రంగారెడ్డి : దోమ మండలం ఐనాపురం గ్రామంలో ఓ మహిళ(30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐనాపురం గ్రామానికి చెందిన మహిళ ఆదివారం రాత్రి నుంచి కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె గ్రామ సమీపంలోని పొలాలల్లో సోమవారం ఉదయం శవమై కనిపించింది.
ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.