కుంచె కదిపితే... సజీవ చిత్రాలు
చిత్రకళా రంగంలో రాణిస్తున్న ఉక్కు ఉద్యోగి వెంకట్రావు
విశాఖపట్నం : ఆయన కుంచె కదిపితే ప్రకృతి పులకరిస్తుంది.. సెలయేళ్లు పరవళ్లు తొక్కుతాయి.. మేఘాలు వర్షిస్తాయి.. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది.. పడుచుపిల్లలు ఊహల పల్లకిలో ఊరేగుతారు.. దేవతామూర్తులు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తారు.. ఇలా ఆ కుంచె ఎన్నో అద్భుత చిత్రాలను సృష్టించింది. ఆ చిత్రాలు కొల్లి వెంకట్రావు సృజనాత్మక శక్తికి దర్పణాలు. ఉద్యోగిగా, కళాకారునిగా రాణిస్తు న్న ఆయన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ సీసీడీ వి భాగంలోని హైడ్రాలిక్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. అగనంపూడి నిర్వాసిత కాలనీలో నివసిస్తున్నారు. చిరుప్రాయంలోనే బొమ్మలు గీయడం నేర్చుకొని స్వగ్రామంలోని రామాలయం గోడలమీద చిత్రాలు వేయడంతో ప్రారంభమైంది ఆయన చిత్ర కళా నైపుణ్యం.
ఇలా ఆయన చిత్రిం చిన కళాఖండాలను విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రియేటివ్ కల్చరల్ డీలైట్ కార్యక్రమంలో ప్రదర్శించి, ఉక్కు కిర ణం బిరుదును పొందా రు. ఇంకా వివిధ ఆల యాల నమూనాలు, బ హుళ అంతస్తుల భవనాలను ధర్మాకోల్‌తో రూపొందిస్తారు. ఈనెల 4వ తేదీన స్టీల్‌ప్లాంట్ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో వెం కట్రావు రూపొందించిన చిత్రాలకు ప్రథమ, తృతీయ బహుమతులు ల భించడం విశేషం. ఈ పోటీల్లో విశా ఖ స్టీల్‌ప్లాంట్, మాదారం, బయ్యా రం, జగ్గయ్యపేట, గర్భాం గనుల నుంచి అనేకమంది కార్మికులు తమ పెయింటింగ్‌లతో హాజరైనప్పటికీ, కొల్లి గీసిన చిత్రాలకు బహుమతులు దక్కాయి. ఉక్కు సీఎండీతోపాటు వివిధ ఉన్నతాధికారులు, గుర్తింపు యూనియన్ నాయకులు వెంకట్రావును అభినందించారు.