టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటివైపుగా రావడంతో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పైగా ఆ సమయానికి చంద్రబాబు ఇంట్లోనే ఉండటం, తెలంగాణ టీడీపీ కీలక నాయకులతో సమావేశం కావడం, అప్పుడే తలసాని రావడంతో మంత్రిగారి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది