హీరో ప్రభాస్ తమిళనాడుకు వెళ్లారట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో తమిళనాడులో ప్రారంభం కానుందని తెలిసింది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment