కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
పేద వైద్య విద్యార్థినికి ఊరట
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.
మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్‌లోని మేఘన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో బీడీఎస్‌లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు.
అయితే అక్టోబర్ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్íÙప్ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment