మిద్దె కూలి వృద్ధురాలి మృతి
Published Tue, Aug 9 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
పోదొడ్డి (ప్యాపిలి): మండల పరిధిలోని పోదొడ్డి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మిద్దె కూలిన ప్రమాదంలో తులసమ్మ (58) మృతి చెందింది. గ్రామానికి చెందిన వెంకటరామయ్య, తులసమ్మ దంపతులు పాత మిద్దెలో నివాసముంటున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బ తిన్న మిద్దె ఆదివారం రాత్రి ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తులసమ్మపై రాళ్లు, దెంతెలు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంకటరామయ్య తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్న వెంకటరామయ్య భార్య మృతితో ఒంటరిగా మిగిలాడు. వెంకటరామయ్య కుమారులు బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. తహశీల్దార్ గోవింద్ సింగ్, ఎంపీడీఓ అమత్‌రాజ్, జిల్లా గొర్రెల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్, ఎంపీపీ సరస్వతి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు తదితరులు వెంకటరామయ్యను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
Advertisement
Advertisement