టీడీఎల్‌పీకి వెళ్లలేక.. టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి వెళ్లక.. | talasani at assembly | Sakshi
Sakshi News home page

టీడీఎల్‌పీకి వెళ్లలేక.. టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి వెళ్లక..

Published Thu, Nov 6 2014 3:09 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

టీడీఎల్‌పీకి వెళ్లలేక.. టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి వెళ్లక.. - Sakshi

టీడీఎల్‌పీకి వెళ్లలేక.. టీఆర్‌ఎస్‌ఎల్‌పీకి వెళ్లక..

సాక్షి, హైదరాబాద్: అన్నీ తానే అయి కనిపించే నేత ఆయన... తను ఎక్కడుంటే అక్కడ హల్‌చల్... విమర్శలు చేయాలన్నా, పొగడ్తలు పంచాలన్నా తనదైన హైదరాబాదీ భాషలో ఆకట్టుకుంటారు. ఆయన... సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ బుధవారం శాసనసభ ఆవరణలోని టీడీఎల్‌పీ కార్యాలయం పక్కన ఇలా ఒంటరిగా ఫోన్‌లో మాట్లాడుతూ కారు కోసం వేచిచూస్తూ కనిపించారు. పక్కనే తనకు సుపరిచితమైన టీడీఎల్‌పీ ఆఫీసు ఉంది. లోపల ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. అయినా ఆయన అటువైపు కూడా చూడలేదు. ఎందుకంటే ఆయనిప్పుడు టీడీపీ నేత కాదు కదా! ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని అక్కడ కూడా ఇంకా ఇమిడినట్టు కనిపించలేదు. సభకు వచ్చినప్పుడు గానీ, సభ నుంచి వె ళ్తున్నప్పుడు గానీ టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయం ఛాయలకు కూడా వెళ్లలేదు. అసెంబ్లీలో కూడా రెండుపక్కల(టీడీపీ, టీఆర్‌ఎస్) కూర్చున్న ఎమ్మెల్యేలకు నమస్కారం చేస్తూ వెళ్లి వెనకాల కూర్చున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement