విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ అవార్డు | Visakhapatnam Steel Plant to the National Film Award | Sakshi
Sakshi News home page

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ అవార్డు

Published Mon, Nov 24 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ అవార్డు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ అవార్డు

విశాఖపట్నం: పని ప్రదేశ నిర్వహణ(ఫైవ్ ఎస్)లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో చెన్నై చాప్టర్ సహకారంతో మధురైలో నిర్వహించిన 2వ జాతీయ సదస్సుకు దేశ వ్యాప్తంగా 30 సంస్థలకు చెందిన జట్లు, 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో విశాఖ స్టీల్ ప్రతిభకు పార్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది.

క్యూసీఎఫ్‌ఐ అధ్యక్షుడు డాక్టర్ ఎ.కె మిట్టల్, ఈడీ డి.కె.శ్రీవాత్సవ చేతుల మీదుగా ఉక్కు డైరక్టర్ (పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో ప్లాంట్ నుంచి కోక్ ఒవెన్స్ జిఎం ఆర్.నాగరాజన్, ఎంఎస్ డీజీఎం గాంధీ తదితరులు పాల్గొన్నారు. వాయ్‌ఘాయ్ ఆగ్రో ప్రాడక్ట్స్ ఎండీ నీతీ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ ఉక్కు ఉద్యోగులను అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement