suspicious circumstances
-
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై బి.రాంచరణ్ తెలిపిన కథనం ప్రకారం ఎండీ. ఫకృద్దీన్–ఆశ దంపతుల ఏకైక కుమారుడు ఉమర్ (20) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆశ ఇంటిగేటు కొట్టి వెళ్లారు. కొంత సమయానికి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఉమర్ తలకు తీవ్ర గాయామై రక్తస్రావంతో పడి ఉండడాన్ని గమనించింది. వెంటనే అతడిని మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులను స్థానిక వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ పరామర్శించారు. బంధువుల ఆందోళన.. ఉమర్ మృతిపై కారణాలను పోలీసులు విచారణ చేస్తుండగా మృతుడి తండ్రి ఫకృద్దీన్ తరుపు బంధువులు మాత్రం తల్లి ఆశ అతడిని చంపి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ బి.రమేష్, ఎస్సై బి.రాంచరణ్ ఈదులపూసపల్లికి చేరుకుని వారితో మాట్లాడారు. ఎవరికైనా అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి దోషులను తప్పనిసరిగా శిక్షిస్తామని చెప్పారు. -
బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..
బోసి నవ్వులు.. చిట్టిపొట్టి మాటలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. తెల్లవారు జామున తమ ఇద్దరి పిల్లలు అస్వస్థతకు గురికావడంతో ఏమైందో తెలియక గందరగోళం ఏర్పడింది. ఆప్తులు ఎవ్వరూ లేకపోయినా చుట్టుపక్కల తెలిసిన వారి సహాయంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఏమైందో ఏమోగానీ పిల్లలు ఒకరితర్వాత ఒకరు మృతిచెందడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఊరుగాని ఊర్లో ఏం చేయాలో తెలియక విలపించింది. ఈ ఘటన శ్రీకాళహస్తి మండలం, రాచగున్నేరిలో చూపరులను కంటతడి పెట్టించింది. సాక్షి, శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన గురువారం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మర్దన్ జిల్లా, ఆండాళ్ గ్రామానికి చెందిన రమేష్, నీలంకుమారి దంపతులు. రెండేళ్ల కిందట పొట్టచేతబట్టుకుని రాచగున్నేరికి వచ్చారు. వీరికి కుమార్తె హీనాకుమారి(5), కుమారుడు రోషణ్‌కుమార్‌దాస్(2) ఉన్నారు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రయివేటు కర్మాగారంలో రమేష్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తుండగా, భార్య ఇంటివద్దే ఉంటోంది. రమేష్ బుధవారం విధులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. రాత్రి ఆహారం తిని అందరూ నిద్రకు ఉపక్రమించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హీనాకుమారి అస్వస్థతకు గురైంది. చదవండి: (ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం) తల్లిదండ్రులు తన కుమారుడుని పక్క ఇంట్లో వదిలిపెట్టి కుమార్తెను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేసరికి కుమారుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారడంతో మళ్లీ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రోషణ్‌కుమార్‌దాస్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతికి కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదికలను బట్టి కలుషిత ఆహారమా, మరే ఇతర కారణాలా..? తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం చిన్నారులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే ఏరియా ఆస్పత్రి వైద్యులు మరణధ్రువీకర పత్రాలు అందజేశారు. ఆపై పోలీసులు వత్తిడి చేయడంతో పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. -
బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
చాంద్రాయణగుట్ట: ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా(30)కు ఏడుగురు సంతానం. భర్త నదీం చనిపోవడంతో ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది.ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో తండ్రి చనిపోవడం, తాజాగా తల్లి చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు. -
నాడు తల్లి.. నేడు కుమార్తె.. వారి మృతిపై అనుమానాలెన్నో
రామాయంపేట, నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలం రజాక్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఖాసీంపూర్ తండాలో డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. తండాకు చెందిన నాజం కూతురు నీరజ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లి బుజ్జి గతంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిపై కూడా అనుమానాలున్నాయి. నీరజకు ఇద్దరు సోదరులున్నారు. కొంతకాలంగా కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ ఊచలకు ఉరివేసుకున్న నీరజ మృతదేహాన్ని పక్కవారు గుర్తించి తండావాసులకు తెలిపారు. తక్కువ ఎత్తులో ఉన్న కిటికీ ఊచలకు ఉరివేసుకున్న నీరజ కాళ్లు రెండు నేలను తాకుతుండటంతో ఆమె మృతిపై తండావాసులు అనుమానం వ్యక్తంచేశారు. నీరజ ఆత్మహత్య అనుమానాస్పదంగా మారగా, తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజాంపేట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నీరజ కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ తండా వాసులు తరలివచ్చి పోస్టుమార్టం ప్రక్రియను అడ్డుకున్నారు. నిజాంపేట ఎస్సై ప్రకాశ్ మృతురాలి బంధువులకు నచ్చచెప్పినా వినకపోవడంతో, పోస్టుమార్టం సోమవారం నాటికి వాయిదా వేశారు. ఈ మేరకు కేసు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్
కోనేరుసెంటర్(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం సామవరం గ్రామానికి చెందిన జిల్లేపల్లి ప్రశాంతి (23) ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. మచిలీపట్నం పరాసుపేటలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. పరాసుపేటలోని ఓ స్కూల్లో పని చేసే తన బావ రాజేష్‌తో ఇటీవల ఆమెకు వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. (చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..) ఈ క్రమంలో గురువారం ప్రశాంతి రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన ఇంటి యజమాని మచిలీపట్నం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బందరు డీఎస్పీ మాసూంభాషా, చిలకలపూడి సీఐ అంకబాబు వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మచిలీపట్నం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఏఆర్ విభాగం అధికారులు, తోటి సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. చదవండి: జవాన్‌ను మింగేసిన మంచు -
విష ప్రయోగమా.. క్షుద్ర పూజలా..?
వనపర్తి/గోపాల్పేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో శువ్రకారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. పోస్టుమార్టం ప్రాథమిక అంచనా ప్రకారం విష ప్రయోగం వల్ల మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తుండగా.. గుప్త నిధి కోసం క్షుద్ర పూజలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన హాజిరా బీ (62)కి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. వారిలో పెద్దకుమార్తె, రెండో కుమార్తె, కుమారుడు నాగర్‌కర్నూల్‌లో, చిన్నకూతురు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 11వ తేదీన హాజిరా బీ నాగర్‌కర్నూల్‌లో తన మనవడు, మనవరాలి జన్మదిన వేడుకలు నిర్వహించి మరుసటి రోజు కూతురు అస్మా (39), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (11)తో కలసి నాగపూర్‌కు వచ్చారు. శుక్రవారం ఉదయం అదే గ్రామానికి చెందిన హాజిరా బీ బంధువు యూసుఫ్ అనారోగ్య సమస్య కారణంగా ట్యాబ్లెట్ (మాత్ర) కోసం వారి ఇంటికి వెళ్లగా.. ఇంట్లో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు విగతజీవులుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే నాగర్‌కర్నూల్‌లో ఉండే హాజిరా బీ కుమారుడు కరీం పాషాకు, గ్రామస్తులకు విషయం చెప్పాడు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటి పరిసరాలను పరిశీలించారు. వంట గదిలో హాజిరా బీ, డైనింగ్ హాలులో అస్మా, హాలులో హసీనా, ఇంటి వెనుక గుంత వద్ద ఖాజా పాషా మృతదేహాలు ఉన్నాయి. అన్ని మృతదేహాల వద్ద కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూలు, అత్తరు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే క్షుద్ర పూజలేమైనా జరిగాయా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇంట్లో గుప్త ని«ధి కోసం తవ్విన దాఖలాలు ఉన్నాయని మృతుల బంధువులు, గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం, మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 2014లో ఓసారి.. కొన్నేళ్లుగా తన ఇంటి ఆవరణలో నిధి ఉన్నట్లు నిద్రలో కనిపిస్తుందని హాజిరా బీ తరచూ చెప్పేదని గ్రామస్తులు తెలిపారు. 2014లో ఒకసారి కుటుంబ సభ్యులంతా ఇంటి ఆవరణలో ఉన్న నిధి కోసం తవ్వేందుకు యత్నించగా.. బంధువులు, గ్రామస్తులు మందలించడంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎస్పీ విచారణ ఎస్పీ కె.అపూర్వరావు, డీఎస్పీ కిరణ్‌కుమార్ ఈ ఘటనపై విచారణ జరిపారు. మృతుల బంధువులతో మాట్లాడారు. ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు లేవని వారు తెలిపారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో వివరా లు సేకరించే ప్రయత్నం చేశారు. డాగ్ ఘటనా స్థలం నుంచి సమీపంలోని రెండు ఇళ్లలోకి వెళ్లి తిరిగి అక్కడికే వచ్చి ఆగింది. గుప్త నిధులు బయటకు తీసేందుకు గతంలో పెద్దకొత్తపల్లి ప్రాంతం నుంచి ఓ వ్యక్తిని రప్పించినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఎవరినైనా పిలిపించారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. ఘటనా స్థలంలో ఉన్న వస్తువులను ఫోరె న్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతుడు ఖాజాపాషా ఫోన్ కాల్ డేటాను సేకరించి గడిచిన ఎవరెవరితో మాట్లాడారనే కోణంలో విచారణ చేస్తున్నామని సీఐ సూర్యానాయక్ తెలిపారు. రేవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా.. విష ప్రయోగం వల్లే నలుగురు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీఐ వెల్లడించారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
గీసుకొండ : అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెం దిన సంఘటన మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఆది వారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన బొల్లం సాంబలక్ష్మి (70), మల్ల య్య దంపతులకు ఇద్దరు కుమారులు కుమారస్వామి, రవీందర్ ఉన్నారు. ఇం దులో చిన్న కుమారుడు రవీందర్ పోలీస్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హన్మకొండలో నివాసముంటున్నారు. కాగా, మల్లయ్య తన భార్య తో కొద్ది రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడు రవీందర్ తల్లిని హన్మకొండలోని తన నివాసానికి ఇటీవల తీసుకుని వెళ్లాడు. అయితే సాంబలక్ష్మిని తన వద్దకు పంపించాలని తండ్రి మల్లయ్య గొడవ చేస్తుండడంతో రవీందర్ పది రోజుల క్రితం ఆమెను ఎలుకుర్తిహవేలి గ్రామానికి పంపించారు. ఈ క్రమంలో ఇంటికి చేరిన సాంబ లక్ష్మిని.. మల్లయ్య, అత డి పెద్ద కుమారుడు కలిసి చం పారని చిన్న కుమారుడు రవీందర్ ఫిర్యాదు చేసినట్లు పో లీసులు తెలిపారు. కాగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య
-
అనుమానాస్పద స్థితిలో యువకుడి దుర్మరణం
పలాస: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు తాళభద్ర గ్రామానికి చెందిన కర్రి జగదీష్(23) అనుమానాస్పద స్థితిలో ఆదివారం ఉదయం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. శరీరమంతా ఛిద్రమై ఉండగా.. ఇది ప్రమాదమా? లేదా మరేదైనా కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు జగదీష్ నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. రైల్వే పోలీసులు, కుటుంబీకుల కథనం మేరకు... శనివారం రాత్రి జగదీష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేసి ఆ తరువాత చల్లగాలి కోసమంటూ డాబాపై పడుకున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం నిద్ర నుంచి మేల్కొని 5 గంటల సమయంలో కాలకృత్యాల కోసం ఇంటి నుంచి గ్రామ పొలిమేరలకు వెళ్లాడు. 7 గంటల సమయంలో గ్రామానికి అతిసమీపంలో ఉన్న తాళభద్ర రైల్వే గేటుకు పలాస రైల్వేస్టేషన్ పంప్‌హౌస్ మధ్యగల అప్‌లైన్‌పై అతని మృతదేహం తునాతునకలై పడి ఉంది. ఒక కాలు పూర్తిగా తెగిపడగా, తల, చేతులు ఇతర శరీర భాగాలు ఛిద్రమై కనిపించాయి. విషయం తెలుసుకుని కుటుంబీకులు హతాశులయ్యారు. గుండెలు బాదుకొని సంఘటన స్థలానికి వచ్చి బోరున విలపించారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు ఈ విధంగా మృతి చెందడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాళభద్ర రైల్వే గేట్ కీమెన్ జె.కృష్ణారావు పలాస జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఎస్ఎ మునఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు తాళభద్రకు చెందిన ఓ బాలికను జగదీష్‌తో పాటు గొనప రాజకుమార్, రంది షణ్ముఖరావు మానసికంగా వేధించారని, దీంతో ఆ చిన్నారి తన శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని గాయాలపాలైందన్న ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసులో ఎ1 నిందితుడైన జగదీష్.. సుమారు 45 రోజులు శ్రీకాకుళం జిల్లా కేంద్రం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆర్మీ కానిస్టేబుల్‌గా ఎంపికై... అనూహ్య పరిస్థితుల్లో కటకటాల్లోకి.... నిరుపేద కుటుంబానికి చెందిన జగదీష్ డిగ్రీ చదువుకున్నాడు. విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ అనునిత్యం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ ఉద్యోగాన్వేషణలో ఉన్న అతడు తెలివైన విద్యార్థి అని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ కేసు నమోదయ్యేసమయానికి ఆర్మీ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. వారం రోజుల్లో శిక్షణకు వెళ్లాల్సిన జగదీష్ అనూహ్య పరిస్థితుల్లో రిమాండ్ ఖైదీగా కటకటాల్లోకి వెళ్లాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత ఇంటి వద్ద ఉంటూ అవమాన భారంతో కుంగిపోతూ మానసికంగా బలహీనుడయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు. గత నెల 25న జగదీష్ తన చెల్లెలు వేణుకు వివాహం జరిపించాడు. ఈ సంఘటన ఎలా జరిగిందనేది ఎవరికీ కూడా మింగుడు పడడం లేదు. పలాస రైల్వే ఎస్ఐ ఎస్ఎ మునఫ్ తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మునఫ్ చెప్పారు. -
సాగర్ కాల్వలో శవం లభ్యం
ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి మండలం సాగర్ కాల్వలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి షర్ట్ జేబులో డ్రైవింగ్ లెసైన్స్, ఐడీ కార్డులు లభించాయి. వాటి ఆధారంగా మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అలాగే మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
అనుమానాస్పద స్థితిలోమహిళ మృతి
రంగారెడ్డి : దోమ మండలం ఐనాపురం గ్రామంలో ఓ మహిళ(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐనాపురం గ్రామానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి నుంచి కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె గ్రామ సమీపంలోని పొలాలల్లో సోమవారం ఉదయం శవమై కనిపించింది. ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
సీటీఆర్ఐ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : స్థానిక పేపరుమిల్లు సమీపంలోని ఆనంద్‌నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అతడి భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి విషయం తెలపడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. సింహాద్రి నగర్‌కు చెందిన వరప్రసాద్ (30)కు గాదిరెడ్డి నగర్‌కు చెందిన వరలక్ష్మితో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం తర్వాత వరప్రసాద్ అప్పులు చేసి ఆటోలు కొనడం, వాటిని తిరిగి అమ్మేసి ఖాళీగా తిరగడం చేసేవాడు. ఇదిలావుండగా అతడి భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుం డడంతో తరచూ ఘర్షణ పడేవారు. 2012 ఆగస్టులో వారిద్దరూ ఓ అంగీ కారానికి వచ్చి వేర్వేరుగా జీవిస్తున్నారు. వరలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలసి మరో వ్యక్తితో జీవిస్తుండగా, వరప్రసాద్ తన అక్క వద్ద ఉంటున్నాడు. గురువారం వరప్రసాద్, వరలక్ష్మిల పుట్టినరోజు కావడంతో అతడు ఆనందనగర్‌లో నివసిస్తున్న భార్య వద్దకు వచ్చి.. ‘ఇకపై ఇద్దరం కలసి జీవిద్దామ’ని చెప్పాడు. అంగీకరించిన వరలక్ష్మి ఆ రోజు సాయంత్రం గాదాలమ్మ నగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. అతడు వరలక్ష్మి ఇంట్లోనే ఉండిపోయాడు. శుక్రవారం ఉదయం కుమారుడు సిద్ధును భర్త వద్దకు పంపించింది. కుమారుడితో ‘నీవు అమ్మను తీసుకురా’ అని చెప్పి వరప్రసాద్ పంపించేశాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వచ్చి చూసేసరికి తలుపులు వేసి ఉన్నాయని, లోనికి వెళ్లి చూడగా తన భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని ఆమె పోలీసులకు వివరించింది. సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాలెన్నో వరప్రసాద్ మృతిపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కూడా ఇంటికి వచ్చినట్టు సమాచారం. వీరి మధ్య ఏమైనా తగా దా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఫ్యానుకు ఉరి వేసుకున్న వ్యక్తిని చూసిన వెంటనే చీరను కత్తి పీటతో కోసేశానని చెబుతున్న వరలక్ష్మి మాటలు ఎంతమేర నిజమో నిర్ధారించాల్సి ఉంది. ఆ ఇంటికి దూరంగా ఎందుకు పడవేయాల్సి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతు తోంది. వరలక్ష్మి ఉదయం భర్త ఇంటి ముందు ముగ్గు వేసి, తాపీగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులకు తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
గుత్తి, న్యూస్‌లైన్ : మూడు రోజుల క్రితం అదృశ్యమైన పట్టణంలోని కోట వీధికి చెందిన డిగ్రీ విద్యార్థిని స్వాతి(20) బుధవారం తన ఇంటి పక్కనున్న పాడుబడిన బావిలో శవమై తేలింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోట వీధిలో నివసిస్తున్న మాజీ సైనికోద్యోగి దస్తగిరి, వరలక్ష్మి దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు కాగా ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. మిగతా ఇద్దరిలో స్వాతి పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కాలేజ్‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. మరో కూతురు కూడా స్థానిక శ్రీసాయి డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి స్వాతి కనిపించడం లేదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వాతి అక్క నీరజ తమ ఇంటి పక్కన ఉన్న పాడుబడిన బావిలోకి కసువు వేసేందుకు వెళ్లింది. అందులో కసువు వేస్తూ తొంగి చూడగా స్వాతి శవం తేలి ఉండడాన్ని చూసింది. ఆమె కేకలు విన్న బావి పక్కనే ఉన్న ఇళ్లలోని వారు, మృతురాలి కుటుంబ సభ్యులు పరుగున వచ్చారు. స్వాతి మృతదేహం చూసి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో ట్రెయినీ డీఎస్పీ ఉషారాణి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదనిస్నేహితులు, సన్నిహితులు అంటున్నారు. కాగా పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉంది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ డీఎస్పీ చెప్పారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
నర్సింగాపురం(కొడకండ్ల), న్యూస్‌లై న్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన సంఘటన మండలంలోని నర్సింగాపురంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి కథనం ప్రకారం.. మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన సుమలత(28)కు నర్సింగాపురం గ్రామానికి చెందిన కొయ్యూరి సోమనర్సయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త సోమనర్సయ్య రోజూ తాగొచ్చి సుమలతను వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సుమలతను భర్త, ఆడపడుచులు కలిసి కొట్టారు. దీంతో బాధితురాలు తన అన్న సంతోష్‌కు ఫోన్ చేసి రోదిస్తూ విషయం చెప్పిం ది. సంతోష్ వెంటనే నర్సింగాపురంలోని చెల్లెలి ఇంటికి చేరుకుని పెద్దమనుషుల సమక్షంలో తన బావను, చెల్లెలి ఆడపడుచులను సముదాయిం చాడు. సుమలత నీరసంగా ఉండడంతో ఆమెకు ఆహరం తీసుకొచ్చేందుకు కాన్వాయిగూడెం వెళ్లాడు. భోజనం టిఫిన్‌బాక్స్‌లో పెడుతుండ గా సుమలత ఆడపడుచు భర్త ఫోన్ చేసి మీ చెల్లె లు ఉరివేసుకుందని చెప్పాడు. దీంతో వెంటనే సంతోష్ అక్కడికి చేరుకునేసరికి సుమలత ఇంటిపై కప్పు వాసానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, సుమలత భర్త, మామ సోమయ్య, ఆడపడుచులు పరారయ్యారు. కాగా సుమలత ఆత్మహత్య చేసుకోలేదని ఆమె భర్త సోమనర్సయ్య, మామ సోమయ్య, ఆడపడడుచులే ఆమెను కొట్టి చంపి ఉరివేశారని మృతురాలి సోదరుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. మృతురాలికి కుమారులు అవినాష్(06), అర్షిత్ (04) ఉన్నారు. సంఘటన స్థలానికి కొడకండ్ల ట్రైనీ ఎస్సై వెంకట్రావు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పాపం.. పసిప్రాణం..!
సారంగాపూర్, న్యూస్‌లైన్ : బీరవెల్లి గ్రామానికి చెందిన బాలేరు సాయన్న వివాహం భైం సా మండలం కోతుల్‌గామ్‌కు చెందిన సరిత తో మూడేళ్ల క్రితం జరిగింది. వీరికి పది నెల ల కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. సాయన్నది ఉమ్మడి కుటుంబం. మూడు నెలల నుం చి ఇంట్లో గొడవలు జరుగుతున్నారుు. దీంతో అమ్మానాన్నలతో విడిపోరుు సాయన్న తన కుటుంబంతో అదే ఇంట్లో వేరుగా ఉంటున్నా డు. సోమవారం సాయంత్రం ఆస్తిపంపకం విషయమై సాయన్నకు, అతడి తల్లిదండ్రులు గట్టవ్వ, దేవన్నలకు మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన సాయన్న కుమారుడు యశ్వంత్‌ను తీసుకుని రాత్రి బయటకు వెళ్లాడు. గ్రామంలో బాలుడికి తినుబండారా లు కొనిచ్చాడు. అర్ధరాత్రి దాటినా సాయన్న తిరిగి రాకపోవడంతో తండ్రీకొడుకు కోసం కుటుంబ సభ్యులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. బంధువులకు ఫోన్ చేసినా ఫలి తం లేకపోరుుంది. మంగళవారం ఉదయం సాయన్న సోదరుడు చిన్నయ్య తమ పసుపు చేను వద్దకు వెళ్లగా యశ్వంత్ మృతదేహం కనిపించింది. వెంటనే అతడు ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో అంతా అ క్కడికి చేరుకున్నారు. కొడుకు మృతదేహం వద్ద సరిత గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయన్న జాడ తెలి యకపోవడంతో యశ్వంత్ మృతికి కారణా లు తెలియరాలేదు. సర్పంచ్ ఎల్లన్న, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పోలీసులకు సమాచార మందించారు. నిర్మల్ రూరల్ సీఐ రఘు, రూ రల్ ఎస్సై నర్సింహారెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, వీ ఆర్వో గణపతిరెడ్డి, ఏఎస్సైలు నవాబ్జానీ, భూమన్న మృతదేహాన్ని పరిశీలించారు. చలే బలిగొందా..? బాలుడి మృతదేహంపై ఎలాంటి గాయూల గుర్తులు లేవని పోలీసులు తెలిపారు. సాయ న్న కుమారుడిని తనతోపాటు చేనులో పడుకోబెట్టుకోవడంతో చలితీవ్రత భరించలేక బా లుడు చనిపోరుు ఉంటాడని, కొడుకు మృతి విషయం తెలిసి సాయన్న పారిపోరుు ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో సాయన్న తన చేను వద్దకు వెళ్తుండగా చూశామని, ఆ తర్వాత అతడు కనిపించలేదని కొందరు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నిర్మల్ ఏరియూ ఆస్పత్రికి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.