Fatima
-
పరీక్షలకు ఫాతిమాను అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్‌లోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో బీడీఎస్‌లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్íÙప్ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది. -
సీసీఎస్‌ను ఆశ్రయించిన ఏడో నిజాం మనవరాలు
సాక్షి, హైదరాబాద్: నిజాం ఆస్తులకు సంబంధించిన ఓ వివాదం హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)కు చేరింది. తన పేరిట ముగ్గురు వ్యక్తులు నకిలీ జీపీఏ సృష్టించి కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనవరాలు ఫాతిమా ఫౌజియా సీసీఎస్‌లో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఏడో నిజాం రెండో కుమారుడైన వాలాషాన్ ప్రిన్సెస్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఆమె. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కేసు నమోదు చేయకపోవడంతో హైదరాబాద్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారసత్వ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..: ‘బషీర్‌బాగ్‌కు చెందిన మిలాద్ అలీ ఖాన్, నాంపల్లికి చెందిన సాజిద్ అలీఖాన్, బంజారాహిల్స్‌కు చెందిన మీర్ మిర్జా అలీఖాన్ ఉమ్మడిగా ఏడో నిజాంకు సంబంధించిన ఆస్తులకు వారసులమని.. నా పేరిట నకిలీ జీపీఏతో 2016లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారు. అనంతరం నా ఆస్తిలోనూ వాటా ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తమిళనాడులోని నీలగిరి, ఊటీల్లో ఉన్న దాదాపు రూ. 121 కోట్ల విలువైన ఏడో నిజాం ఎస్టేట్స్‌లో వాటా పంచాలని కోర్టుకెక్కారు. నా తండ్రి, సోదరుడి నుంచి నాకు సంక్రమించిన 36 శాతం ఆస్తుల వాటాను తక్కువగా చూపించడంతోపాటు పూర్తిగా ఎస్టేట్‌ను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు’అని ఫాతిమా కోర్టులో వేసిన ప్రైవేటు ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు పొందిన వారసత్వ సరి్టఫికెట్ బోగస్ అని, దాన్ని రద్దు చేయాలని కోరారు. -
Ind vs Pak: భారత్‌తో మ్యాచ్.. దూకుడుగా ఆడతాం: పాక్ కెప్టెన్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్‌లో గెలిచిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు జోష్‌లో ఉంది. గ్రూప్-ఏలో భాగమైన శ్రీలంకను 31 పరుగులతో ఓడించి తొలి విజయం అందుకుంది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఆదివారం పోటీకి సిద్ధమైంది.దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దాయాది జట్ల మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు హర్మన్‌ప్రీత్ సేనతో పాక్ మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. అన్ని మ్యాచ్‌లలాగే టీమిండియాతోనూ ఆడతామని పేర్కొంది.దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం‘‘మేము ఒత్తిడికి లోనవ్వము. అయితే, ప్రేక్షకుల ఉత్సాహం కారణంగా మా వాళ్లు కాస్త అలజడి చెందే అవకాశం ఉంది. అయితే, వీలైనంత ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఒత్తిడికి లోనైతే మాత్రం ఫలితం మాకు అనుకూలంగా రాదని తెలుసు.మేము గత కొంతకాలంగా దూకుడైన క్రికెట్ ఆడుతున్నాం. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా నిర్భయంగా అటాకింగ్‌కి దిగుతున్నాం. తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయడానికి సిద్ధపడుతున్నాం. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చితకబాదడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.అందుకు తగ్గట్లుగానే ఇక్కడా ఫలితం రాబడతామని విశ్వాసంతో ఉన్నాము’’ అని ఫాతిమా సనా గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫాతిమా ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో అదరగొట్టింది. 30 పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు తీసింది.భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా బోణీ కొట్టగా.. భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే కివీస్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడింది.ఈ క్రమంలో ఇక ముందు ఆడనున్న ప్రతీ మ్యాచ్ హర్మన్‌సేనకు అగ్నిపరీక్షగా మారింది. పాకిస్తాన్‌తో పాటు శ్రీలంక జట్లపై ఘన విజయాలు సాధించడం సహా ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తేనే సెమీస్‌కు మార్గం సుగమం అవుతుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే.ఇక పాకిస్తాన్ మహిళా జట్టుపై కూడా భారత్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఇరుజట్లు టీ20లలో 15 సందర్భాల్లో తలపడగా.. భారత్ 12 సార్లు, పాక్ మూడు సార్లు గెలిచింది. చివరగా ఆసియా వుమెన్స్ కప్-2024లోనూ హర్మన్ సేన పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.చదవండి: అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి: పాక్ బ్యాటర్లపై కోచ్ ఫైర్! -
కొండంత ధైర్యంతో...
సియాచిన్ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు. దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్ ఉమన్ మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ఫాతిమా వసీమ్ చరిత్ర సృష్టించింది... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి మెడికల్ ఆఫీసర్‌గా అడుగు పెట్టనుంది కెప్టెన్ ఫాతిమా వసీమ్. ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్ గ్లేసియర్‌పై ఆపరేషనల్ పోస్ట్‌లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్ ఫాతిమా వసీమ్ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్’లో ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్ కెప్టెన్ ఫాతిమా, ఏ సియాచిన్ వారియర్. ఉయ్ సెల్యూట్ హర్’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఫాతిమా వసీమ్ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ∙కెప్టెన్ ఫాతిమా వసీమ్∙శిక్షణలో... ∙వైద్య సేవలు అందిస్తూ -
ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. మీరా సూసైడ్ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో విజయ్‌కు ధైర్యం చెప్పారు. తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన ప్రతి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పించింది. పిల్లల పట్ల కన్నవారికి ఎంత ప్రేమ ఉంటుందో.. ఇలాంటి సమయంలో బాధను భరించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ విషాద సమయంలో విజయ్ ఆంటోనీకి కోలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచింది. అయితే తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో విజయ్ భార్య ఫాతిమా పోస్ట్ చూస్తేనే అర్థమవుతోంది. గతంలో ఆమె తన పెద్దకూతురి పట్ల చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ విషాద సమయంలో విజయ్, ఆయన భార్య ఫాతిమా ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. పిల్లలపై వారి ప్రేమను తెలిపేందుకు ఈ ట్వీట్ నిదర్శనం. ఫాతిమా తన కుమార్తె మీరా పాఠశాలలో సాధించిన విజయాల గురించి చేసిన పాత పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మార్చిలో ఫాతిమా తన కూతురు మీరా స్కూల్ యూనిఫాంతో ఉన్న చిత్రాన్ని పంచుకుంది. ట్వీట్లో రాస్తూ.. 'నా బలం వెనుక ఉన్న శక్తి, నా కన్నీళ్లకు ఓదార్పు, నా ఒత్తిడికి కారణం(నీ కొంటెతనం సూపర్)నా తంగకట్టి-చెల్లకుట్టి. మీరా విజయ్ ఆంటోనీ కంగ్రాట్స్ బేబీ’.' అంటూ పోస్ట్ చేసింది. కుమార్తె మరణం తర్వాత ఫాతిమా చేసిన పాత పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జయం రవి, ఆర్జే బాలాజీ, శరత్‌కుమార్, పలువురు తారలు సంతాపం తెలిపారు. కాగా.. విజయ్ భార్య ఫాతిమా ఫిల్మ్ కార్పొరేషన్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. విజయ్ సినిమాలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. The Force behind my strength,the consolations to my tears,the reason for my stress(Naughtiness super loaded)my Thangakatti-chellakutty. Meera Vijay Antony ,Congrats Baby 🤗❤️🥰🔥🔥🔥 pic.twitter.com/yfTTdIiAjL — Fatima (@mrsvijayantony) March 12, 2023 -
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!
ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ మహిళా అంజూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు ఆమె తన భర్త, పిల్లలను వదిలి దాయాది దేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తరువాత నస్రుల్లా తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని పేర్కొంది అంజూ. తాను కేవలం ఓ పెళ్లికి హాజరు కావడానికి మాత్రమే పాక్‌కు చేరినట్లు, త్వరలోనే భారత్‌కు రానున్నట్లు తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మాతం మార్చుకున్న అంజూ ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు అంజూ ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. తన పేరును సైతం అంజూ నుంచి ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో వీరిద్దరూ అధికారికంగా నిఖా జరుపుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంజూ, నస్రుల్లా ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ.. టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సంబంధిత వార్త: అందుకే పాక్ వచ్చా.. అంజూ వ్యవహారంలో ట్విస్ట్! నిఖా హోగయా అంజూ, నస్రుల్లా వివాహాన్ని మలకాండ్ డివిజన్ డీఐజీ నసీర్ మెహమూద్ సత్తి ధృవీకరించారు. ఆ మహిళా ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరును మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంజూను పోలీసు భద్రతతో కోర్టు నుంచి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు. 24 గంటలు గడవకముందే నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన వీసా గడువు ముగియగానే ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వస్తుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు నస్రుల్లా సైతం తమ ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అయితే 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోవడంతో ప్రజలు అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అంజూ చెప్పింది అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ ప్రకారం అతడిని పెళ్లి చేసుకుందా? లేదా వారు బలవంతంగా ఇలా చేశారా? అన్నది ఆసక్తిగా మారింది. పాక్‌లోనే ఉంటుందా? తిరిగొస్తుందా! ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం, పేరు మార్చుకోవటం చూస్తుంటే పాకిస్థాన్‌లోనే ఉండిపోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారమంతా లవ్ జీహాదీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది? Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U — Naimat Khan (@NKMalazai) July 25, 2023 -
సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు.. తేల్చేసిన యూపీఎస్సీ?
సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. కాగా యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్ వచ్చింది. ముందుగా సివిల్స్‌కు ఎంపిక అవ్వడంతో అంతులేని ఆనందానికి లోనయ్యారు. తమ శ్రమ ఫలించిందనుకున్నారు. ఇంతలోనే తన పేరు, ర్యాంకు, రోల్ నంబర్లతో మరో అమ్మాయి ఉందని తెలియడంతో నిర్ఘాంతపోయారు. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. ఒకే పేరుతో ఇద్దరు దేవాస్ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమా (23), అలీరాజ్‌పూర్‌కు చెందిన ఆయేషా మక్రాని (26) ఇద్దరూ ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో అర్హత సాధించారు. వారిరువురికీ 184వ ర్యాంకు వచ్చింది. వీరిద్దరి రోల్ నంబర్లు కూడా ఒకటే. దీంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ ఇద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్ కార్డులను సమర్పించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేశారు. చదవండి: చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ తేల్చేసిన యూపీఎస్సీ వారిద్దరి అడ్మిట్ కార్డులను గమనిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే.. మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం ఉండగా.. ఫాతిమా కార్డులో మంగళవారం అని స్పస్టంగా ఉంది. క్యాలెండర్ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్ మార్కుతోపాటు క్యూఆర్ కోడ్ సైతం ఉంది. మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం లేవు. దీంతో యూపీఎస్సీ అధికారులు ఫాతిమానే అసలు అభ్యర్థి అని పేర్కొన్నారు. మరోచోట కూడా మరోవైపు తుషార్ అనే పేరుతోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. తమకు 44వ ర్యాంక్ వచ్చిందని హరియాణాకు చెందిన తుషార్, బిహార్‌కు చెందిన తుషార్ కుమార్ చెప్పారు. దీంతో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్పీ.. బిహార్‌కు చెంది తుషార్ కుమార్ నిజమైన అభ్యర్థిగా గుర్తించింది. ఆయేషా మక్రాని (26)తో సహా బిహార్‌కు చెందిన తుషార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు యూపీఎసీ పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షల్లో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగబోవని హామీ ఇచ్చారు. చదవండి: లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్ -
విజయవాడ : ఫాతిమా హత్య కేసులో కీలక విషయాలు
-
Ifrah Fatima, Mounika Wadiwala: ఇద్దరు వందయ్యారు
డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్లో ఎంబీబీఎస్ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడొచ్చింది కరోనా. ప్రపంచం మొత్తం భయవిహ్వలమై పోయింది. ఒంట్లో ఏ రకమైన నలత వచ్చినా ‘ఇది కరోనా లక్షణమేమో’ లని బెంబేలు పడిపోతున్నారు జనం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ల క్లినిక్‌లు, నర్సింగ్‌హోమ్‌లు కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ దొరక్క ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్‌కు పరుగులు తీస్తున్నారు పేషెంట్లు. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లకు నర్సింగ్ స్టాఫ్‌తో సర్వీస్ ఇప్పిస్తే పేషెంట్లకు సంతృప్తి ఉండడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే డాక్టర్లకు ప్రజలకు మధ్య పెద్ద దూరం పెరుగుతుందనిపించింది. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక వారధిగా పనిచేయాలనుకున్నారు. ఈ యువ డాక్టర్లిద్దరికీ అప్పుడు వచ్చిందో ఆలోచన. వెంటనే ఆన్లైన్ వైద్యానికి శ్రీకారం చుట్టారు. ఈ వైద్యానికి ఫీజు లేదు! ఇఫ్రాహ్, మౌనికలు తమ ఆలోచనను స్నేహితులందరికీ చెప్పారు. విన్నవాళ్లలో దాదాపుగా అందరూ కరోనా పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వచ్చారు. మొదటగా ఏప్రిల్ నెలలో 24 మంది డాక్టర్లతో ఒక బృందం తయారైంది. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు సమయాన్ని ఒక్కొక్క స్లాట్ రెండు గంటల చొప్పున ఆరు స్లాట్లుగా విభజించుకున్నారు. ప్రతి టైమ్ స్లాట్‌లో నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉండేటట్లు చూసుకున్నారు. డాక్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఏ సమయంలో ఏ డాక్టర్లను సంప్రదించాలి... వంటి వివరాలతో ఒక పట్టిక తయారు చేశారు. ఈ పట్టికను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ మాట్లాడేటంతటి రష్. డాక్టర్లు ఇచ్చిన సర్వీస్ చాలా సులువైనదే. అయితే హాస్పిటల్లో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకని క్లిష్టమైన సమయంలో వీరి సేవ పేషెంట్లను సేదదీర్చే చల్లని చిరుజల్లయింది. పేషెంట్లు చెప్పిన లక్షణాల ఆధారంగా కరోనా తీవ్రతను గ్రహించి అవసరమైన మందులను, ఆహారాన్ని సూచించేవారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేవారు. తేలికపాటి లక్షణాలకు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని, హోమ్ క్వారంటైన్ పాటించమని ధైర్యం చెప్పేవారు. అలాగే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను స్వయంగా సంప్రదించాల్సి ఉంటుందో కూడా వివరించారు. ఈ సర్వీస్‌లో కొంతమంది డాక్టర్లు ఫోన్లో మాట్లాడితే మరికొంతమంది వాట్సప్ చాట్ ద్వారా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. వందమందికి చేరింది! ఇఫ్రాహ్, మౌనిక ప్రారంభించిన ఫ్రీ మెడికల్ సర్వీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ల పోస్టులను ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ, బాలీవుడ్ నటి కొంకణాసేన్‌లు కూడా షేర్ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ల సంఖ్యను 24 నుంచి యాభైకి, మే ఒకటి నాటికి యాభై నుంచి వందమందికి పెంచుకున్నారు. ఒక్కో స్లాట్‌లో ఎనిమిది నుంచి పది మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్ సర్వీస్ నెట్‌వర్క్‌లో దేశవిదేశాల్లో ఉన్న డాక్టర్ మిత్రులందరినీ భాగస్వాములను చేయగలిగారు ఇఫ్రాహ్, మౌనిక. అలాగే సర్వీస్ టైమ్ కూడా ఉదయం ఎనిమిది నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు విస్తరించారు. రాను రాను కరోనా భయం శారీరకం నుంచి మానసిక సమస్యలకు దారి తీయడాన్ని గమనించి... హైదరాబాద్, ఎర్రగడ్డ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డాక్టర్లు కూడా ఈ మెడికల్ సర్వీస్‌లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, దుబాయ్‌లో ఉంటున్న వాళ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే! నిజంగా అవసరమైన టెస్టులేవో, అవసరం లేని టెస్టులేవో పేషెంట్లకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఒక లిస్ట్ ఇచ్చి ‘ఈ పరీక్షలు చేయించుకుని రండి’ అని మాత్రమే చెప్తారు. మరోమాట మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఒక తుమ్ము వచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా, ఒళ్లు వెచ్చబడినా భయంతో వణికిపోవాల్సిన దుస్థితి రాజ్యమేలుతున్న సమయంలో, డాక్టర్ల మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్న తరుణంలో ఈ యువ డాక్టర్లు చేస్తున్న మంచిపని వైద్యరంగం మీద గౌరవాన్ని పెంచుతోంది. ఒక్కొక్కరికి రెండు వేల ఫోన్ కాల్స్! మాకు రెండు గంటల స్లాట్‌లో యాభై నుంచి అరవై ఫోన్ కాల్స్ వచ్చేవి. ఈ యాభై రోజుల్లో మా టీమ్ డాక్టర్లు సరాసరిన ఒక్కొక్కరు రెండు వేల మందికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటారు. మా ప్రయత్నంలో ప్రధానమైన ఉద్దేశం మా తోటి వైద్యుల మీద పెరుగుతున్న ఒత్తిడి తగ్గించడానికి మా వంతు సహకారం అందించడం. పేషెంట్లతో అనునయంగా మాట్లాడి, ‘ఏం ఫర్వాలేదు, ఈ రోగాన్ని జయించగలం’ అనే ధైర్యాన్ని కల్పించడం. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటల్‌కు వెళ్లడాన్ని నివారించడం కూడా. తేలికపాటి లక్షణాలున్న పేషెంట్లు హాస్పిటల్‌కు వెళ్తే అక్కడ తీవ్ర లక్షణాలున్న పేషెంట్లతో మెలగడం ద్వారా వీరిలో కూడా వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదం ఎక్కువ. అలాంటి అనర్థాలను నివారించడానికి మా వంతుగా కృషి చేశాం. ఈ ప్రయత్నంలో కలిసి వచ్చిన డాక్టర్లందరూ తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే అంకితభావంతో పని చేస్తున్నారు. వారందరికీ కృతజ్ఞత లు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మాకు ఫోన్ కాల్స్ కూడా బాగా తగ్గాయి. – డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా, డాక్టర్ మౌనిక వడియాల – వాకా మంజులారెడ్డి -
22 కిలోల బరువు తగ్గాను : ఆజంఖాన్
రాంపూర్ : తనపై అక్రమంగా నమోదైన క్రిమినల్ కేసుల కారణంగా 22 కిలోల బరువు తగ్గినట్టు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున ఆజంఖాన్ భార్య ఫాతిమా బరిలో నిలిచారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆజంఖాన్ తన ఆవేదనను ప్రజలతో పంచుకున్నారు. తాను ఎదుర్కొంటున్న కేసుల గురించి ప్రస్తావించిన ఆయన.. ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. తను ప్రజల కోసం, సమాజం కోసం మాత్రమే పనిచేశానని తెలిపారు. ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు తనపై క్రిమినల్ అని ముద్ర వేశారని విమర్శించారు. జీవితంలో చాలా చూశానని చెప్పిన ఆజంఖాన్.. ఎటువంటి ఆస్తులు సంపాదించుకోలేదని అన్నారు. తాను ప్రజల కోసమే పనిచేశానని, పిల్లల కోసం విద్యాసంస్థలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క కిలో బరువు పెరగలేదని.. కానీ 22 కిలోలు తగ్గానని వ్యాఖ్యానించారు. కాగా, ఆజంఖాన్‌పై ల్యాండ్ మాఫియాకు సంబంధించి పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి అక్టోబర్ 5వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆజంఖాన్‌ను 2.30 గంటల పాటు విచారించింది. ఈ కేసుల తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 29కి వాయిదా వేసింది. -
నాలుగేళ్లకు ఇల్లు చేరిన బాలిక
సాక్షి, హైదరాబాద్: దాదాపు నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన బాలికను తెలంగాణ పోలీసులు దర్పణ్ యాప్ సాయంతో ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పాతబస్తీలోని హసన్‌నగర్‌కు చెందిన పదేళ్ల ముస్కాన్ ఫాతిమా 2015 మే 5న హైకోర్టు సమీపంలో తప్పిపోయింది. దీనిపై ఫాతిమా నానమ్మ మాలేబీ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు గాలించినా ఫాతిమా ఆచూకీ దొరకలేదు. 2016లో ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. అక్కడ ఫాతిమా ఫొటోను దర్పణ్ యాప్ సాయంతో వెతికి చూడగా.. ఫలక్‌నుమాలోని రెయిన్బో హోంలో ఉన్నట్లు గుర్తించారు. దర్ప ణ్ యాప్ సాయంతో మూడేళ్ల 10 నెలల తర్వా త తిరిగి ఫాతిమా సొంతింటికి చేరింది. దర్పణ్ యాప్ ద్వారా ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 20 మంది చిన్నారులను కన్న వారి వద్దకు చేర్చినట్లు వుమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఇన్చార్జి, ఐజీ స్వాతీ లక్రా వెల్లడించారు. -
అమ్మ ఎగురుతోంది
ఆకాశం నుంచి కిందకు చూస్తే అరమరికలు కనపడవు. మనిషికి మనిషికి తేడా అనిపించదు. ఆడ, మగ భేదం తెలయదు. లోకమంతా అందంగా అల్లాహ్ సృష్టిలా కనపడతుంది. సృష్టిలో ఈ అందాన్నీ కిందున్న మనుషులూ గుర్తిస్తే ఎంత బాగుండు! కానీ.. అంత ఎత్తుకు ఎగరాలంటే... రెక్కల కింది గాలి ఎంత బలంగా ఉండాలి? ఆ కనపడని బలమైన గాలే విశ్వాసం!! అదీ తల్లి సల్వా ఫాతిమా విశ్వాసం!! అదే కూతురు మరియం ఫాతిమా ఆశ!! ముందు గదిలో కూర్చొని పేపర్ చదువుతున్న మామయ్యను కర్టెన్ చాటు నుంచి మాటిమాటికీ చూస్తోంది. ఆ పిల్ల ఆరాటం అతనికి తెలియదు. మధ్యమధ్యలో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ దాదాపు అరగంట పేపర్ మీద కాలక్షేపం చేశాడు. ఆ పేపర్ దీవాన్ మీద పడ్డ మరుక్షణమే వచ్చి వాలిపోయింది పదమూడేళ్లు దాటని ఆ అమ్మాయి. ఆత్రంగా ఆ వార్తా పత్రికలోనే పేజీలన్నీ తిప్పుతోంది. ఒక్కచోట ఆగిపోయింది. విమాన యానానికి సంబంధించిన వార్త అది. ఆసక్తిగా చదివింది. తర్వాత వాటెండ్ కాలమ్‌లోని విమానసంబంధ ఉద్యోగాల గురించి చూసింది. పేపర్‌ను మడత పెట్టి అక్కడే ఉన్న కిటికీలో కూర్చోని ఆకాశం వైపు తలెత్తింది. తన కల రెక్కలు తొడుక్కుని విహంగంలా విహరిస్తుంటే ఆస్వాదిస్తోంది. ఇంట్లో వాళ్లు తట్టి పిలిచే వరకూ ఆమె ఉనికి ఆ ఊహలోనే. ఇది ఒక్కరోజు చర్య కాదు.. దాదాపుగా అదే దినచర్య! ఆమె పేరు సల్వా ఫాతిమా. ది కమర్షియల్ పైలెట్ ఫ్రమ్ హైదరాబాద్. అలా నింగిలో ఎగరడానికి నేల మీద కష్టాల ప్రయాణం చేసి గమ్యానికి ఎగసిన సాహసి! పరిచయం.. సల్వా ఫాతిమా తండ్రి అష్వాక్ అహ్మద్. హైదరాబాద్‌లోని ఒక బేకరీలో రోజువారీ ఉద్యోగి. చార్మినార్ దగ్గర్లోని ఒక ఇరుకు గల్లీలోని అద్దె ఇంట్లో నివాసం. చాలీచాలని తండ్రి సంపాదనతో ముగ్గురు పిల్లల సంసారాన్ని ఈదుతున్న అమ్మ కష్టం చూస్తే సల్వాకు పుట్టెడు దుఃఖం వచ్చేది. ‘అల్లాహ్ మాకే ఎందుకు ఈ కష్టాలు?’ అంటూ కుమిలిపోయేది. అప్పుడు అమ్మమ్మ ‘కష్టాలు కలకాలం ఉండవు. మనమెప్పుడూ మన కిందివాళ్లను చూసి ఎంత మెరుగ్గా ఉన్నామో అని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అంటూ ఊరట ఇచ్చేది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోతగరతి నుంచి పది (అయిజా స్కూల్) వరకు అజాంపురలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంది సల్వా. వాళ్లింట్లో టీవీ ఉండేది. దూరదర్శన్లోని కొన్ని సీరియల్స్ చూసేది. ఆకాశం, విమానం, పైలెట్ అనే అంశాలు కన్పిస్తే చాలు ఆమె కళ్లు విప్పారేవి. పైలెట్ కావాలనే ఆశ మొగ్గ తొడిగింది. పేపర్లలో వచ్చే సంబంధిత వార్తలతో దానికి జీవం పోసేది. పేపర్ కటింగ్స్‌ను దాచుకునేది. మరిన్ని వివరాలను మేనమామను అడిగి తెలుసుకునేది. ఒక్కోసారి ‘నీకెందుకివన్నీ?’ అని అడిగేవాడు. ఆ ప్రశ్నకు సల్వా నవ్వేది. తను పేపర్లో చదివినవి, సీరియల్స్‌లో చూసినవి, మేనమామ చెప్పినవి ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసేది. ఫ్రెండ్ కోసం వెళ్లి... టెన్త్ మంచి మార్కులతో పాస్ అయింది సల్వా. ఆమె స్నేహితులంతా ఇంటర్ కోసం మంచి పేరున్న కాలేజ్‌లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అవన్నీ బాగా ఫీజులున్న కాలేజ్‌లు. అందులో చేరడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అనుమతించదని తెలిసి గవర్నమెంట్ కాలేజ్‌ను నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ రోజు తన స్నేహితురాలు మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్‌లో అడ్మిషన్ కోసం వెళుతూ సల్వానూ తోడు తీసుకెళ్లింది. ఆ కాలేజ్ ఆమెకు బాగా నచ్చింది. కాని డబ్బులూ గుర్తొచ్చి గమ్మున ఊరుకుంది. ఫ్రెండ్ బలవంతం మీద ప్రిన్సిపల్ రూమ్ దాకా వెళ్లింది సల్వా. ‘ఏ గ్రూప్‌లో అడ్మిషన్ కావాలి, టెన్త్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి?’ అని సల్వా స్నేహితురాలిని ప్రశ్నించింది ప్రిన్సిపల్. ‘బైపీసీ, 386 మార్కులు’ అని జవాబిచ్చింది ఫ్రెండ్. ‘నీకు?’ అంటూ సల్వాని అడిగింది ప్రిన్సిపల్. ‘నేను తనకు తోడుగా వచ్చా..’ అని చెప్పబోతుంటే సల్వా ఫ్రెండ్ అడ్డుతగిలి ‘తనకు నాకన్నా ఎక్కువ మార్కులే వచ్చాయి మేడం’ అంది. మరి అడ్మిషన్ ఎందుకు తీసుకోవట్లేదు అన్న ప్రిన్సిపల్ ప్రశ్నకు ‘మాకంత స్థోమత లేదు’ అంటూ ఏడ్చేసింది సల్వా. అప్పుడు మంచి నీళ్లు తెప్పించి, ‘మరేం పర్వాలేదు. నాకు చేతనైన సాయం చేస్తా, అడ్మిషన్ తీసుకో’ అంటూ భరోసా ఇచ్చింది ప్రిన్సిపల్. అప్పట్లో ఆ కాలేజ్‌లో బైపీసీకి 12 వేల రూపాయాల ఫీజు. అడ్మిషన్ తీసుకుంది. మెరిట్ స్టూడెంట్ అవడం వల్ల ఫీజులో కన్సేషన్ దొరికింది. ఆరువేల రూపాయలతో ఫస్ట్ ఇయర్ పూర్తయిపోయింది. సెకండియర్‌లో సంగీతారెడ్డి అనే లెక్చరర్ సహాయం అందించింది. అలా ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది సల్వా. సియాసత్ కోచింగ్ తర్వాత చదువులు ఎట్లా అనుకుంటున్న సమయంలోనే సియాసత్ ఉర్దూ పేపర్ ఆ వేసవి సెలవుల్లో ఉచిత ఎమ్సెట్ కోచింగ్ క్యాంప్ పెట్టారు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడమెందుకని అందులో చేరింది సల్వా. ఆ కోర్స్ ముగింపు రోజు సియాసత్ ఎడిటర్ జాహేద్అలీ ఖాన్ వచ్చారు. ఆ సందర్భంగా కోచింగ్ తీసుకున్న అమ్మాయిల అభిప్రాయాలు చెప్పాలని అడిగారు. అప్పుడే తనకు పైలెట్ కావాలనుందని చెప్పింది సల్వా. ఆ ఆశయం జాహేద్అలీ ఖాన్‌కు నచ్చి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు. అలా 2007లో ఏపీ ఏవియేషన్ కోర్స్‌లో చేరి శిక్షణ పూర్తిచేసుకుంది సల్వా ఫాతిమా. అడ్డంకులు.. సల్వా పైలెట్ శిక్షణకు వెళ్తున్నట్లు తెలియగానే బంధువులతోపాటు ఇరుగుపొరుగూ పెద్ద చర్చనే పెట్టారు. ‘పైలెట్ కోచింగ్ అంటే రోజుల తరబడి మీ అమ్మాయి బయట ఉండాల్సి వస్తుంది. రేపు జరగరానిది ఏదైనా జరిగితే మొత్తం ముస్లిం సమాజానికి ఏం సమాధానం చెప్తారు? మేమైతే మీకు సపోర్ట్ చేయం’అంటూ సల్వా తండ్రిని నిలదీశారు. అలాగే ‘కోచింగ్ చోట అందరూ మగవాళ్లే ఉంటారు. అమ్మాయికి జాగ్రత్తలు చెప్పండి. పైలెట్ అవ్వగానే సరిపోదు కదా. అమ్మాయికి పెళ్లీ చేయాలి. పైలెట్ ఉద్యోగం వల్ల ఎప్పుడూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధాలు వస్తాయో లేదో? ఈ కోర్స్ కన్నా ఏ ఇంజనీరింగ్ డిగ్రీ చేయించినా అయిపోయేది కదా’ అంటూ సల్వా వాళ్ల అమ్మనూ వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. ఇలా అందరి ఒత్తిళ్లను తట్టుకొని సల్వాకు అండగా నిలిచింది ఆ కుటుంబం. ముఖ్యంగా సల్వా అమ్మమ్మ, తండ్రి, మేనమామ సల్వాను ప్రోత్సహించారు. పెళ్లి.. పైలెట్ కోచింగ్ పూర్తి అయిన వెంటనే అంటే 2013, అక్టోబర్‌లో సల్వా పెళ్లి అయింది. ఈ సంబంధం సల్వా కుటుంబానికి బాగా కావల్సిన వాళ్ల నుంచి వచ్చింది. ఆమె కోర్స్ వివరాలు అన్నీ నచ్చే అమ్మాయిని తమింటి కోడలుగా చేసుకున్నారు. పైలెట్‌కి సంబంధించి ఇంకా చాలా కోర్సులు మిగిలి ఉన్నాయని, వాటి కోసం విదేశాలకూ వెళ్లాల్సి ఉంటుందని కూడా అబ్బాయి వాళ్లకు ముందే చెప్పారు సల్వా తల్లిదండ్రులు. దానికీ వాళ్లు అనుమతినిచ్చారు. అంతేకాదు అమ్మాయి పైలెట్ ఉద్యోగం చేయడం పట్లా తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ తెలిపారు. దాంతో మిగిలిన కోర్సులనూ సల్వా విజయవంతంగా పూర్తిచేసుకోగలిగింది. కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌ను పొందింది. ఏవియేషన్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. ప్రస్తుతం ఇండిగోలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఒక్క మాట పదేళ్ల కిందట నేను పైలెట్ శిక్షణకు వెళ్లినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. నేడు ముస్లిం అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందు ఉన్నారు అన్ని రంగాల్లో. మహళలు ముందు వెళ్లాలని నిర్ణయించుకుంటే అందరూ సహకరిస్తారు. మతపరంగా ఎలాంటి ఒత్తిళ్లూ ఉండవు. అమ్మాయిల చదువు విషయంలో ప్రతి ముస్లిం కుటుంబం చాలా శ్రద్ధ తీసుకుంటోంది. అంతేకాదు ఉన్నత చదువులు చదివిన అమ్మాయిలు వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రిపగలు అనే తేడా లేకుండా వెహికిల్స్, క్యాబ్స్‌లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. నా లక్ష్య సాధనకు సహకరించిన తెలంగాణ సీఎం కేసీఆర్, జాహెద్ అలీఖాన్, కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. నాకు ఉద్యోగం వస్తే ఆశయాలున్న పేదింటి అమ్మాయిలకు నాచేతనైన సహాయం చేస్తాను. విహంగ వీక్షణం.. సల్వా 2013లో సెస్నా 152 విమానాన్ని 200 గంటల పాటు, సోలో ఫ్లైట్‌ను 123 గంటల పాటు నడిపించి పైలట్ శిక్షణ పూర్తి చేసుకుంది. 2016లో బహుళ ఇంజిన్ ట్రైనింగ్‌కు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు అందజేసింది. ఈ సమయంలో ఆమె గర్భిణి. అయినా వెనకడుగు వేయకుండా న్యూజిలాండ్‌లో 15 గంటల పాటు బహుళ ఇంజిన్ విమానాన్ని నడిపి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2017, నవంబర్‌లో బహ్రెయిన్‌లో ఎయిర్‌బస్ 320 విమానాన్ని 60 గంటల పాటు నడిపి, కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. (కూతురు మరియం ఫాతిమా, భర్త మహ్మద్ షఖీల్తో సల్వా ఫాతిమా) – ముహ్మద్ మంజూర్, సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో -
సీఎం, మంత్రి కామినేని మాటలు నమ్మి మోసపోయాం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ మాటలు నమ్మి తాము మోసపోయామని ఫాతిమా కళాశాల విద్యార్థిని కౌసర్‌ఖాన్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫాతిమా కళాశాలలో 8 నెలలు చదివిన తర్వాత తమను రోడ్డున పడేశారన్నారు. మూడేళ్లుగా తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీలిస్తూనే ఉందని, కానీ ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఒకే పొరపాటును వరుసగా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తమకెందుకు అన్యాయం చేస్తోందో అర్థం కావడం లేదని వాపోయారు. మైనార్టీ కళాశాల అయినందునే వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోర్టు వెలుపల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపి కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేసీ నడ్డా, ఎంసీఐ అధికారులతో చర్చించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. విద్యార్థుల సమస్యపై పూనం మాలకొండయ్యను ఢిల్లీకి పంపడం సమంజసం కాదని తెలిపారు. చంద్రబాబు హామీ మేరకు విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళీకృష్ణ, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
జైలు నుంచి పాక్ అక్కాచెల్లెళ్ల విడుదల
అమృత్సర్: మాదక ద్రవ్యాల కేసులో కటకటాలపాలైన పాకిస్థాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ఫాతిమా, ముంతాజ్‌లు గురువారం విడుదలయ్యారు. వారితోపాటు 11 ఏళ్ల హీనాకు కూడా మోక్షం లభించింది. శిక్షాకాలంలో ఫాతిమాకు హీనా జన్మిచింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసుపై భారత ప్రధాని నరేంద్రమోదీప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తమకు తెలిసిందని, అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతమాతకు వందనం చేస్తున్నాం’ అని విడుదల అనంతరం ఫాతిమా ఉద్వేగంగా తెలియజేసింది. తమ దేశానికి వెళ్లే ముందు స్వర్ణదేవాలయాన్ని సందర్శించాలని అభిలషిస్తున్నట్టు చెప్పారు. కాగా పాకిస్థాన్‌లో మాదకద్రవ్యాలు తీసుకుని భారత్‌లో చొరబడేందుకు యత్నిస్తుండగా 2006, మే ఎనిమిదో తేదీన అట్టారి అంతర్జాతీయ సరిహద్దు వద్ద భద్రతా బలగాలు అరెస్టు చేయడం తెలిసిందే. -
ఆడుకుంటూ బాల్కనీ నుంచి పడిపోయింది!
హైదరాబాద్: అభం శుభం తెలియని ఓ పాప ఆడుకుంటూ అపార్ట్మెంట్ నుంచి కింద పడిపోయింది. నగరంలోని పాతబస్తీ బహదూర్ పురలో ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ వివరాలు.. పాతబస్తీలోని బహదూర్ పుర ఎంవో కాలనీలో 18 నెలల చిన్నారి ఫాతిమా అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్‌లోని తమ ఫ్లాట్‌లో ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ ఫాతిమా అలాగే బాల్కనీలోకి వచ్చేసింది. ఆ చిన్నారి పొరపాటున ఆ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇది చూసిన పక్కింటి వ్యక్తి వెంటనే వచ్చి పాపను ఎత్తుకుని ఏమైందోనని చూశాడు. ఆ వెంటనే స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు ఆ పాపను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్డీకపూల్ లోని లోటస్ ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నట్లు సమచారం. ఫాతిమా ఆడుకుంటుండగా పొరపాటున ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయిందని, దీంతో తలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. ఫాతిమాకు ఏమైతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
అంత్యక్రియలకు వెళ్తూ..
కొత్తూరు: అంత్యక్రియలకు వెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మండల కేంద్రం సమీపంలోని కొత్తూరు పారిశ్రామికవాడ సమీపంలో పాత జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఫయాజోద్దీన్(45) అతడి భార్య ఫాతీమా(40)లు ఇద్దరు బైకుపై హైదరాబాద్ లో తమ బంధువుల అంత్యక్రియలకు బయలుదేరారు. కాగా మార్గమధ్యలో పారిశ్రామికవాడ సమీపంలోకి రాగానే బైకు అదుపుతప్పడంతో ఫాతిమా కిందపడి పోయింది. అదే సమయంలో వెనకాల నుండి వేగంగా వస్తున్న లారీ ఆమెపై నుండి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
చోరీకి వెళ్లి.. చంపేశాడు..
సంచలనం సృష్టించిన మహిళపై అత్యాచారం, హత్య కేసు నిందితున్ని డబీర్‌పురా పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత ఏడాది నవంబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ ఎం. శ్రీనివాస్‌రావు వెల్లడించిన వివరాలివీ.. నూర్‌ఖాన్‌బజార్ బాల్‌శెట్టికేత్ ప్రాంతానికి చెందిన జీనత్ ఆలియాస్ జకియా ఫాతిమా (36) కోఠిలోని రూప్ సంఘం బట్టల దుకాణంలో పని చేసేది. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివాసముంటోంది. మోసీన్ అనే స్నేహితుడు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. కాగా, పురానీహవేలీకి చెందిన మీర్జా జీషాన్ అలీ ఖాన్(19) గతేడాది నవంబర్ 3వ తేదీన ఉదయం 6 గంటలకు జీనత్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో నివాసముండే తాత మీర్జా ఆబేద్ అలీ ఖాన్ వద్దకు వచ్చాడు. పైన నివాసముండే జీనత్ ఇంటి కిటికీలు తెరిచి ఉండటంతో దొంగతనం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది. కిచెన్ గది పక్కనున్న కిటికీలో నుంచి ఇంట్లోకి చొరబ డ్డాడు. విలువైన వస్తువులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా నిద్రలో ఉన్న జీనత్ లేచి పెద్దగా అరిచింది. దీంతో జీషాన్ జీనత్ నోరు మూసి గట్టిగా నెట్టేశాడు. ఆమెను తలను గోడకేసి బాదడంతో స్పృహతప్పింది. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. గొంతు నులిమి చంపేశాడు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని ఏమీ తెలియనట్లు కింద నివాసముండే తాత, నాన్నమ్మ దగ్గరికి వెళ్లి పోయాడు. ఉదయం 10 గంటలకు జీనత్ స్నేహితుడు మోసీన్ ప్రతి రోజు మాదిరిగానే బట్టల దుకాణానికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. జీనత్ అప్పటికే చనిపోయి ఉండటంతో ఆందోళనతో కిందికి దిగి తన సోదరుడి సాయంతో డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జీనత్ సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడు జీషాన్‌ను పట్టుకున్నారు. అతనిపై ఐపీసీ 302, 380, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
దుబాయ్ నుంచి అమ్మ కోసం..
మూడు దశాబ్దాల తర్వాత కన్నతల్లిని వెతుక్కుంటూ ఎడారి దేశం దుబాయ్ నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ వచ్చారు. తమ తల్లి జాడ చెప్పండని వారు కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. నగర పోలీసులను ఆశ్రయించి ముప్పై ఏళ్ల క్రితం తమను వదిలి వెళ్లిన తమ తల్లిని వెతకమని అభ్యర్థించారు. తమ వద్ద నున్న తల్లి ఫోటోను, వివరాలను వారికి అందజేశారు. ఈ సంఘటన సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది..1981 డిసెంబర్ 7న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రజియా బేగం అనే అమ్మాయిని దుబాయ్‌కు చెందిన రషీద్ ఈద్ ఒబేద్ రిఫక్ మస్మారీ అనే అరబ్ షేక్ హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. అనంతరం రజియాను తనతో పాటు దుబాయ్ తీసుకెళ్లాడు. వీరు 7 ఏళ్ల కాపురం తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రజియా హైదరాబాద్ వచ్చేసింది. రజియా, మస్మారీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆ తర్వాత మస్మారీ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూతుళ్లు సవతి తల్లి దగ్గరే పెరిగారు. తండ్రి చనిపోతూ అసలు విషయం చెప్పాడు. ఈమె మీకు సవతితల్లే కానీ కన్న తల్లి కాదు అనీ.. మీ కన్న తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఇద్దరు యువతులు కన్నతల్లి కోసం వెతుకులాట ప్రారంభించారు. అయేషా రషీద్ ఈద్ ఒబేద్(29), ఫాతిమా రషీద్ ఈద్ ఒబేద్(25) అనే ఇద్దరు యువతులు మీడియాతో మాట్లాడుతూ..మా తండ్రి, మా అమ్మకు 1988లో విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి మా అమ్మను చూసే అవకాశం రాలేదు. నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మ కోసం హైదరాబాద్‌కు వచ్చాం. కానీ ఆమె జాడ కనిపెట్టలేకపోయాం. కొంత మంది మిత్రుల సహాయంతో మళ్లీ అమ్మను వెతకటానికి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. మా జీవితంలో ఒక్కసారైనా అమ్మను చూడాలనేదే తమ కోరికన్నారు. ఇద్దరు యువతులు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణను కలిసి తమ అమ్మ జాడ కనిపెట్టాల్సిందిగా అభ్యర్థించారు. -
మక్కాబాధిత కుటుంబాలకు పరిహారం
మక్కా ప్రమాదంలో మరణించిన ఫాతిమా, ఖాదర్ కుటుంబ సభ్యులకు సీఎం పరిహారం అందజేశారు. ఇవాళ విజయవాడలో మృతుల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి మూడులక్షల రూపాయల చెక్కులు అందించారు. ఇటీవల బందరు పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మక్కా భాదితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్కరాల బాధితులతో సమానంగా.. మక్కాబాధితులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పులి
కథ నదిలోకి దిగింది ఫాతిమా. పొద్దుగూకుతున్నది. బంగారు పూత పూసినట్టుగా తళుక్కుమంటున్నది చల్లటి నీరు. ఒళ్లు జలదరించింది. ఒడ్డు పట్టుకుని, అడుగు తీసి అడుగువేస్తూ మొలలోతు నీటిలో కొంత దూరం నడిచింది. తడి చీర ఒంటికి అతుక్కుపోయింది. మలయా స్త్రీలందరిలాగే కాస్త బొద్దుగా, గోధుమవర్ణంలో అందంగా వుంది ఫాతిమా. ఆమె నిండు గర్భిణి. ప్రసవ సమయం సమీపించినప్పుడు స్త్రీలలో కనిపించే భయం కళ్లలో ప్రతిఫలించింది. శరీరం భారంగా వుంది. ఆమె ఆలోచనల్లో మునిగింది. మెరిసే, నల్లటి పొడవాటి జుత్తు ఆమె పిరుదుల దాకా సాగింది. ఆచ్ఛాదన లేకపోవటంతో గాలి గిలిగింతలు పెడుతున్నట్టుగా వుంది. దూరంగా చెట్లు, పొదలు, తీగలతో ఆ ప్రాంతం అడవిలాగే వుంది. మగవాళ్ల చూపుల నుండి కాపాడటానికి, అదనంగా గడ్డి కూడా ఏపుగా పెరిగింది. ఆ ఊరి స్త్రీలంతా యిక్కడే స్నానాలు చేస్తుంటారు. అంతలో ఒక నీటి కొంగ అరుపుతో ఆ ఏకాంత నిశ్శబ్దం భగ్నమైంది. రెక్కలు రెపరెప కొట్టుకుంటూ మరికొన్ని పక్షులు పెకైగిరాయి. ఎలుకలు కలుగుల్లోకి పరుగులు పెట్టాయి. ప్రాణభయంతో చిన్న జంతువులు గడ్డిమాటున నక్కాయి. నాచు, కాలుజారే బురదా, అడివి పువ్వుల వాసనలతో వాతావరణం మత్తుగా వుంది. అలవాటైన ప్రదేశమే అయినా, ఆ క్షణాన ఫాతిమాకు భయమేసింది. ఈ భగవంతుని సృష్టిలో, ఇంత జీవజాలం మధ్య తను ఒంటరి. ఎవరైనా రావచ్చు ఏమైనా జరగొచ్చు. ప్రమాదాలు చెప్పిరావు కదా. నది ఎగువన ఒక గాండ్రింపు వినిపించింది మొదట, అది తన భ్రమ కాబోలు ననుకున్నది ఫాతిమా. కాని చారలతో, నిప్పుకణికల్లా మెరుస్తున్న కళ్లతో, ‘ఒంటరిగా చిక్కావులే’ అన్నట్టుగా తనవైపే చూస్తున్నది పులి. తనకూ దానికీ మధ్య యిరవై గజాలకన్నా ఎక్కువ దూరం లేదు. ముసురుకుంటున్న చీకట్లతో రూపం మరింత భయంకరంగా వుంది. తల పెకైత్తి ఎర్రటి నాలుకా, పచ్చటి కోరలూ ప్రదర్శిస్తూ మరోసారి గాండ్రించింది. మృత్యువు కళ్లముందు సాక్షాత్కరించినప్పుడు పారిపోవడానికి కూడా కాళ్లు సహకరించవు. ఇంద్రజాలంతో హిప్నాటైజ్ అయినట్టుగా చేష్టలుడిగి చూసింది ఫాతిమా. అప్పటిదాకా ఎన్నెన్నో ఆలోచనలతో నిండిన మనసు నిశ్చలమైంది.పులి నుండి కళ్లు కదల్చలేకపోయింది. అనుకోకుండా మనిషి కనిపించడంతో బహుశా పులి కూడా అదే స్థితిలో వుండి వుంటుంది. ఫాతిమాలాగే పులి కూడా భయపడే వుంటుంది. గాండ్రించిందే తప్ప ముందుక్కదల్లేదు. మనుషులు అంత రుచికరమైన ఆహారం కాదని కూడా అనుకుని వుండవచ్చు. ముందరి కాళ్ల పంజాలతో గడ్డిని పెకలిస్తూ తలతిప్పి అటూ యిటూ చూసింది. కనిపిస్తున్న మనిషి మీద దానికి ఆసక్తి తగ్గినట్టే వుంది. చీకటి పడింది. తూర్పున కొండలు నల్లటి దయ్యాల్లా విస్తరించాయి. నీటిలో ప్రతిబింబాలు కనిపించడం లేదు. మంచు తుంపర్లతో వాతావరణం మరింత చల్లబడింది. కీటకాల రొద, గుడ్లగూబ అరుపు రాత్రికి స్వాగతం పలికాయి. కదలనంత మాత్రాన పులి నుండి ప్రమాదం తప్పిందని కాదు. భయ తీవ్రత తగ్గినా ఒంట్లో సత్తువ వుడిగినట్లుగా వుంది. చలి పెరిగింది. పులి కదలదు. రెండు చేతులతో పొట్ట తుడుముకుంది ఫాతిమా. పులి కదిలిందంటే రెండు ప్రాణాలు పోతాయి. అది తల పక్కకు తిప్పినప్పుడు, నీటిలో మునిగి నదీ గర్భంలో ఈత కొట్టింది. ఆ తీరప్రాంతవాసులందరికీ ఈత పుట్టుకతో వచ్చిన విద్య. ఎటువైపు ఈదితే గ్రామం చేరుకోవచ్చో ఆమెకు తెలుసు. నీటిలో వున్నా ఉపరితలం మీది కదలికలు ఆమెకు తెలుస్తూనే వున్నాయి. గాండ్రింపు యిప్పుడు దూరంగా వినిపించింది. పైకి వచ్చి పరికించింది. గ్రామంలోని దీపాలు కనిపించాయి. ఒడ్డుకు ఈదింది. అయితే, మధ్యాహ్నమెప్పుడో స్నానానికి వెళ్లిన తన కూతురు చీకటిపడినా తిరిగి రాలేదని నెత్తీనోరూ బాదుకుంటూ వూళ్లో ఇంటింటికీ వెళ్లి చెప్పింది ఫాతిమా తల్లి. ఆ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అందరికీ తెలుసు. ఎన్నిసార్లు ఎన్నింటిని చంపినా మళ్లీ మళ్లీ వస్తూనే వుంటాయవి. కర్రలూ, బరిసెలూ, దివిటీలు పట్టుకుని వేటకు బయల్దేరారు మగాళ్లు - ఒక్క మనిషిని రక్షించాలని కాదు. తమ తమ పశువులు, మేకలు, గొర్రెలు ఏమవుతాయోనని భయం. కుక్కిమంచాల మీద కూర్చుని, తమలపాకులు నముల్తున్న ముసలాళ్లు ఆ హడావుడి ఎందుకో అర్థంకాక ‘‘పొయ్యేకాలం’’ అంటూ గొణుక్కున్నారు. ఫాతిమాను చాపమీద పడుకోబెట్టారు. అందరూ గుమిగూడి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఇదే అదనుగా ఫాతిమా తల్లి వున్నవీ లేనివీ కల్పించి చెప్పి తన పరపతి పెంచుకోవడానికి ప్రయత్నించింది. ఈ ముసల్దాని కాకిగోల భరించలేక గ్రామ పెద్ద నోర్మూసుకొమ్మని కసురుకున్నాడు. ఫాతిమాకు మాట్లాడే ఓపిక లేదు. అయినా అడిగిన ప్రశ్నలన్నింటికీ నెమ్మదిగా జవాబిచ్చింది. అయితే, పులి గురించి ఎక్కువగా చెప్పడం ఆమెకిష్టంలేదు. జనం దాన్ని వెంటాడి చంపుతారు. అందువల్ల అదెక్కడ కనిపించిందో స్పష్టంగా చెప్పలేదు. గ్రామ పెద్దకు కోపం వచ్చింది. పులిజాడ తెలియకపోతే దాన్ని వేటాడటమెలా? ఫాతిమా చేసిన ‘సాహస కార్యం’ వల్ల తననే అందరూ కళ్లప్పగించి చూస్తున్నారు అనుకుంది తల్లి. ‘‘అంతా అల్లా దయ. ఇలాంటి ప్రమాదాల్నుంచి మానవమాత్రులెవరూ రక్షించలేరు. అల్లా! అల్లా! అంటూ చేతులెత్తి ప్రార్థించింది. అసలే విసిగిపోయివున్న గ్రామ పెద్ద ‘‘అల్లా రక్షించాడని నాకూ తెలుసు. కాని మరోసారి యిలాగే జరిగితే ఆయన రక్షించకపోవచ్చు. పులులు మనిషి వాసన పసిగట్టగలవు. దాన్ని వెంటనే చంపకపోతే ఈ వూళ్లో ఎవరికీ క్షేమం కాదు’’ అంటూ దృఢకాయులైన యువకులందర్నీ పోగుచేశాడు. పులి వేటంటే ప్రాణాలతో చెలగాటమే. ముఖ్యంగా, రాత్రి వేళ మరీ ప్రమాదం. అడవి దట్టంగా వుంటుంది. వ్యూహాత్మకంగా కూడా, వేటలో పులిదే పైచేయి అవుతుంది. ‘‘ఏం చేద్దాం?’’ అందరూ ఒకరిమొహాలొకరు చూసుకున్నారు. పిరికిపందల్లారా!’’ అనే మాటా నోటిదాకా వచ్చింది గ్రామపెద్దకు. అంతలోనే మామూద్ అనే యువకుడు తుపాకీ పట్టుకుని ముందుకొచ్చాడు. ‘‘మన ఫాతిమాకేమైంది? పులి దాడిచేసిందా? నమ్మలేకపోతున్నాను.’’ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు గ్రామపెద్ద. ‘‘ఇంకెందుకాలస్యం. దాన్ని వెంటనే చంపాలి.’’ అసహనంగా కుడిచేతి వేళ్లతో డబుల్ బ్యారెల్ గన్ను పట్టుకుని దయ్యం పూనిన వానిలా వూగిపోయాడు మామూద్. పులిని వేటాడే అవకాశం రావడం తన అదృష్టం. ‘‘పులి ఈ ప్రాంతంలో తిరిగినంత సేపూ స్త్రీలకు, పిల్లలకూ రక్షణ వుండదు. వాళ్లకేప్రమాదమూ రాకుండా చూడడమే మగవాళ్ల డ్యూటీ. నా వెంట ఎవరొస్తారో చెప్పండి. ఎవరూ రాకపోయినా నేనొంటరిగా పోగలను. నేను మా అమ్మకు పుట్టి వుంటే ఆ పులి కళేబరంతో తప్ప మళ్లీ వూళ్లో అడుగు పెట్టను.’’ అంటూ శపథం చేశాడు మామూద్. మొదట కాస్త సందేహించినా, ఓ డజనుమంది అతణ్ణి అనుసరించారు. మామూద్ తుపాకీ గురి తప్పదని వాళ్లకు తెలుసు. ఆ తర్వాత తలుపు మూసి, గడివేస్తూ ‘‘ఫాతిమా, ఇక మనం భయపడాల్సిందేమీ లేదు. అది పులి. వీడు బెబ్బులి.’’ అంది తల్లి. ఫాతిమా నెమ్మదిగా లేచి కిటికీ తెరిచింది. చెట్ల ఆకుల మీద, నీటిగుంటల మీద మెరుస్తున్నది కరిగిన వెండిలాంటి వెన్నెల. కొబ్బరిచెట్ల మీద కొబ్బరికాయ గుత్తులు నిండుగా కనిపిస్తున్నాయి. వేటకు బయల్దేరిన మనుషులు ఒకరినొకరు సైగలు చేసుకుంటున్నారు. ఫాతిమా మొహంలో విషాదం అలముకుంది. మనుషులు చెట్ల వెనక కనుమరుగైనారు. గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. నదిలోని నీటి గలగల తనతో సంభాషిస్తున్నట్టుగా వుంది. సాయంత్రం తాను నదిలోకి దిగిన చోటే తిరుగుతూ వుండి వుంటుంది పులి. అది ఈ మనుషుల కంటపడకుండా వుండాలని కోరుకుంది ఫాతిమా. రోట్లో పోకకాయలు దంచుతూ, ‘‘అల్లా, వేటకు వెళ్లిన కుర్రాళ్లను రక్షించు. వంద నక్కలకన్నా జిత్తులమారి ఆ పులి. చీకట్లో చూడగల శక్తి దానికుంది, తెల్లారేలోగా ఏ దుర్వార్త వింటానో, ఎవరు దానికి బలి అవుతారో!’’ అంటూ శోకాలు పెట్టింది తల్లి. ‘‘దాని మానాన దాన్ని వదిలేయొచ్చుగా!’’ అంది ఫాతిమా. ‘‘నీకు పిచ్చెక్కిందేవ్. అది మనల్ని చంపేలోగా మనం దాన్ని చంపాలి. తెలిసిందా!’’ అంది తల్లి. ‘‘దానంతటదే తిరిగి అడవిలోకి వెళ్లిపోతుంది. మనమెందుకూ దానివెంట పడడం?’’ ‘‘మనుషులను చూసిన పులి చంపకుండా ఎలా వుంటుంది?’’ ‘‘ఏమో. అది చంపగలిగే స్థితిలో లేదనిపించింది.’’ ‘‘నాకు యిరవై గజాల దూరంలోనే వున్నా అది నా మీదికి దూకలేదు. ఎందుకంటావు? అది నన్ను చూసింది. నేను దాన్ని చూశాను. అల్లా సృష్టిలో అన్ని జీవులూ వుంటాయి. తనలాగే నేనూ. దాని కళ్లలో కోపం కనిపించలేదు.’’ ‘‘మీ నాన్నలాగే నీకూ వేపకాయంత వైందేవ్. ఆ మహానుభావుడు చచ్చి స్వర్గంలో వున్నాడు కూడా- యిలాగే పిచ్చి పిచ్చిగా, గాలి పాటలు పాడుతుందని చెప్పేవాడు.’’ ఫాతిమా కిటికీ దగ్గర నిల్చుని కళ్లార్పకుండా చూసింది. శవం మీద కప్పిన చద్దర్ లాగుంది చీకటి. గర్భిణి గనక, కాళ్లూ చేతులు కూడా లావెక్కి గాలివూదిన బొమ్మలాగుంది ఫాతిమా. ఎక్కడైనా శబ్దం వినిపిస్తుందేమోనని చెవులు రిక్కించి వింది. వక్కల్ని దంచుతున్న రోకలి చప్పుడు లాగే ఆమె గుండె కూడా కొట్టుకుంటున్నది. ఇహ భరించలేక రెండు చేతులతో పొత్తికడుపును అదుముకున్నది. ‘‘ఏమైంది?’’ ‘‘ఏమీ లేదు’’ అంటూ పంటితో పెదవిని నొక్కి పట్టింది. ‘‘ఎంతసేపలా నిల్చుంటావు. పడుకుందువు గాని, రా.’’ కిటికీ వద్ద నుండి కదల్లేదు ఫాతిమా. అలలు అలలుగా వస్తున్నది నొప్పి. అడవిలో, పులి ఏ పరిస్థితిలో వుందో? అది పరిగెత్తగలదా? అది కూడా బాధను అనుభవిస్తుందా? రైఫిల్ పేలిన చప్పుడైంది. మరోసారి. బుల్లెట్ తన గర్భంలో దూసుకుపోయినట్టుగా గిలిగిలా కొట్టుకుంది గుండె. గాండ్రింపు కూడా వినిపించింది. అయితే, అది ఎవరి మీదికో దూకుతున్న భీకరమైన గాండ్రింపు కాదు. మృత్యువు వేదనలో కూడా ‘నేను స్వేచ్ఛాజీవిని’ అని ప్రకటించినట్టుగా వినిపించింది. ఆ గాండ్రింపులో దైన్యం వుంది. ప్రతిఘటన వుంది. ఆ క్షణంలో ఎలుగెత్తి రోదించగలిగితే ఫాతిమా కూడా అలాగే ఏడుస్తుంది. నొప్పులు భరించలేదు. ఒళ్లంతా చెమట పట్టింది. ‘‘అల్లా-అల్లా. ఏమవుతున్నదే. రా తల్లీ. చాప మీద పడుకో!’’ అంటూ అరిచింది తల్లి. ‘‘నొప్పులొస్తున్నాయమ్మా!’’ ముసలావిడ, నడిపించుకుంటూ వెళ్లి కూతుర్ని పడుకోపెట్టింది. ఫాతిమా కేకలతో గది ప్రతిధ్వనించింది. ‘‘హమ్మయ్య, అంతా అల్లా దయ. మగపిల్లవాడు పుడతాడు. నువ్వు కదలకు తల్లీ. వేడినీళ్లు తెస్తాను. తాగుదువుగాని. ఇంకా మంత్రసానిని పిలుచుకు రావాలి. ఈ రాత్రి ఎవరొస్తారు? ముసల్దాన్ని నేను దానికోసం అంతదూరం నడవగలనా?’’ అంటూ బిగ్గరగా తనలో తాను మాట్లాడుకుంది ముసలావిడ. చాపమీద కళ్లు మూసుకుని పడుకుంది ఫాతిమా. వంటింట్లో నీళ్లు మరగబెడుతున్న ముసలావిడ- ‘‘అదిగో, వాళ్లు తిరిగి వస్తున్నారు’’ అంటూ కేకేసింది. ఇంటి బయట కొందరు విజయోత్సాహంతో అరుస్తున్నారు. ఒకరిద్దరు తుపాకులు పైకి లేపి గాలిలో కాల్పులు జరిపారు. ముసలావిడ తలుపు తెరిచింది. ఇంటి ముందర పోగయ్యారు జనం. ‘‘మామూద్ వున్నంత వరకూ మనకు భయం లేదు పెద్దమ్మా. టపటపమంటూ రెండు రెండు సార్లు కాల్చి దాన్ని మట్టుబెట్టాడు మన వీరుడు. అది చాలా పెద్ద మృగం. మొదట మమ్మల్ని చంపుతానని భయపెట్టిందిలే. తుపాకీ కాల్చిన తరువాత వెళ్లి బరిశలతో పొడిచి నిజంగా చచ్చిందని నిర్ధారించారు’’ అంటూ గర్వంగా చెప్పాడో యువకుడు. ఫాతిమా కళ్లు తెరిచి ఆ కుర్రాణ్ణి చూసింది. ‘‘ఆ తర్వాతేమైంది?’’ కాస్త సందేహించి, ‘‘పులిని చంపిన తర్వాత కూడా ఏవో శబ్దాలు వినిపించాయి. హరికేన్ లాంతర్ల వెలుగులో చచ్చిన తల్లి పక్కనే యింకా కళ్లు తెరవని మూడు పులికూనలు కనిపించాయి. అవి నేలమీద పడి గంట కూడా అయివుండదు. కాని తల్లి తన పిల్లల కోసం ఎలా పోరాడిందనుకున్నావు. పులికూనల్ని అమ్మితే మంచి ధర వస్తుందన్నాడు మామూద్’’ అంటూ తన కథనం ముగించాడు యువకుడు. భరించలేని బాధతో మూల్గింది ఫాతిమా. పసుపు పచ్చని చెమట ముత్యాలు మెరిశాయా బాలింత చర్మం మీద. ఎవరితో పంచుకోగలదు తన దుఃఖం. ‘‘అమ్మా!’’ అంటూ అరిచింది. ‘‘త్వరగా వెళ్లండి. మంత్రసానిని పిలుచుకురండీ’’ అంటూ జనాన్ని పంపించి తలుపేసింది ముసలావిడ. తెలుగు: ముక్తవరం పార్థసారథి ఎస్.రాజరత్నం ప్రఖ్యాత మలయా (మలేసియా) కథా రచయిత, జర్నలిస్ట్, రాజకీయవేత్త. బి.బి.సి లండన్‌లో పని చేశారు. ఆ తర్వాత సింగపూర్‌లో పాత్రికేయుడిగా పని చేస్తూ రాజకీయాలలో చేరి సింగపూర్ డిప్యూటి ప్రైమ్ మినిస్టర్ (1980-85)గా ప్రజల ఆదరణ పొందారు. ‘ది స్పెక్టేటర్స్’ ఆయన కథాసంపుటి పేరు. 2006లో మరణించారు. ‘మృగాల’లలో కూడా ఉన్న తల్లి అంశను వ్యక్తపరిచే ఈ అద్భుత కథను ‘మదర్స్ డే’ సందర్భంగా సాక్షి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. -
భార్యపై దాడి చేసిన కార్పొరేటర్
నిజామాబాద్ క్రైం : భార్యపై దాడి చేసిన నిజామాబాద్ నగరం 37వ డివిజన్ కార్పొరేటర్ మీర్ పర్వేజ్‌అలీ, అతని తమ్ముడు, మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, వారి సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగర ఐదవ ఠాణా ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం, పర్వేజ్‌అలీ, అఖిల ఫాతిమా దంపతులు కొంత కాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పర్వేజ్ అలీ పోటీ చేశాడు. డబ్బులు అవసరం ఉండడంతో భార్యను పుట్టించి నుంచి రూ. రెండు లక్షలు తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అందుకు ఫాతిమా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆమె హైదరాబాద్‌లోనే ఉండి పోయింది. ఎన్నికల్లో పర్వేజ్ అలీ విజ యం సాధించాడు. బుధవారం నిజామాబాద్ వచ్చిన ఫాతిమాకు, పర్వేజ్ అలీ మధ్య గొడవ ప్రారంభమైంది. ఇంతలో పర్వేజ్ అలీ, అతని తమ్ముడైన మీర్ మజాజ్ అలీ కలిసి ఫాతిమాపై దాడి చేశారు. తల్వార్ పిడితో తలపై, భుజంపై గాయపర్చారు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేయడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. అహ్మద్పురాలో నివాసం ఉండే ఆమె తండ్రి మంజూర్ అలీ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని అల్లుడిని నిలదీశాడు. మళ్లీ గొడవైం ది. అనంతరం ఫాతిమాను ఆస్పత్రిలో చేర్పించారు.