శీలాన్ని శంకించాడని.. | married woman died in T Nagar | Sakshi
Sakshi News home page

శీలాన్ని శంకించాడని..

Published Wed, Apr 5 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

శీలాన్ని శంకించాడని..

శీలాన్ని శంకించాడని..

టీనగర్‌: భర్త శీలాన్ని శంకించాడని మనస్తాపానికి గురైన భార్య పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పిల్లల్లో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. తిరువన్నామలై జిల్లా, తండరాంపట్టు అమందపుత్తూరు గ్రామానికి చెందిన రమేష్‌ (35)టైలర్‌. ఇతని భార్య సరసు (30). వీరికి కుమార్తెలు అనసూయ (3), కౌసల్య (2).

 రోజూ మద్యం సేవించి రమేష్‌ ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. అంతేకాకుండా భార్య ప్రవర్తనను అనుమానించి హింసించేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రమేష్‌ మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపంతో రాత్రి 11 గంటల సమయంలో పాలల్లో విషం కలిపి ఇద్దరు పిల్లలకు తాగించి తర్వాత తాను పాలను తాగింది. దీంతో కొద్ది సేపట్లోనే సరసు కిందపడి మృతిచెందింది.

 ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానించిన ఇరుగు పొరుగు ఇంట్లోకి వెళ్లి చూడగా సరసు విగతజీవిగా పడివుంది. అపస్మారక స్థితిలో ఉన్న పిల్లల్ని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే మార్గమధ్యలో కౌసల్య మృతిచెందింది. ఆస్పత్రిలో అనసూయకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement