Gurrampod
-
పోషకాలను మోతాదు మేరకు వాడాలి
గుర్రంపోడు వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ వ్యవసాయ పంటలకు అవసరమయ్యే పోషకాలను మోతాదు మేరకు వాడాల్సి ఉంటుంది.. ఉద్యానపంటలకు మాత్రం మొక్కకు వాడాల్సిన పోషకాల మోతాదును బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. పీల్డ్ క్రాప్లైన వ్యవసాయ పంటలు పత్తి, మిర్చి, వరిలాంటి పంటలకు మాత్రం పోషకాల మోతాదును మాత్రమే సూచిస్తారు. రసాయన ఎరువుల్లోని ఈ మోతాదును లెక్కగట్టి వాడితే ఖర్చు తగ్గడమేగాక పైరుకు పోషకాలు సమతుల్యంగా అందినట్లవుతుంది. ఎరువుల ధరలు తరుచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా పోషకాల మోతాదు గణనలో రైతులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మురళి సూచిస్తున్నారు. ఎరువుల్లో పోషకాల గణనపై సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ఎరువుల్లో పోషకాల శాతం ఎరువుల బస్తాపై ఆ ఎరువులో ఉండే పోషకాల శాతం ముద్రించి ఉంటుంది. యూరియా బస్తాపై 46 శాతం ఉంటుంది. అంటే వంద కిలోల యూరియాలో 46శాతం యూరియా ఉంటుంది. సింగిల్ సూపర్ పాస్పేట్లో 16శాతం భాస్వరం ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌లో 60 శాతం పొటాష్ ఉంటుంది. ఈ ఎరువుల్లో ఒకే పోషక పదార్థం ఉన్నందున వీటిని సూటి ఎరువులు అంటారు. రెండు లేదా మూడు పోషకాలు కలిపి ఉండే ఎరువులను కాంప్లెక్స్ ఎరువులు అంటారు. డీఏపీలో 18 శాతం నత్రజని, 46 శాతం భాస్వరం ఉంటాయి. పోషకాల గణన ఇలా... ఫీల్డ్ క్రాప్ పత్తి పంటకు ఎకరాకు 60 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 24 కిలోల భాస్వరం సిఫారసు చేయబడింది. ఎంచుకునే కంపెనీ ఎరువులో పోషకాల మోతాదును బట్టి అవసరమయ్యే ఎరువులను లెక్కించవచ్చు. కిలో నత్రజని కోసం 2.17 కిలోల యూరియా(100/46)ను వాడాలి. కిలో భాస్వరం అందించేందుకు 6.25 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్(100/16) వేసుకోవాలి. కిలో పొటాష్ కోసం 1.67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (100/60)వాడాలి. 15–15–15 బస్తాలో 7.5 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌లు ఉంటాయి. బస్తా డీఏపీలో 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం ఉంటాయి. వ్యవసాయ పంటల్లో ఎకరాకు ఎరువు మోతాదును లెక్కించడంలో కిలో భాస్వరాన్ని డీఏపీ ద్వారా అందించాలంటే 2.17 కిలోల (100/46) డీఏపీ వాడాలి. అయితే 2.17 కిలోల డీఏపీలో కిలో భాస్వరంతోపాటు 0.4 కిలోల (18/100“2.17) నత్రజని కూడా ఉంటుంది. కిలో భాస్వరాన్ని 20–20–0 అనే కాంప్లెక్స్ ఎరువు ద్వారా అందించాలంటే 5 కిలోల (100/20) 20–20–0 అనే కాంప్లెక్స్ ఎరువు వాడాలి. అయితే 5 కిలోల 20–20–0 ఎరువులో ఒక కిలో భాస్వరంతో పాటు కిలో నత్రజని కూడా ఉంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వాడినప్పుడు వాటి మోతాదుననుసరించి అవసరమైన ఎరువులు లెక్కగట్టి సరైన అవసరమైనంత మోతాదులో వాడి వృ«థా ఖర్చు తగ్గించుకుని, పోషకాల సమతుల్యతను పొందవచ్చు. ఎరువుల వాడకంలో కాంప్లెక్స్ ఎరువులు దుక్కిలో విత్తనాలు వేసేటప్పుడు వాడాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం వల్ల పోషకాలు సమర్థవంతంగా పనిచేయవు. యూరియాను పలు ధపాలుగా వేయాలి. ఎక్కువగా యూరియా వాడకం వల్ల చీడపీడలు, తెగుళ్లు సోకుతాయి. -
జల సంరక్షణపై రైతులకు అవగాహన
గుర్రంపోడు : వర్షపు నీటిని భూమిలోకి ఇంకింప జేయడం ద్వారానే భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని తెలంగాణ జల సంరక్షణ వేదిక అధ్యక్షుడు అయ్యప్ప మాసాజీ అన్నారు. సోమవారం మండలంలోని మక్కపల్లిలో జల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు కందకాలను, వాలుకు అడ్డంగా నీటి గుంతలను తవ్వుకోవాలన్నారు. వర్షపు నీటిని భూమిలో ఇంకింప జేసుకుంటే బోరు బావుల్లో నీరు సరిపడా లభ్యమవుతుందని తెలిపారు. రైతులు వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు తమ పొలాల్లో సామూహికంగా కందకాలు తవ్వుకోవాలని సూచించారు. కందకాలు తవ్వుకున్న ప్రాంతాల్లో గతంలో ఎండిన బావుల్లో నీరు లభిస్తుందని అన్నారు. వాలుకు అడ్డంగా దున్నుకోవడం, రాతికట్టడాలు లాంటి జలసంరక్షణ పద్ధతులు పాటించాలని తెలిపారు. వర్షాకాలంలో వృ«థా అయ్యే నీటిని నేలలో ఇంకింప జేస్తే కరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చన్నారు. భాస్కర్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంతో జల సంరక్షణకు గాను పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్ లెంకల అశోక్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
ఇద్దరు మహిళల ఆత్మహత్య
గుర్రంపోడు వేర్వేరు కారణాలతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని గుర్రంపోడు, మోత్కూరు మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. గుర్రంపోండు మండలం కొప్పోలు గ్రామ పంచాయతీ పరిధి బుడ్డరెడ్డిగూడేనికి చెందిన సింగం ముత్యాలు, సింగం ఈదయ్యలు సోదరులు. వీరి మధ్య కొంత కాలంగా స్థల వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో ముత్యాలు భార్య సింగం యాదమ్మ(40)పై ఈదయ్యతోపాటు అతడి కుమారులు, బంధువులు కలిసి దాడి చేశారు. అనంతరం మనస్తాపంతో సింగం యాదమ్మ పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. యాదమ్మ భర్త ముత్యాలు ఫిర్యాదు మేరకు ఈదయ్య, సత్తమ్మ, వంశీ, సైదులు, బాలకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ప్రోబెషనరీ ఎస్ఐ రాములు తెలిపారు. కడుపునొప్పి భరించలేక.. మోత్కూరు: మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన బాసోజు బుగ్గరాములు భార్య మలీశ్వరి(47) అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు కూతుళ్లు. ఇద్దరి వివాహాలు జరిగాయి. అయితే ఐదేళ్లుగా మలీశ్వరి కడుపునొప్పితో బాధపడుతుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకలమందు తాగి , సుమారు 20 బీపీ మాత్రలు మింగింది. సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త ఆమె తల్లి బందరోజు సుగుణమ్మ, అక్క రాజేశ్వరిలు అపస్మారకస్థితిలో పడి ఉన్న మల్లీశ్వరిని గమనించారు. వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోత్కూరు ఏఎస్ఐ సాయినాథ్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
గుర్రంపోడ్ అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని చామలేడు గ్రామంలో శనివారం వెలుగుచూసింది. ఏఎస్ఐ రాముల కథనం ప్రకార ం.. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి పద్మ (19) శుక్రవారం రాత్రి ఇంట్లో మంటలు అంటుకుని కాలిన గాయాలతో ఉన్న ఆమెను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ భర్త బొడ్డుపల్లి సైదులు నల్లగొండలో చికిత్స పొందుతున్నాడు. కాగా పద్మ కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్య చేసుకుందని ఆమె బంధువులు, భర్త చెబుతుండగా తన కుమార్తెను భర్త సైదులే కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తండ్రి ఈదయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొసంగి గ్రామానికి చెందిన పద్మను ఏడు నెలల క్రితమే చామలేడు గ్రామానికి చెందిన సైదులుకు ఇచ్చి వివాహం చేశారు. అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.