చాంద్రాయణగుట్ట: ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా(30)కు ఏడుగురు సంతానం. భర్త నదీం చనిపోవడంతో ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది.
మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది.ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో తండ్రి చనిపోవడం, తాజాగా తల్లి చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment