
గులాబీ సంబరం
‘వరంగల్’ విజయం గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో జోష్‌ను నింపింది. ఎంపీ అభ్యర్థి దయాకర్ విజయం సాధించినట్లు తెలియగానే మంగళవారం నగరంలోని పలుచోట్ల టీఆర్‌ఎస్ నేతలు విజయోత్సవాలు జరుపుకొన్నారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
స్వీట్లు పంచుకున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లోనూ విజయ డంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవాల్లో మంత్రులు తలసాని, నాయిని, పద్మారావు, ఈటల తదితరులు పాలుపంచుకున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో