colony
-
అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..
అంగారక గ్రహంపై మానవుని ఆవాసానికి యోగ్యమైనదా? కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నీటి జాడలు ఉన్నాయా లేదా ఒక వేళ ఉండాల్సి వచ్చినా అనువుగా ఉంటుందా లేదా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనులు చేశారు. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు తాజగా ఆ గ్రహంపై ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ వెల్లడించారు. జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మార్స్‌పై కాలనీని 22 మంది వ్యోమగాములతో నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేలా ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ కూడా చెప్పారు. తాము ఎన్నో యేళ్లుగా చేస్తున్న అధ్యయనాల్లో.. మానవ స్థావరాన్ని నిర్మించడం చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య అని తేలిందన్నారు. వనరులు పరిమితంగా ఉన్నందునన ఈ గ్రహంపై ఆవాసం నిర్మించడం అనేది సవాలుతో కూడినది. అయితే అక్కడ ఎంతమంది వ్యోమోగాములు ఆవాసాలను నిర్మించగలరు, ఎంతమంది ఉండొచ్చు అనేదానిపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాల్లో దాదాపు 22 మంది వ్యోమగాములతో కాలనీ నిర్మించొచ్చని, అలాగే సుమారు 100 నుంచి 500 మంది దాక ఉండొచ్చని గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో వలసవాద సమస్య గానీ, మానవ వికృతి ప్రవర్తనకు సంబంధించిన సవాళ్లు గానీ ఎదరయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా హెచ్చరించారు. అంగారక గ్రహంపై ఏ ప్రాంతంలో కాలనీలు నిర్మించాలనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహంపై మానవ మనుగడను అంచనా వేసేందుకు ఏజెంట్-బేస్డ్ మోడలింగ్ అనే కంప్యూటర్ అనుకరణను ఉపయోగించారు. అక్కడ ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తట్టుకుని జీవించగలిగే మానవుల మనసతత్వాలను గూర్చి కూడా ఈ కంప్యూటర్ వెల్లడించింది. "న్యూరోటిక్" మనస్తత్వం కలవారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, "పరిస్థితులను అంగీకరించదగిన" వ్యక్తిత్వ గల వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్) -
జల దిగ్బంధంలో గజగజ
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ఆ కాలనీ వాసులు జల దిగ్బంధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. చినుకు పడిందంటే ఈ కాలనీ ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గాజుల రామారం డివిజన్లోని ఓక్షిత్ ఎన్‌క్లేవ్‌ను నాలుగు రోజులుగా జల వలయం వీడకపోవడంతో స్థానికులు నిద్రాహారాలు మాని కాలం వెళ్లదీస్తున్నారు. సమస్య ఉత్పన్నమైనప్పుడే అధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారే తప్ప ఆ తర్వాత ఇటువైపు చూసిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ వరద నీట మునిగింది. ఆదివారం వరకూ తేరుకోకపోవడంతో ఇక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకిలా..? సూరారం గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్ 70, 71లలో 24.22 ఎకరాల్లో రామారం పెద్ద చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎగువ ప్రాంతంలోని లింగా చెరువు, కొత్తచెరువు, ఎర్ర చెరువు, మానింగ్ ఒంపులలోని వర్షపు నీరు రామారం చెరువులో వచ్చి చేరుతోంది. భారీ వర్షం వచ్చినప్పుడు రామారం చెరువు ఉద్ధృతంగా ప్రవహించి పరిక చెరువులో కలుస్తోంది కట్టు కాల్వను ప్లాట్లుగా మార్చి.. వెంచర్ ప్రారంభంలో కాలనీలో ఉన్న మొత్తం ప్లాట్లు అమ్ముడుపోగా.. కొంతమంది కళ్లు కాలనీ నుంచి వెళ్తున్న 30 ఫీట్ల కట్టు కాల్వపై పడ్డాయి. దీనిని ప్లాట్లు చేసి రూ.కోట్లు గడించారు. ఏడేళ్ల క్రితం ప్లాటింగ్ చేస్తున్న సమయంలో మూడేళ్ల వరకు వర్షాలు అంతంత మాత్రమే పడడం, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల అండదండలు ఉండడంతో కట్టు కాల్వపై నిర్మాణాలు వెలిశాయి. కబ్జా బాగోతం వెలుగులోకి.. 2022లో భారీ వర్షాలు పడడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు మార్గం లేక కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో కాలనీవాసులు రెండు నెలలుగా పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై ‘సాక్షి’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలన.. కట్టు కాలువ కబ్జా విషయమై గాజుల రామారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది మార్చి నెలలో గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, పీసీబీ, ఫారెస్ట్, జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు పరిశీలించి వెళ్లారే తప్ప చర్యలు తీసుకోలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలించిన అనంతరం 274 నిర్మాణాలు కట్టు కాల్వపై వెలిసినట్లు గుర్తించారు. వీటిలో 24 నిర్మాణాలను తక్షణమే తొలగించాలని మార్కింగ్ కూడా వేశారు. కానీ అంతటితోనే ఆపివేయడం గమనార్హం. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. ప్లాటు కొనుగోలు చేసేటప్పుడు కాలనీలో సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పారు. అసలు కట్టు కాల్వపై ప్లాట్లు చేశారనే విషయమే మాకు తెలియదు. గత ఏడాది నుంచి భారీ వర్షాలు పడటంతో కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలి. – శంకరాచారి, ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ వాసి -
టీడీపీ హయాంలో కాళ్ళరిగేలా తిరిగినా ఇవ్వని ఇళ్ళు
-
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
పరి పరిశోధన
వర్టికల్ ఫార్మింగ్‌తో 30 రెట్లు ఎక్కువ దిగుబడి నేల అవసరం లేని నిట్టనిలువు వ్యవసాయం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాంగానీ.. ఇందులోనూ రికార్డులు బద్దలు కొట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన బోవరీ విషయాన్నే తీసుకోండి. ఈ సంస్థ అతితక్కువ స్థలం, నీరు, వనరులు వాడుకుని బోలెడన్ని ఆకు కూరలు పండించేందుకు రంగం సిద్ధం చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో ఎకరానికి పండించే దానికంటే బోవరీలో పండేది ఏకంగా 30 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. అత్యాధునిక టెక్నాలజీలను వాడుకోవడం ద్వారా తాము 95 శాతం తక్కువ నీరు.. క్రిమికీటక నాశినులు, రసాయన ఎరువులు ఏవీ వాడకుండానే అధిక దిగుబడులు సాధిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒకే రకమైన పంట కాకుండా ఏకకాలంలో దాదాపు వంద రకాల ఆకు కూరలు, ఔషధ మొక్కలు పెంచడం ఇంకో విశేషం. ప్రత్యేకంగా తయారుచేసుకున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మొక్కలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానగరాలకు చేరువలో ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్ చేపట్టడం ద్వారా నగరవాసులకు తాజా ఆకుకూరలు దొరుకుతాయి. ఇందువల్ల రవాణా చేయవలసిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని బోవెరీ అంటోంది. ప్రస్తుతం ఈ సంస్థ పంటలు న్యూయార్క్‌లోని ఫోరేజ్, హోల్సమ్ ఫుడ్స్ వంటి స్టోర్లలో లభ్యమవుతున్నాయి. పెంగ్విన్ల కాలనీ బయటపడింది... మంచుముద్ద అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ల కాలనీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ.. ఇందులో విశేషమేముంది? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అంతరించిపోతున్నాయని అనుకుంటున్న అడిలీ రకం పెంగ్విన్లు ఇక్కడ ఉండటం ఒక విశేషమైతే.. ఏకంగా 15 లక్షల ప్రాణులు ఉండటం ఇంకో విశేషం. వుడ్హోల్ ఓషన్రోఫిక్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్లతో జరిపిన పరిశోధనల ద్వారా ఈ కొత్త కాలనీ గురించి ప్రపంచానికి తెలిసింది. డాంగర్ ద్వీపంలో ఉన్న ఈ కాలనీని ఇప్పటివరకూ మనుషులెవరూ సందర్శించలేదని.. బహుశా అందుకే ఆ ప్రాంతంలో పెంగ్విన్లు బాగా వృద్ధి చెందుతూండవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్ హార్ట్ తెలిపారు. 1959లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ వీటి ఉనికి గురించి కొన్ని ఆనవాళ్లు కనిపించాయని, ఆ తరువాత డాంగర్ ద్వీపమున్న పశ్చిమ అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్లు క్రమేపీ తగ్గిపోతూ వచ్చాయని హార్ట్ వివరించారు. దాదాపు ఏడు లక్షల జంటలతో ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా ‘హార్ట్’ నిలిచింది అంటున్నారు. ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, ఫ్రాన్స్‌లలోని ఇతర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. నిత్య యవ్వనం గుట్టు తెలిసింది... నిండు నూరేళ్లూ... ఎలాంటి జబ్బులు, ఇబ్బందులు లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది గానీ.. సాధ్యమయ్యేదెలా? అంటున్నారా? అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఈ దిశగా ఇంకో అడుగు ముందుకు పడింది. విషయం ఏమిటంటే.. మన క్రోమోజోమ్‌ల చివరన ఉండే టెలిమోర్లకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని తెలుసుకున్నారు. డీఎన్ఏ పోగుల్లోని కొన్ని భాగాలను టెలీమోర్లుగా మార్చేందుకు టెలిమరేస్ అనే ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వీరు గుర్తించారు. సాధారణంగా మన శరీర కణాలు కొన్నిసార్లు విభజితమైన తరువాత మరణిస్తాయి. ఈ క్రమంలో క్రోమోజోమ్‌ల చివర ఉండే టెలీమోర్ల పొడవు తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే టెలిమోర్ల పొడవు నిర్దిష్ట స్థాయికంటే తక్కువ అవుతుందో అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే కణాలు.. వాటితోపాటు మనమూ వృద్ధులమవుతామన్నమాట. ఈ నేపథ్యంలో టెలీమోర్ల పొడవు తగ్గకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. టెలీమెరేస్లో క్రోమోజోమ్ చివరల్లో ఉండే టెలీమోర్లకు సంబంధించిన డీఎన్ఏ ముక్కలను కచ్చితంగా తయారు చేసేందుకు ఒక వ్యవస్థ ఉందని.. ఇది.. ఆ ఎంజైమ్ మొత్తం పనితీరునూ ప్రభావితం చేస్తోందని వీరు తెలుసుకున్నారు ఈ వ్యవస్థను నియంత్రించగలిగితే టెలీమోర్ల పొడవు తగ్గకుండా ఉంటుంది.. తద్వారా కణాలు.. మనమూ నిత్యయవ్వనంతో ఉండవచ్చునని అంచనా. -
వియ్యంకుడి కోసం విచిత్ర నైజం
- ఎన్నికల ముందు ఢోకా లేదన్నారు - అధికారం చేజిక్కాక వందల కుటుంబాలకు అన్యాయం - వియ్యంకుడికి పోలవరం కాలువ పనులు దక్కడమే కారణం - తమ స్వార్థం కోసం ఇంత మోసమా - భగ్గుమంటున్న బాధితులు సాక్షిప్రతినిధి, కాకినాడ :‘ఒడ్డు దాటే వరకూ ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడి మల్లన్న’ చందంగా తునిలో అ«ధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తుని నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యనమల కృష్ణుడు పోటీచేశారు. కృష్ణుడు గెలుపు కోసం ఆయనకు వరుసకు సోదరుడైన ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అప్పట్లో ఎడాపెడా హామీలు గుప్పించేశారు. అందులో తుని రూరల్ మండలం కుమ్మరిలోవ కాలనీ వాసులకు ఇచ్చిన హామీ కూడా ఉంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం కుమ్మరికాలువ కాలనీ తొలగించాలని ప్రతిపాదించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ కాలనీకి వచ్చిన సోదరులు తెలుగుదేశం పార్టీకి పట్టకండితే కాలనీ తొలగించాల్సిన అవసరం లేకుండా ఎలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ కాలనీలో 500 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. కాలనీ చెక్కు చెదరదన్న యనమల సోదరులు ఇచ్చిన హామీ అమలు చేస్తారనే నమ్మకంతో ఇంతకాలం ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రామకృష్ణుడు ఆర్థిక మంత్రి అయ్యారు. ఇక తమ కాలనీకి ఏ ఢోకా ఉండదని భావించారు. అధికారంలోకి వచ్చాక... ఎన్నికలైపోయి టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.కుమ్మరిలోవ వాసులకు ఇచ్చిన హామీ అమలు చేయాలంటే అమాత్యునికి బంధుత్వం అడ్డువచ్చింది. కాలనీ తొలగించకుండా చూస్తామన్న హామీ ఓ పక్క, స్వయానా రామకృష్ణుడి వియ్యంకుడుకి పోలవరం ఎడమ కాలువ పనుల టెండర్ దక్కడంతో కుమ్మరి కాలనీ వాసుల ఆశలు అడియాసలయ్యాయి. పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పరిధిలో 95–96 కిలోమీటర మధ్య కాలువ నిర్మాణానికి పెద్ద కొండ అడ్డంగా ఉంది. ప్రస్తుత ఎలైన్మెంట్ ప్రకారం కట్రాళ్లకొండ మీదుగా తాండవ నదిపై నుంచి షుగర్ ఫ్యాక్టరీ కొండపైకి 400 మీటర్లు ఆక్విడెక్టు నిర్మాణానికి కొండను తొలిచే పనులు మొదలు పెట్టారు. ఇందుకు రూ.40 కోట్లు పైనే ఖర్చు అవుతుంది. ఈ సందర్బంగా కంట్రాళ్లకొండ, కుమ్మరిలోవ కొండలను బాంబులతో పేల్చి మట్టిని తొలగించాలి. ఆ సందర్భంగా కొండపై నుంచి బండరాళ్లు కుమ్మరిలోవ కాలనీలో ఇళ్లపై పడి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకోసమే కాలనీ మొత్తాన్ని ఖాళీ చేయిస్తున్నామంటున్నారు. నష్టపరిహారంగా రూ.25 కోట్లు, దుద్దిక మెట్ట ప్రాంతంలో 27 ఎకరాలు భూసేకరణకు చేసి ఇళ్ల స్థలాలు, అక్కడ మౌలిక వసతులు కల్పనకు మరో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మొత్తంగా సుమారు రూ.100 కోట్లు వెచ్చించాలి. ఇలా చేస్తే ఎవరికీ నష్టం ఉండదు... ఎలైన్మెంట్ మారిస్తే తమకు ప్రయోజనం ఉంటుందని కుమ్మరిలోవ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. కుమ్మరిలోవ కాలనీ కొండ ప్రారంభంలో ఎడమవైపు నుంచి నేరుగా తాండవ నదిపై నుంచి షుగర్ ఫ్యాక్టరీ కొండపైకి 800 మీటర్ల నుంచి కిలో మీటరు మేర ఆక్విడెక్టు నిర్మిస్తే కాలనీవాసులను తరలించాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఇందుకు రూ.70 నుంచి రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఖర్చు కూడా తక్కువ అవుతుందంటున్నారు. ఆర్థిక మంత్రి యనమలకున్న పలుకుబడి ముందు ఈ ఎలైన్మెంట్ మార్పు పెద్ద విషయం కానేకాదంటున్నారు. కానీ స్వయానా వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పనులు చేపడుతుండటంతో ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని మంత్రి యనమల గాలికొదిలేశారని కుమ్మరిలోవ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందేమో కాలనీకి ఏమీ ఇబ్బంది కలగకుండా చూస్తామని నమ్మించి ఇప్పుడు కాలనీని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. కేవలం వియ్యంకుడు చేస్తున్న పనులకు ప్రతిబంధంక కలిగించకూడదనే ఏకైక లక్ష్యంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి కాలనీని ఖాళీ చేయిస్తున్నారని, తమకు ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నారు. పనులు చేస్తున్నది మంత్రి వియ్యంకుడు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు కూడా పెదవి విప్పడం లేదు. 1986లో టీడీపీ ప్రభుత్వంలో ఇదే మంత్రి రామకష్ణుడు హాయంలోనే కుమ్మరిలోవ కాలనీలో బలహీనవర్గాలకు ఇళ్లు నిర్మించడం గమనార్హం. స్థానికులంతా కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే వారే. అయినా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు కన్నీరుపెట్టుకుంటున్నారు. తునిలో కృష్ణుడుని ఓడించారనే అక్కసుతోనే ఇచ్చిన హామీని గాలికొదిలేసి తమను రోడ్డున పడేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘పోలవరం’ పనులు ప్రాణాంతకం
కుమ్మరిలోవ కాలనీపై పడిన కాలువ బండరాళ్లు తృటిలో తప్పిన పెనుప్రమాదం ఆందోళనలో స్థానికులు తాత్కాలికంగా పనులు నిలిపివేత తునిరూరల్ : తుని మండలం కుమ్మరిలోవ కాలనీని ఆనుకుని ఉన్న కొండపై నుంచి తాండవ నదిమీదుగా నిర్మించనున్న పోలవరం ఎడమ కాలువ అక్విడెక్ట్ పనులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలు వెళ్లేందుకు వీలుగా కొండపై రహదారి ఏర్పాటు చేస్తుండగా మంగళవారం బండరాయి అదుపు తప్పి కిందకు దొర్లివచ్చింది. ఈ బండరాయి కొండ దిగువన ఉన్న గోగాడ పైడితల్లి ఇంటి ప్రధాన గోడను ధ్వంసం చేసింది. ఈ ఘటనతో తమ వంటింట్లో సామాన్లు ధ్వంసమయ్యాయని బాధితురాలు బుధవారం వాపోయింది. పాఠశాల నుంచి పిల్లలు రాకపోవడంతో పెద్దప్రమాదం తప్పిందని, వారు వచ్చుంటే ఆ ప్రాంతంలోనే ఆడుకునేవారని ఆందోళన వ్యక్తం చేసింది. 20 అడుగులు ఎత్తునుంచి ఈ బండరాయి పడిందని, కాంట్రాక్టర్ సిబ్బంది వచ్చి పరిశీలించి పనులు నిలిపివేసినట్టు ఆమె వివరించింది. పగుళ్లిచ్చిన ఇంటి గోడ, బండరాయిని ఆమె విలేకరులకు చూపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఎవరూ లేరు. ఇటీవల పనులు చేసేందుకు పీఎస్‌కె, హెచ్‌ఈఎస్ (జాయింట్ వెంచర్)కు అప్పగించారు. కాలనీ ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా నష్టపరిహారం ఇవ్వలేదని, పనులు చేస్తున్నట్టు కనీస సమాచారం ఇవ్వలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించగానే పనులు నిలిపివేశారన్నారు. ప్రాథమిక పనులు చేస్తేనే తీవ్రత ఇలా ఉంటే ప్రధాన పనులు చేస్తే ఏవిధంగా ఉంటుందోనని స్థానికులు భీతిల్లుతున్నారు. -
అస్తవ్యస్తంగా సాగర్‌కాలనీలు
నాగార్జునసాగర్ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సాగర్‌లోని వివిధ కాలనీల్లో గల వీధులన్నీ బురదమయంగా మారాయి. డ్రెయినేజీ నిర్మాణాల పేరుతో ఇటీవల రోడ్లన్నీ తవ్వారు. మరలా వాటిని సరిగ్గా నిర్మించకపోవడంతో గుంతలమయంగా తయారయ్యాయి. వీటిపై వాహనాలు తిరుగుతుండడంతో మరీ అధ్వానంగా మారాయి. ఫలితంగా చిన్నపాటి వర్షమెుచ్చినా చిత్తడిగా తయారై వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇదేకాక గుంతల్లో వర్షం నీరు రోజుల తరబడి నిలిచి ఉండడంతో కంపు వాసన వస్తోందని వివిధ కాలనీవాసుల వాపోతున్నారు. ముఖ్యంగా పైలాన్‌కాలనీలోని మత్స్యకారులు నివాసముండే వీదంతా వర్షాలకు చేపలమడుగులా మారింది. ఎప్పుడో పోసిన కంకరంతా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోగా రోడ్డంతా గుంతలే దర్శనమిస్తోంది. నీరుగారుతున్న ప్రభుత్వ క్వార్టర్లు సాగర్‌లోని పైలాన్ కాలనీలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ క్వార్టర్లన్నీ శిథిలావస్థకు చే రుకున్నాయి. భవనాల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. వర్షం వచ్చినప్పుడు గదుల్లోకి నీరు కారుతుండడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థతి దాపురించిందని అందుల్లో నివాసముండే వారు పేర్కొంటున్నారు. దీంతో సమానులన్నీ ఒకదగ్గరకు చేరి వేరే ప్రాంతాల్లో నివాసముంటున్నామని పలువురు తెలిపారు. మరమ్మతులు చేసుకున్న వారి క్వార్టర్లు కొంతమేర బాగున్నప్పటికీ మరమ్మతులు చేయని క్వార్టర్లు కొన్ని కూలిపోగా మరికొన్ని నీరు కారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు అధికారులు ఆయా కాలనీలను పర్యవేక్షించి సీసీ రోడ్లు వేయించాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ రోడ్డు వేయాలి– కోదండం, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మత్స్యకారులు నివాసమంటున్న ఈవీధిలో రోడ్డంతా వర్షాలకు కొట్టుకుపోయింది. ఇళ్లముందు బురద గుంటలు ఏర్పడి మడుగుల్లా దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు అధికారులు స్పందించి సీసీ రోడ్లు వేయించాలి. లేదంటే జనం రోగాలబారిన పడతారు. -
లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
నిందితుడిపై కాలనీవాసుల ఆగ్రహం కాలనీలో పోలీసు పికెట్ అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన మైనర్ మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి చేసి పరారైన అదే కాలనీకి చెందిన కొప్పనాతి సతీష్‌ను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. డీఎస్పీ లంక అంకయ్య పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడు సతీష్‌ను ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. అచేతనంగా ఉండే ఆ మానసిక వికలాంగ బాలికపై 23 ఏళ్ల సతీష్ ఈనెల 27వ తేదీ తెల్లవారు జామున లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈదరపల్లి వంతెన వద్ద సతీష్‌ను ఉదయం అరెస్ట్ చేశామన్నారు. బాధిత బాలికను మరింత మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఆ దుర్మార్గుడిని మాకు అప్పగించండి కాగా నిందితుడు సతీష్‌ను తమకు అప్పగించాలంటూ మున్సిపల్ కాలనీవాసులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసి కాలనీవాసులు బుధవారం రాత్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఒక దశలో లాఠీలకు పనిచెప్పారు. ఈ మేరకు సీఐ శ్రీనివాస్ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటుచేసి, సతీష్‌తో పాటు అతని కుటుంబీకులకు పోలీసులు రక్షణ కల్పించారు. -
పడకేసిన జంగాల కాలనీ
డెంగీ లక్షణాలతో 20 మందికి తీవ్ర జ్వరాలు పారిశుద్ధ్య నివారణ చర్యలు మృగ్యం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కత్తిపూడి శివారు జంగాల కాలనీలో సుమారు 20 మంది డెంగీ లక్షణాలతో మంచానపడ్డారన్న విషయం కలకలం రేపింది. సుమారు 200 మంది బుడగ జంగాలకు చెందినవారు నివసించే ఈ కాలనీలో కొన్నాళ్లుగా పారిశుద్ధ్య నిర్వహణ జరగడం లేదు. దోమల బెడద అధికమై ప్రజలు అల్లాడుతున్నారు. ఫలితంగా ప్రాణాంతక వ్యాధులు అక్కడ ప్రబలుతున్నాయి. – కత్తిపూడి (శంఖవరం) జంగాల కాలనీలో శనివారం రాత్రి కొందరికి జ్వరాలు సోకడంతో మంచాన పడ్డారు. వీరిలో మోతు రాంబాబు 15 ఏళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, అతడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇతడికి డెంగీ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారని కాలనీవాసులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాలనీవాసులు స్థానిక ఆర్ఎంపీలను ఆశ్రం¬ంచారు. వ్యాధి తీవ్రరూపం దాల్చి ఆదివారం ఉదయానికి మరో 20 మంది జ్వరాల బారిన పడినట్టు కాలనీవాసులు గుర్తించి, శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి పీహెచ్సీ వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. పంచాది గంగాభవాని, మోతు కుమారికి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు జరపడంతో టైఫాం¬డ్ సోకినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. పంచాది నూకరత్నం, భద్రాద్రి రాజేశ్వరి, మోతు రాజులమ్మ, మోతు గంగ జ్వరాలతో బాధపడుతున్నారు. హుటాహుటిన పారిశుద్ధ్య చర్యలు శనివారం రాత్రి జంగాల కాలనీలో అనేకమంది జ్వరాల బారిన పడ్డారని తెలియడంతో, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టారు. ముగ్గులు వేసినట్టుగా బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారని స్థానికులు ఆరోపించారు. శంఖవరం పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి ఎన్ దయానందరావు ఆధ్వర్యంలో వైద్య బృందం శిబిరం ఏర్పాటు చేసింది. సుమారు 38 మందికి రక్తపూత నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపారు. మోతు కుమారి, పంచాది గంగాభవానికి టైఫాం¬డ్ జ్వరాలు సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. జ్వరాలు సోకిన నలుగురినీ శంఖవరం పీహెచ్‌సీకి తరలించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జ్వరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరో రెండు రోజులు వైద్య శిబిరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
కాలనీలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ
ౖయెటింక్లయిన్‌కాలనీ : గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టివినాయకులనే పూజించాలని కోరుతూ ఆర్జీ–2 యాజమాన్యం ఆధ్వర్యంలో ౖయెటింక్లయిన్‌కాలనీలో శనివారం పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సింగరేణి స్కూల్ చౌరస్తా నుంచిlషిర్కేబస్టాప్ వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఆర్జీ–2 జీఎం విజయపాల్‌రెడ్డి, ఎస్‌టూ జీఎం రవీందర్, ఎన్విరాన్మెంట్ అధికారి రాజారెడ్డి, యూనియన్ నాయకులు ఐలి శ్రీనివాస్, నాచగోని దశరథంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్టు ఇలా.. రాకపోకలు ఎలా..!
డిచ్పల్లి : మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలోని ఉపాధ్యాయుల కాలనీలో సుమారు రెండు నెలల క్రితం కల్వర్టు పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన స్థలం చుట్టూ రాళ్లు పెట్టి ఇలా వదిలేశారు. దీంతో కాలనీవాసులు రాపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు కల్వర్టు నీటితో నిండిపోయి ఇక్కడ ఉన్న డ్రైనేజీ కనిపించకపోవడంతో ఇద్దరు ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక సర్పంచ్‌కు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏదైనా జరగక ముందే స్పందించి వెంటనే కల్వర్టుకు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
కల్వర్టు ఇలా.. రాకపోకలు ఎలా..!
డిచ్పల్లి : మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలోని ఉపాధ్యాయుల కాలనీలో సుమారు రెండు నెలల క్రితం కల్వర్టు పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన స్థలం చుట్టూ రాళ్లు పెట్టి ఇలా వదిలేశారు. దీంతో కాలనీవాసులు రాపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు కల్వర్టు నీటితో నిండిపోయి ఇక్కడ ఉన్న డ్రైనేజీ కనిపించకపోవడంతో ఇద్దరు ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక సర్పంచ్‌కు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏదైనా జరగక ముందే స్పందించి వెంటనే కల్వర్టుకు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ౖయెటింక్లయిన్‌కాలనీ : సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించి మాట నిలబెట్టుకున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి గురువారం టీబీజీకేఎస్ నాయకులు తెలంగాణ చౌరస్తాలో పాలతో అభిషేకం చేశారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సకలజనుల సమ్మెలో పాల్గొన్న వారందరికీ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సింగరేణి కార్మికులకు వేతనాలు అందజేసిన గొప్ప నాయకడన్నారు. కార్యక్రమంలో డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్ మందల కిషన్‌రెడ్డి, టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, నాయకులు మురళి, స్వామి, కొండం నారాయణ, మోతీలాల్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చిత్రపురి కాలనీ వాసులపై వరాల జల్లు
హైదరాబాద్: నగరంలోని చిత్రపురి కాలనీ వాసులపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌లు గురువారం వారాల జల్లు కురింపించారు. చిత్రపురి కాలనీని సందర్శించిన మంత్రులు కాలనీలోని అనేక సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రహదారుల మరమ్మతులకు రూ. కోటిన్నర కెటాయించడంతో పాటు త్వరలోనే అర్బన్ అసుపత్రిని కాలనీలో నిర్మించనున్నట్లు హామీ ఇచ్చారు. కాలనీ వాసులకు ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాలనీకి సరైన బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో.. రేపటి నుండి బస్సు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిత్రపురి కాలనీకి ఆనుకొని ఉన్న 10 ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి కాలనీ వాసులకు ప్రయోజనకరంగా ఉండేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యున్నత ఫిలిం ఇండస్ట్రీగా తీర్చిదిద్దుతామని మంత్రులు పేర్కొన్నారు. -
అభివృద్ధా.. కనపడదే?
మార్క్సనగర్, సాయిమాణిక్నగర్ సిద్ధార్థనగర్, సంజీవ్‌నగర్ తదితర కాలనీలలో ఎటుచూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. దారిగుండా ముక్కుమూసుకొని దాటడమే కానీ ఎవరూ ఈ మురికిని పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల సమయంలో అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, వార్డు కౌన్సిలర్లు సైతం హామీలు గుప్పించి.. అధికారంలోకి వచ్చాక కాలనీ వైపే చూడడం మానేశారు. - కాలనీలలో అన్నీ సమస్యలే.. - కనీస వసతులు ఉండవు - అధికారులకు అసలే పట్టదు.. - పాలకులు పట్టించుకోరు.. సంగారెడ్డి మున్సిపాలిటీ: సాయిమాణిక్ నగర్.. ఈ కాలనీ ఎక్కడో మూలన లేదు. ప్రధాన రహదారికి కేవలం 500 మీటర్ల దూరంలోనే కాలనీ ఉంది. ఈ కాలనీలో బ్యాంక్, పరిశ్రమలకు చెందిన ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ అభివృద్ధి జాడే లేదు. కౌన్సిలర్‌గా గెలుపొంది ఏడాది పూర్తయినా.. ఏ ఒక్కరోజూ కాలనీ పరిస్థితిని కౌన్సిలర్ పరిశీలించిన పాపానపోలేదు. సమస్యల పట్ల పలు మార్లు అధికారులకు.. కౌన్సిలర్లకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. మార్స్స్నగర్, సిద్దార్థనగర్, సంజీవ్నగర్లలో సైతం సమస్యలు తిష్టవేసినా.. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర బలహీనవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. ఈ కాలనీలో కనీసం మురికికాల్వలు లేకపోయాయి. ఇక్కడున్నవారంతా ఓపెన్డ్రైనేజ్ పద్ధతినే అవలంభిస్తున్నారు. దీంతో వర్షకాలం వచ్చే వరదనీటితో పాటు డైనేజీలో నుంచి ముక్కుపుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. కానీ ఇంతవరకు మురికికాల్వలు నిర్మించలేకపోయారు. సాయిమాణిక్ నగర్లో సైతం డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేనందున గోకుల్ వెంకటేశ్వర ఆస్పత్రి నుంచి వచ్చే మురికి నీరు కాలనీల మధ్య వచ్చి నిల్వ ఉంటుంది. దీంతో పందులు సంచరిస్తున్నాయి. దీనికి తోడు కచ్చాకాల్వలు కూడా లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడే మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. పట్టణంలో గతేడాది డెంగీవ్యాధి వచ్చిన వారిలో అధికంగా ఈ కాలనీ వారే ఉండటం గమనార్హం.. అధికారులు అన్ని కాలనీలను అభివృద్ధి చేశాం అని చెబుతున్నా.. ఈ కాలనీలో మాత్రం ఒక్క అడుగు మురికి కాల్వలు కూడా నిర్మించలేకపోయారు. ఈ కాలనీలో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. నెల రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఈ కాలనీ చెత్తకాలనీగా తయారైంది. కాలనీలో మురికికాల్వలు, వీధిదీపాలు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోయాయి. ప్రతిపాదనలు పంపాం.. మార్క్సనగర్, సాయిమాణిక్నగర్ లో.. ఇటీవల 13 ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్ ఫండ్ నుంచి మురికికాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగింది. రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే త్వరలోనే పనులు చేపడతామన్నారు.. - గయాసొద్దీన్, మున్సిపల్ కమిషనర్ -
రాత్రికి రాత్రే కాలనీ అంతా బుగ్గి
మచిలీపట్నం (కృష్ణా జిల్లా): అగ్ని ప్రమాదంలో ఓ కాలనీ మొత్తం బూడిదై పోయింది. పదిమందికి పైగా గాయాలపాలయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మంగినపూడి బీచ్ వద్ద వైఎస్ ఆర్ కాలనీలో గురువారం రాత్రి ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగినపూడి బీచ్ వద్ద వైఎస్సార్ ఫిషర్ కాలనీలో సుమారు 250 వరుకు గుడిసెలు ఉన్నాయి. సముద్రంలో చేపల వేట ద్వారా జీవనం సాగించే మత్స్యకారులు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ నుంచి వలస వచ్చిన కార్మికులు. అయితే, చేపల వేటపై నిషేధంతో వీరిలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఉప్పాడు వెళ్లారు. కొద్ది మంది మాత్రమే ఇళ్లలో ఉన్నారు. గురువారం రాత్రి ఈ కాలనీలో ఒక్కసారిగా మంటలు లేవగా... అన్నీ గుడిసెలే కావడంతో స్వల్ప వ్యవధిలోనే మొత్తం తగలబడిపోయాయి. అవనిగడ్డ, పామర్రు, బంటుమిల్లి, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి ఐదు అగ్ని మాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఉన్న కొందరు కొన్ని వస్తువులను తీసుకుని క్షేమంగా బయటకు రాగా, కొందరు మాత్రం పోయిన బంగారు వస్తువుల కోసం గాలించిన పరిస్థితి కనిపించింది. ఆస్తి నష్టంపై అధికారులు ఇంకా అంచనాకు రాలేదు. ప్రమాద స్థలిని ఆర్డీవో సాయిబాబు, తహశీల్దారు నారదముని, డీఎస్పీ శ్రవణ్‌కుమార్ పరిశీలించారు. -
కథ్పుత్లీ కాలనీని ఖాళీ చెయ్యం
న్యూఢిల్లీ: దశబ్దాల కాలంగా నివసిస్తున్న క థ్పుత్లీ కాలనీని ఖాళీ చేసేదేలేదని స్థానిక బొమ్మల తయారీదారులు, జానపద కళాకారులు చెబుతున్నారు. ఈ కాలనీని ఖాళీ చేసి మరోచోటుకు వెళ్లాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో స్థానిక పెద్దలు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు వ్యక్తులకు ఈ కాలనీని కట్టబెట్టాలని చూస్తున్నారని, దశాబ్దాల కాలంగా ఇక్కడే ఉంటు, ఇక్కడే పుట్టిపెరిగిన తాము మరోచోటుకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు. 2009 ప్రణాళిక ప్రకారం ఈ కాలనీలోని కళాకారులను తాత్కాలికంగా మరోచోటుకు తరలించి, నాలుగేళ్లలో ఇక్కడ ఫ్లాట్లు సిద్ధం చేయాలనేది అధికారుల వ్యూహంగా కనిపిస్తోందని, ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్నవారిని ఆనంద్ ప్రభాత్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలోకి తరలిస్తారని చెబుతున్నారని, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమాధానమే లేదన్నారు. తాము ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నామని, ఇప్పుడు ఖాళీ చేసి, నాలుగు కిలోమీటర్ల దూరం తాత్కాలికంగా, ఆ తర్వాత మరెక్కడికో వెళ్తే వారి చదువులు సాగేదెలాగని స్థానిక వ్యక్తి దిలీప్ భట్ ప్రశ్నించారు. భూమి విషయంలో అధికారులు అబద్ధమాడుతున్నారు. బిల్డర్ల కోసం భూమి అందుబాటులో ఉందని మొదట చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. -
నేటినుంచి కార్మికుల సమ్మె తీవ్రతరం
-
వీధివీధిలో కంపు
ఎక్కడి చెత్త అక్కడే కంపుకొడుతున్న రహదారులు, కాలనీలు నేటినుంచి కార్మికుల సమ్మె తీవ్రతరం ముషీరాబాద్/కవాడిగూడ,న్యూస్‌లైన్: కనీస వేతనం రూ.16,500, మధ్యంతరభృతి ఇవ్వాలని,ఉద్యోగులకు ఆరోగ్య కార్డులివ్వాలన్న తదితర డిమాండ్లతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకపోయింది. గతవారం రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి. గుట్టలుగుట్టలుగా చెత్త పేరుకపోవడంతో దాన్ని తీసేవారే కరువయ్యారు. కాగా పారిశుద్ద్య కార్మికులు గత వారంరోజులుగా సమ్మె చేస్తుంటే... నేటి నుంచి అదే సమస్యపై మరో పది కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. కాకుంటే కనీస వేతనం ఎంత ఉండాలనే అంశంపై ఈ సంఘాల మధ్య వ్యత్యాసం ఉంది. టీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘం రూ.16,500 కనీస వేతనం ఉండాలంటుంటే..సీఐటీయూ, ఇతర సంఘాలు రూ.12,500 ఉండాలనిడిమాండ్ చేస్తున్నాయి. భారీ ర్యాలీ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తా నుంచి వీఎస్టీ వరకూ పారిశుద్ధ్య కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ వేతనాలు పెంచుతామని, డీఏ, మధ్యంతరభృతి, పార్ట్‌టైం స్వీపర్లను పూర్తికాలం కార్మికులుగా గుర్తిస్తామని జీవో విడుదల చేసి ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటినుంచి 10 కార్మిక సంఘాలతో కలిసి సమ్మెను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. 12న మున్సిపల్ కార్మికుల గర్జన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహిస్తామని ప్రకటించారు.