కల్వర్టు ఇలా.. రాకపోకలు ఎలా..!
డిచ్‌పల్లి : మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లిలోని ఉపాధ్యాయుల కాలనీలో సుమారు రెండు నెలల క్రితం కల్వర్టు పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన స్థలం చుట్టూ రాళ్లు పెట్టి ఇలా వదిలేశారు. దీంతో కాలనీవాసులు రాపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు కల్వర్టు నీటితో నిండిపోయి ఇక్కడ ఉన్న డ్రైనేజీ కనిపించకపోవడంతో ఇద్దరు ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక సర్పంచ్‌కు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏదైనా జరగక ముందే స్పందించి వెంటనే కల్వర్టుకు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.