సెంచురీ మ్యాట్రిసెస్కు అవార్డు | Award for national-level award Century matrices | Sakshi
Sakshi News home page

సెంచురీ మ్యాట్రిసెస్కు అవార్డు

Published Mon, Oct 24 2016 2:45 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

అవార్డు అందుకుంటున్న కంపెనీ సీఎండీ పురుషోత్తమ్ మలానీ (కుడి వ్యక్తి)

అవార్డు అందుకుంటున్న కంపెనీ సీఎండీ పురుషోత్తమ్ మలానీ (కుడి వ్యక్తి)

హైదరాబాద్: సెంచురీ మ్యాట్రిసెస్ తయారు చేసే సెంచురీ ఫైబర్ ప్లేట్స్ కంపెనీకి అవార్డు లభించింది. రబ్బరైజ్‌డ్ కాయిర్ ఉత్పత్తులను అధికంగా ఎగుమతి చేసినందుకు ఈ అవార్డు లభించిందని సెంచురీ ఫైబర్ ప్లేట్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల లూథియానాలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ జాతీయ స్థాయి అవార్డుల  కార్యక్రమంలో తమ కంపెనీ సీఎండీ పురుషోత్తమ్ మలానీ ఈ అవార్డ్ స్వీకరించారని పేర్కొంది.

వరుసగా రెండేళ్లు(2014,2015) తమకే ఈ అవార్డు దక్కిందని వివరించింది. 1988లో తమ కంపెనీ ప్రారంభమైందని, భారత్‌లోని పలు గృహాల్లో తమ ఉత్పత్తులు ఒక భాగమని, పలు యూరప్, ఆసియా దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. భారత తయారీ రంగానికి సంబంధించి వివిధ రంగాల్లో మంచి వృద్ధి సాధించిన సంస్థలకు భారత ప్రభుత్వం ఈ అవార్డ్‌లనిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement