అమ్మా.. మాట్లాడమ్మా.. లే అమ్మా.. ఒక్కసారి మాట్లాడమ్మా’ అంటూ పిల్లలు రోదించిన తీరు కలచివేసింది. పాముదుర్తి వెంకటాపురంలో ఓ వివాహిత విద్యుదాఘాతంతో మృతిచెందింది. బంధువులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఎద్దుల సుదర్శన్‌రెడ్డి భార్య వెంకటరమణమ్మ (30) మంగళవారం ఉదయం ఉతికిన బట్టలను మిద్దెపై ఆరేసే క్రమంలో జీఏ వైర్‌ను తాకింది. పైకçప్పు రేకులపై నుంచి ఇంటి సర్వీస్ వైర్‌కు సంబంధించి ఒక చోట ఎర్త్ కావటంతో జీఏ వైరుకు విద్యుత్ సరఫరా అయ్యి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తమ కళ్లెదుటే తల్లి ప్రాణం విడచడంతో పిల్లలు రోదించారు. విషయం తెలుసుక్ను వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి స్థానిక నాయకులు సూర్యనారాయణరెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
అదనపు కట్నం తేలేదని..
బొమ్మనహళ్లి : వరకట్నం వేధింపుల నేపథ్యంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈఘటన ఆనేకల్‌లో వెలుగు చూసింది. బహుదూరు పుర ప్రాంతంలో నివాసం ఉంటున్న మోహన్‌కు ఎనిమిది నెలల క్రితం జీవిత (21)తో వివాహమైంది. కట్నంగా 120 గ్రాముల బంగారం, రూ.75 వేలు నగదు ఇచ్చారు. అయితే అదనపు కట్నం తేవాలని జీవితను అత్త గౌరమ్మ, మామ నాగరాజు, అడపడచు శ్వేతలు వేధించేవారని సమాచారం. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలపగా వారు సర్ది చెప్పారు. ఇటీవల అనారోగ్యానికి గురై పుట్టింటికి వెళ్లిన జీవిత..బుధవారం తిరిగి అత్తవారింటికి వచ్చింది. ఈక్రమంలో గురువారం రాత్రి మోహన్ జీవిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుందని, ఆస్పత్రికి తరలించామని సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకోగా జీవిత విగతజీవిగా కనిపించింది. తమ కుమార్తెను భర్త, అత్తమామ, కలిసి వరకట్నం కోసం హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోహన్, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
జ్యోతి ఆరిపోయింది!
♦ పెళ్లైన ఏడాదికే వివాహిత అనుమానాస్పద మృతి ♦ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి బంధువులు ♦ దర్యాప్తు చేస్తున్న పోలీసులు ♦ బాతుపురంలో విషాదం పెళ్లైన ఏడాదికే వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ సంఘటన వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. పసుపురెడ్డి జ్యోతి (22) మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. జ్యోతి చావుకు అత్త వేధింపులే కారణమని కన్నవారు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: సోంపేట మండలం లక్కవరం గ్రామానికి చెందిన టేకు వాసుదేవరావు, సరోజినిల పెద్ద కుమార్తె జ్యోతికి బాతుపురం గ్రామానికి చెందిన సింహాచలంతో గత ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. సింహాచలం ఉపాధి కోసం 10 రోజుల క్రితమే విజయవాడ వెళ్లిపోయాడు. దీంతో ఇంటి వద్ద అత్త లక్ష్మీకాంతం, జ్యోతి మాత్రమే ఉంటున్నారు. కాగా లక్ష్మీకాంతం శనివారం ఉదయం కాశీబుగ్గ వెళ్లి 12 గంటల సమయానికి తిరిగి ఇంటికి వచ్చేసరికి జ్యోతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయి ఉండడాన్ని చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి మృతదేహాన్ని కిందకుదించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు, వజ్రపుకొత్తూరు ఎస్ఐ ప్రసా ద్ సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రస్తుతం బిలాయిలో ఉంటున్న జ్యోతి తల్లిదండ్రులు వచ్చే వరకు మృతదేహాన్ని ఉంచుతున్నట్టు పోలీసులు తెలిపారు. జ్యోతి మృతికి కారణాలు తెలియరాలేదని సీఐ పేర్కొన్నారు. అయితే జ్యోతి మృతదేహం వద్ద హిందీ లో రాసిఉన్న సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత ్త వేధింపులే జ్యోతి మరణానికి కారణం! జ్యోతి మరణానికి అత్త వేధింపులే కారణమని కన్నవారు తరఫువారు ఆరోపించా రు. లక్ష్మీకాంతాన్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అందరితో కలివిడిగా ఉండే జ్యోతి ఇక లేదని తెలియడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీ రుగా విలపించారు. జ్యోతి మృతితో బాతుపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విచారణ చేపడుతున్నాం జ్యోతి మరణంపై కేసు నమోదు చేసి విచా రణ చేపడుతున్నామని కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు తెలిపారు. జ్యోతి అత్తను విచారించామన్నా రు. బిలాయి నుంచి జ్యోతి తల్లి దండ్రులు వచ్చిన తరువాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తామన్నారు. -
శీలాన్ని శంకించాడని..
టీనగర్: భర్త శీలాన్ని శంకించాడని మనస్తాపానికి గురైన భార్య పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పిల్లల్లో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. తిరువన్నామలై జిల్లా, తండరాంపట్టు అమందపుత్తూరు గ్రామానికి చెందిన రమేష్ (35)టైలర్. ఇతని భార్య సరసు (30). వీరికి కుమార్తెలు అనసూయ (3), కౌసల్య (2). రోజూ మద్యం సేవించి రమేష్ ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. అంతేకాకుండా భార్య ప్రవర్తనను అనుమానించి హింసించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రమేష్ మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపంతో రాత్రి 11 గంటల సమయంలో పాలల్లో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తాగించి తర్వాత తాను పాలను తాగింది. దీంతో కొద్ది సేపట్లోనే సరసు కిందపడి మృతిచెందింది. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానించిన ఇరుగు పొరుగు ఇంట్లోకి వెళ్లి చూడగా సరసు విగతజీవిగా పడివుంది. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లల్ని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే మార్గమధ్యలో కౌసల్య మృతిచెందింది. ఆస్పత్రిలో అనసూయకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
► పెళ్లయిన ఏడాదికే ఆత్మహత్య ► హత్యే అంటున్న మృతురాలి కుటుంబ సభ్యులు ► ఘటనాస్థలాన్ని పరిశీలించిన ► పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్రీకాకుళం సిటీ /పాతశ్రీకాకుళం : అత్తంటి ఆరళ్లకు ఓ వివాహిత బలైంది. శ్రీకాకుళం పట్టణంలోని ఇందిరానగర్‌కాలనీ సమీప వంశధారనగర్ కాలనీలో వివాహిత మట్ట కల్పన(24) ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని.. మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కల్పనకు.. నందిగాం మండలం పెంటూరుకు చెందిన మట్ట యుగంధర్ ఉరఫ్ మూర్తితో గతేడాది మార్చి 22న వివాహమైంది. ప్రస్తుతం కల్పన నాలుగు నెలల గర్భిణి. కల్పన తల్లిదండ్రులు కొంచాడ సరోజిని, లచ్చయ్య వ్యవసాయకూలీలు. యుగంధర్, కల్పనలు కొంతకాలంగా శ్రీకాకుళంలోని వంశధారనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. యుగంధర్ బీఎస్ఎన్ఎల్ సంస్థలో కాంట్రాక్ట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో గానీ.. శుక్రవారం సాయంత్రం కల్పన ఉరివేసుకొని మృతి చెందిందన్న విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు యుగంధర్ ఫోన్లో సమాచారం అందించాడు. దీంతో వారు రాత్రి సమయంలో ఇక్కడికి చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కల్పన విగతజీవిగా పడిఉండడంతో మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడు, ఇతర బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలానికి శనివారం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు, శ్రీకాకుళం తహసీల్దార్ సుధాసాగర్, సీఐ ఆర్.అప్పలనాయుడు, ఎస్సై వాసునారాయణలు చేరుకున్నారు. మృతికి గల కారణాలను ఆరా తీశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లయిన ఏడాదిలోపే.. పెళ్లయిన 11 నెలలకే తమ కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు సరోజిని, లచ్చయ్య ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నెలరోజుల నుంచే అదనపు కట్నం తేవాలంటూ యుగంధర్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచు తమ కుమార్తెను వేధించే వారని చెప్పారు. పెళ్లి సమయంలో 2.50 లక్షల నగదు, 5 తులాల బంగారం, ఒక ద్విచక్రవాహణాన్ని ఇచ్చామన్నారు. నాలుగు నెలల గర్భిని అని తెలిసి కూడా సరైన తిండి పెట్టకుండా శారీరకంగా, మానసికంగా హింసించేరని వాపోయారు. పెళ్లయిన నాటి నుంచి రెండు, మూడుసార్లు మాత్రమే కుమార్తెతో ఫోన్లో మాట్లాడామని కన్నీటిపర్యంతమయ్యారు. కల్పన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేస్తున్నాం కల్పన మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ కె.భార్గవరావునాయుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలిస్తున్నామన్నారు. కల్పన తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు యుగంధర్, అతని తల్లిదండ్రులు, ఆడపడుచులపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
వరకట్న వేధింపులే కడతేర్చాయి
విశాఖపట్నం : వరకట్న వేధింపులే తమ కుమార్తెను కడతేర్చాయని మృతురాలు గాయత్రి తల్లిదండ్రులు ఝాన్సీలక్ష్మి, సోమరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను భర్త భోగరాజు రోజూ హింసించేవాడని, అతనే హతమార్చినట్లు అనుమానాలున్నాయని ఆరోపించారు. గోపాలపట్నం శివారు యల్లపువానిపాలెంలో రెండు రోజుల కిందట ఆర్పీఎఫ్ ఎస్ఐ నాగళ్ల భోగరాజు భార్య గాయత్రి(43) ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె తల్లిదండ్రులు ఝాన్సీలక్ష్మి, సోమరాజులు, ఇతర కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి ఇక్కడికి ఆదివారం ఉదయం చేరుకున్నారు. గాయత్రి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు. ముమ్మాటికీ భర్త భోగరాజు వల్లే తమ కుమార్తె మరణించినట్లు ఆరోపించారు. గాయత్రి మరణించిన రోజు రాత్రి ఏడు గంటల సమయంలో బాగానే ఉన్నట్లు తమకు ఫోన్ చేసిందని, తెల్లారేసరికి మృతిచెందిందని చెప్పడం అనుమానంగా ఉందన్నారు. 2009లో భోగరాజుతో పెళ్లి చేశామని, అప్పటి నుంచి వరకట్నం కోసం వేధిస్తున్నా సర్దుబాటు చేసుకుంటూ వచ్చామని వాపోయారు. తాను మాజీ సీఐని అయినప్పటికీ సంపాదించుకున్నది ఏమీ లేదని, నలుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశానని సోమరాజులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి కోసం నరకం చూపించేవాడని, ఏదోలా వదిలించుకునేందుకే గాయత్రిని హతమార్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. బెడ్రూంలో మరణంపై సందేహాలు గాయత్రి బెడ్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండడంపై పోలీసులు, ఆమె తల్లిదండ్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. భోగరాజు చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. బెడ్రూంలో గాయత్రి ఫ్యానుకి ఉరివేసుకుని విలవిల్లాడితే భోగరాజు అంత గాఢ నిద్రలో ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణ అనంతరం మృతదేహాన్ని పోలీసులు తరలిస్తున్నపుడు గాయత్రి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ సందర్భంగా సీఐ వైకుంఠరావు మాట్లాడుతూ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని తెలిపారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
గంట క్రితం వచ్చి తమతో మాట్లాడిన కుమార్తె క్షణాల్లో విగతజీవిగా మారడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తమ కుమార్తెను అల్లుడే అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాడని బోరున విలపిస్తున్నారు. పూసపాటిరేగ మండలం చింతపల్లిలో మూడు నెలల గర్భిణి అనుమానాస్పద మృతి ఘటన సంచలనం రేకెత్తించింది. పూసపాటిరేగ : మండలంలోని చింతపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమ అల్లుడే కుమార్తెను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. చింతపల్లి గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్మి(23), అప్పన్న భార్యాభర్తలు. లక్ష్మి తల్లిదండ్రులు బర్రి ఎర్రయ్య, అప్పయ్యమ్మలు కూడా చింతపల్లిలోనే ఉంటున్నారు. శుక్రవారం లక్ష్మి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. రాత్రి వరకు ఉండి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. లక్ష్మి వెళ్లిన గంట వ్యవధిలోనే మృతి చెందిందని తల్లిదండ్రులకు సమాచారం అందడం నిర్ఘాంతపోయారు. అర్ధరాత్రి పూటుగా మద్యం సేవించి వచ్చిన అప్పన్నే తమ కుమార్తెను హత్య చేశాడని తల్లిదండ్రులు బోరును విలపిస్తూ చెప్పారు. లక్ష్మి గొంతుపై ఉన్న గాట్లు ఆధారంగా హత్యేనని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూసపాటిరేగ ఎస్ఐ కళాధర్ ఆధ్వర్యంలో మృతదేహానికి పంచానామా నిర్వహించారు. నిందితుడు అప్పన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భోగాపురం సీఐ కె.వైకుంఠరావు వివాహిత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు.. మృతురాలు లక్ష్మి మూడునెలలు గర్భిణి. ఆమెకు పావని, పరిదేశి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి మరణించడం, తండ్రి పోలీసుల అదుపులో ఉండటంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు దర్యాప్తు ప్రారంభించిన ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్ పార్వతీపురం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన పార్వతీపురంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, మృతురాలి బంధువులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన సరస్వతి (25)కు గత ఏడాది అక్టోబరు 29న పార్వతీపురం నెహ్రూకాలనీకి చెందిన రాయల సంతోష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ లాంఛనాల కింద లక్ష రూపాయల కట్నం, తులం బంగారం ఇచ్చారు. సరస్వతి కుటుంబ సభ్యులు మంగళవారం పార్వతీపురం వచ్చి సంతోషంగా ఉన్న తమ కుమార్తెను చూసి ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఇంతలో గురువారం ఉదయం మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భర్త, అత్తమామలే చంపేశారు..! ఈ విషయమై మృతురాలి సోదరుడు అనుపోజు అప్పారావు మాట్లాడుతూ మంగళవారం నాటికి సంతోషంగా ఉన్న తన సోదరి సరస్వతిని భర్త, అత్తమామలే చంపేశారని ఆరోపించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. గత అక్టోబర్ 29న సింహాచలంలో పెళ్లి చేశామన్నారు. తన సోదరి భర్త రాయల సంతోష్, అత్త ఈశ్వరమ్మ, మామ రామారావులు కలిసి చంపేసినట్లు ఆరోపించారు. మద్యం మత్తులో... భార్యాభర్తలిద్దరూ మేడపై పడుకుంటారని, గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో మృతదేహాన్ని పట్టుకొని భర్త, అత్తమామలు, ఆ ఇంటికి వచ్చిన ఓ అతిథి కనిపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం మత్తులో భార్యను చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంట్లోనే పడిపోయి కోడలు మృతి చెందిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏఎస్పీ దర్యాప్తు... విషయం తెలుసుకున్న ఏఎస్పీ సిద్దార్థ కౌశిల్, సీఐ వి.చంద్రశేఖర్, పట్టణ ఎస్ఐ బి. సురేంద్రనాయుడు తన సిబ్బందితోపాటు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
చికిత్స పొందుతూ వివాహిత మృతి
నెల్లిమర్ల రూరల్ : భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళి తే... విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో గల కొం డపేట గ్రామానికి చెందిన లక్ష్మి(25)కి నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అలుగోలు జగన్నాథంతో ఎని మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త మద్యం సేవిస్తూ ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం తాగవద్దని ఎంతచెప్పినా వినకపోవడంతో లక్ష్మి ఈనెల 20న భర్త ఇంట్లో ఉంటుండగానే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచింది. పరారీలో భర్త ఘటన జరిగిన దగ్గర నుంచి భర్త జగన్నాథం పరారీలోనే ఉన్నాడు. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తమ కుమార్తె మృతికి భర్తే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిత్యం మద్యం సేవించి గొడవలకు దిగేవాడని, కుటుంబ పోషణను కూడా పట్టించుకునేవాడు కాదని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అందిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేశామని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఇప్పటికే మృతిరాలి వద్ద నుంచి మేజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం కూడా తీసుకున్నాయని చెప్పారు. జగన్నాథం విశాఖపట్నంలో ఉన్నట్లు తెలిసిందని, రెండు రోజుల్లో పట్టుకొని పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు.