దొడ్డబళ్లాపురం: తోటకు పనికి వెళ్లిన వివాహితను దుండగులు హత్యచేసి గుంతలో పడేసిన సంఘటన చెన్నపట్టణ తాలూకా అక్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చెన్నపట్టణ తాలూకా ద్యావపట్టణ గ్రామానికి చెందిన శ్వేత (24) హతురాలు. ఐదేళ్లుగా ద్యావపట్టణ గ్రామంలో నివసిస్తున్న శ్వేతకు 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త బెంగళూరులో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వారానికి ఒకసారి వచ్చి వెళ్లేవాడు.
సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తోటలో కూలీ పనికి వెళ్లిన శ్వేత రాత్రయినా తిరిగిరాలేదు. మంగళవారం ఉదయం తోటలో ఒకచోట గుంతలో శ్వేత మృతదేహం లభించింది. ఎవరో దుండగులు ఆమెను హత్య చేసినట్లు తేలింది. అక్కూరు పోలీసులు చేరుకుని జాగిలాలతో ఆధారాల కోసం గాలించారు.
Comments
Please login to add a commentAdd a comment