Riyaz Bhatkal
-
ప్రాణం ఖరీదు రూ.888!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జంట పేలుళ్ల ’కోసం ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఖర్చు చేసింది ఎంతో తెలుసా..? అక్షరాల రూ.40 వేలు మాత్రమే. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లో దొరికిన పేలని బాంబు ఆపరేషన్ వెనుక ఉన్న విషయమిది. 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న ఈ రెండు పేలుళ్లు 45 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన సరాసరిన ఒక్కో హత్యకు వీరు రూ.888 చొప్పున ఖర్చు చేశారు. హైదరాబాద్ పేలుళ్ల తర్వాత వీరందరూ ఈ కుట్ర పురుడుపోసుకున్న పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ఆ నగరంలో కొన్ని కిడ్నాప్‌లు చేయడం ద్వారా ‘మాల్ ఏ ఘనీమఠ్’ సంపాదించాలని కుట్రపన్నారు. మంగళవారం దోషులుగా తేలిన అనీఖ్ షఫీద్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిల వాంగ్మూలాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనీఖ్‌కు ఇచ్చింది రూ.20 వేలు... పాతబస్తీలోని మక్కా మసీదు పేలుళ్లకు ప్రతీకారంగా నగరాన్ని టార్గెట్ చేయాలని భావించిన రియాజ్ భత్కల్ తన అనుచరుడు అనీఖ్‌ను హైదరాబాద్ పంపాలని నిర్ణయించుకున్నాడు. తొలుత ఫారూఖ్ బంధువైన నవీద్‌ను కలిసి, కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చినట్లు చెప్పాలని సూచించాడు. ఆగస్టు 1న అతడికి రూ.20 వేలు ఇచ్చి పంపాడు. సరూర్‌నగర్‌లోని నవీద్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న అనీఖ్ అక్కడి నుంచి పుణే వెళుతున్నట్లు చెప్పి నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేశాడు. అయితే దాని అద్దె రోజుకు రూ.250 వరకు ఉండటంతో మరుసటి రోజే అజీజియా లాడ్జికి మకాం మార్చాడు. తన పేరు సతీష్ గౌక్వాడ్‌గా చెప్పుకుని రూ.120 అద్దెతో గది తీసుకున్నాడు. ఇక్కడ ఉంటూనే హబ్సిగూడ బంజారా నిలయంలోని ఫ్లాట్ నం.302లో దిగేందుకు యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నెలకు రూ.4 వేల అద్దె చెల్లించేందుకు అంగీకరించి రూ.12 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అక్బర్ తెచ్చింది మరో రూ.6 వేలు... ఫ్లాట్ అద్దెకు తీసుకున్న అనీఖ్ ఈ విషయాన్ని పబ్లిక్ ఫోన్ ద్వారా రియాజ్‌కు చేరవేయడంతో ఆగస్టు 8న అక్బర్‌ను నగరానికి పంపిన రియాజ్... ఖర్చుల కోసం రూ.6 వేలు ఇచ్చాడు. అనీఖ్, అక్బర్ అమీర్‌పేటలోని ధూమ్ టెక్నాలజీస్‌లో హార్డ్‌వేర్ నెట్ వర్కింగ్ కోర్సులో చేరి రూ.5 వేలు చెల్లించారు. అక్బర్.. వినోద్ పాటిల్ పేరుతో చెలామణి అయ్యాడు. భత్కల్ ఆదేశాల మేరకు అనీఖ్ రూ.4 వేలతో కోఠిలో టీవీ కొనుగోలు చేశాడు. రియాజ్ భత్కల్ బంజారా నిలయానికి వచ్చిన తర్వాత అతడి సూచనల మేరకు సికింద్రాబాద్‌లోని రూ.360 వెచ్చించి మూడు బ్యాగులు కొన్నారు. ఆగస్టు 1 నుంచి 27 మధ్య (పేలుళ్ల తర్వాతా ఫ్లాట్‌లోనే రెండు రోజులు ఉన్నాడు) భత్కల్ రెండుసార్లు వచ్చిపోవడానికి, బాంబుల తయారీ, ఇతర ఖర్చులకు మరో రూ.14 వేలు వెచ్చించినట్లు అనీఖ్, అక్బర్ చెప్పుకొచ్చారు. ఇలా మొత్తమ్మీద జంట పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి రియాజ్ వెచ్చించింది రూ.40 వేలు. పేలుళ్ల అనంతరం ఆగస్టు 27న అనీఖ్ పుణేకు తిరిగి వెళ్లిపోయాడు. పుణేలో కిడ్నాప్‌లకు కుట్ర... పేలుళ్ల తర్వాత అనీఖ్, అక్బర్, రియాజ్ వేర్వేరుగా పుణే చేరుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకు పుణేలోని అశోక మీవ్స్ అపార్ట్మెంట్లో సమావేశం కాగా, రియాజ్ తన కుట్రను బయటపెట్టాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన డబ్బు (మాల్ ఏ ఘనీమఠ్) కోసం కిడ్నాప్‌లు చేయాలని చెప్పాడు. పుణేలోని ప్రముఖ నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థ లుంకడ్ బిల్డర్స్ యజమానిని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. అక్కడి విమాన్‌నగర్‌లో ఉన్న అతడి కార్యాలయం, క్యాంప్ ఏరియాలోని కౌన్సిల్ హాల్ ఔట్‌పోస్ట్‌ల వద్ద రెక్కీ చేసే బాధ్యతలను రియాజ్.. అనీఖ్, అక్బర్‌కే అప్పగించాడు. ఇతడితో పాటు రంక జ్యూవెలర్స్ యజమాని కుమారుడినీ టార్గెట్‌గా చేసుకుని గణేశ్ పేట్‌లోని అతడి కార్యాలయం, మార్షినగర్‌లోని ఇంటి వద్ద సైతం వీరితో రెక్కీ చేయించాడు. ఒక్కొక్కరి వెనుక పక్షం రోజుల పాటు రెక్కీలు చేయించిన రియాజ్ ఆపై హఠాత్తుగా వదిలేయాలంటూ చెప్పాడు. జంట పేలుళ్లతో పాటు పేలని బాంబు కేసులో అనీఖ్, అక్బర్లను మంగళవారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. -
ప్రతీకారేచ్ఛతోనే పేలుళ్లు
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో జంట బాంబు పేలుళ్లవెనుక ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదుల ప్రతీకారేచ్ఛే కారణమని దర్యాప్తు అధికారులు తేల్చారు. హైదరాబాద్ పాతబస్తీ లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడుకు ఓ వర్గం వారే బాధ్యులని భావించిన ఐఎం ఉగ్రవాదులు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించారు. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపంలో మరో బాంబును అమర్చినా అది పేలకపోవ డంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న అశోక్ మీవ్స్ అపార్ట్మెంట్లో ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందని నిందితులు బయటపెట్టారు. భారీ ప్రాణ నష్టమే లక్ష్యం... హుస్సేన్‌సాగర్ బోట్లో అనీఖ్, గోకుల్‌చాట్‌లో రియాజ్, దిల్‌సుఖ్‌నగర్‌లో అక్బర్ బాంబులు పేట్టాలన్నది పథకం. వాస్తవానికి సికింద్రాబాద్, అమీర్‌పేట్, చార్మినార్ సహా మరికొన్ని చోట్ల రెక్కీ చేసినా చివరకు రియాజ్ ఆదేశాలతో ఈ మూడింటినే టార్గెట్‌గా చేసుకున్నారు. భారీ ప్రాణ నష్టాన్ని సృష్టించాలని భావించిన రియాజ్ భత్కల్... నగరంలో మూడు బాంబులూ రద్దీ సమయమైన రాత్రి 7 గంటలకు కచ్చితంగా పేలేలా అనీఖ్, అక్బర్‌ల వాచీలను రీ–సెట్ చేయించాడు. టైమర్‌తో కూడిన షేప్డ్ బాంబుల్లో సరిగ్గా 6.45 గంటలకు బ్యాటరీలను పెట్టి, తమ టార్గెట్స్‌లో జన సమ్మర్థం ఉన్న చోట వదలాలని స్పష్టం చేశాడు. తమ దగ్గర ఉన్న సెల్ఫోన్లను ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లే ముందు ఆపేయాలని, విధ్వంసం జరిగి ఫ్లాట్‌కు చేరుకున్నాకే వాటిని ఆన్‌చేయాలని చెప్పాడు. ఒకవేళ ముగ్గురిలో ఎవరైనా పట్టుబడితే పోలీసుల సమక్షంలోనే మిగిలిన ఇద్దరికీ ఫోన్ చేసి ‘బిగ్ బజార్‌కు రండి’అని చెప్పాలంటూ రియాజ్ కోడ్ ఏర్పాటు చేశాడు. ఇలా ఫోన్ వస్తే మిగిలిన వారు పారిపోవాలని స్పష్టం చేశాడు. తారుమారైన పరిస్థితులు... గోకుల్‌చాట్ వద్ద పేలుడుకు రియాజ్ భత్కల్ పథకం ప్రకారమే అక్కడి ఐస్‌క్రీమ్ డబ్బాపై బాంబు పెట్టి జారుకున్నా మిగిలిన ఇద్దరు మాత్రం పేలుళ్ల అమల్లో కంగారుపడ్డారు. హబ్సిగూడ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రా బాద్‌కు వెళ్లిన అనీఖ్ అక్కడి నుంచి ఆటోలో లుంబినీ పార్కుకు చేరుకొని ఆటోడ్రైవర్‌కు రూ. 500 నోటు ఇవ్వగా అతడు చిల్లర లేదన్నాడు. దీంతో అక్కడే ఉన్న లేజర్ షో బుకింగ్ కౌంటర్లో టికెట్ కొని చిల్లర తెచ్చిచ్చాడు. కానీ ఆటో దిగే ముందే టైమర్‌ను ఆన్ చేయడంతో బాంబు యాక్టివేట్ అయి పోయింది. అయితే అప్పుడే షికారు బోటు హుస్సేన్‌సాగర్‌లోకి వెళ్లిపోవడం, మరొకటి బయలుదేరే వరకు తాను వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండటం, ఈలోగా బాంబు పేలే ప్రమాదం నెలకొనడంతో తాను కొన్న టికెట్‌తో లేజర్ షో వద్దకు వెళ్లి బాంబు అమర్చి పరారయ్యాడు. మరోవైపు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో బాంబు పెట్టడానికి హబ్సిగూడలోని ఫ్లాట్ నుంచి సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరి బస్సు కోసం నిరీక్షించి అది రాకపోవడంతో ఆటోలో 6.20 గంటలకు అక్కడకు చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా జన సమ్మర్థంగా ఉన్నప్పటికీ బాంబు ఉన్న బ్యాగ్‌ను ఎక్కడ పెట్టాలో అతనికి అర్థంకాలేదు. ఆ ఆందోళనలోనే బాంబులో బ్యాటరీని హడావుడిగా పెట్టడంతో టైమర్ వాచ్ పని చేయకపోవడాన్ని గమనించినా... ఏమీ చేయలేక బ్యాగ్‌ను ఓ ద్విచక్ర వాహనానికి తగిలించి చివరకు ఫ్లాట్‌కు చేరుకున్నాడు. పేలుడు జరిగిన మర్నాడూ ముగ్గురు ఉగ్రవాదులు ఫ్లాట్‌లోనే గడిపారు. ఆగస్టు 27న మధ్యాహ్నం 3.30 గంటలకు అక్బర్ సికింద్రాబాద్ నుంచి బస్సు ద్వారా పుణే పరారవగా ఆపై రెండు రోజుల వ్యవధిలో మిగిలిన వాళ్లూ పరారయ్యారు. ఈ విధ్వంసాలకు అవసరమైన సహాయ సహకారాలను ఇతర నిందితులు అందించారు. రియాజ్ భత్కల్ స్కెచ్... ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తన సోదరుడు ఇక్బాల్ భత్కల్, పాకిస్తాన్లో ఉన్న అమీర్ రజా ఖాన్‌తో కలసి హైదరాబాద్‌లో పేలుళ్లకు స్కెచ్ వేశాడు. రియాజ్ ఆదేశాలతో 2007 ఆగస్టు మొదటి వారంలో అనీఖ్ షఫీఖ్ సయ్యద్ నగరానికి చేరుకోగా సురక్షిత ప్రాం తంలో ఇల్లు అద్దెకు తీసుకోవడంతోపాటు కం ప్యూటర్ కోర్సులో చేరాలంటూ అతన్ని రియా జ్ ఆదేశించాడు. దీంతో అనీఖ్ తొలుత సరూర్ నగర్లో ఉంటున్న ఫారూఖ్ బంధు వైన నవీద్ వద్ద ఆశ్రయం పొందాడు. ఆపై నాంపల్లిలోని అజీజియా లాడ్జిలో కొన్ని రోజులు బస చేశాడు. ఆ తర్వా త హబ్సిగూడలోని బంజారా నిల యం అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 302ను అద్దెకు తీసుకున్నాడు. అనీఖ్ ఎవరికీ అనుమానం రాకుండా నగరంలో ఆశ్రయం పొందడంతో పుణేకు చెందిన అక్బర్ ఇస్మాయిల్ చౌదరిని రియాజ్ హైద రాబాద్ పంపాడు. వారిద్దరూ అమీ ర్‌పేటలోని ధూమ్ కంప్యూటర్స్ లో హార్డ్‌వేర్ శిక్షణలో చేరారు. పే లుళ్లకు కొన్ని రోజుల ముందు సిటీ వచ్చిన రియాజ్... ఇక్కడి ఏర్పాట్ల పై సంతృప్తి చెందాడు. కొన్ని రోజు ల తర్వాత మంగుళూరు నుంచి ఆర్టీసీ బస్సు లో పేలుడు పదార్థాలను పంపగా... అనీఖ్, అక్బర్ ఎంజీబీఎస్‌లో వాటిని అందుకున్నారు. పేలుళ్లకు రెండ్రోజుల ముందు అనీఖ్, అక్బర్లను నగరంలో కలిసిన రియాజ్ కుట్ర అమలుకు సిద్ధం కావాలని ఆదేశించాడు. దీంతో వారిద్దరూ సికింద్రాబాద్‌లో బ్యాగ్‌లు, కోఠిలో బ్యాటరీలు కొని అనుకున్నట్లుగానే 2007 ఆగస్టు 25న మూడు బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని బయలుదేరారు. -
శాసనసభలో ప్రశ్నోత్తరాలు
భత్కల్‌పై కూడా చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ను పాకిస్తాన్ నుంచి దేశానికి తీసుకొచ్చి శిక్షించే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి కోరారు. మంగళవారం జీరోఅవర్‌లో మాట్లాడారు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష వేయించిన మాదిరే గోకుల్‌చాట్ నిందితులకు సైతం కఠిన శిక్షలు పడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. – కిషన్‌రెడ్డి, బీజేపీ ఆంధ్రా బస్సులను నియంత్రించండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రైవేటు బస్సులను నియంత్రించాలని జీరోఅవర్‌లో ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా ప్రాంత బస్సులతో తెలంగాణ ఆర్టీసీకి రోజూ రూ.కోటి నష్టం వాటిల్లుతోందని ఆయన చెప్పారు. – శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ స్కూల్ యూనిఫాంలు సరఫరా చేయండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో విద్యార్థులకు స్కూల్ యూనిఫారంలు సరఫరా కావడం లేదని వాటిని త్వరగా సరఫరా చేయడంతో పాటు, నాణ్యమైన వాటిని అందించాలని జీరోఅవర్‌లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి కోరారు. – పద్మావతి, కాంగ్రెస్ ఆశావర్కర్ల జీతాలు పెంచాలి సాక్షి, హైదరాబాద్: ఆశావర్కర్ల కనీస వేతనాలను కనీసం రూ.15 వేలకు పెంచడంతో పాటు వారికివ్వాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీరోఅవర్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. – రాజయ్య, సీపీఎం చెరుకు మద్దతు ధర పెంచాలి సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చెరుకు మద్దతు ధర రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు ఉందని కానీ రాష్ట్రంలో కేవలం రూ.3 వేలే ఉందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇక్కడి రైతులకు కూడా మద్దతు ధరను రూ.4,200లకు పెంచాలని కోరారు. – ఆర్ కృష్ణయ్య, టీడీపీ -
ఏ-1ఎక్కడ?
►రియాజ్ భత్కల్ నేతృత్వంలోనే సాగిన ‘రెండు ఆపరేషన్స్’ ►ఇప్పటికీ చిక్కని ప్రధాన నిందితుడు ►దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు ►2008 నుంచి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది రియాజ్ భత్కల్... 2007 నాటి గోకుల్ చాట్, లుంబినీపార్క్ , 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా (ఏ–1) ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిర్వహించాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు విచారణ పూర్తయి దోషులకు శిక్ష సైతం పడింది. 2007 నాటి జంట పేలుళ్ల కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికీ ఏ–1 చిక్కలేదు. అసలు ఎవరీ రియాజ్, ఉగ్రవాదిగా ఎలా మారాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. సాక్షి, సిటీబ్యూరో: రియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆదినుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువే. ఆ యావలోనే నేరబాట పట్టి ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్–ఉర్–రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా... ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తరవాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ ఉండగా స్థానికంగా ఓ ప్రార్థన స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచు వెళ్లేవాడు. ఆ ప్రోద్బలంతో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజాఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారిమళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్ ఇండియన్ ముజాహిదీన్‌లో సెకండ్ కమాండ్ ఇన్చార్జి హోదాలో ఉండటంతో నిధులపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యుల్లోని ఎవరూ చేయలేకపోయారు. ‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే... ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్ షేక్ పూర్తిగా వ్యతిరేకించాడు. దీని వల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. తమ లక్ష్యం నెరవేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం తెరవెనుకే ఉండటం మంచిదని రియాజ్‌తో చెప్పాడు. అయితే ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు. తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదనకు దిగాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్... ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్నాడు. ముష్కరులను వెంటనే ఉరితీయాలి అమాయకులను పొట్టన పెట్టుకున్న ముష్కరులను వెంటనే ఉరితీయాలి. కాలయాపన చేయకుండా శిక్ష అమలు చేస్తేనే అమరుల ఆత్మ శాంతిస్తుంది. ఆనాటి ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రామకృష్ణ, : పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు శిక్షిస్తేనే చట్టాలపై నమ్మకం కలుగుతుంది...చట్టాలపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే తీవ్రవాదులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. వారు శిక్ష నుంచి బయటపడకుండా చూస్తేనే ప్రజలు హర్షిస్తారు. బాంబు పేలుడు ఘటన జరిగిన ప్రదేశానికి ఎప్పుడు వెళ్లినా ఒళ్లు జలదరిస్తుంది. – సుధాకర్‌రెడ్డి : ప్రత్యక్ష సాక్షి, దిల్సుఖ్నగర్ -
హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి లగ్జరీ లైఫ్
హైదరాబాద్: ఓ వైపు దిల్ సుఖ్ నగర్ పేలుళ్లను అమలు చేసిన ఇండియన్ మొజాహిద్దీన్(ఐఎమ్) ఉగ్రవాది యాసిన్ బత్కల్ ను జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) అరెస్టు చేసి ఆఖరి తీర్పుకు కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతుండగా.. మరో వైపు పేలుళ్ల సూత్రధారి, ఐఎమ్ సహవ్యవస్ధాపకుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియాజ్ బత్కల్ కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలోని భవనంలో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో పేలుళ్లు చేసినందుకుగాను ఐఎస్ఐ పెద్ద ఎత్తున డబ్బును రియాజ్ బత్కల్ కు ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల చార్జిషీటులో రియాజ్ బత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ బత్కల్ లకు ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. ఐఎస్ఐకు సాయం చేస్తానని రియాజ్ ఒప్పుకోవడంతోనే ఐఎమ్ లో చీలిక వచ్చిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. మాజీ ఐఎమ్ నేత షఫీ అర్మర్ రియాజ్ తో విభేదించి ఐఎస్ లేదా అల్ ఖైదా సంస్ధ పుట్టుకురావడానికి కారణమయ్యాడని చెప్పారు. రియాజ్ వద్ద పాకిస్తాన్ పాస్ పోర్టు కూడా ఉన్నట్లు తెలిసింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఒకసారి రూ.1.25లక్షలు, మరోసారి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెస్ట్ టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ.75 వేలు యాసిన్ బత్కల్ కు రియాజ్ పంపినట్లు చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సాగుతున్న కార్యకలాపాలను అడ్డుకునేందుకు రియాజ్ బత్కల్ పేలుళ్ల కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. పేలుళ్ల కోసం అసదుల్లా అక్తర్ అలియస్ హద్దీ, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్ లను యాసిన్ బత్కల్ కు పరిచయం చేసి దిల్ సుఖ్ నగర్ తో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని పథకం రచించాడు. పేలుళ్లకు ఒకరోజు ముందు వ్యుహం సఫలీకృతం కావాలని దేవుడిని ప్రార్ధించాలని రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ను కోరినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లకు తొలుత పిక్రిక్ యాసిడ్ ను ఉపయోగించాలని యాసిన్ భావించాడని కానీ, సహచరుల సలహాలతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పేలుళ్లలో 50 ఇంప్రొవైజ్ డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ)లను ఉపయోగించినట్లు చెప్పారు. పేలుళ్లు పూర్తయ్యేవరకూ యాహు మెసేంజర్ ద్వారా రియాజ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు. -
ఫేస్బుక్ లో భత్కల్: పోలీసులు
న్యూఢిల్లీ: తీవ్రవాదులు పరస్పరం సందేశాలు పంపుకునేందుకు సామాజిక సంబంధాల వెబ్సైట్లు వినియోగిస్తున్నారా. అవుననే అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) తీవ్రవాదులు - ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, ఇతర ఇ-మెయిల్ చాటింగ్ వెబ్సైట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారని కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ తాను అమలుచేయాలనున్న దాడులు గురించి ఇంటర్నెట్ ద్వారా సహచరులకు తెలిపేవాడని పోలీసులు పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ఐఎం తీవ్రవాదులు నిమ్బజ్, యాహు, పాల్‌టాక్, జీమెయిల్, ఫేస్బుక్ ఐడీలు కలిగివున్నారని పోలీసులు గుర్తించారు. ఓ అక్రమ ఆయుధ కర్మాగారం ఏర్పాటు వెనుక కూడా వీరి ప్రమేయం ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. -
దిల్సుఖ్నగర్ పాత్రధారే పాట్నా సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో పాత్రధారిగా ఉన్న తెహసీన్ అక్తర్.. అక్టోబర్ 27 నాటికి పాట్నా పేలుళ్లలో సూత్రధారిగా మారాడు! ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ వాసిమ్ అక్తర్ షేక్ అలియాస్ మోను అలియాస్ హసన్ (23) స్వస్థలం బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఉన్న మనియార్పూర్ గ్రామం. కంప్యూటర్ విద్యను అభ్యసించిన మోను గతంలో నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)లో కీలకపాత్ర పోషించాడు. ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ ద్వారా ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతడి ఆదేశాల మేరకే అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (గత ఆగస్టులో యాసీన్ భత్కల్‌తో పాటు బీహార్‌లో అరెస్టయిన ఉగ్రవాది)తో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్సుఖ్నగర్ పేలుళ్లకు రంగంలోకి దిగాడు. హడ్డీ, వఖాస్‌లతో కలిసి నగరంలో అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫిబ్రవరి 21న సైకిల్‌పై పెట్టుకున్న బాంబును ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద వదిలి వెళ్లాడు. 2011లో ముంబై వరుస పేలుళ్లు, వారణాసి పేలుళ్ల కేసులో కూడా తెహసీన్ నిందితుడు. ఆయా కేసులకు సంబంధించి ఎన్ఐఏ గత కొన్ని నెలల్లో పదిసార్లకు పైగా అతడి స్వగ్రామంలో గాలింపు చేపట్టింది. అతడిపై అరెస్ట్ వారంట్ జారీచేసిన ఎన్ఐఏ.. ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల బహుమతి కూడా ప్రకటించింది. అయినా ఫలితం దక్కలేదు.