మిద్దెపై నుంచి కింద పడి వ్యక్తి మృతి | man skid from roof | Sakshi
Sakshi News home page

మిద్దెపై నుంచి కింద పడి వ్యక్తి మృతి

Published Sat, Oct 8 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

man skid from roof

కర్నూలు(హాస్పిటల్‌): మిద్దెపై నుంచి ఓ వ్యక్తి కింద పడి మృతి చెందాడు. బనగానపల్లెకు చెందిన ఖాజాహుసేన్‌(50)కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన స్థానికంగా సైకిల్‌ విడిబాగాల దుకాణాన్ని నిర్వహిస్తు జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం మిద్దె ఆరేసిన బట్టలు తెచ్చేందుకు వెళ్లి అదుపు తప్పి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రంగా గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్‌ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన మృతి చెందాడు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement