పుష్కరిణిలో చక్రస్నానం
సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం శ్రీవారి చక్రస్నానం శాస్రోక్తంగా జరిగింది. అనంత పద్మనాభ వ్రతంలో భాగంగా ఈ వైదికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 5.45 గంటలకు సుదర్శన చక్రతాళ్వారును ఆలయ వీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్ద వేంచేపు చేశారు. అక్కడ ఆగమోక్తంగా సుదర్శన చక్రతాళ్వారుకు అభిషేకం, పూజలతో చక్రస్నానం పూర్తి చేశారు. అనంతరం ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద అనంత పద్మనాభస్వామి వ్రతం పట్టుదారాలు (కంకణాలు) ఉంచి అర్చన, ఇతర పూజా కైంకర్యాలు చేశారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ద్వాదశి, అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా మాత్రమే పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.