ఫాతిమాను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన బాలికను తెలంగాణ పోలీసులు దర్పణ్ యాప్ సాయంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పాతబస్తీలోని హసన్‌నగర్‌కు చెందిన పదేళ్ల ముస్కాన్ ఫాతిమా 2015 మే 5న హైకోర్టు సమీపంలో తప్పిపోయింది. దీనిపై ఫాతిమా నానమ్మ మాలేబీ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు గాలించినా ఫాతిమా ఆచూకీ దొరకలేదు. 2016లో ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. అక్కడ ఫాతిమా ఫొటోను దర్పణ్ యాప్ సాయంతో వెతికి చూడగా.. ఫలక్‌నుమాలోని రెయిన్‌బో హోంలో ఉన్నట్లు గుర్తించారు. దర్ప ణ్ యాప్ సాయంతో మూడేళ్ల 10 నెలల తర్వా త తిరిగి ఫాతిమా సొంతింటికి చేరింది. దర్పణ్ యాప్ ద్వారా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 20 మంది చిన్నారులను కన్న వారి వద్దకు చేర్చినట్లు వుమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఇన్‌చార్జి, ఐజీ స్వాతీ లక్రా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment