భత్కల్‌పై కూడా చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్‌ను పాకిస్తాన్ నుంచి దేశానికి తీసుకొచ్చి శిక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి కోరారు. మంగళవారం జీరోఅవర్‌లో మాట్లాడారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష వేయించిన మాదిరే గోకుల్‌చాట్ నిందితులకు సైతం కఠిన శిక్షలు పడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
– కిషన్‌రెడ్డి, బీజేపీ
ఆంధ్రా బస్సులను నియంత్రించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు బస్సులను నియంత్రించాలని జీరోఅవర్‌లో ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా ప్రాంత బస్సులతో తెలంగాణ ఆర్టీసీకి రోజూ రూ.కోటి నష్టం వాటిల్లుతోందని ఆయన చెప్పారు.
– శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్
స్కూల్ యూనిఫాంలు సరఫరా చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫారంలు సరఫరా కావడం లేదని వాటిని త్వరగా సరఫరా చేయడంతో పాటు, నాణ్యమైన వాటిని అందించాలని జీరోఅవర్‌లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి కోరారు.
– పద్మావతి, కాంగ్రెస్
ఆశావర్కర్ల జీతాలు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఆశావర్కర్ల కనీస వేతనాలను కనీసం రూ.15 వేలకు పెంచడంతో పాటు వారికివ్వాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీరోఅవర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు.
– రాజయ్య, సీపీఎం
చెరుకు మద్దతు ధర పెంచాలి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకు మద్దతు ధర రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు ఉందని కానీ రాష్ట్రంలో కేవలం రూ.3 వేలే ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇక్కడి రైతులకు కూడా మద్దతు ధరను రూ.4,200లకు పెంచాలని కోరారు.
– ఆర్ కృష్ణయ్య, టీడీపీ