falaknuma
-
హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్.. ఆ హోటల్లో కఠిన నిబంధనలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికందర్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం సల్లు భాయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనూ షూటింగ్ నిర్వహిస్తున్నారు.అయితే సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుసగా బెదిరింపులు వస్తోన్న సంగతి తెలిసిందే. కృష్ణజింకల కేసు నుంచి ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తామంటూ కొందరి నుంచి కాల్స్ వస్తుండటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. అలా ఫుల్ సెక్యూరిటీ మధ్య ఆయన షూటింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.నాలుగంచెల భద్రత..ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో నాలుగు అంచెల భద్రతలో సల్మాన్ ఖాన్ మూవీ షూటింగ్ నిర్వహించారు. ఆయన భద్రత విషయంలో రాజీ పడకూడకుండా నిర్మాతలు చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అతిథులు షూటింగ్ జరుగుతున్న హోటల్‌ను బుక్ చేసుకుంటే రెండంచెల చెకింగ్‌ను వారు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి హోటల్ సెక్యూరిటీ సిబ్బంది.. మరొకటి సల్మాన్ ఖాన్ ప్రత్యేక భద్రత బృందం వారిని తనిఖీ చేయాలి. ఆ తర్వాతే వారిని హోటల్లోకి అనుమతించడం జరుగుతుంది.ఐడీ ఉంటేనే అనుమతి...మరోవైపు హోటల్ సిబ్బందికి ఐడీ కార్డులు ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. ప్రతి రోజు సిబ్బంది ఐడీలను సైతం తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను పటిష్టమైన భద్రతా వలయంగా మార్చారు. ఆయన కోసం దాదాపు 50 నుంచి 70 వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. వీరిలో మాజీ పారామిలటరీ సిబ్బంది కూడా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన తర్వాత సల్మాన్ దుబాయ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.కాగా.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్ను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పాతబస్తీ ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చిన్నారుల వరుస కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు అపహరణకు గురవ్వడం తీవ్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అయిదేళ్ల బాలుడిని ఇద్దరు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు. బాలుడిని రక్షించి.. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే పాతబస్తీ ఫలక్ నుమాలో మరో బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడు అయాన్‌ను ఓ అగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడిని వ్యక్తి తీసుకొని వెళ్తునట్టు స్థానిక సీసీటీవీ ఫుటేజీ రికార్డయ్యాయి. కొడుకు కనిపించకపోవడంతో ఫలక్‌నుమా పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అయిదు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు. చదవండి: HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య -
కాలేజ్‌కి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లి..
సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్‌నుమా జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన వీరస్వామి కూతురు కె.ఐశ్వర్య (17) ఈ నెల 1వ తేదీ ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తన సోదరి కనిపించడం లేదని అన్న లోకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చదవండి: బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా.. -
హైదరాబాద్: ఎంఎంటీస్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు మరో గుడ్‌న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 11వ తేది నుంచి నగరంలో మరో 86 ఎంఎంటీస్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. అలాగే రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు పేర్కొంది. తాజాగా ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు స్పష్టం చేసింది. The popular suburban transport services in the twin cities providing affordable and convenient travel option. 86 #MMTS services running as on 11th April, 2022 between Falaknuma - Lingampalli - Hyderabad- Secunderabad @drmsecunderabad @drmhyb pic.twitter.com/dsVrdrGrVW — South Central Railway (@SCRailwayIndia) April 13, 2022 అయితే, గతంతో ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు రైళ్లు నడిచేవి. అలాగే, సీజనల్ టికెట్స్‌ను సైతం సౌత్ సెంట్రల్ రైల్వే మళ్ళీ అందుబాటులో తీసుకువచ్చింది. #MMTS #TwinCities Secunderabad to Hyderabad; Secunderabad - Lingampalli - Secunderabad; Falaknuma to Hyderabad & Falaknuma - Ramchandrapuram - Falaknuma @drmsecunderabad @drmhyb pic.twitter.com/dgCiB1bQmQ — South Central Railway (@SCRailwayIndia) April 14, 2022 -
వివాహేతర సంబంధం: పెళ్లి చేసుకోవాలని డ్యాన్సర్ బలవంతం చేయడంతో
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. క్యాబ్ డ్రైవర్ మహ్మద్ అప్సర్‌తోపాటు రేస్ కోర్స్ బుకీ నహీద్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం ఫాతిమా భర్త మృతిచెందడంతో క్యాబ్ డ్రైవర్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడినట్లు విచారణలో తేలింది, ఇటీవల పెళ్లి చేసుకోవాలంటూ డ్రైవర్‌పై ఫాతిమా ఒత్తిడి తీసుకొచ్చింది. డ్యాన్స్‌లు ఆపేస్తే పెళ్లి చేసుకుంటానని డ్రైవర్ ఫాతిమాకు షరతు పెట్టాడు. చదవండి: బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి కాగా దీంతో వివాహ విషయంలో క్యాబ్ డ్రైవర్, ఫాతిమాకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫాతిమాకు మద్యం తాగించి క్యాబ్ డ్రైవర్ ఉరి వేసి హత్య చేశాడు. ముస్తఫానగర్‌కు చెందిన 30 ఏళ్ల షరీన్ ఫాతిమాకు ఏడుగురు సంతానం. ఫాతిమా భర్త నదీమ్ ఏడాది కిందట మృతి చెందాడు. ఏడుగురు సంతానాన్ని ఆర్కెస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ తల్లి ఫాతిమానే పోషించుకునేది. ప్రస్తుతం ఫాతిమా మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. చదవండి: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి కిరాతకంగా... -
బీరు బాటిల్, అర్థనగ్నంగా.. మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి
చాంద్రాయణగుట్ట: ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ముస్తఫానగర్‌కు చెందిన షరీన్ ఫాతిమా(30)కు ఏడుగురు సంతానం. భర్త నదీం చనిపోవడంతో ఆర్కేస్ట్రా ట్రూప్ డ్యాన్సర్‌గా కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం ముస్తఫానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె ఆదివారం వస్తువులను షిఫ్ట్ చేసేందుకు పిల్లలను అమ్మమ్మ ఇంటి వద్దే ఉంచింది.ఆమె కొత్త ఇంటికి వచ్చి తిరిగి రాకపోవడంతో ఫాతిమా తల్లి వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. ఆమె గొంతుపై గాయాలు ఉండటంతో పాటు అర్ధనగ్నంగా ఉండటం, పక్కనే బీరు బాటిల్ ఉండటంతో ఎవరో హత్య చేసి ఉంటారని ఫాతిమా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో తండ్రి చనిపోవడం, తాజాగా తల్లి చనిపోవడంతో చిన్నారులు అనాథలయ్యారు. -
Hyderabad: అయ్యో! ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా?
సాక్షి, సిటీబ్యూరో: పాత నగరానికి మెట్రో జర్నీ కలగా మారనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మెట్రో పనులు చేపట్టేందుకు గతంలో పలు మార్లు హడావుడి మొదలైనప్పటికీ అడుగు ముందుకు పడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మెట్రో నిర్మాణ సంస్థ వర్గాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. నష్టాల మెట్రో గాడిన పడేందుకు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారన్న అంశంపై స్పష్టత కరువైంది. దీంతో పాతనగరంతోపాటు రాయదుర్గం–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంలోనూ మెట్రో ఎప్పటికి పూర్తవుతుందన్న అంశం సస్పెన్స్‌గా మారడం గమనార్హం. సమస్యలు ఎన్నో.. ► ప్రధానంగా ఎంజీబీఎస్–ఫలక్‌నుమా (5.5 కి.మీ) మార్గంలో పనులు చేపట్టేందుకు సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, మరో 69 వరకు ప్రార్థనా స్థలాలు దెబ్బతినకుండా మార్గాన్ని రూపొందించడం, మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్‌ఆఫ్‌వే స్థలాన్ని సేకరించడం వంటి పనులు కత్తిమీద సాములా మారాయి. ► పాతనగరంలో మెట్రో మార్గాన్ని ఏర్పాటుచేసేందుకు సుమారు వెయ్యి ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటికి సుమారు వంద కోట్లకుపైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ► సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా, శంషీర్‌గంజ్ ప్రాంతాల్లో ఐదు మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు రూ.1250 కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ► ఇక పనులు చేపట్టేందుకు వీలుగా ఆస్తుల సేకరణ ఆలస్యమైతే ప్రాజెక్టు నిర్మాణ గడువు పెరిగే అవకాశం ఉంది. పనుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ► ఈ రూట్లో సుమారు 69 వరకు ఉన్న ప్రార్థనా స్థలాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ► ఈ సమస్యల కారణంగానే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఓల్డ్‌సిటీలో మెట్రో పనులు చేపట్టేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ► గతంలో మెట్రో అధికారులు, నిర్మాణ సంస్థ వర్గాలు ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురానీహవేలి, మీరాలంమండి, ఎతేబార్‌చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీఛబుత్రా, అలియాబాద్, షంషీర్గంజ్ ద్వారా ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు పనులు ప్రారంభిస్తామని హడావుడి చేసినా..అడుగు ముందుకుపడకపోవడం గమనార్హం. ► మరోవైపు తొలిదశ మెట్రో మార్గాల్లో పనుల ఆలస్యం కారణంగా వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన రుణాలపై వడ్డీ, ఇతరత్రా నిర్మాణ వ్యయాలు పెరగడంతో అదనంగా రూ.4 వేల కోట్లు నిర్మాణ వ్యయం పెరిగిందని..ఈ మొత్తాన్ని సైతం తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నిర్మాణ సంస్థ వర్గాలు ఇటీవల ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం గమనార్హం. మెట్రో కోసం మహా పోరాటం.. పాతబస్తీ మెట్రో కోసం పలు రాజకీయ పార్టీలు మహా పోరాటమే చేశాయి. పలు రాజకీయ పారీ్టలతోపాటు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల పాదయాత్రలతో మెట్రో ప్రాజెక్టు కోసం మహా ఉద్యమమే సాగింది. 2017 నుంచి 2021 వరకు పలు రాజకీయ పార్టీలు మెట్రో కావాలని నినదిస్తున్న విషయం విదితమే. -
cyber crime: కాల్ చేసి కాజేస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా ఎర వేసి సిటీకి చెందిన ఇద్దరి నుంచి రూ.2.07 లక్షలు కాజేశారు. బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఫలక్‌నుమ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షల వ్యక్తిగత రుణం మంజూరైందని చెప్పారు. ఆ మొత్తం తీసుకోవడానికి కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని, వీటిలో కొన్ని రిఫండ్ వస్తాయంటూ నమ్మబలికారు. ఇలా మొత్తం రూ.1.03 లక్షలు కట్టించుకుని మోసం చేశారు. కార్వాన్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు హైపీ అనే తమ వెబ్సైట్ నుంచి వస్తువులు ఖరీదు చేయాలని, అలా చేస్తే భారీ మొత్తం కమీషన్‌గా వస్తుందని నమ్మబలికారు. కొన్న వస్తువుల్ని అమేజాన్, ఫ్లిప్‌కార్డ్ ద్వారా డెలివరీ చేస్తామన్నారు. ఈ యువకుడు తొలుత కొన్ని వస్తువులు కొనగా..వాటితో పాటు కమీషన్ కూడా వచ్చింది. దీంతో పూర్తిగా నమ్మిన ఇతగాడు రూ.1.04 లక్షలు షాపింగ్ చేశాడు. ఆ తర్వాత వస్తువులు, కమీషన్ రెండూ రాకపోవడంతో తనను సంప్రదించిన వారికి ఫోన్ చేశాడు. అవన్నీ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. (చదవండి: ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు కాల్.. తీరా చేస్తే.. ) -
కరీంనగర్లో తీగ... ఫలక్‌నుమాలో డొంక
చంద్రాయణగుట్ట: దీపావళి టపాసులు తయారు చేయడానికి వినియోగించి గన్‌పౌడర్‌తో తక్కువ సామర్థ్యం కలిగిన డిటొనేటర్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్లో పట్టుబడిన ఇద్దరి విచారణలో వీటి మూలాలు ఫలక్‌నుమాలో ఉన్నట్లు తేలాయి. సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈది బజార్‌కు చెందిన మహ్మద్ జైనుల్లా హబీబ్ అలియాస్ షబ్బీర్‌కు గతంలో గన్‌పౌడర్ తయారీకి సంబంధించి లైసెన్స్ ఉండేది. బొగ్గు, అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ తదితరాలను కలిపి దీనిని తయారు చేసే అతగాడు టపాసుల తయారీదారులకు విక్రయించేవాడు. రెయిన్‌బజార్ కేంద్రంగా ఈ వ్యాపారం చేయడానికి కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ జారీ చేసిన దీని కాల పరిమితి 2018లో ముగిసింది. ఆ తర్వాత దాన్ని షబ్బీర్ రెన్యువల్ చేయించుకోలేదు. అయితే అప్పటికే అతడి వద్ద కొంత ముడిసరుకు మిగిలిపోయింది. ఫాతీమానగర్‌లో బొగ్గు విక్రయానికి లైసెన్స్ కలిగిన హమీద్ ఖాన్‌తో కలిసి ఆ ప్రాంతంలోనే దీన్ని అక్రమంగా తయారు చేయడం మొదలెట్టాడు. నిర్మాణ రంగంలో అక్రమ పేలుళ్ల కోసం డిటొనేటర్లకు భారీ డిమాండ్ ఉందని తెలుసుకున్న షబ్బీర్ గన్‌పౌడర్ వినియోగించి తక్కువ సామర్థ్యం కలిగిన డిటోనేటర్లను తయారు చేస్తున్నాడు. వివిధ జిల్లాలకు పాలిష్ పౌడర్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతడి వద్ద వీటిని ఖరీదు చేస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన సతీష్, విష్ణువర్థన్‌రెడ్డి సైతం ఉన్నారు. గురువారం ఉదయం వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి పోలీసులు వారి నుంచి భారీ మొత్తంలో డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తమకు వీటిని హైదరాబాద్ నుంచి షబ్బీర్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు ఫాతీమానగర్‌లోని స్థావరంపై దాడి చేసి షబ్బీర్‌తో పాటు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు టన్ను గన్‌పౌడర్ స్వాధీనం చేసుకున్నారు -
జేబీఎస్- ఎంజీబీఎస్ మెట్రో: ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని ప్రశ్నించారు. ఈ మేరకు... ‘దార్ ఉల్ షిఫా నుంచి ఫలక్నామా మెట్రో లైన్ సంగతి ఏంటి? జేబీఎస్ మార్గాన్ని పూర్తి చేశారు గానీ.. దక్షిణ హైదరాబాద్ విషయానికి వచ్చే సరికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదైతే ఇంకా అద్భుతం.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి. మరి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా పనులు ఎప్పుడు మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తార’ని అసదుద్దీన్ ట్విటర్ వేదికగా హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం 15 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు చేసిన ట్వీట్‌కు అసదుద్దీన్ పైవిధంగా స్పందించారు. నగరంలో 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా మార్గం మాత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ 5 కిలోమీటర్లు మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. Amazing that you have funds for JBS & MGBS,when will @hmrgov start and complete MGBS to FALAKNUMA ? https://t.co/FnCyy8Y829 — Asaduddin Owaisi (@asadowaisi) February 6, 2020 -
హైదరాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం
సాక్షి, హైదరాబాద్ : ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఫలక్‌నుమాలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫలక్‌నుమాలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో నలుగురు దుండగులు చోరీకి యత్నించారు. చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను మొబిన్, సాజిద్, షేక్ ఖాసీంగా గుర్తించారు. దుండగులపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురు గతంలో నిజాం మ్యూజియంలో దొంగతనం చేశారు. -
కత్తులతో వీరంగం కేసులో నిందితుల అరెస్ట్
చాంద్రాయణగుట్ట: మారణాయుధాలతో నడి రోడ్డుపై హల్చల్ చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుతో కలిసి ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్ వివరాలు వెల్లడించారు. నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, మీర్జా ఖాదర్ బేగ్, కాలాపత్తర్‌కు చెందిన ఇమ్రాన్ అహ్మద్, బహదూర్‌పురాకు చెందిన గులాం ముస్తఫా, కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి రౌడీయిజం చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ రాత్రి వీరు నవాబు సాహెబ్‌కుంటలో కత్తులు, బ్యాట్లతో హల్చల్ చేస్తూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై సమాచారం అందడంతో కాలాపత్తర్, ఫలక్‌నుమా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా వారు అక్కడినుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన కాలాపత్తర్ పోలీసులు మిగిలిన ఐదుగురిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కత్తులు, బ్యాట్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు ఎల్.రమేష్ నాయక్, కె.గొకారీ తదితరులు పాల్గొన్నారు. హత్యకు కుట్ర కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఇస్మాయిల్ వరుసకు సోదరుడయ్యే ఇర్షాద్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. దుబాయిలో ఉంటూ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఇర్షాద్ వద్ద రూ.కోట్లు ఉన్నందున అతడిని హత్య చేసి అతని ఆస్తులను కాజేయాలని ఇస్మాయిల్ భావించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న రాత్రి అతడి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు.ఇర్షాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై పలు కేసులు నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్మాయిల్ కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో ఐదేళ్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మరో నిందితుడు మిర్జా ఖదీర్ బేగ్ అక్రమ ఆయుధాల కేసు ఉండగా, మూడో నిందితుడు ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నట్లు ఏసీపీ వివరించారు. -
వైట్నర్ మత్తులో మహిళల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో ఇన్నాళ్లూ యువకులు మాత్రమే వైట్నర్కు బానిసై జీవితాలు నాశనం చేసుకోగా.. ప్రస్తుతం ఈ వ్యసనం మహిళలకు కూడా పాకింది. వైట్నర్ తాగిన మత్తులో ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ వద్ద శనివారం రాత్రి నలుగురు మహిళలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడికి యత్నించారు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన షబానా, పర్వీనా, జబానా, అయేషాలు వైట్నర్ సేవనానికి బానిసలయ్యారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వీరు మదీనా కాలనీ, ఫలక్‌నుమా జైతున్ హోటల్, ఇంజన్‌బౌలి ప్రాంతాలలో రోడ్లపై ట్రాఫిక్‌ను అడ్డగించడం.. చెప్పులు విసరడం.. బూతులు తిట్టడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై రెండు మూడు రోజులుగా 100 డయల్‌కు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఎస్సైలు రమేష్ నాయక్, గొకారీ నేతృత్వంలో వైట్నర్లపై శనివారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. ఫాతిమా నగర్‌కు చెందిన గోరీ బీ అనే మహిళ శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తన 12 ఏళ్ల చిన్న కూతురు సభా బేగాన్ని వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఇంట్లోనీ వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు ‘నీ పెద్ద కుమార్తె ముంతాజ్ బేగం తన భర్త హాజీతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. నీ పెద్ద కుమార్తె వస్తేనే చిన్న కుమార్తె సభా బేగాన్ని విడిచి పెడతామంటూ పర్వీనా అనే మహిళ బెదిరించి మిగిలిన ముగ్గురితో కలిసి తీసుకెళ్లిందని’ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు మహిళలు నివాసం ఉన్న ప్రాంతానికి వెళ్లి బాలికను వారి చెర నుంచి విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదే సమయంలో నలుగురు మహిళలు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసిన గోరీ బీని పోలీసుల సమక్షంలోనే కొట్టడం ప్రారంభించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారి స్థితిని గమనించి పోలీస్‌స్టేషన్ నుంచి బయటికి వంపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళలు పోలీసులను దుర్భాషలాడుతూ.. చెప్పులు విసరసాగారు. అంతటితో ఆగకుండా ప్రధాన రహదారిపైకి వచ్చి వాహనదారులకు ఆటంకం కల్పించారు. మహిళా పోలీసులు వారిని పట్టుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కిడ్నాప్, న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
నాలుగేళ్లకు ఇల్లు చేరిన బాలిక
సాక్షి, హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన బాలికను తెలంగాణ పోలీసులు దర్పణ్ యాప్ సాయంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పాతబస్తీలోని హసన్‌నగర్‌కు చెందిన పదేళ్ల ముస్కాన్ ఫాతిమా 2015 మే 5న హైకోర్టు సమీపంలో తప్పిపోయింది. దీనిపై ఫాతిమా నానమ్మ మాలేబీ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు గాలించినా ఫాతిమా ఆచూకీ దొరకలేదు. 2016లో ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. అక్కడ ఫాతిమా ఫొటోను దర్పణ్ యాప్ సాయంతో వెతికి చూడగా.. ఫలక్‌నుమాలోని రెయిన్బో హోంలో ఉన్నట్లు గుర్తించారు. దర్ప ణ్ యాప్ సాయంతో మూడేళ్ల 10 నెలల తర్వా త తిరిగి ఫాతిమా సొంతింటికి చేరింది. దర్పణ్ యాప్ ద్వారా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 20 మంది చిన్నారులను కన్న వారి వద్దకు చేర్చినట్లు వుమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఇన్చార్జి, ఐజీ స్వాతీ లక్రా వెల్లడించారు. -
అర్థరాత్రి అలజడి.. వైట్నర్ మత్తులో..
సాక్షి, హైదరాబాద్ : అర్థరాత్రి సమయంలో వైట్నర్ మత్తులో ఉన్న కొంతమంది అలజడి సృష్టించారు. పూర్తిగా వైట్నర్ మత్తులో మునిగిన వాళ్లు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడి చేసుకుని జనాలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన పాతబస్తీలోని ఫలక్నామా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం అర్థరాత్రి వేళ ఫలక్నామాలో వైట్నర్ల మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు, కొందరు పురుషులు ఒకరిపై ఒకరు కత్తులతో, బ్లేడ్లతో దాడిచేసుకున్నారు. మత్తులో మునిగిన ఓ మహిళ బ్లేడ్‌తో నరాలు కోసుకోవటంతో అక్కడి జనం భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. వైట్నర్ల మత్తు కారణంగానే వాళ్లు వీరంగం సృష్టించారని తెలిపారు. -
షంషేర్ గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం
-
షంషేర్ గంజ్‌లో భారీ అగ్నిప్రమాదం
చార్మినార్(హైదరాబాద్): ఫలక్నామాలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షంషేర్ గంజ్‌లోని ఓ స్క్రాప్ గోదాములో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫలక్నామా, ఇంజనబౌలి ఆంధ్రాబ్యాంక్ సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఒక్క సారిగా మంటలు వచ్చాయి. ఆ మంటలు పక్కనే ఉన్న స్క్రాప్ గోదాములోకి వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికుల భయాందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపిచడంతో పోలీసులు వెంటనే గోదాము చుట్టు పక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన 15 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. రాత్రి నుంచి శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షార్ట్సర్క్వూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
ఘరానా ఆటో దొంగ అరెస్ట్
హైదరాబాద్: పార్క్ చేసి ఉన్న ఆటోలను మాయం చేస్తున్న ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. ఫలక్‌నుమా పోలీసులు గురువారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో వెళుతూ అనుమానాస్పదంగా కనిపించిన అజీజ్‌ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. పత్రాలు చూపించకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆటోల చోరీ వ్యవహారం వెలుగు చూసింది. విచారణ అనంతరం అతడు కొట్టేసిన 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన ఆటోల ఇంజన్ నంబర్లను మార్చి గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 నుంచి రూ. 20 వేలకు విక్రయించేవాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా నగర్‌కు చెందిన వ్యక్తి అని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మహబూబ్‌నగర్, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతాల్లో ఇతడు చోరీలకు పాల్పడినట్టు వెల్లడించారు. -
ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయికి వేధింపులు
హైదరాబాద్: ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని వేధించిన ఘటన పాతబస్తీలో కలకలం రేపింది. ఫలక్ నుమాలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని... అమీర్ అనే సహ విద్యార్ధి వేధించాడు. పేపర్ పై తన ఫోన్ నంబర్ రాసి ఆమెకు ఇచ్చాడు. రోజూ తనకు ఫోన్ చేయాలని ఆమెను వేధించసాగాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన సోదరుడితో చెప్పింది. అతడు స్నేహితులతో కలిసి అమీర్ పై దాడి చేశాడు. అమీర్ తరపు కూడా వారితో కలబడంతో ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరుపక్షాలపై కేసు నమోదు చేశామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ 'సాక్షి' టీవీకి తెలిపారు. అమీర్ పై నిర్భయ కేసు కూడా పెట్టామని చెప్పారు. సాయంత్రంలోపు రెండు గ్రూపులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతామన్నారు. -
ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయికి వేధింపులు
-
ప్రెసిడెన్సీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
పాతబస్తీ ఫలక్ నుమా పీఎస్ పరిథిలోని ప్రెసిడెన్సీ కాలేజీలో గురువారం ర్యాగింగ్ కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ప్రెసిడెన్సీ జూనియర్ కాలేజీలో ఓ యువతిని సీనియర్స్ ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు. తన చెల్లెల్ని ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నారని యువతి సోదరుడు ప్రశ్నించగా.. అతడి మీద దాడికి దిగారు. దీంతో బాధిత విద్యార్థిని కుటుంబం ఫలక్ నుమా పోలీసులను ఆశ్రయించారు. ఘనటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫలక్‌నుమాలో పట్టాలు తప్పిన రైలింజన్
- ఆలస్యంగా నడిచిన ప్యాసింజర్ రైళ్లు - మధ్యాహ్నం వరకు ఎంఎంటీఎస్ సర్వీసుల నిలిపివేత చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున రైలింజన్ పట్టాలు తప్పింది. దీనిని గుర్తించిన రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) రాజ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 11367 నంబర్ కలిగిన రైలింజన్ గూడ్స్ రైలు బోగీలను తీసుకువచ్చి ప్యాసింజర్ రైలు బోగిలను తగిలించుకునేక్రమంలో చక్రాలు పట్టాలు తప్పింది.దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఇంజన్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారులు మహబూబ్‌నగర్, కాచిగూడ నుంచి వచ్చే రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అనంతరం కాచిగూడ నుంచి యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను రప్పించి రైలింజన్‌ను పట్టాల పైకి ఎక్కించారు. ఈ కారణంగా దాదాపు మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఎంఎంటీఎస్ సర్వీసుల నిలిపివేత రైలింజన్ పట్టాలు తప్పడంతో అధికారులు ఫలక్‌నుమా-సికింద్రాబాద్ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్యాసింజర్ రైళ్ల రద్దీ తగ్గడంతో సర్వీసులను పునరుద్దరించారు. వర్షంతో ఒరిగిన సిగ్నల్ స్తంభం శుక్రవారం రాత్రి పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి ఫలక్‌నుమా బ్రిడ్జి సమీపంలోని సిగ్నల్ లైట్ ఒకవైపు ఒరిగింది. రైలింజన్‌ను రివర్స్‌లో తీసుకొస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించని కారణంగా ఇంజన్ పట్టాలు తప్పినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) రాజ్ కుమార్ సాక్షికి తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. -
పోలీసు శాఖ స్థలానికే పొగబెట్టాడు!
పోలీస్ విభాగానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎం.సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్‌లో పోలీస్ ట్రెనింగ్ కాలేజీ (పీటీసీ)కి చెందిన 350 గజాల స్థలాన్ని మహ్మద్ ఇద్రీస్(56) కబ్జా చేసేందుకు యత్నించాడు. స్థలం చుట్టూ సిమెంట్ దిమ్మెలు ఏర్పాటుచేసి 59 జీవో ప్రకారం రెవెన్యూ అధికారులకు డీడీ కూడా చెల్లించాడు. అధికారులు విచారణకు వస్తారని తెలుసుకున్న ఇద్రీస్ స్థలం చుట్టూ ఉన్న చెట్లను కొట్టివేయడంతో పాటు మరికొంత నిర్మాణం చేసేందుకు యత్నించాడు. దీనిని గమనించిన ఫలక్‌నుమా పోలీసులు మార్చి 3వ తేదీన ఇద్రీస్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇద్రీస్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఫలక్‌నుమాలో దొంగల బీభత్సం
దుకాణదారుడిపై కత్తితో దాడి: నగదు చోరీ చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: చీకటిమాటున ఫలక్‌నుమాలో దొంగలు తెగబడ్డారు. రాత్రి 9 గంటలకు దుకాణంలో ఒంటరిగా ఉన్న వ్యక్తిపై కత్తితో దాడిచేసి దోపిడీ చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఫలక్‌నుమా బస్‌డిపో ఎదురుగా సయ్యద్ అజీజుద్దీన్ అనే వ్యక్తి ‘ఎక్స్‌ప్రెస్ మనీ’ పేరుతో మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి అజీజుద్దీన్ ఇంటికి వెళ్లి వస్తానని దుకాణంలో పనిచేసే బర్కత్ అలీ(24) అలియాస్ ఇమ్రాన్‌కు చెప్పి వెళ్లాడు. అతను వెళ్లిన పది నిమిషాల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడ్డారు. ఇందులో ఒకరు మంకీ క్యాప్ ధరించి ఉండగా, మరొకరు టీ షర్ట్, జీన్స్‌లో ఉన్నాడు. వీరు తమకు డబ్బులు ఇవ్వాలని బర్కత్ అలీని హిందీలో బెదిరించారు. తాను ఇవ్వబోనని చెప్పడంతో కత్తి చూపించి కౌంటర్లో ఉన్న నగదును లాక్కొని బయటికి వెళ్లారు. దుకాణం ముందు నుంచి పది అడుగుల వేయగానే వారి వెనుకాలే వచ్చిన బర్కత్ అలీ దొంగలను అడ్డుకొని ప్రతిఘటించాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు కత్తితో బర్కత్ అలీ కడుపులోకి పొడిచేందుకు యత్నిం చారు. ఆ సమయంలో బర్కత్ అలీ చేతిని అడ్డం పెట్టడంతో ఎడమ చేతికి కత్తి గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే దుండగులు అక్కడి నుంచి ఫలక్‌నుమా డిపో రోడ్డుకు.. అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, దుండగులు ఆటో వాలాకు కూడా కత్తి చూపించి ఆటోలో ఎక్కినట్లు సమాచారం. గాయపడ్డ బర్కత్ అలీ వెంటనే యజమాని సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాహేర్ అలీ, ఇన్స్పెక్టర్ హుస్సేన్ నాయుడులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించి కేసు నమెదు చేశారు. కాగా పోలీసుల విచారణలో దుకాణంలో రూ.1900 చోరీ అయినట్లు తేలింది. ఘటనా స్థలంలో నకిలీ నంబర్‌తో బైక్ మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయం ముందు ఏపి 13 ఎఫ్ 7262 నంబర్ కలిగిన పల్సర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం నంబర్ ఇంటర్నెట్లో పరిశీలించగా అది ప్యాషన్ ప్లస్‌కు సంబంధించిన నంబర్‌గా తేలింది. దీంతో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, దుండగులు ఇదే వాహనంపై వచ్చి ఉంటారని, వెళ్లే సమయంలో గొడవ జరగడంతో వాహనాన్ని వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని బట్టి దుండగులు పథకం ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 6వ తేదీనా రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. అక్కడ కూడా దుండగులు దుకాణదారుడిని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ఇదే తరహా ఘటన పునరావృతం కావడం పట్ల పాత నగరంలో ఏదైనా ముఠా సంచరిస్తుందా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఎంఎంటీఎస్ రైలుకు ప్రమాదం
హైదరాబాద్: లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయింది. రెండవ నంబర్ ప్లాట్ పామ్ డెడ్ ఎండ్‌ను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమయింది. క్యాబిన్లో ఇరుక్కునపోయిన డ్రైవర్‌ను సహాయక సిబ్బంది కాపాడారు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ‘మెట్రో’ రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు ఫలక్‌నుమా వరకే ప్రతిపాదించిన ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టు మార్గాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిప్రకారం సుమారు రూ.3,275 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 15 కిలోమీటర్ల మేర పనులు చేపడతారు. ఇప్పటివరకు జూబ్లీబస్‌స్టేషన్-ఫలక్‌నుమా వరకు మాత్రమే మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయం విదితమే. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం కారిడార్లలోనూ మెట్రో పనులు జరుగుతున్నాయి. తాజా నిర్ణయంతో మెట్రో ప్రాజెక్టు నిడివి 72 కిలోమీటర్ల నుంచి 87 కిలోమీటర్లకు పెరిగే అవకాశాలున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. విమాన ప్రయాణికులకు ఉపశమనం నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిత్యం సుమారు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వ్యక్తిగత వాహనాలున్నవారు మినహా మిగతా వారు క్యాబ్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ రూట్లో మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వస్తే వేలాదిమంది నగరం నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు తక్కువ ఖర్చుతో చేరుకునే అవకాశం లభించనుంది. మెట్రో వ్యయం ఇలా.. ప్రపంచంలో అతిపెద్ద పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రాజెక్టుగా పేరొందిన మెట్రోకు ఎల్అండ్టీ సంస్థ రూ.12,674 కోట్లు వ్యయం చేస్తుందని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందులో 30 శాతం నిధులను ఎల్అండ్టీ సంస్థ సొంత మూలధనం నుంచి వెచ్చిస్తుందని, మిగతా 70 శాతం నిధులను జాతీయ బ్యాంకుల నుంచి సేకరించే రుణాల ద్వారా సమీకరిస్తుందని చెప్పారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.1458 కోట్ల నిధులు వ్యయం చేయనుందని ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. భూసేకరణ, పునరావాసం, రహదారుల విస్తరణ, పైప్లైన్ల మార్పు, ఇతర వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3275 కోట్లు పెరిగిందని తెలిపారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, ఎల్అండ్టీ చేయనున్న వ్యయంపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు.