పాపం.. పసిప్రాణం..! | Boy killed in suspicious circumstances | Sakshi
Sakshi News home page

పాపం.. పసిప్రాణం..!

Published Wed, Dec 11 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

Boy killed in suspicious circumstances

 సారంగాపూర్, న్యూస్‌లైన్ :  బీరవెల్లి గ్రామానికి చెందిన బాలేరు సాయన్న వివాహం భైం సా మండలం కోతుల్‌గామ్‌కు చెందిన సరిత తో మూడేళ్ల క్రితం జరిగింది. వీరికి పది నెల ల కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. సాయన్నది ఉమ్మడి కుటుంబం. మూడు నెలల నుం చి ఇంట్లో గొడవలు జరుగుతున్నారుు. దీంతో అమ్మానాన్నలతో విడిపోరుు సాయన్న తన కుటుంబంతో అదే ఇంట్లో వేరుగా ఉంటున్నా డు. సోమవారం సాయంత్రం ఆస్తిపంపకం  విషయమై సాయన్నకు, అతడి తల్లిదండ్రులు గట్టవ్వ, దేవన్నలకు మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన సాయన్న కుమారుడు యశ్వంత్‌ను తీసుకుని రాత్రి బయటకు వెళ్లాడు. గ్రామంలో బాలుడికి తినుబండారా లు కొనిచ్చాడు.

అర్ధరాత్రి దాటినా సాయన్న తిరిగి రాకపోవడంతో తండ్రీకొడుకు కోసం కుటుంబ సభ్యులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. బంధువులకు ఫోన్ చేసినా ఫలి తం లేకపోరుుంది. మంగళవారం ఉదయం సాయన్న సోదరుడు చిన్నయ్య తమ పసుపు చేను వద్దకు వెళ్లగా యశ్వంత్ మృతదేహం కనిపించింది. వెంటనే అతడు ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో అంతా అ క్కడికి చేరుకున్నారు. కొడుకు మృతదేహం వద్ద సరిత గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయన్న జాడ తెలి యకపోవడంతో యశ్వంత్ మృతికి కారణా లు తెలియరాలేదు. సర్పంచ్ ఎల్లన్న, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పోలీసులకు సమాచార మందించారు. నిర్మల్ రూరల్ సీఐ రఘు, రూ రల్ ఎస్సై నర్సింహారెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్, వీ ఆర్వో గణపతిరెడ్డి, ఏఎస్సైలు నవాబ్‌జానీ, భూమన్న మృతదేహాన్ని పరిశీలించారు.
 చలే బలిగొందా..?
 బాలుడి మృతదేహంపై ఎలాంటి గాయూల గుర్తులు లేవని పోలీసులు తెలిపారు. సాయ న్న కుమారుడిని తనతోపాటు చేనులో పడుకోబెట్టుకోవడంతో చలితీవ్రత భరించలేక బా లుడు చనిపోరుు ఉంటాడని, కొడుకు మృతి విషయం తెలిసి సాయన్న పారిపోరుు ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో సాయన్న తన చేను వద్దకు వెళ్తుండగా చూశామని, ఆ తర్వాత అతడు కనిపించలేదని కొందరు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నిర్మల్ ఏరియూ ఆస్పత్రికి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement