Visakhapatnam Steel
-
కుంచె కదిపితే... సజీవ చిత్రాలు
చిత్రకళా రంగంలో రాణిస్తున్న ఉక్కు ఉద్యోగి వెంకట్రావు విశాఖపట్నం : ఆయన కుంచె కదిపితే ప్రకృతి పులకరిస్తుంది.. సెలయేళ్లు పరవళ్లు తొక్కుతాయి.. మేఘాలు వర్షిస్తాయి.. నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది.. పడుచుపిల్లలు ఊహల పల్లకిలో ఊరేగుతారు.. దేవతామూర్తులు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తారు.. ఇలా ఆ కుంచె ఎన్నో అద్భుత చిత్రాలను సృష్టించింది. ఆ చిత్రాలు కొల్లి వెంకట్రావు సృజనాత్మక శక్తికి దర్పణాలు. ఉద్యోగిగా, కళాకారునిగా రాణిస్తు న్న ఆయన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్ఎంఎస్ సీసీడీ వి భాగంలోని హైడ్రాలిక్ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. అగనంపూడి నిర్వాసిత కాలనీలో నివసిస్తున్నారు. చిరుప్రాయంలోనే బొమ్మలు గీయడం నేర్చుకొని స్వగ్రామంలోని రామాలయం గోడలమీద చిత్రాలు వేయడంతో ప్రారంభమైంది ఆయన చిత్ర కళా నైపుణ్యం. ఇలా ఆయన చిత్రిం చిన కళాఖండాలను విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రియేటివ్ కల్చరల్ డీలైట్ కార్యక్రమంలో ప్రదర్శించి, ఉక్కు కిర ణం బిరుదును పొందా రు. ఇంకా వివిధ ఆల యాల నమూనాలు, బ హుళ అంతస్తుల భవనాలను ధర్మాకోల్‌తో రూపొందిస్తారు. ఈనెల 4వ తేదీన స్టీల్‌ప్లాంట్ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోటీల్లో వెం కట్రావు రూపొందించిన చిత్రాలకు ప్రథమ, తృతీయ బహుమతులు ల భించడం విశేషం. ఈ పోటీల్లో విశా ఖ స్టీల్‌ప్లాంట్, మాదారం, బయ్యా రం, జగ్గయ్యపేట, గర్భాం గనుల నుంచి అనేకమంది కార్మికులు తమ పెయింటింగ్‌లతో హాజరైనప్పటికీ, కొల్లి గీసిన చిత్రాలకు బహుమతులు దక్కాయి. ఉక్కు సీఎండీతోపాటు వివిధ ఉన్నతాధికారులు, గుర్తింపు యూనియన్ నాయకులు వెంకట్రావును అభినందించారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ అవార్డు
విశాఖపట్నం: పని ప్రదేశ నిర్వహణ(ఫైవ్ ఎస్)లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) ఆధ్వర్యంలో చెన్నై చాప్టర్ సహకారంతో మధురైలో నిర్వహించిన 2వ జాతీయ సదస్సుకు దేశ వ్యాప్తంగా 30 సంస్థలకు చెందిన జట్లు, 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో విశాఖ స్టీల్ ప్రతిభకు పార్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. క్యూసీఎఫ్ఐ అధ్యక్షుడు డాక్టర్ ఎ.కె మిట్టల్, ఈడీ డి.కె.శ్రీవాత్సవ చేతుల మీదుగా ఉక్కు డైరక్టర్ (పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో ప్లాంట్ నుంచి కోక్ ఒవెన్స్ జిఎం ఆర్.నాగరాజన్, ఎంఎస్ డీజీఎం గాంధీ తదితరులు పాల్గొన్నారు. వాయ్ఘాయ్ ఆగ్రో ప్రాడక్ట్స్ ఎండీ నీతీ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ ఉక్కు ఉద్యోగులను అభినందించారు. -
ఉక్కు ఆశలపై నీళ్లు
ఏలేరు నీటి సరఫరాలో కోత గోదావరి జిల్లాలో సాగునీటికి కేటాయింపు గోదావరి పంపింగుకూ ఆటంకాలు రెండు పైపులుమొరాయింపు కర్మాగారానికి మరిన్ని నీటి కష్టాలు ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నీటి కష్టాలు తీరేలా లేవు. మొన్నటివరకు ఇచ్చే నీటి కేటాయింపు కూడా తగ్గిపోయింది. స్టీల్‌ప్లాంట్, ఫార్మాసిటీ, జీవీఎంసీ తా గునీటి అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి నీటి ఎద్దడి పెరగడంతో రెండు నెలలుగాస్టీల్ప్లాంట్కు నీటి సరఫరాను 300 నుంచి 200 క్యూసెక్లకు తగ్గించేశారు. దీంతో ఉక్కు యాజమాన్యం గతనెలలో రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కృష్ణారావుకు పరిస్థితి నివేదించింది. దీంతో ఆయన విస్కోతో సమావేశమై స్టీల్‌ప్లాంట్‌కు నీటిసరఫరా పెంచాలని ఆదేశించారు. నీటి సరఫరా పరుగుతాదని ఆశించిన ఉక్కు యాజమాన్యానికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చుక్కెదురయింది. ఈనెల మొదటివారంలో తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏలేశ్వరం నీటిని మళ్లిస్తే 25వేల ఎకరాలకు పంట లభిస్తుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యవసర నీటిసరఫరా కింద ఉన్న గోదావరి పంపింగ్ పనులు ద్వారా నీటిసరఫరా చేస్తే వారి అవసరాలు తీరుతాయని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం వెంటనే ధవళేశ్వరం ఏస్ఈకు ఏలేశ్వరం నుంచి నీటిసరఫరా తగ్గించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈనెల 4వరకు 200 క్యూసెక్కులు సరఫరా జరగగా ఈ ఆదేశాలతో 5 నుంచి 100క్యూసెక్కులకు, 8 నుంచి 50 క్యూసెక్లకు సరఫరా తగ్గించేశారు. గతంలో విస్కో ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయంగా గోదావరి పంపింగ్ నిమిత్తం ఏర్పాటుచేసిన మొత్తం ఐదు పంపుల్లో రెండు పంపులు మరమ్మతులకు గురయ్యాయి. ఏకకాలంలో మూడు పంపులు ఉపయోగించి గరిష్టంగా రోజుకు 150 క్యూసెక్కులు మాత్రమే పం పింగ్ చేయగలుతున్నారు. ఈనెల 8నుంచి ఏలేశ్వరం, గోదావరి పంపింగ్ ద్వారా 200క్యూసెక్ల నీరు సరఫరా జరగడం గగనంగా మారింది. ఈ పరిస్థితిలో ఏ ఒక్క పంపు రిపేర్‌కు వచ్చినా నీటిసరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందని ఉక్కు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై ఉక్కు డెరైక్టర్ (ఆపరేషన్స్) డి.ఎన్.రావు సోమవారం జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ ద్వారా నీటిసరఫరా పెంచాలని కోరారు. -
వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ఈ ఏడాదే..
త్వరలో ఉక్కుశాఖ కొత్త పాలసీ విశాఖలో విలేకరులతో కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి జి. మోహన్‌కుమార్ స్టీల్ ప్లాంట్‌లో గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్, సింటర్ పవర్ ప్లాంట్ ప్రారంభం సాక్షి, విశాఖపట్నం: కేంద్రప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యంలో భాగంగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో ఈ ఏడాదే పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి జి.మోహన్ కుమార్ వెల్లడించారు.కేంద్రప్రభుత్వ రంగసంస్థల్లో తమ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని కొనసాగిస్తుందని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోనూ దీన్ని అమలుచేస్తామని స్పష్టం చేశారు.ై వెజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో రెండురోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఆర్‌ఐఎన్‌లో రూ.600 కోట్లతో చేపట్టిన గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్ ఆధునికీకరణ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. అనంతరం జపాన్‌దేశ సాంకేతిక సహకారంతో రూ.300 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మించిన 20.6 మెగావాట్ల సింటర్ కూలర్ వేస్ట్‌హీట్ రికవరీ పవర్ ప్లాంట్‌ను సైతం మోహన్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ స్టీల్ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వెలువడే వృథా వాయువులతో విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం మంచి ప్రయత్నమని అభినందించారు. దేశంలో ఇతర ఉక్కు సంస్థలు కూడా ఇదేబాటలో పయనిస్తే పర్యావరణ కాలుష్యాన్ని నివారించి వాతావరణ సమతుల్యత సాధించవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ఉక్కు ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయనే ప్రశ్నకు ఇది ఆయా కంపెనీల విధానాలపై ఆధారపడి ఉంటుందని,దీనిపై తామేం చేయలేమన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం కొంతవరకు బాధాకరమేనని, రాజస్థాన్ గనుల అనుమతి రూపంలో కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఉక్కు ఉత్పత్తి వ్యయం క్రమేపీ పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించుకోగలిగితేనే ఏ కంపెనీకైనా మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని కంపెనీలకు కలిపి 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, వ్యక్తిగత ఉక్కు వినియోగం తక్కువగా ఉంటున్నందున 80 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ భవిష్యత్‌లో రెండో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్ఐఎన్ఎల్ సీఎండీ మధుసూదన్ ప్రసంగించారు. గోదావరి బ్లాస్ట్‌ఫర్నేస్‌ను ఆధునీకరించడం వలన ఫర్నేస్ ఉత్పత్తి సామర్థ్యం రెండు మిలియన్ టన్నుల నుంచి 2.5 మి లియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వెలువడే వృథా వాయువుల నుంచి సింటర్ పవర్ ప్లాంట్‌ను నిర్మించడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటూ ఇందుకు తోడ్పాటునందించిన జపాన్‌దేశ ప్రతినిధులైన జేపీ స్టీల్ ప్లాన్టెక్ కంపెనీ డెరెక్టర్ శొశకు ఉమెజావా, నీడో కంపెనీ ఈడీ ఫ్యుమియో యెడాలను అభినందించారు.