సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
Published Thu, Aug 4 2016 10:38 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM
ౖయెటింక్లయిన్‌కాలనీ : సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించి మాట నిలబెట్టుకున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి గురువారం టీబీజీకేఎస్ నాయకులు తెలంగాణ చౌరస్తాలో పాలతో అభిషేకం చేశారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సకలజనుల సమ్మెలో పాల్గొన్న వారందరికీ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సింగరేణి కార్మికులకు వేతనాలు అందజేసిన గొప్ప నాయకడన్నారు. కార్యక్రమంలో డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్ మందల కిషన్‌రెడ్డి, టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, నాయకులు మురళి, స్వామి, కొండం నారాయణ, మోతీలాల్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement