yaswanth
-
రొమాంటిక్ లవ్ స్టోరీగా 'జస్ట్ ఏ మినిట్'.. లిరికల్ సాంగ్ రిలీజ్!
అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం "జస్ట్ ఎ మినిట్". ఈ సినిమాను రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్, ప్రకాష్ ధర్మపురి నిర్మించారు. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నువ్వంటే ఇష్టం అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణాస్ యశ్వంత్ మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ.. డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నాం.'మని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫస్ట్ లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా "జస్ట్ ఏ మినిట్ " సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్‌రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్‌కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్‌పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్‌ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
సిన్హాపై నో యాక్షన్..?
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు, జీఎస్టీకి సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర విమర్శలు గుప్పించిన పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాపై బీజేపీ క్రమశిక్షణ చర్యలకు దిగకపోవచ్చని భావిస్తున్నారు. సిన్హా ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకపోవడం, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గళం విప్పకపోవడంతో ఆయనపై వేటు వేసే అవకాశం లేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. యశ్వంత్ వ్యాఖ్యలను పార్టీ నేతలు ఖండించినప్పటికీ వివాదానికి తెరదించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. మరోవైపు యశ్వంత్ కేవలం ఆర్థిక వ్యవస్థపైనే మాట్లాడిన క్రమంలో ఆయనపై చర్యలు తీసుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఓ బీజేపీ సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం. గతంలో 2012 నవంబర్‌లో అప్పటి బీజేపీ చీఫ్ నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని సిన్హా పట్టుబట్టారు. గడ్కరీకి సంబంధించిన ఓ కంపెనీ ఆర్థిక అవకతవకల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఇక యూపీఏ హయాంలో జీఎస్టీని త్వరగా ప్రవేశపెట్టాలని యశ్వంత్ కోరగా, పార్టీ ఆయన వాదనతో విభేదించింది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలతో మాత్రం యశ్వంత్ విభేదించకపోవడంతో ఆయనపై వేటు పడే అవకాశాలు లేవని బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేశారని, పాకిస్తాన్ ఫౌండర్ మహ్మద్ అలీ జిన్నాను పొగిడినందుకు జస్వంత్ సింగ్‌పై కొద్దికాలం వేటు వేశారని, యశ్వంత్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని గుర్తుచేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా, అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అనంతరం పార్టీ నేతలు పలు అంశాలపై తరచూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం అనంతరం ఆర్కే సింగ్, భోళా సింగ్, సీపీ ఠాకూర్ వంటి పార్టీ ఎంపీలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక బీహార్ ఎంపీ శత్రుఘ్న సిన్హా బాహాటంగానే యశ్వంత్ వ్యాఖ్యలను సమర్ధించారు.మరోవైపు యశ్వంత్ సిన్హా తన దూకుడు వైఖరి నుంచి ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తన కుమారుడు జయంత్ సిన్హాను ఆయన విడిచిపెట్టలేదు. జయంత్ అంత పనిమంతుడైతే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అతడిని ఎందుకు తప్పించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
బాదంపాలు అనుకుని విషం తాగారు
రంగారెడ్డి: జిల్లాలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో శుక్రవారం వెలుగుచూసింది. పాలలో పురుగుల మందు కలుపుకొని తాగి స్పృహ కోల్పోయింది. ఇది గమనించని ఆమె ఇద్దరు పిల్లలు బాదంపాలు అనుకొని విషం కలిపిన పాలను తాగారు. దీంతో ఓ చిన్నారి మృతి చెందగా.. తల్లితో పాటు కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలనీకి చెందిన విజయలక్ష్మి(38) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కడుపునొప్పి భరించలేక పురుగుల మందు కలిపిన పాలను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించని ఆమె పిల్లలు యశస్విని(6), యశ్వంత్(4) పురుగుల మందు కలిపిన పాలు తాగి అస్వస్థతకు గురయ్యారు. ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ యశస్విని మృతి చెందింది. యశ్వంత్‌తో పాటు తల్లి విజయలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
యశ్వంత్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో యశ్వంత్ (130), ప్రజ్వల్ రావు (90) బౌలింగ్‌లో వీరాస్వామి (5/62) మెరుగ్గా రాణించడంతో సత్యసీసీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా గోల్కొండ సీసీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సత్యసీసీ జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సత్య సీసీ జట్టు 38.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. యశ్వంత్ సెంచరీతో ఆకట్టుకోగా... ప్రజ్వల్ రావు తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. గోల్కొండ సీసీ బౌలర్లలో శ్రీనికేత్ రెడ్డి, లోహిత్ చెరో 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం 254 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గోల్కొండ సీసీ 28.4 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సత్య సీసీ బౌలర్లలో వీరారెడ్డితో పాటు రిత్విక్ రెడ్డి (4/58) రాణించాడు. -
'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'
తిరుపతి: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించిన ఓ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రిక అనే ఇంటర్ విద్యార్థినిని ఓ ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించసాగారు. యశ్వంత్, నవీన్ అనే ఇద్దరు యువకులు ప్రతిరోజూ ఆమెను ప్రేమిస్తున్నామంటూ వేధిస్తూ వెంటబడేవారు. ఈ క్రమంలో వారి మాట వినలేదని ఆమెను బైక్‌తో ఢీకొట్టించారు. దాంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పుడా ఆ విద్యార్థిని మంచానికే పరిమితమైంది. వాళ్లు చాలా అమానుషంగా వ్యవహరించారని బాధితురాలు చంద్రిక వాపోయింది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చంద్రిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తిరుపతి పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. బాధితురాలు చంద్రిక డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ అంజూ యాదవ్‌లకు జరిగిన విషయాన్ని అంతా వివరించింది. చంద్రిక స్టేట్మెంట్ ను డీఎస్పీ రికార్డు చేశారు. తమకు న్యాయం చేయాలని చంద్రిక తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. యశ్వంత్, నవీన్ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిని వేధించిన నవీన్, యశ్వంత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
అత్తింటి ముందు కోడలి ఆందోళన
అదనపు కట్నం తీసుకుని కూడా .. ఇంట్లొకి రానివ్వడం లేదంటూ.. ఓ నవ వధువు .. అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఈఘటన హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ లో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యశ్వంత్ కు గతేడాది సింహాద్రి స్వాతి (22) తో పెళ్లైంది. అప్పటి నుంచి అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వాతి తెలిపింది. దీంతో గత్యంతరం లేక వారు చెప్పిన మొత్తాన్ని పుట్టింటి నుంచి తీసుకు వచ్చానని.. తన వద్ద నుంచి డబ్బు తీసుకున్న అత్తమామలు ఇంటి నుంచి గెంటే శారని.. ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘాల సాయంతో అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఇలా ఉండగా.. యశ్వంత్ తండ్రి సాంబశివరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ. అవినీతి ఆరోపణలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయి సస్పెండ్ అయ్యాడు. దీంతో కోడలు వచ్చిన వేళ మంచిది కాదని.. తన కొడుకు జీవితం ఒడిదుడుకులకు గురికావడానికి కూడా స్వాతి దురదృష్టమే కారణమని నిందిస్తున్నారని వివరించింది. తాను ఇచ్చిన కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని యశ్వంత్ ఇంటి ముందు నిరసనకు దిగింది. -
ఇద్దరు విద్యార్థుల అదృశ్యం..
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని బెంగళూరు రోడ్డు సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు లారెన్స్, యశ్వంత్‌లు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాపం.. పసిప్రాణం..!
సారంగాపూర్, న్యూస్‌లైన్ : బీరవెల్లి గ్రామానికి చెందిన బాలేరు సాయన్న వివాహం భైం సా మండలం కోతుల్‌గామ్‌కు చెందిన సరిత తో మూడేళ్ల క్రితం జరిగింది. వీరికి పది నెల ల కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. సాయన్నది ఉమ్మడి కుటుంబం. మూడు నెలల నుం చి ఇంట్లో గొడవలు జరుగుతున్నారుు. దీంతో అమ్మానాన్నలతో విడిపోరుు సాయన్న తన కుటుంబంతో అదే ఇంట్లో వేరుగా ఉంటున్నా డు. సోమవారం సాయంత్రం ఆస్తిపంపకం విషయమై సాయన్నకు, అతడి తల్లిదండ్రులు గట్టవ్వ, దేవన్నలకు మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన సాయన్న కుమారుడు యశ్వంత్‌ను తీసుకుని రాత్రి బయటకు వెళ్లాడు. గ్రామంలో బాలుడికి తినుబండారా లు కొనిచ్చాడు. అర్ధరాత్రి దాటినా సాయన్న తిరిగి రాకపోవడంతో తండ్రీకొడుకు కోసం కుటుంబ సభ్యులు గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. బంధువులకు ఫోన్ చేసినా ఫలి తం లేకపోరుుంది. మంగళవారం ఉదయం సాయన్న సోదరుడు చిన్నయ్య తమ పసుపు చేను వద్దకు వెళ్లగా యశ్వంత్ మృతదేహం కనిపించింది. వెంటనే అతడు ఈవిషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో అంతా అ క్కడికి చేరుకున్నారు. కొడుకు మృతదేహం వద్ద సరిత గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సాయన్న జాడ తెలి యకపోవడంతో యశ్వంత్ మృతికి కారణా లు తెలియరాలేదు. సర్పంచ్ ఎల్లన్న, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ పోలీసులకు సమాచార మందించారు. నిర్మల్ రూరల్ సీఐ రఘు, రూ రల్ ఎస్సై నర్సింహారెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, వీ ఆర్వో గణపతిరెడ్డి, ఏఎస్సైలు నవాబ్జానీ, భూమన్న మృతదేహాన్ని పరిశీలించారు. చలే బలిగొందా..? బాలుడి మృతదేహంపై ఎలాంటి గాయూల గుర్తులు లేవని పోలీసులు తెలిపారు. సాయ న్న కుమారుడిని తనతోపాటు చేనులో పడుకోబెట్టుకోవడంతో చలితీవ్రత భరించలేక బా లుడు చనిపోరుు ఉంటాడని, కొడుకు మృతి విషయం తెలిసి సాయన్న పారిపోరుు ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో సాయన్న తన చేను వద్దకు వెళ్తుండగా చూశామని, ఆ తర్వాత అతడు కనిపించలేదని కొందరు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నిర్మల్ ఏరియూ ఆస్పత్రికి, అక్కడి నుంచి రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.