అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు | dowry harassment case on Abhinav | Sakshi
Sakshi News home page

అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు

Published Sun, Nov 1 2015 3:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు - Sakshi

అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు

తలసాని సాయి కిరణ్ పై శనివారం ఆరోపణలు చేసిన అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. తనపై వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని.. అతని భార్య భువన ఆదివారం బేగంపేట మహిళా పీఎస్ లో కేసు నమోదు చేసింది. మంత్రి తల సాని కుమారుడు తనను బెదిరిస్తున్నాడని.. అతని వల్ల తనకు ప్రాణ హాని ఉందని అభినవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 24గంటలు కూడా గడవక ముందే.. అతనిపై కేసునమోదవడం విశేషం.


కాగా.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న  ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న అభినవ్.. భువన తండ్రి తమను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని శనివారం ఆరోపించాడు.  ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు సాయి కిరణ్ తనను బెదిరించాడని... ఈ నెల 24న భువన కల్వాను తన తల్లిదండ్రుల వద్దకు పంపాడని తెలిపాడు. భువనను కలిసేందుకు ప్రయత్నించగా సాయికిరణ్ అతని స్నేహితులు తనను కొట్టడమేగాక తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఫొటోలు, లెటర్లు లాక్కున్నట్లు తెలిపాడు, వల్లబ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
 
 అభినవ్‌పై కేసు...
తన కుమార్తెను అభినవ్ అనే యువకుడు దొంగచాటుగా వివాహం చేసుకోవడంతోపాటు, తన ఇంటికి వచ్చి కత్తితో బెదిరించి గాయపరిచాడని మారేడుపల్లికి చెందిన వ్యాపారవేత్త తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లాకు చెందిన కే.మహేంద్రనాథ్‌రెడ్డి అనే వ్యాపారవేత్త మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు మహేందర్‌రెడ్డి రెండో కుమార్తెను ప్రేమ పేరుతో నమ్మించి దొంగచాటుగా వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత అతని వేధింపులు తాళలేక ఆమె పుట్టింటికి చేరింది. ఈనెల 26వ తేదీ రాత్రి అభినవ్ మద్యం మత్తులో  తమ ఇంటికి వచ్చి కత్తి చూపించి హత్య చేస్తానని బెదిరించాడని, ఈ ఘర్షనలో తనకు గాయాలయ్యాయని రవీంద్రనాథ్‌రెడ్డి అదే రాత్రి తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాణభయంతో కడప జిల్లాకు వెళ్లిపోయాడు. శనివారం అతను పోలీసులను కలిసి పరిస్థితి వివరించడంతో పోలీసులు అభినవ్‌పై ఐపీసీ 324, 506 సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement