talasani
-
సనత్‌నగర్ ప్రజలు ఈసారి ఎన్నుకునే అభ్యర్థి ఎవరు..?
సనత్ నగర్ నియోజకవర్గం సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి గెలిచారు. దీనితో ఆయన ఐదుసార్లు గెలిచినట్లయింది. ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు సికింద్రాబాద్ నుంచి, రెండుసార్లు సనత్‌నగర్ నుంచి గెలిచారు. 2014 ఎన్నికల వరకు ఆయన టిడిపిలో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరి కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి మరోసారి గెలిచి మళ్లీ మంత్రి కాగలిగారు. తలసాని తన సమీప తెలుగుదేశం ప్రత్యర్ది కూన వెంకటేష్ గౌడ్‌పై 30651 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తలసానికి 66464 ఓట్లు రాగా, వెంకటేష్ గౌడ్‌కు 35813 ఓట్లు తెచ్చుకున్నారు. మహాకూటమిలో భాగంగా ఇక్కడ టిడిపి పోటీచేసింది. కాగా ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన బవర్ లాల్ వర్మకు 14200 ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచారు. తలసాని యాదవ వర్గానికి చెందినవారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 2014లో తలసాని శ్రీనివాసయాదవ్ టిఆర్ఎస్ అభ్యర్ధి విఠల్పై 27461 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 2014లో ఇక్కడ పోటీచేసిన కేంద్ర ప్రకృతి వైపరీత్యాల సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిదర్ రెడ్డి కనీసం రెండో స్థానంలో కూడా లేకపోవడం విశేషం. శశిదర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కుమారుడు. సనత్‌నగర్‌లో నాలుగుసార్లు విజయం సాధించారు. 1989లో ఇక్కడ నుంచి చెన్నారెడ్డి గెలిచాక ఓ ఏడాదిపాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. అనంతరం ఆయన గవర్నరు పదవి చేపట్టడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా 1992లో జరిగిన ఉప ఎన్నికలో శశిధర్‌రెడ్డి గెలిచారు. తదుపరి మరో మూడుసార్లు గెలుపొందారు. చెన్నారెడ్డి వికారాబాద్, తాండూరు, మేడ్చల్ నుంచి కూడా గతంలో గెలుపొంది మొత్తం ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించారు. సనత్‌నగర్ అసెంబ్లి స్థానానికి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. శ్రీనివాసయాదవ్ గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా పనిచేశారు. టిడిపి నేత శ్రీపతి రాజేశ్వర్ సనత్‌నగర్‌లో రెండుసార్లు, అంతకు ముందు ముషీరాబాద్‌లో ఒకసారి గెలిచారు. ఎన్.టి.ఆర్ అభిమాన సంఘాల నాయకుడిగా పేరొందిన రాజేశ్వర్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో సభ్యునిగా కూడా వున్నారు. శశిధర్‌రెడ్డి అప్పట్లో కోట్ల విజయభాస్కరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. సనత్ నగర్లో ఐదుసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు గెలిస్తే ఐదుసార్లు బిసి నేతలు, ఒకసారి కమ్మ నేత గెలుపొందారు. సనత్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
‘చీకోటి’ కేసులో ఈడీ దూకుడు.. ఎమ్మెల్సీ రమణకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో కేసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే చీకోటి ప్రవీణ్‌పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరులు మహేశ్, ధర్మేందర్ సంబంధాలపై ఈడీ బుధవారం ప్రశ్నించింది. చీకోటి నిర్వహించిన ఈ కేసీనోలకు వీరు కూడా హాజరయ్యారన్న సమాచారం మేరకు అధికారుల వారి నుంచి కూపీ లాగుతున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై వారిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఇక్కడ కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? నిబంధనల ప్రకారం మార్పిడి చేశారా?.. ఇలా పలు అంశాలపై మంత్రి సోదరులను ప్రశ్నించినట్లు తెలిసింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జరిగిన విదేశీ ప్రయాణాల విమాన టికెట్ల బుకింగ్ వ్యవహారాలనూ ఈడీ సేకరించినట్లు చెబుతున్నారు. వీరిని గురువారం కూడా మరోసారి విచారించనున్నట్లు తెలిసింది. చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ రికార్డులను పరిశీలించిన ఈడీ అధికారులు ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిలో దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో భాగంగానే శుక్రవారం విచారణకు హాజరుకావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: కేసీఆర్ కాళ్లుమొక్కిన ఉన్నతాధికారి.. ఎమ్మెల్యే టిక్కెట్ కోసమేనా! -
క్యాసినో వ్యవహారం.. ఈడీ ముందుకు తలసాని సోదరులు
సాక్షి, హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ మళ్లీ విచారణ షురూ చేసింది. హవాలా లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే చీకోటి ప్రవీణను పలుమార్లు విచారించిన ఈడీ.. ప్రస్తుతం ఈ కేసులో పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. చీకటితో కలిసి నేపాల్‌కు వెళ్లిన ప్రముఖులను విచారించనుంది. వీరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్‌కు నోటీసులు అందగా.. బుధవారం వారు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. మనీలాండరింగ్, హవాలా వ్యవహారంలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చీకటితో కలిసి తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లిన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలుగా తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. విదేశాల్లో కేసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీ ల్యాండరింగ్‌పై ఈడీ కూపీ లాగుతోంది. హవాలా చెల్లింపులపై కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే మరికొందరికి నోటీసులు ఇచ్చిన ఈడీ.. సుమారు వంద మంది కేసినో కస్టమర్లను చీకోటి ప్రవీణ్, మాధవ్ రెడ్డిల కాల్ డేటా ఆధారంగా ఈడీ వివరాలు సేకరించింది. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్స్ టికెట్స్ బుకింగ్స్ వివరాలు ఈడీ సేకరించింది. చదవండి: CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్ కొత్త వ్యూహం! -
రాబోయే కాలంలో దేశ వ్యాప్తంగా పోటీ చేస్తాం : తలసాని శ్రీనివాస్ యాదవ్
-
రేపు ఉజ్జయినీ అమ్మవారి బోనాలు
-
తలసాని, తుమ్మల ఉద్యమకారులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవుల్లో ఉన్నవారే తెలంగాణ ఏర్పాటు కోసం త్యాగాలు చేశారా అని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ బుధవారం ఓ లేఖలో ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రమే ఉండాలంటూ ఉద్యమకారులను తరిమి కొట్టి, దాడులకు తెగబడిన మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి వంటివారే నిజమైన ఉద్యమకారులా అని ప్రశ్నించారు. అధికార దాహం, పదవీవ్యామోహంతో తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల ఆత్మలను సీఎం అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తున్న ఉద్యమకారులను వేధిస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో కూడా లేని నిర్బంధాన్ని, అప్రజాస్వామిక విధానాలను సీఎం అమలు చేస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. -
చంద్రబాబు ఇంటివైపు తలసాని..
-
గోల్కొండలో ఘనంగా మొదలైన బోనాలు
-
ముందు ఏపీలో జీవో తీసుకురండి
ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణపై మంత్రి తలసాని సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో మంత్రి తలసాని, టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించి విశ్వసనీయతను చాటుకోవాల్సిన సమయం వచ్చిందని తలసానిని ఉద్దేశించి సండ్ర వ్యాఖ్యానించగా.. ‘ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా జరిపేందుకు ముందు ఏపీలో జీవో తీసుకురండి, తర్వాత ఇక్కడ ఆలోచిద్దాం’ అని తలసాని అన్నారు. దీంతో కార్యక్రమానికి జీవోలుండవని, మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయని రేవంత్ జవాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని, ఇప్పుడు ఏపీలోనూ నిర్వహిస్తున్నారని వివరించారు. -
అసెంబ్లీలో నాయకుల ముచ్చట్లు
కొమురవెల్లి మూల విరాట్టును ముట్టుకోం పుట్టమన్ను విగ్రహం యథాతథం: తలసాని హైదరాబాద్: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని, యాదవులు, కురుమలకు కులదైవమని, మల్లన్న మూలవిరాట్టు విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలసి ఆయన శుక్రవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. పుట్టమన్నుతో ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామని అనవసర ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని, కురుమ యాదవుల ప్రతినిధిగా తాను చెబుతున్నానని, పుట్టమన్ను విగ్రహం అలాగే ఉంటుందని అన్నారు. రెండేళ్ల కిందట కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి హామీలు ఇచ్చారని, ఆ పనులన్నీ కొనసాగుతున్నాయని తెలిపారు. సుమారు 166 ఎకరాల దేవుని మాన్యాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ స్థలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కొమురవెల్లికి మొక్కుల చెల్లింపుల్లో వచ్చిన కోడెలను విక్రయించడం లేదని, ఎవరకీ ఎలాంటి అపోహలు అవసరం లేదని, అనుమానాలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. గడిచిన రెండేళ్లలో ఆలయ ఆదాయం రూ.4 కోట్లకు పెరిగిందని, మిషన్ భగీరథ నుంచి తాగునీటి సౌకర్యం కూడా కల్పించామని ముత్తిరెడ్డి వివరించారు. కొత్త జిల్లాల ఆందోళనలపై స్పందించండి మండలిలో ప్రస్తావించిన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ హైదరాబాద్: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయాలని ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. మండలిలో ప్రత్యేక ప్రస్తావన కింద శుక్రవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. రామాయంపేట డివిజన్ కోసం 97 రోజులుగా ఆందోళన జరుగుతోందని, ధర్నాలు, రాస్తారోకోలతో ప్రతిరోజు అక్కడి హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోతోందని తెలిపారు. బాన్సువాడ జిల్లా కోసం కూడా ఆందోళన జరుగుతోందని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడి ప్రజలతో చర్చలు జరపాలని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆందోళనలు విరమింపజేయాలని కోరారు. తెలంగాణ ప్రైవేట్ బస్సులను అడ్డుకోవద్దు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రైవేటు బస్సులు తెలంగాణలో ఎన్ని నడుస్తున్నాయో అదే సంఖ్యలో తెలంగాణ బస్సులను కూడా ఏపీలో నడవ నివ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయిం ట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్యలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో నడుస్తున్న తెలంగాణకు చెందిన ప్రైవేటు బస్సులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఇలాంటివి పునరావృతమైతే తెలంగాణలో తాము కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. పాలెం బస్సు ప్రమాద ఘటనలో జేసీ బ్రదర్స్ నిందితులని, ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తానంటే అక్రమ కేసులకు సంబంధించిన ఆధారాలను చూపడానికి తాము సిద్ధమని ప్రకటించారు. హోంగార్డుల సమస్యలపై సీఎం స్పందన వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో కమిటీ హైదరాబాద్: హోంగార్డుల సమస్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించారు. వారి వేతనాల పెంపు, ఇ తర సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజుల్లోగా నివేదిక అందజేయాలని కమిటీని సీఎం ఆదేశించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో హోంగార్డుల సమస్యలను మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ లేవనెత్తారు. సమస్యలను విన్న సీఎం కేసీఆర్.. అసెంబ్లీలోని తన చాంబర్లో డీజీపీ అనురాగ్ శర్మ, హోంగార్డ్స్ ఐజీలతో సహా హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. వెంటనే ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. హోంగార్డుల వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కానిస్టేబుల్ నియామకాల్లో ప్రాధాన్యం, ఇతర సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సీఎం నివేదిక కోరారు. రాష్ట్రంలోని 25వేల మంది హోంగార్డుల కుటుంబాలలో వెలుగులు నింపేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని హోం గార్డుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పీఏసీ బాధ్యతలు గీతారెడ్డే చూస్తారు’ హైదరాబాద్: ప్రజాపద్దుల సంఘం(పీఏసీ) బాధ్యతలను పదవీకాలం పూర్తయ్యేదాకా జె.గీతారెడ్డి నిర్వహిస్తారని, ఇందులో ఎవరికీ అనుమానాలు అవసరం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడు కె.జానారెడ్డి స్పష్టంచేశారు. పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డితో కలసి శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో జానారెడ్డి విలేకరులకు ఎదురయ్యారు. టీఆర్ఎస్ నేతలతో గీతారెడ్డి సన్నిహితంగా ఉంటున్నారనే ఉద్దేశంలో పీఏసీ బాధ్యతలను ఎవరికి అప్పగించబోతున్నారనే అర్థంతో జానారెడ్డిని విలేకరులు ప్రశ్నించారు. దీనికి జానారెడ్డి సమాధానం ఇస్తూ గీతారెడ్డి సమర్థతపై, పార్టీ పట్ల అంకితభావంపై ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. పదవీకాలం పూర్తయ్యేవరకూ పీఏసీ బాధ్యతలను గీతారెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తారని జానారెడ్డి స్పష్టం చేశారు. కాగా, తనకు కొంత అనారోగ్య పరిస్థితుల వల్ల ఎక్కువగా తిరుగలేకపోతున్నానని, దీనిపై అనవసర ఊహాగానాలు వద్దు అని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. -
రూ.43వేల కోట్ల రెవెన్యూ సాధిస్తాం
♦ ఈ ఏడాది ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటాం: తలసాని ♦ వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు ♦ జీరో దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం ♦ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన రెవెన్యూను సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయ లక్ష్యం, ప్రణాళికలు, జీరో దందా నివారణకు తీసుకోనున్న చర్యలను ఆయన బుధవారం ‘సాక్షి’కి వివరించారు. తమ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43,115 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించారని.. నెలకు సగటున రూ.3,500 కోట్ల రెవెన్యూ సాధించాల్సి ఉందని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని... ప్రజలపై పన్నుల భారం మోపకుండానే సంస్కరణల ద్వారా లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జీరో దందాపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ‘పన్నులు చెల్లించండి- దర్జాగా వ్యాపారం చేసుకోండి’ అనే నినాదాన్ని వ్యాపార వర్గాల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. కొత్తగా వ్యాట్, టీవోటీ డీలర్ల రిజిస్ట్రేషన్‌కు మేళాలు నిర్వహించామని తెలిపారు. పన్ను ఎగవేత సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం ఇచ్చేందుకు రూ.10లక్షల నిధి (సీక్రెట్ సర్వీస్ ఫండ్)ని సమకూర్చామని వెల్లడించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమం కింద చట్టాలలో కొన్ని సవరణలు చేసి వ్యాపార వర్గాలకు పన్ను సేవలను సులభతరం చేశామని వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేసి రూ.115 కోట్ల మేర పన్ను నోటీసులు జారీ చేశామన్నారు. తనిఖీలు చేపడుతున్నాం.. రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేసే ‘మహా చెక్’ కార్యక్రమాన్ని చేపట్టి రూ.9.70 కోట్లు ఆదాయాన్ని సమకూర్చామని తలసాని తెలిపారు. పన్ను ఎగవేత కు ఆస్కారమున్న ఐరన్, స్టీల్, ప్లైవుడ్, టైల్స్, బియ్యం, నిత్యావసర వస్తువులను గుర్తించి లీకేజీని అరికట్టే చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 14 చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటు ద్వారా అక్రమ సరుకు రవాణాను పూర్తిగా అరికట్టే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.12 కోట్లు విడుదల చేశామని, ఆధునీకరణ ద్వారా భారీ ఆదాయాన్ని సమీకరిస్తామని తెలిపారు. -
రాజకీయ శత్రువులంతా గులాబీ గూటికే..
సాక్షి, హైదరాబాద్: అంతా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వారే! చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు అనుభవించిన వారు కొందరైతే... టీడీపీలో ఉన్నన్ని రోజులు పదవులను అనుభవించిన వారు మరికొందరు. 2014 ఎన్నికల వరకు వీరందరిదీ పసుపు గూడే! దాదాపు 20 ఏళ్లకు పైగా కలిసి పనిచేసి, పార్టీలో అంతర్గతంగానే శత్రువులుగా మెదిలిన ఆ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ మారడం మొదలుపెట్టారు. 1994లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. సాయన్నలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవిని అనుభవించి స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని 2003లో జైలుపాలైన సి. కృష్ణయాదవ్ సోమవారం టీఆర్ఎస్ జెండా పట్టుకోనున్నారు. అయితే 1994, 1999లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణయాదవ్‌ల మధ్య మంత్రి పదవి కోసం పోటీ, తీవ్ర అభిప్రాయ భేదాలు ఉండేవి. హైదరాబాద్ నుంచే ఎన్నికైన ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్ధరిలో ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. ఇదే తలసాని, కృష్ణయాదవ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలకు కారణమైంది. కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు. చివరికి కృష్ణయాదవ్ టీడీపీలోలో చేరినా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. అప్పటి వరకు హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్ఎస్లో చేరిన వెంటనే కృష్ణయాదవ్‌కు ఆ పదవి లభించింది. కృష్ణయాదవ్ టీడీపీ అధ్యక్షుడిగా పనికిరాడంటూ చంద్రబాబుకు విన్నవించి ఆ పదవిని మాగంటి గోపీనాథ్‌కు కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న కూడా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరందరికన్నా సీనియర్ అయిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా విభేదిస్తారు. వీరేకాకుండా ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ సీబీఐ డెరైక్టర్ కె. విజయ రామారావుతో కూడా మాజీ టీడీపీ నేతలైన ప్రస్తుత టీఆర్ఎస్ నేతలకు పలు విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. 1999 నుంచి 2004 వరకు మంత్రిగా ఉన్న ఆయన పోలీస్ ఆఫీసర్‌గానే వ్యవహరిస్తూ మాస్ లీడర్లుగా ఉన్న తలసాని, కృష్ణయాదవ్‌ల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరంతా ఇప్పుడు గులాబీ గూటికి చేరడం భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు వేదికవుతుందో చూడాలి. -
చిత్రపురి కాలనీ వాసులపై వరాల జల్లు
హైదరాబాద్: నగరంలోని చిత్రపురి కాలనీ వాసులపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌లు గురువారం వారాల జల్లు కురింపించారు. చిత్రపురి కాలనీని సందర్శించిన మంత్రులు కాలనీలోని అనేక సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రహదారుల మరమ్మతులకు రూ. కోటిన్నర కెటాయించడంతో పాటు త్వరలోనే అర్బన్ అసుపత్రిని కాలనీలో నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. కాలనీ వాసులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాలనీకి సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. రేపటి నుండి బస్సు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిత్రపురి కాలనీకి ఆనుకొని ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి కాలనీ వాసులకు ప్రయోజనకరంగా ఉండేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యున్నత ఫిలిం ఇండస్ట్రీగా తీర్చిదిద్దుతామని మంత్రులు పేర్కొన్నారు. -
గులాబీ సంబరం
‘వరంగల్’ విజయం గ్రేటర్ టీఆర్ఎస్లో జోష్‌ను నింపింది. ఎంపీ అభ్యర్థి దయాకర్ విజయం సాధించినట్లు తెలియగానే మంగళవారం నగరంలోని పలుచోట్ల టీఆర్ఎస్ నేతలు విజయోత్సవాలు జరుపుకొన్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ విజయ డంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవాల్లో మంత్రులు తలసాని, నాయిని, పద్మారావు, ఈటల తదితరులు పాలుపంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో -
'ఆంధ్రాకు లక్ష.. మాకు పదివేలేనా'
-
అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు
-
అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు
తలసాని సాయి కిరణ్ పై శనివారం ఆరోపణలు చేసిన అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. తనపై వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని.. అతని భార్య భువన ఆదివారం బేగంపేట మహిళా పీఎస్ లో కేసు నమోదు చేసింది. మంత్రి తల సాని కుమారుడు తనను బెదిరిస్తున్నాడని.. అతని వల్ల తనకు ప్రాణ హాని ఉందని అభినవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 24గంటలు కూడా గడవక ముందే.. అతనిపై కేసునమోదవడం విశేషం. కాగా.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న అభినవ్.. భువన తండ్రి తమను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని శనివారం ఆరోపించాడు. ఈ నేపథ్యంలో మంత్రి కుమారుడు సాయి కిరణ్ తనను బెదిరించాడని... ఈ నెల 24న భువన కల్వాను తన తల్లిదండ్రుల వద్దకు పంపాడని తెలిపాడు. భువనను కలిసేందుకు ప్రయత్నించగా సాయికిరణ్ అతని స్నేహితులు తనను కొట్టడమేగాక తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ఫొటోలు, లెటర్లు లాక్కున్నట్లు తెలిపాడు, వల్లబ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీనిపై మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అభినవ్‌పై కేసు... తన కుమార్తెను అభినవ్ అనే యువకుడు దొంగచాటుగా వివాహం చేసుకోవడంతోపాటు, తన ఇంటికి వచ్చి కత్తితో బెదిరించి గాయపరిచాడని మారేడుపల్లికి చెందిన వ్యాపారవేత్త తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లాకు చెందిన కే.మహేంద్రనాథ్‌రెడ్డి అనే వ్యాపారవేత్త మారేడుపల్లిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అభినవ్ అనే యువకుడు మహేందర్‌రెడ్డి రెండో కుమార్తెను ప్రేమ పేరుతో నమ్మించి దొంగచాటుగా వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత అతని వేధింపులు తాళలేక ఆమె పుట్టింటికి చేరింది. ఈనెల 26వ తేదీ రాత్రి అభినవ్ మద్యం మత్తులో తమ ఇంటికి వచ్చి కత్తి చూపించి హత్య చేస్తానని బెదిరించాడని, ఈ ఘర్షనలో తనకు గాయాలయ్యాయని రవీంద్రనాథ్‌రెడ్డి అదే రాత్రి తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాణభయంతో కడప జిల్లాకు వెళ్లిపోయాడు. శనివారం అతను పోలీసులను కలిసి పరిస్థితి వివరించడంతో పోలీసులు అభినవ్‌పై ఐపీసీ 324, 506 సెక్షన్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
-
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆరుగురి పేర్లతో కొత్త మంత్రుల జాబితాను రాజ్‌భవన్‌కు పంపారు. శ్రీనివాస్ యాదవ్, తుమ్మలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన చందూలాల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరి చేరికతో తెలంగాణ కేబినెట్లో మంత్రుల సంఖ్య 18కి చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. కాగా తాజా విస్తరణలో మహిళలకు స్థానం దక్కలేదు. సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు నిరసన చేపడుతున్నా జాబితాలో చోటు దక్కలేదు. -
టీడీఎల్పీకి వెళ్లలేక.. టీఆర్ఎస్ఎల్పీకి వెళ్లక..
సాక్షి, హైదరాబాద్: అన్నీ తానే అయి కనిపించే నేత ఆయన... తను ఎక్కడుంటే అక్కడ హల్చల్... విమర్శలు చేయాలన్నా, పొగడ్తలు పంచాలన్నా తనదైన హైదరాబాదీ భాషలో ఆకట్టుకుంటారు. ఆయన... సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ బుధవారం శాసనసభ ఆవరణలోని టీడీఎల్పీ కార్యాలయం పక్కన ఇలా ఒంటరిగా ఫోన్లో మాట్లాడుతూ కారు కోసం వేచిచూస్తూ కనిపించారు. పక్కనే తనకు సుపరిచితమైన టీడీఎల్పీ ఆఫీసు ఉంది. లోపల ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. అయినా ఆయన అటువైపు కూడా చూడలేదు. ఎందుకంటే ఆయనిప్పుడు టీడీపీ నేత కాదు కదా! ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన తలసాని అక్కడ కూడా ఇంకా ఇమిడినట్టు కనిపించలేదు. సభకు వచ్చినప్పుడు గానీ, సభ నుంచి వె ళ్తున్నప్పుడు గానీ టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయం ఛాయలకు కూడా వెళ్లలేదు. అసెంబ్లీలో కూడా రెండుపక్కల(టీడీపీ, టీఆర్ఎస్) కూర్చున్న ఎమ్మెల్యేలకు నమస్కారం చేస్తూ వెళ్లి వెనకాల కూర్చున్నారు. -
కన్నబిడ్డల్లా చూసుకుంటాం..
పొట్ట చేతపట్టుకుని వచ్చినోళ్లంతా మా బిడ్డలే: కేసీఆర్ చంద్రబాబు ఓ దగా కోరు.. అబద్ధాల కోరు సీమాంధ్రులను నిండా మోసం చేస్తున్నడు టీఆర్ఎస్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు తీగల, తల సాని, ఎమ్మెల్సీ గంగాధర్ సాక్షి, హైదరాబాద్: ‘‘పొట్ట చేతబట్టుకుని హైదరాబాద్‌కు బతకడానికి వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలే. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నిరుపేదలను సైతం కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకుని చూసుకుంటాం..’’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సీమాంధ్రులకు తెలంగాణ ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేస్తుందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఓ దగాకోరని, ఆయన చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. బాబును నమ్మితే సున్నం పెడతాడే కానీ అన్నం పెట్టడని విమర్శించారు. హైదరాబాద్ శివార్లలోని మీర్‌పేటలో బుధవారం నిర్వహించిన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడారు. హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమ దేశం గర్వపడే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతర్జాతీయ నగరాలను మించిన మహా నగరాన్ని నిర్మిస్తామన్నారు. హాలీవుడ్‌ను తలదన్నేలా సినీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో 1,700 మురికి వాడలున్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది నివసిస్తున్నారు. ఏ బస్తీలో నివసిస్తున్న వాళ్లకు ఆ బస్తీలోనే ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్నగర్ వాసులకు త్వరలో పట్టాలు పంపిణీ చేస్తాం..’’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టర్కీలోని ఇస్తాంబుల్ నగరాన్ని వారసత్వ సంపద దెబ్బతినకుండా ఏ విధంగా అభివృద్ధి చేశారో.. అదే తరహాలో వారసత్వ సంపదకు నష్టం కలుగకుండా హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు అధ్యయనం చేసేందుకు త్వరలో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, అధికారులను త్వరలో ఇస్తాంబుల్‌కు పంపించనున్నట్లు సీఎం తెలిపారు. చంచల్‌గూడ జైలును చర్లపల్లికి తరలించి.. ఇక్కడ ముస్లిం పేద విద్యార్థుల కోసం విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రేస్‌కోర్స్‌ను శివారుకు తరలించి.. రేస్‌కోర్స్ స్థలంలో వంద ఎకరాల్లో విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. పేకాట క్లబులు, జూదాలాడే రేస్కోర్స్లు మనకు అవసరమా..? అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే రైతుల రుణాలు మాఫీ చెయ్యి.. ఏపీ సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ సవాలు చేశారు. ‘‘టీఆర్ఎస్ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా అమలు చేస్తున్నాం. ఇప్పటి కే రైతులకు సంబంధించిన రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేశాం. అదే చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రూ. 1.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. వాటి అమలు సాధ్యం కాదని చెప్పిన ఇతర పార్టీల నేతలను దబాయించిండు. తీరా అధికారంలోకి వచ్చినంక వాటిని పట్టించుకోకుండ అక్కడి రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నడు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. చంద్రబాబుకు దమ్ముంటే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేసి చూపించాలె..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, చంద్రబాబు పాలన వల్లే నేడు తెలంగాణ రైతులకు కష్టాలు వచ్చాయని... వారు అనుసరించిన తప్పుడు విధానాలే విద్యుత్ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేదన్నారు. తెలంగాణకు మూడేళ్ల పాటు కరెంట్ కష్టాలు తప్పవని ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పానని కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రతి పల్లెకు వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీరు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కర్నె ప్రభాకర్, సలీం, వెంకటేశ్వర్లు, నరేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా?: - చంద్రబాబుపై తలసాని మండిపాటు ‘‘మేం ఎటో పారిపోతున్నట్లు మమ్ములను ఓ గదిలో బంధించి నీకు ఏం కావాలి? నీ కుటుంబానికి ఏం కావాలి? అంటూ బాబు సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే బేరాలు ఆడుతున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొంటావా? నీకేమైనా సిగ్గుందా..?’’ అంటూ తలసాని శ్రీనివాస్‌యాదవ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాము యాచించే వాళ్లం కాదని, హైదరాబాద్‌ను శాసించే వాళ్లమని వ్యాఖ్యానించారు. తమ సత్తా ఏమిటో త్వరలోనే తెలుస్తుందని, వంద జన్మలెత్తినా తమలాంటి నేతలను తయారు చేయలేవని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లింది. బాబు కళ్లకు కాంట్రాక్టర్లు మినహా కార్యకర్తలెవరూ కనిపించడం లేదు. కొంతమంది చంద్రబాబు బంట్రోతులు బ్రోకర్లలా మాట్లాడుతున్నారు..’’ అని తలసాని విమర్శించారు. బతకడానికి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని చెప్పారు. తల్లిరుణం తీర్చుకునేందుకే..: తీగల తెలంగాణ తల్లి రుణం తీర్చుకునేందుకే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెప్పారు. తెలంగాణలో రంగారెడ్డి జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని.. అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ను బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామన్నారు. బంగారు తెలంగాణ కోసమే..: గంగాధర్‌గౌడ్ చంద్రబాబు సహా కొంత మంది సీమాంధ్రులు ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక పోతున్నారని ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ చెప్పారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని.. నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామిగా మారేందుకే తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని పేర్కొన్నారు.