roof
-
నడక చైర్‌లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో!
ఇంటర్నెట్లో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో కంబోడియాకు చెందినది. ఒక మహిళ తమ ఇంటి పైకప్పు కూలిపోతున్న సమయంలో తన పిల్లవాడిని ఎలా కాపాడిందనేది ఈ వీడియోలో ఉంది. కొన్ని సెకెన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కన్నుతిప్పుకోనీయకుండా చేస్తోంది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన రాజధాని నోమ్ పెన్హ్‌లో చోటుచేసుకుంది. వీడియో ఉన్న కంటెంట్ ప్రకారం పిప్‌సర్ అనే మహిళ ఒక పిల్లవాడిని ఎత్తుకుని కనిపిస్తుంది. గదిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారు. ఆ తల్లికి ఏదో శబ్ధం వినిపించగానే ఇద్దరు పిల్లలతో సహా బయటకు పరిగెడుతుంది. అయితే ఇంకో పిల్లాడు అక్కడే నడక చైర్లో ఉంటాడు. ప్రమాదాన్ని గ్రహించిన ఆమె ఆ నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కూడా లాక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోతుంది. ఆ తల్లి నడకచైర్‌లో ఉన్న పిల్లవాడిని కాపాడటంలో ఒక్క క్షణం జాప్యం చేసినా, ఆ పసిపిల్లవాడు ప్రమాదం బారిన పడేవాడని వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పిల్లవాడిన కాపాడిన ఆ తల్లి ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ఇంటిపై కప్పు మా మీద పడితే మేం చనిపోయేవాళ్లం. అందుకే మేము పరుగుపరుగున వచ్చేశాం అని తెలిపారు. ఇంటి యజమాని మీడియాతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం జరిగినప్పుడు వాటర్ ప్రూఫింగ్ సరిగా జరగలేదని, ఇప్పుడు కుర్తుస్తున్న భారీ వర్షాలకు ఇంటిపైకప్పు కుంగిపోయి, పడిపోయిందని తెలిపారు. నిర్మాణం సరిగా లేకపోవడం వలనే ఇలా జరిగిందన్నారు. అందుకే ఎవరైనా ఇంటిని కొనుగోలు చేసేముందు అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి: భారత్, పాక్‌లను కలిపిన కేంబ్రిడ్జ్ స్నేహం.. గత 31 ఏళ్లుగా.. The #ceiling of a residence in Phnom Penh, #Cambodia, #collapsed in the living room. Luckily, the #mother inside the house acted quickly, picking up one child with one hand and holding a school bicycle having another child with the other. All her children were saved in the end. pic.twitter.com/aK9wXVsTvW — Warm Talking (@Warm_Talking) July 18, 2023 -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్‌రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్‌రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్‌రూఫ్ విధానాన్ని ఆప్షన్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్‌రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలౖమెన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనిసరని చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్‌రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్‌రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్‌రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్‌రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. -
ఏపీ సచివాలయం టాప్ ఎగిరిపోయింది
-
తెల్లగా.. ఇల్లు చల్లగా..
వాతావరణం వేడెక్కుతోంది.. ఏటికేడాదీ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పట్టణాల కాంక్రీట్ జనారణ్యంలో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. ఇంటికంటే ఏసీలున్న ఆఫీసే వేసవి ‘విడిది’గా మారిపోతున్న పరిస్థితి వస్తోంది. ఇలాంటి సమయంలో సామాన్యుల పరిస్థితి మరింత దారుణం కదా! కానీ శాస్త్రవేత్తలు మాత్రం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇంట్లో అయినా చల్లదనాన్ని పొందవచ్చని చెబుతున్నారు. వేసవికి ముందే.. ఇళ్ల పైకప్పుపై సున్నం లేదా తెలుపు రంగు వేయిస్తే చల్లగా ఉంటుందని అంటున్నారు. పైకప్పులపై తెల్లటి సున్నపు పూత పూస్తే ఇల్లు ఎలా చల్లబడుతుంది? చాలా సింపుల్.. సూర్య కిరణాల రూపంలో ఇంటి పైకప్పులను తాకే వేడిని తెలుపురంగు 80 శాతం వరకు పరావర్తనం చెందిస్తుంది. అంటే పైకప్పు వేడవడం తగ్గుతుంది. దానివల్ల ఇంట్లోకి ప్రవేశించే వేడి తగ్గి.. చల్లగా ఉంటుంది. పెద్ద పెద్ద భవనాలపై.. ఆ మాటకొస్తే దేశం మొత్తమ్మీద దీనిని అనుసరిస్తే.. నగరాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వంటి వాటి వినియోగం తగ్గి విద్యుత్ బిల్లుల మోత గణనీయంగా తగ్గుతుందని... ఈ మొత్తం పదేళ్లలో కొన్ని వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని హైదరాబాద్‌లోని ఐఐటీ, అమెరికాకు చెందిన లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీలు ఇప్పటికే తేల్చిచెప్పాయి! దేశంలో ఏటా 700 గిగావాట్ల వరకు విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చని పేర్కొంటున్నాయి. పైకప్పులకు సున్నం, తెల్ల రంగు వేయడమే కాదు.. వినైల్ ప్లాస్టిక్ కూడా వేడిని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వినైల్ ప్లాస్టిక్‌తోనూ చల్లదనం మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూల్ రూఫ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో పైకప్పులను తెల్లగా మార్చే పని యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం దక్షిణ అమెరికాలోని పెరూలో కొండ ప్రాంతాల్లోని భారీ పరిమాణంలోని రాళ్లకు తెల్లరంగు వేశారు. మన దేశంలోనూ ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూల్ రూఫింగ్ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోనూ నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ అనే సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కీ) వంటి సంస్థలతో కలసి ఇటీవల ఓ పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. డ్యూపాంట్ కంపెనీ సరఫరా చేసిన ప్రత్యేమైన ప్లాస్టిక్ షీట్లను నిరుపేదలు నివసించే 25 ఇళ్లపైకప్పులపై బిగించి పరిశీలించింది. ఆ ఇళ్ల లోపలి ఉష్ణోగ్రతలను పరిశీలించినప్పుడు రెండు డిగ్రీల వరకూ తక్కువగా ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ప్లాస్టిక్ షీట్లు మాత్రమే కాదు.. హోర్డింగుల్లో వాడే వినైల్ తెరలను రీసైకిల్ చేసి పేదల ఇళ్లను చల్లగా ఉంచేందుకు వినియోగించవచ్చని ఎన్ఆర్డీసీ ప్రతినిధి అమర్త్య అవస్తి తెలిపారు. త్వరలోనే దీనిని విస్తృత స్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. వినైల్ తెరలను కొంచెం ఖాళీతో రెండు పొరలుగా వేసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలూ కల్పించుకుంటే మేలు కూల్ రూఫ్ టెక్నాలజీ వాడకం విస్తృతమైతే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడం ప్రభుత్వాలకు కొంతవరకూ సులువు అవుతుంది. అందువల్ల దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. భవన నిర్మాణానికి సంబంధించిన నిబంధనల్లో కూల్ రూఫింగ్ టెక్నాలజీని చేర్చడం ద్వారా అటు విద్యుత్‌ను సమర్థంగా వాడుకోవడమే కాకుండా పేద, మధ్య తరగతి ప్రజలను పలు ఆరోగ్య సమస్యల నుంచి కాపాడేందుకూ వీలు కలుగుతుంది. అయితే కూల్ రూఫింగ్ వల్ల వ్యక్తిగతంగా విద్యుత్ బిల్లులలో తగ్గుదల చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపోవడం వల్ల జనంలో ఆసక్తి తక్కువగా ఉండే అవకాశముంది. ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు (విస్తీర్ణం ఆధారంగా) నిర్బంధంగా కూల్‌రూఫ్ టెక్నాలజీని వాడేలా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. -
సోలార్ ప్యానెలే ఇక రూఫ్
విశాక ఇండస్ట్రీస్ నుంచి ‘ఆటమ్’ మిర్యాలగూడలో 60 మెగావాట్ల ప్లాంటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్ తాజాగా సోలార్ విపణిలోకి ప్రవేశించింది. ఆటమ్ పేరుతో సోలార్ రూఫింగ్ సిస్టమ్స్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. సంప్రదాయ రూఫింగ్ సిస్టమ్స్‌కు భిన్నంగా భారత్‌లో తొలిసారిగా వినూత్న డిజైన్‌తో వీటిని రూపొందించింది. ఫైబర్ సిమెంటు బోర్డుకు సోలార్ సిస్టమ్‌ను జోడించడంతో సోలార్ ప్యానెలే రూఫ్‌గా మారిపోయింది. దీని మందం కేవలం 12 మిల్లీమీటర్లు. చదరపు అడుగుకు ధర రూ.700గా నిర్ణయించామని విశాక జేఎండీ జి.వంశీకృష్ణ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆటమ్ జీవిత కాలం 25 ఏళ్లని చెప్పారు. ఏడాదిన్నరపాటు పరిశోధన చేసిన అనంతరం వీటిని విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదార్లను తొలుత లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. నూతనంగా నిర్మించే గృహాలకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మూడు నెలల్లో ప్లాంటు.. సోలార్ ప్యానెళ్ల తయారీకి నల్గొండ సమీపంలోని మిర్యాలగూడ వద్ద ప్లాంటును నిర్మిస్తున్నట్టు వంశీకృష్ణ తెలిపారు. ‘60 మెగావాట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్లాంటుకై తొలి దశలో రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాం. ఉత్పాదనకు పేటెంటు దాఖలు చేశాం. పర్యావరణానికి ఇది అనుకూలమైంది. మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం. ఆటమ్‌ను విదేశాలకూ ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు. పశ్చిమ బెంగాల్లో వి–బోర్డుల తయారీ ప్లాంటు 2019లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశాక ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ జి.వివేకానంద్ తెలిపారు. హర్యానాలోని జజ్జర్ వద్ద రూ.100 కోట్లతో నిర్మిస్తున్న మూడో ప్లాంటు వచ్చే ఏడాది మార్చికల్లా సిద్ధం అవుతుందని చెప్పారు. కాగా, ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీఈవో జి.వి.ప్రసాద్, విశాక ఎండీ సరోజ వివేకానంద్ పాల్గొన్నారు. -
మట్టిమిద్దె కూలి వృద్ధురాలి దుర్మరణం
బండిఆత్మకూరు : మండల కేంద్రంలో మట్టిమిద్దె కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఎస్ఐ విష్ణునారాయణ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటమ్మ(89)కు ఒక కుమారుడు నాగన్నతో పాటు నలగురు మనువరాళ్లు ఉన్నారు. వారందరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే వెంకటమ్మ కొద్ది రోజుల క్రితం మనువరాలైన రాజేశ్వరి ఇంట్లో ఉండేది. అయితే వెంకటమ్మ తాను ఎన్నో ఏళ్లుగా నివాసమున్న తన సొంతింటికి పంపించాలని కోరింది. దీంతో ఆమె కోరిక మేరకు ఆ ఇంటిలో ఉంచారు. వెంకటమ్మ ఉంటున్న మట్టిమిద్దె నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా నానింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంచంపై పడుకున్న వృద్ధురాలు మట్టిలో కూరుకుపోయింది. తెల్లవారిన తర్వాత స్థానికులు విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మనవరాలు రాజేశ్వరి వచ్చి మట్టిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని తహసీల్దార్ సుధాకర్ తెలిపారు. కోడుమూరులో వృద్ధుడు.. కోడుమూరు రూరల్ : మండల కేంద్రంలోని కొమ్మసానిగేరిలో మట్టి మిద్దె కూలడంతో గుంటెప్ప (82) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. గుంటెప్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారులు పెద్ద రంగన్న, చిన్న రంగన్నలు, మహబూబ్‌నగర్‌లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా, వృద్ధుడు ఒక్కడే పాత ఇంటిలో నివాసముంటున్నాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం దాటికి మిద్దె తడిసిపోయి ఇంటిలో నిద్రిస్తున్న గుంటెప్పపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తహసీల్దార్ రామకృష్ణ, ఎస్ఐ మహేష్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పాఠశాల భవనం పెచు్చలూడి విద్యార్థులకు గాయాలు
మంత్రాలయం రూరల్ : ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. మండలం పరిధిలోని చౌళహళ్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తరగతి గదిలో పిల్లలు చదువుకుంటుండగా ఉన్నట్టుండి పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఈ సంఘటనలో మూడోతరగతి చదవుతున్న శివరాజుకు తీవ్ర గాయాలు కాగా, నాలుగోతరగతి చదువుతున్న నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం వారిని ఎమ్మిగనూరులో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాధికారి కె. ఈరన్న ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. టీచర్లను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గోనెగండ్ల: గంజిహళ్లి గ్రామంలో విద్యుదాఘాతంతో పింజరి తిక్కయ్య (47) మృతి చెందాడు. సోమవారం రాత్రి వర్షం కురవడంతో సోమవారం ఉదయం గ్రామంలోని ఎస్వీ నగర్లో తన ఇంటి మిద్దె ఎక్కి చూస్తుండగా ఇంటిపైనే వేలాడుతున్న విద్యుత్ లైన్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడికి భార్య బీబీ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
మిద్దెపై నుంచి కింద పడి వ్యక్తి మృతి
కర్నూలు(హాస్పిటల్): మిద్దెపై నుంచి ఓ వ్యక్తి కింద పడి మృతి చెందాడు. బనగానపల్లెకు చెందిన ఖాజాహుసేన్(50)కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన స్థానికంగా సైకిల్ విడిబాగాల దుకాణాన్ని నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం మిద్దె ఆరేసిన బట్టలు తెచ్చేందుకు వెళ్లి అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రంగా గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మిద్దె కూలి వృద్ధురాలి మృతి
పోదొడ్డి (ప్యాపిలి): మండల పరిధిలోని పోదొడ్డి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మిద్దె కూలిన ప్రమాదంలో తులసమ్మ (58) మృతి చెందింది. గ్రామానికి చెందిన వెంకటరామయ్య, తులసమ్మ దంపతులు పాత మిద్దెలో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బ తిన్న మిద్దె ఆదివారం రాత్రి ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తులసమ్మపై రాళ్లు, దెంతెలు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరామయ్య తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్న వెంకటరామయ్య భార్య మృతితో ఒంటరిగా మిగిలాడు. వెంకటరామయ్య కుమారులు బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. తహశీల్దార్ గోవింద్ సింగ్, ఎంపీడీఓ అమత్‌రాజ్, జిల్లా గొర్రెల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్, ఎంపీపీ సరస్వతి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు తదితరులు వెంకటరామయ్యను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. -
కల్వర్టు ఇలా.. రాకపోకలు ఎలా..!
డిచ్పల్లి : మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలోని ఉపాధ్యాయుల కాలనీలో సుమారు రెండు నెలల క్రితం కల్వర్టు పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన స్థలం చుట్టూ రాళ్లు పెట్టి ఇలా వదిలేశారు. దీంతో కాలనీవాసులు రాపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు కల్వర్టు నీటితో నిండిపోయి ఇక్కడ ఉన్న డ్రైనేజీ కనిపించకపోవడంతో ఇద్దరు ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక సర్పంచ్‌కు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏదైనా జరగక ముందే స్పందించి వెంటనే కల్వర్టుకు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
కల్వర్టు ఇలా.. రాకపోకలు ఎలా..!
డిచ్పల్లి : మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలోని ఉపాధ్యాయుల కాలనీలో సుమారు రెండు నెలల క్రితం కల్వర్టు పైకప్పు కూలిపోయింది. అప్పటి నుంచి కూలిపోయిన స్థలం చుట్టూ రాళ్లు పెట్టి ఇలా వదిలేశారు. దీంతో కాలనీవాసులు రాపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసినప్పుడు కల్వర్టు నీటితో నిండిపోయి ఇక్కడ ఉన్న డ్రైనేజీ కనిపించకపోవడంతో ఇద్దరు ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. స్థానిక సర్పంచ్‌కు, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం ఏదైనా జరగక ముందే స్పందించి వెంటనే కల్వర్టుకు మరమ్మతులు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
మండు వేసవిలో చల్లగా!
ఫాల్స్ సీలింగ్‌తో ఇల్లు ఆహ్లాదం సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎండ భగ్గుమంటోంది. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. జాగ్రత్తలివే.. ♦ ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. ♦ ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ♦ ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలిం గ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ♦ ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ♦ దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. వర్ణాల ఎంపికలో.. ♦ ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. ♦ గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ♦ మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. ♦ తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. ♦ గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
మిద్దె కూలి బాలింత మృతి
-
కూలిన హాస్టల్ పైకప్పు
మహబూబ్‌నగర్: మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బాలుర బీసీ హాస్టల్ పైకప్పు ఆదివారం అర్ధరాత్రి కూలింది. విద్యార్థులు నిద్రపోయే స్థలం పక్కనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ విద్యార్థులెవరికీ గాయాలు కాలేదు. హాస్టల్ లో సరైన వసతులు లేవని , ఎప్పుడు ఏం జరుగుతుందో భయపడాల్సి వస్తోందని విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
-
ఇంటి పైకప్పే ఏసీ
సిడ్నీ: మనకు వేసవి కాలం ముగిసి వర్షాకాలం రాబోతోంది. త్వరలో వేసవి నుంచి ఉపశమనం పొందనున్నాం. కానీ ఆస్ట్రేలియాలో ఇప్పుడే వేసవి మొదలవుతోంది. అక్కడివారు కూడా మనలాగే ఈ ఎండల్ని ఎదుర్కోవడమెలాగా అని భయపడిపోతున్నారు. అయితే ఎండ ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడి పరిశోధకులు ఓ కొత్త సాంకేతికతను కనుగొన్నారు. సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఇంటిపైకప్పునే ఏసీగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీని ద్వారా ఇళ్ల పైకప్పుల్తోనే ఇల్లంతా చల్లదనం పరుచుకుంటుంది. ఎలాగంటే: ఇంటి పైకప్పులకు చల్లదనాన్నిచ్చే కొత్త రకం పదార్థాన్ని పరిశోధకులు తయారు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించిన పదార్థంతో ఒక పొర తయారు చేసి, దాన్ని వెండి పొర మీద పేర్చారు. ఈ రెండింటి కలయికతో ఏర్పడిన పదార్థం వేడిని నిలవనివ్వదు. దీంతో ఈ పదార్థంతో తయారు చేసిన పై కప్పులు ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా వేడెక్కవు. ఫలితంగా ఇంటిలోపల చల్లదనం పరుచుకుంటుంది. దాదాపు 50 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు వేడిని తగ్గించే సామర్థ్యం ఈ కప్పులకు ఉంటుంది. ఈ కప్పులను వాడడం వల్ల ఇంటిలోపలికి వేడి రాకుండా నిరోధించవచ్చు. సాధారణంగా ఇంటి పైకప్పులు వేడెక్కడం వల్ల ఇళ్లల్లోకి వేడిగాలి వస్తుంటుంది. ఈ సమస్యలన్నింటినీ ఈ కొత్త రకం కప్పులతో ఎదుర్కోవచ్చు. పైగా దీనికి ఏసీల కంటే తక్కువ విద్యుత్ అవసరం. ప్రస్తుతం మార్కెట్లో లేకపోయినా త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. -
కూలిన సినిమా హాల్ పైకప్పు
జీడిమెట్ల: సినిమా థియేటర్లో సీలింగ్ పై కప్పుకు మరమ్మతు చేస్తూ ఓ యువకుడు కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. సినిమా చూస్తున్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. జీడిమెట్ల ఎస్సై వెంకటరాజ గౌడ్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా ఎన్సాన్పల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి(23) షాపూర్‌నగర్‌లో ఉంటూ రంగ థియేటర్లో ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం మార్నింగ్ షో ప్రారంభమైంది. తరచూ వర్షపు నీరు థియేటర్ పై నుంచి చుక్కలు చుక్కులుగా రూ.20ల టికెట్ ప్రాంతంలోని సీట్లపై పడుతోంది. ఈ విషయంపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదు అందండంతో ఆపరేటర్ కరుణాకర్‌రెడ్డి సీలింగ్ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా పై నుంచి పట్టుతప్పి థియేటర్ లోపల పడ్డాడు. అదే సమయంలో సీలింగ్ అట్టలు కూలి సినిమా చూస్తున్న రోడామిస్త్రీనగర్కు చెందిన మహ్మద్ ఇతియాస్(15), శ్రీనివాస్(23), బహదూర్‌పల్లి శివరాం(25), రంగారెడ్డినగర్‌కు చెందిన సత్యనారాయణ (31)లకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కరుణాకర్ రెడ్డిని షాపూర్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడిని నుంచి నగరంలో కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటికప్పు కూలి దంపతుల దుర్మరణం
సిద్దవటం: వివాహబంధంతో ఒక్కటైన వారు మరణంలోనూ ఒక్కటై వెళ్లిపోయారు. సిద్దవటం మండలం పొన్నవోలు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున నివాస గృహం పైకప్పు(స్లాబు) కూలి ఎన్నంరెడ్డి సుబ్బారెడ్డి(65), భాగ్యమ్మ(58) అనే దంపతులు దుర్మరణం చెందారు. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీగా భాగ్యమ్మ పని చేస్తోంది. ఈమె భర్త సుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకునేవారు. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా పైకప్పు స్లాబు విరిగి నిద్రిస్తున్న వారిపై కూలింది. దీంతో సుబ్బారెడ్డి శిధిలాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను చికిత్స నిమిత్తం 108వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి కొద్దిసేపటికే భాగ్యమ్మ కూడా కన్నుమూసింది. రోజూ తెల్లవారుజామున 4గంటలకే నిద్రలేచే వారని, వర్షం కురుస్తుండటంతో సోమవారం నిద్రలేవలేదని, ఇంతలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ అన్సర్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం కోసం సుబ్బారెడ్డి మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్ బాబు రిమ్స్‌లో మృతదేహాలను సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.