Venkatrao
-
శోక జీవితం నిరాశామయం!
కష్టాలలో పడి బాధలను అనుభవిస్తున్న మనిషికి తన చుట్టూ చోటుచేసుకుంటున్న సుఖ సంతోషాలను గురించిన స్పందన, కాలం గడిచే కొద్దీ తగ్గిపోయి, చివరకు దాదాపుగా నశించిపోతుంది. బతుకంతా కష్టంతోనే కూడుకున్నట్లుగా కనబడి అంతులేని నిరాశకు, అయోమయానికి గురిచేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ విపరీత మానసిక స్థితిని ఎదుర్కొనని మనిషి దాదాపుగా ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. ఈ విపరీత మాన సిక స్థితిని ఒక సరసమైన సన్నివేశంలో చెప్పాడు కనుపర్తి అబ్బయామాత్యుడు ‘కవిరాజ మనోరంజనము’ కావ్యం ద్వితీయాశ్వాసంలో.మానవలోకంలో చంద్రవంశానికి చెందిన ప్రభువైన పురూరవుడిని ప్రేమించింది దేవేంద్రుడి సభలో నర్తకియైన ఊర్వశి. అయితే, లోకాలు వేరైన కారణంగా, పురూరవుడితో సాంగత్యాన్ని ఎలా పొందాలో తెలియని అవస్థలో పడింది. అలా పురూరవుడి ధ్యాసలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సర్వమూ మరిచి దుఃఖిస్తూ ఉన్న స్థితిని ఇలా వర్ణించాడు అబ్బయా మాత్యుడు.'పువ్వులు మానె దావి మెయిపూతలు మానె సఖీజనంబుతో నవ్వులు మానె గీరవచన ప్రతిభాషలు మానె మానె దానెవ్వియు నింపుగాక సుఖహేతువు లెల్ల మనోజబాధ నాజవ్వని ‘దుఃఖితే మనసి సర్వమసహ్యమ’ నంగ లేదొకో'పూవులు పెట్టుకోవడం మానేసింది; సుగంధ పరిమళాలు వెదజల్లే లేపనాలను శరీరంపై రాసుకోవడం మానేసింది; తోటివారితో నవ్వులు మానివేసింది; సరస మైన సంభాషణలతో సమాధానాలను మానివేసింది; ఈ శోకం కారణంగా, ఒకప్పుడు ఆహ్లాదంగా అనిపించినవి అన్నీ ఇప్పుడు సుఖం ఇచ్చేవిగా కనుపడడంలేదు ఊర్వశికి. భరింపరాని దుఃఖంలో మునిగిపోయిన మనిషికి లోకంలో అంతా దుఃఖమయంగానూ, సహింపరానిదిగానూ కనపడడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు కదా! అని పై పద్యం భావం. శోకంలో మునిగివున్న మనిషికి సర్వమూ సహింపరానిదిగా కనబడుతుందన్నది స్వతహాగా అనుభవించకపోయినప్పటికీ అందరూ గ్రహించగలిగే సంగతే! కష్టమే అయినప్పటికీ ప్రయత్నం చేసి శోకంలోంచి ఎంత త్వరగా బయటపడితే అంతగా మేలు జరుగుతుందన్నది అందరూ సారాంశంగా గ్రహించవలసిన విషయం. – భట్టు వెంకటరావు -
ఈ పసివాడు.. యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి?
విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముడిని యాగపరిరక్షణార్థం పంపించమని అడిగినప్పుడు, కేవలం పదిహేనేండ్ల బాలుడు, ఈ పసివాడు యాగానికి రక్షగా నిలబడడం ఏమిటి? అని కంగారుపడి, పంపించడానికి సంకోచించాడు దశరథ మహారాజు. తపస్సు చేయగా చేయగా కలిగిన సంతానం కాబట్టి దశరథుడి మనసులో ఆ కంగారు, దిగులు సహజమే! అయితే, అలా పంపమని అడిగిన విశ్వామిత్రుడు ఆ మాత్రం ఆలోచన లేకుండానే అడిగాడా? అన్నది ఆ క్షణాలలో దశరథుడు, శ్రీరాముడి మీదనున్న అపారమైన ప్రేమ కారణంగా ఆలోచించలేకపోయిన సంగతి.పిల్లల క్షేమానికి ఏది రక్షగా పనిచేస్తుంది? అని ప్రశ్న వేసుకున్నపుడు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత ధర్మబద్ధంగా జీవనాన్ని సాగిస్తారో అంత క్షేమంగా వారి పిల్లలు ఉంటారన్న సమాధానాన్ని సూచించిన సన్నివేశం ఇది. దశరథుడి సంకోచానికి విశ్వామిత్రుడు కోపగించుకోవడం చూసిన వశిష్ఠుడు కలగజేసుకుని ‘దశరథ మహారాజా! దక్షప్రజాపతి కుమార్తెలైన జయకు, సుప్రభకు భృశాశ్వుడనే ప్రజాపతి ద్వారా కలిగిన కామరూపులు; మహా సత్వసంపన్నులు, అస్త్రములు అయినటువంటి నూర్గురు కొడుకులను విశ్వామిత్రుడు పొంది ఉన్నాడు.వాళ్ళల్లో ఏ ఒక్కడైనా కూడా యాగరక్షణ అనే పనికి సరిపోతాడు. ఇక శస్త్రాస్త్రాల సంగతంటావా? ఈయనకు తెలియని శస్త్రాలు, తలుచుకుంటే ఈయన సృష్టించలేని అస్త్రాలు లేవు. అటువంటి ఆయనతో పంపించడానికా నీవు సంకోచిస్తున్నావు?’ అని ఊరడించి, దశరథుడితో ఇంకా ఇలా చెప్పాడు."చ. అనలము చేత గుప్తమగు నయ్యమృతంబును బోలె నీ తపో ధనపరిరక్షితుం డగుచు దద్దయు నొప్పెడు నీ తనూభవుం డని నకృతాస్త్రుడైనను నిరాయుధుడైన నిశాట కోటికిం జెనకగ రాదు కౌశికుడు చెప్పగ గేవల సంయమీంద్రుడే"పూర్వం క్షీరసాగర మథనంతో లభించిన అమృతకలశం భయంకరమైన విషాగ్ని కింద దాచబడి ఉన్నట్లుగా, నీ కొడుకైన శ్రీరాముడనే అమృతకలశం నీ తపోధనం అనే ప్రాణశక్తి చేత పరిరక్షించబడుతూ ఉన్నది. అటువంటి స్థితిలో శ్రీరాముడు నిరాయుధుడుగా ఉన్నప్పటికీ ఆ రాక్షస సమూహం అతడిని ఏమీ చేయలేదు. కౌశికుడు కంటికి కనిపిస్తున్నట్లుగా కేవలం మునిమాత్రుడు కాడు సుమా!’ అని వివరించాడు వశిష్ఠుడు ‘భాస్కర రామాయణం’ బాలకాండలోని పై సన్నివేశంలో. సంతానం ప్రాణాలకు వారి తల్లితండ్రుల ధర్మబద్ధ జీవనమే అన్నిటినీ మించిన రక్ష అని పైసన్నివేశం చాలా బలంగా చెప్పింది. – భట్టు వెంకటరావు -
హానికరమైన ఉపేక్ష!
కురుక్షేత్ర సంగ్రామం మొదలైన నాటి నుండి జరిగిన సంగతులను తాను చూసి వచ్చి తన ప్రభువైన ధృతరాష్ట్రుడికి వర్ణించి చెబుతుంటాడు సంజయుడు. భీష్మ, ద్రోణాచార్యుల సర్వసేనాధిపత్యంలో పదిహేను రోజుల యుద్ధం తరువాత, రెండు రోజులు కర్ణుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. ఆ రెండు రోజుల యుద్ధం చివరన అర్జునుడి చేతిలో కర్ణుడు, భీముడి చేతిలో దుశ్శాసనుడు నిహతులయ్యారు.ఆ సంగతులను వివరించిన సంజయుడు, కౌరవుల విజయానికి సంబంధించిన ఆశలు అడుగంటిపోయేలా దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగి భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడని చెబుతాడు. అది విన్న ధృతరాష్ట్రుడు హతాశుడై, సంజయుడు అలా చెబుతున్నాడంటే దుర్యోధనుడు కూడా మరణించి ఉంటాడని ఊహించుకుని హాహాకారాలు చేస్తూ మూర్ఛపోతాడు.విదురుడి సహాయంతో, సంజయుడు సపర్యలు చేసిన అనంతరం మూర్ఛలోంచి తేరుకున్న ధృతరాష్ట్రుడు ‘నీవు మొదట చెప్పిన మాటలు నేను సరిగా వినలేదు. దుర్యోధనుడికి ఏ ప్రమాదము సంభవించ లేదు కదా!’ అంటాడు. ప్రపంచమంతా ఏమైపోయినా çఫరవాలేదు, దుర్యోధనుడు ఒక్కడు బ్రతికి ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది ధృతరాష్ట్రుడి వైఖరి. ఈ వైఖరిని గట్టిగానే నిరసిస్తాడు సంజయుడు.కొడుకులంత రాజ్యంబును గొనగ శక్తులను దురాశను వారల యవినయములునీ వుపేక్షింతు; మానునే? యా విరుద్ధకర్మమున ఫలమొందక కౌరవేంద్ర!‘రాజ్యం మొత్తాన్నీ తామే కాజేయాలన్న దురాశతో నిండిన కాంక్షతో నీ కొడుకులు చేసే కానిపనులన్నిటినీ నీవు ఉపేక్షించి, చూస్తూ ఊరుకున్నావు. ఏనాటికైనా దాని ఫలితం అనుభవించాల్సిన సమయం రాకుండా ఉంటుందా? అదే ఇప్పుడు వచ్చింది చూడు!’ అని ధృతరాష్ట్రుడి మొహం మీదనే సంజయుడు అనడం ఆంధ్ర మహాభారతం, కర్ణపర్వంలోని పై తేటగీతి పద్యంలో కనబడుతుంది.ఈ మాటలు అనిపించుకుని కూడా ‘అది సరేలే, ఇంతకీ దుర్యోధనుడు క్షేమంగానే ఉన్నాడు కదా?!’ అంటాడు ధృతరాష్ట్రుడు. కళ్ళెదురుగా వినాశనానికి సంబంధించిన ఛాయలు కనపడుతున్నా చూడడానికి ఇచ్చగించని స్వార్థపూరిత ఉపేక్ష ధృతరాష్ట్రుడిది! ధృతరాష్ట్రుడి అంగవైకల్యం దృష్టి లేకపోవడం కాదు. దానిని అడ్డం పెట్టుకుని అతడు ప్రదర్శిస్తూ వచ్చిన ఉపేక్షయే! చెడు జరగకుండా ఆపగలిగే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఉపేక్షించడం ఊహించనంత వినాశనానికి దారితీస్తుందని ఇది తెలుపుతుంది. – భట్టు వెంకటరావుఇవి చదవండి: ఉద్యమ వాస్తవ చరిత్ర.. -
మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత
తెనాలి/సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా తెనాలి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలితరం నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం హైదరాబాద్‌లోని కుమార్తె జితా రవిశ్రీ నివాసంలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని స్వగృహానికి తీసుకొచ్చారు. వెంకట్రావు భార్య అలిమేలుమంగమ్మ గతేడాది మృతిచెందారు. తనయుడు జయరామ్, కోడలు హిమకుమారి కూడా అంతకుముందే కాలం చేశారు. యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియల్ని బుధవారం తెనాలిలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం బుర్రిపాలెంరోడ్డులోని వెంకట్రావు స్వస్థలం నుంచి అంతిమయాత్ర బయలుదేరుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో వెంకట్రావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రేపు తెనాలిలో జరిగే అంత్యక్రియల్లోనూ పాల్గొననున్నారు. యడ్లపాటి భౌతికకాయాన్ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, వివిధ పార్టీల నేతలు నన్నపనేని రాజకుమారి, డాక్టర్ గోగినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, పాటిబండ్ల రామకృష్ణ, దాసరి బాలవర్ధనరావు, చలసాని ఆంజనేయులు, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఈదర వెంకటపూర్ణచంద్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితం.. తెనాలికి సమీపంలోని అమృతలూరు మండలం బోడపాడులో మోతుబరి రైతు కుటుంబంలో 1919 డిసెంబర్ 16న వెంకట్రావు జన్మించారు. తురుమెళ్లలో హైస్కూలు విద్య తర్వాత గుంటూరులోని ఏసీ కాలేజిలో ఎఫ్ఏ, బీఏ చేశారు. 1941లో చెన్నైలోని లా కాలేజీలో చేరారు. 1945 నుంచి న్యాయవాదిగా తెనాలిలో స్థిరపడ్డారు. 1973 వరకు ప్రాక్టీసులో ఉంటూనే రాజకీయాల్లో కొనసాగారు. ఎన్జీరంగా అనుచరుడిగా ఆయన స్థాపించిన స్వతంత్ర పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున వేమూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి 1962, 1965 ఎన్నికల్లో ఓడిపోగా, 1967 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన యడ్లపాటి ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. డాక్టర్ చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, న్యాయశాఖ మంత్రిగా, టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా చేశారు. వడ్లమూడి వద్ద 1977లో ఏర్పాటైన సంగం డెయిరీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989 నుంచి టీడీపీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్లపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి సంతాపం యడ్లపాటి వెంకట్రావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కూడా సంతాపం తెలిపారు. -
ఎస్‌సీఎల్‌యూ భవితవ్యమేమిటి ?
టీబీజీకేఎస్‌లో విలీనమా..కలిసి పనిచేయడమా..! అయోమయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు గోదావరిఖని(కరీంనగర్) : ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎల్‌యూ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా నియూమకం కావడంతో ఎస్‌సీఎల్‌యూ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కొంత కాలం క్రితం గోదావరిఖనిలో జరిగిన యూనియన్ సమావేశంలో టీబీజీకేఎస్‌తో కలిసి పనిచేయడానికి వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇటీవల శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తనతో కలిసి వచ్చే నాయకులతో సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆయన వెంట వెళ్లే నాయకులెందరనేది సంశయంగా మారింది. టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెంకట్రావు వ్యవహరిస్తున్నందున ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎస్సీఎల్యూను అందులో విలీనం చేయూలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ భవిష్యత్‌లో టీబీజీకేఎస్ నుంచి బయటకు వచ్చినా.. తిరిగి ఎస్‌సీఎల్‌యూ ద్వారా సింగరేణి లో కార్యకలాపాలు నిర్వహించేందుకు కలిసి పనిచేయా లా? అనే మరో ఆలోచన సైతం చేస్తున్నట్లు సమాచారం. బలోపేతం కానున్న ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ సింగరేణిలో నిన్నటి వరకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి సింగరేణిలో రెండు యూనియన్లు పనిచేశాయి. వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్‌సీఎల్‌యూ, జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఎస్‌సీఎస్‌డబ్ల్యూయూ) కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే వెంకట్రావు టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా వెళ్లడంతో ఎస్సీఎల్యూలో కొనసాగే క్యాడర్, కాంగ్రెస్ అభిమానులు సహజంగా ఎస్సీఎస్డబ్ల్యూయూకే మద్దతు తెలుపుతారు. ప్రస్తుతం ఎస్‌సీఎల్‌యూ వర్కింగ్ కమిటీలో 63 మంది సభ్యులుండగా అందులో 43 మంది జనక్‌ప్రసాద్ యూనియన్‌లో చేరడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం. అలాగే ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఒకే యూనియన్ సింగరేణిలో పనిచేయనుండడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. 1998లో జరిగిన మొదటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ‘సాజక్’ పేరుతో పోటీచేసి ఆర్జీ-1, 2 డివిజన్లను గెలుచుకుంది. తర్వాత 2007 ఎన్నికల్లో వెంకట్రావుతో కలిసి పనిచేసి గుర్తింపు సంఘంగా విజయం సాధించింది. అయితే రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను ఓడించడానికి సంజీవరెడ్డి సూచన మేరకు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసి పోటీచేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో గోదావరిఖనిలో జరి గిన ఐఎన్టీయూసీ మహాసభల్లో పాల్గొన్న యూనియన్ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి సింగరేణిలో ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఒకే యూనియన్ ఉంటుందని చెప్పారు. తాజా పరిణామాలు అందుకు అద్దం పడుతుండడంతో యూని యన్ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. మిర్యాల’తో మంతనాలు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మిర్యా ల రాజిరెడ్డిని యూనియన్‌లో స్థానం లేకుండా చేయడం తో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయనను కాంగ్రెస్ అనుబంధ యూనియన్‌లో చేర్చుకునేందుకు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎస్సీసీడబ్ల్యూ యూ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్, బడికెల రాజలిం గం, గుమ్మడి కుమారస్వామి తదితర నాయకులు మిర్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం రాత్రి సెంటినరీకాలనీలోని నివాసంలో రాజిరెడ్డిని కలిసి యూనియన్‌లోకి రావాలని ఆహ్వానించగా తనకు సమయం కావాలని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని యూని యన్ నుంచి తొలగించడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు సమావేశమై టీబీజీకేఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసురావాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ యూనియన్, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు వారు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కుంచె కదిపితే... సజీవ చిత్రాలు
చిత్రకళా రంగంలో రాణిస్తున్న ఉక్కు ఉద్యోగి వెంకట్రావు విశాఖపట్నం : ఆయన కుంచె కదిపితే ప్రకృతి పులకరిస్తుంది.. సెలయేళ్లు పరవళ్లు తొక్కుతాయి.. మేఘాలు వర్షిస్తాయి.. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది.. పడుచుపిల్లలు ఊహల పల్లకిలో ఊరేగుతారు.. దేవతామూర్తులు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తారు.. ఇలా ఆ కుంచె ఎన్నో అద్భుత చిత్రాలను సృష్టించింది. ఆ చిత్రాలు కొల్లి వెంకట్రావు సృజనాత్మక శక్తికి దర్పణాలు. ఉద్యోగిగా, కళాకారునిగా రాణిస్తు న్న ఆయన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్ సీసీడీ వి భాగంలోని హైడ్రాలిక్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. అగనంపూడి నిర్వాసిత కాలనీలో నివసిస్తున్నారు. చిరుప్రాయంలోనే బొమ్మలు గీయడం నేర్చుకొని స్వగ్రామంలోని రామాలయం గోడలమీద చిత్రాలు వేయడంతో ప్రారంభమైంది ఆయన చిత్ర కళా నైపుణ్యం. ఇలా ఆయన చిత్రిం చిన కళాఖండాలను విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రియేటివ్ కల్చరల్ డీలైట్ కార్యక్రమంలో ప్రదర్శించి, ఉక్కు కిర ణం బిరుదును పొందా రు. ఇంకా వివిధ ఆల యాల నమూనాలు, బ హుళ అంతస్తుల భవనాలను ధర్మాకోల్‌తో రూపొందిస్తారు. ఈనెల 4వ తేదీన స్టీల్‌ప్లాంట్ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో వెం కట్రావు రూపొందించిన చిత్రాలకు ప్రథమ, తృతీయ బహుమతులు ల భించడం విశేషం. ఈ పోటీల్లో విశా ఖ స్టీల్‌ప్లాంట్, మాదారం, బయ్యా రం, జగ్గయ్యపేట, గర్భాం గనుల నుంచి అనేకమంది కార్మికులు తమ పెయింటింగ్‌లతో హాజరైనప్పటికీ, కొల్లి గీసిన చిత్రాలకు బహుమతులు దక్కాయి. ఉక్కు సీఎండీతోపాటు వివిధ ఉన్నతాధికారులు, గుర్తింపు యూనియన్ నాయకులు వెంకట్రావును అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
నర్సింగాపురం(కొడకండ్ల), న్యూస్‌లై న్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన సంఘటన మండలంలోని నర్సింగాపురంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి కథనం ప్రకారం.. మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన సుమలత(28)కు నర్సింగాపురం గ్రామానికి చెందిన కొయ్యూరి సోమనర్సయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త సోమనర్సయ్య రోజూ తాగొచ్చి సుమలతను వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సుమలతను భర్త, ఆడపడుచులు కలిసి కొట్టారు. దీంతో బాధితురాలు తన అన్న సంతోష్‌కు ఫోన్ చేసి రోదిస్తూ విషయం చెప్పిం ది. సంతోష్ వెంటనే నర్సింగాపురంలోని చెల్లెలి ఇంటికి చేరుకుని పెద్దమనుషుల సమక్షంలో తన బావను, చెల్లెలి ఆడపడుచులను సముదాయిం చాడు. సుమలత నీరసంగా ఉండడంతో ఆమెకు ఆహరం తీసుకొచ్చేందుకు కాన్వాయిగూడెం వెళ్లాడు. భోజనం టిఫిన్‌బాక్స్‌లో పెడుతుండ గా సుమలత ఆడపడుచు భర్త ఫోన్ చేసి మీ చెల్లె లు ఉరివేసుకుందని చెప్పాడు. దీంతో వెంటనే సంతోష్ అక్కడికి చేరుకునేసరికి సుమలత ఇంటిపై కప్పు వాసానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, సుమలత భర్త, మామ సోమయ్య, ఆడపడుచులు పరారయ్యారు. కాగా సుమలత ఆత్మహత్య చేసుకోలేదని ఆమె భర్త సోమనర్సయ్య, మామ సోమయ్య, ఆడపడడుచులే ఆమెను కొట్టి చంపి ఉరివేశారని మృతురాలి సోదరుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. మృతురాలికి కుమారులు అవినాష్(06), అర్షిత్ (04) ఉన్నారు. సంఘటన స్థలానికి కొడకండ్ల ట్రైనీ ఎస్సై వెంకట్రావు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి దుర్మరణం
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: విద్యుత్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మండలంలోని చిన్నఅబ్బీపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో ఇదే మండల పరిధిలోని అబ్బాసాహెబ్పేటకు చెందిన వల్లూరు వెంగయ్య (27), కొత్తపేట నివాసి పీతల కొండలరావు (30) ప్రాణాలు విడిచారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు..గుడిపాడు పంచాయతీ మజరా అబ్బాసాహెబ్పేటకు చెందిన వల్లూరు వెంగయ్య అనే రైతు తన పొలంలోని మోటార్‌కు విద్యుత్ స్తంభాలు తీసుకొచ్చేందుకు మండలంలోని కొత్తపేటకి చెందిన కొండలరావు, కోలా మస్తాన్, కోలా చిన్నకొండయ్య, కోలా మల్యాద్రి అనే కూలీలను వెంటబెట్టుకుని తన గ్రామవాసైన వల్లూరు వెంకట్రావు ట్రాక్టర్లో వెళ్లారు. అనుమసముద్రం వద్ద నాలుగు విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్లోకి ఎక్కించారు. అబ్బాసాహెబ్పేటకు వస్తూ మార్గమధ్యంలో చిన్నఅబ్బీపురం బస్టాండ్ దాటిన తర్వాత వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. గొల్లెం ఊడి ట్రక్కు బోల్తాపడింది. ట్రక్కులో స్తంభాలపై కూర్చున్న నలుగురు కూలీల్లో మస్తాన్, చిన్నకొండయ్య, మాల్యాద్రి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వల్లూరు వెంగయ్య, కొండలరావులపై స్తంభాలు పడటంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. మృతదేహాలను గ్రామస్తులు రాత్రికే రాత్రే ఊరికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి శనివారం వెళ్లి పరిశీలించారు. స్తంభాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు శవపంచనామా నిర్వహిస్తామన్నారు. విషాదఛాయలు మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వల్లూరు వెంగయ్యకు మూడేళ్ల క్రితమే సుశీలతో వివాహమైంది. తనకిక దిక్కెవరిని సుశీల చేస్తున్న రోదన చూపరులను కంటితడి పెట్టించింది. కొత్తపేటకు చెందిన కొండలరావుకు భార్య, కుమారుడు మనోహర్, కుమార్తె మమత ఉన్నారు.