అదనపు కట్నం తీసుకుని కూడా .. ఇంట్లొకి రానివ్వడం లేదంటూ.. ఓ నవ వధువు .. అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఈఘటన హైదరాబాద్ నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ లో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యశ్వంత్ కు గతేడాది సింహాద్రి స్వాతి (22) తో పెళ్లైంది. అప్పటి నుంచి అత్తమామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వాతి తెలిపింది. దీంతో గత్యంతరం లేక వారు చెప్పిన మొత్తాన్ని పుట్టింటి నుంచి తీసుకు వచ్చానని.. తన వద్ద నుంచి డబ్బు తీసుకున్న అత్తమామలు ఇంటి నుంచి గెంటే శారని.. ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళా సంఘాల సాయంతో అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఇలా ఉండగా.. యశ్వంత్ తండ్రి సాంబశివరావు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ. అవినీతి ఆరోపణలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయి సస్పెండ్ అయ్యాడు. దీంతో కోడలు వచ్చిన వేళ మంచిది కాదని.. తన కొడుకు జీవితం ఒడిదుడుకులకు గురికావడానికి కూడా స్వాతి దురదృష్టమే కారణమని నిందిస్తున్నారని వివరించింది. తాను ఇచ్చిన కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని యశ్వంత్ ఇంటి ముందు నిరసనకు దిగింది.