abishekam
-
తిరుమలలో శాస్రోక్తంగా శ్రీవారి చక్రస్నానం
సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం శాస్రోక్తంగా జరిగింది. అనంత పద్మనాభ వ్రతంలో భాగంగా ఈ వైదికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5.45 గంటలకు సుదర్శన చక్రతాళ్వారును ఆలయ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అక్కడ ఆగమోక్తంగా సుదర్శన చక్రతాళ్వారుకు అభిషేకం, పూజలతో చక్రస్నానం పూర్తి చేశారు. అనంతరం ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద అనంత పద్మనాభస్వామి వ్రతం పట్టుదారాలు (కంకణాలు) ఉంచి అర్చన, ఇతర పూజా కైంకర్యాలు చేశారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ద్వాదశి, అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా మాత్రమే పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. -
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
ౖయెటింక్లయిన్కాలనీ : సకల జనుల సమ్మె వేతనాలు చెల్లించి మాట నిలబెట్టుకున్నారని పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి గురువారం టీబీజీకేఎస్ నాయకులు తెలంగాణ చౌరస్తాలో పాలతో అభిషేకం చేశారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సకలజనుల సమ్మెలో పాల్గొన్న వారందరికీ వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సింగరేణి కార్మికులకు వేతనాలు అందజేసిన గొప్ప నాయకడన్నారు. కార్యక్రమంలో డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, కార్పొరేటర్ మందల కిషన్రెడ్డి, టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, నాయకులు మురళి, స్వామి, కొండం నారాయణ, మోతీలాల్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.