హైదరాబాద్: నగరంలోని చిత్రపురి కాలనీ వాసులపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్లు గురువారం వారాల జల్లు కురింపించారు. చిత్రపురి కాలనీని సందర్శించిన మంత్రులు కాలనీలోని అనేక సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రహదారుల మరమ్మతులకు రూ. కోటిన్నర కెటాయించడంతో పాటు త్వరలోనే అర్బన్ అసుపత్రిని కాలనీలో నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు.
కాలనీ వాసులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాలనీకి సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. రేపటి నుండి బస్సు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిత్రపురి కాలనీకి ఆనుకొని ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి కాలనీ వాసులకు ప్రయోజనకరంగా ఉండేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యున్నత ఫిలిం ఇండస్ట్రీగా తీర్చిదిద్దుతామని మంత్రులు పేర్కొన్నారు.
చిత్రపురి కాలనీ వాసులపై వరాల జల్లు
Published Thu, Jan 7 2016 2:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement