అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదు
Published Tue, Aug 9 2016 7:16 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM
అదనంగా కట్నం తీసుకురావాలని అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ గృహిణి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నసిమా ఉన్నీసా భేగం (20)కు గత ఆరునెలల క్రితం వెల్డర్‌గా పనిచేసే అబ్దుల్ రజాక్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం భర్త అబ్దుల్జ్రాక్ ఆయన కుటుంబ సభ్యులు వేదిస్తున్నారు. దీంతో నసిమా ఉన్నీసా భేగం మంగళవారం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మురళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో...
ఆర్‌పి కాలనీలో నివాసం ఉండే అఫ్సనా(23)తో షేక్ గౌస్‌కు 2008లో వివాహం జరిగింది. ప్రస్తుతం భార్యభర్తలు ఇద్దరు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.కాగ భర్త షేక్ గౌస్ అదనపు కట్నం తీసుకురమ్మని భార్యపై వేధింపులు ప్రారంభించాడు. దీంతో భరించలేని అఫ్సనా మంగళవారం జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఎస్‌ఐ గణేశ్ పటేల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement