గుర్రంపోడ్ అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని చామలేడు గ్రామంలో శనివారం వెలుగుచూసింది.
గుర్రంపోడ్ అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని చామలేడు గ్రామంలో శనివారం వెలుగుచూసింది. ఏఎస్‌ఐ రాముల కథనం ప్రకార ం.. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి పద్మ (19) శుక్రవారం రాత్రి ఇంట్లో మంటలు అంటుకుని కాలిన గాయాలతో ఉన్న ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ భర్త బొడ్డుపల్లి సైదులు నల్లగొండలో చికిత్స పొందుతున్నాడు. కాగా పద్మ కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్య చేసుకుందని ఆమె బంధువులు, భర్త చెబుతుండగా తన కుమార్తెను భర్త సైదులే కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి ఈదయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొసంగి గ్రామానికి చెందిన పద్మను ఏడు నెలల క్రితమే చామలేడు గ్రామానికి చెందిన సైదులుకు ఇచ్చి వివాహం చేశారు. అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.