National-level award
-
సెంచురీ మ్యాట్రిసెస్కు అవార్డు
హైదరాబాద్: సెంచురీ మ్యాట్రిసెస్ తయారు చేసే సెంచురీ ఫైబర్ ప్లేట్స్ కంపెనీకి అవార్డు లభించింది. రబ్బరైజ్డ్ కాయిర్ ఉత్పత్తులను అధికంగా ఎగుమతి చేసినందుకు ఈ అవార్డు లభించిందని సెంచురీ ఫైబర్ ప్లేట్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల లూథియానాలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమంలో తమ కంపెనీ సీఎండీ పురుషోత్తమ్ మలానీ ఈ అవార్డ్ స్వీకరించారని పేర్కొంది. వరుసగా రెండేళ్లు(2014,2015) తమకే ఈ అవార్డు దక్కిందని వివరించింది. 1988లో తమ కంపెనీ ప్రారంభమైందని, భారత్‌లోని పలు గృహాల్లో తమ ఉత్పత్తులు ఒక భాగమని, పలు యూరప్, ఆసియా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. భారత తయారీ రంగానికి సంబంధించి వివిధ రంగాల్లో మంచి వృద్ధి సాధించిన సంస్థలకు భారత ప్రభుత్వం ఈ అవార్డ్లనిస్తోంది. -
ఇంధన పొదుపులో టీఎస్ ఆర్టీసీ టాప్
♦ రెండు జాతీయ స్థాయి అవార్డులు కైవసం ♦ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీకి తొలిసారి సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో దేశవ్యాప్తంగా రవాణా సంస్థల్లో టీఎస్ఆర్టీసీ ఉత్తమంగా నిలిచింది. బస్సులు సగటున లీటరు డీజిల్‌కు 5.46 కిలోమీటర్ల మైలేజీతో తెలంగాణ ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. దీంతో ప్రతిష్టాత్మక ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండర్‌టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ)’ ప్రతి సంవత్సరం అందించే అవార్డుకు ఎంపికైంది. 2014-15 సంవత్సరానికి గాను టీఎస్ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. ఉమ్మడి ఆర్టీసీ దాదాపు 14 సార్లు ఈ అవార్డు పొందింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాదే ఈ అవార్డు తెలంగాణ ఆర్టీసీ పరమైంది. ఉత్తమ కేఎంపీఎల్‌ను మెరుగుపరుచుకునే కేటగిరీలో టీఎస్ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. కేఎంపీఎల్‌ను అంతకు ముందు సంవత్సరం 5.41 నుంచి 5.46కు పెంచుకుంది. ఈ రెండు అవార్డులను ఈ నెల 21న బెంగళూరులో జరిగే ఏఎస్ఆర్టీయూ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్థ జేఎండీ రమణారావు అవార్డును స్వీకరించనున్నారు. ‘ఇంధనాన్ని పొదుపు చేసే సదుద్దేశంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా టీఎస్ఆర్టీసీని ఉత్తమంగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం’ అని జేఎండీ రమణారావు పేర్కొన్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ అవార్డు
విశాఖపట్నం: పని ప్రదేశ నిర్వహణ(ఫైవ్ ఎస్)లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) ఆధ్వర్యంలో చెన్నై చాప్టర్ సహకారంతో మధురైలో నిర్వహించిన 2వ జాతీయ సదస్సుకు దేశ వ్యాప్తంగా 30 సంస్థలకు చెందిన జట్లు, 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో విశాఖ స్టీల్ ప్రతిభకు పార్ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. క్యూసీఎఫ్ఐ అధ్యక్షుడు డాక్టర్ ఎ.కె మిట్టల్, ఈడీ డి.కె.శ్రీవాత్సవ చేతుల మీదుగా ఉక్కు డైరక్టర్ (పర్సనల్) డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో ప్లాంట్ నుంచి కోక్ ఒవెన్స్ జిఎం ఆర్.నాగరాజన్, ఎంఎస్ డీజీఎం గాంధీ తదితరులు పాల్గొన్నారు. వాయ్ఘాయ్ ఆగ్రో ప్రాడక్ట్స్ ఎండీ నీతీ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ ఉక్కు ఉద్యోగులను అభినందించారు.