అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | suspicious circumstances married woman died | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Published Wed, Jan 1 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

suspicious circumstances married woman died

నర్సింగాపురం(కొడకండ్ల), న్యూస్‌లై న్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన సంఘటన మండలంలోని నర్సింగాపురంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి కథనం ప్రకారం.. మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన సుమలత(28)కు నర్సింగాపురం గ్రామానికి చెందిన కొయ్యూరి సోమనర్సయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త సోమనర్సయ్య రోజూ తాగొచ్చి సుమలతను వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సుమలతను భర్త, ఆడపడుచులు కలిసి కొట్టారు. దీంతో బాధితురాలు తన  అన్న సంతోష్‌కు ఫోన్ చేసి రోదిస్తూ విషయం చెప్పిం ది.

సంతోష్ వెంటనే నర్సింగాపురంలోని చెల్లెలి ఇంటికి చేరుకుని పెద్దమనుషుల సమక్షంలో తన బావను, చెల్లెలి ఆడపడుచులను సముదాయిం చాడు. సుమలత నీరసంగా ఉండడంతో ఆమెకు ఆహరం తీసుకొచ్చేందుకు కాన్వాయిగూడెం వెళ్లాడు. భోజనం టిఫిన్‌బాక్స్‌లో పెడుతుండ గా సుమలత ఆడపడుచు భర్త ఫోన్ చేసి మీ చెల్లె లు ఉరివేసుకుందని చెప్పాడు. దీంతో వెంటనే సంతోష్ అక్కడికి చేరుకునేసరికి సుమలత ఇంటిపై కప్పు వాసానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, సుమలత భర్త, మామ సోమయ్య, ఆడపడుచులు పరారయ్యారు.

 కాగా సుమలత ఆత్మహత్య చేసుకోలేదని ఆమె భర్త సోమనర్సయ్య, మామ సోమయ్య, ఆడపడడుచులే ఆమెను కొట్టి చంపి ఉరివేశారని మృతురాలి సోదరుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. మృతురాలికి కుమారులు అవినాష్(06), అర్షిత్ (04) ఉన్నారు. సంఘటన స్థలానికి కొడకండ్ల ట్రైనీ ఎస్సై వెంకట్రావు చేరుకుని  మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement