పోలీస్ విభాగానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎం.సురేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్‌లో పోలీస్ ట్రెనింగ్ కాలేజీ (పీటీసీ)కి చెందిన 350 గజాల స్థలాన్ని మహ్మద్ ఇద్రీస్(56) కబ్జా చేసేందుకు యత్నించాడు.
స్థలం చుట్టూ సిమెంట్ దిమ్మెలు ఏర్పాటుచేసి 59 జీవో ప్రకారం రెవెన్యూ అధికారులకు డీడీ కూడా చెల్లించాడు. అధికారులు విచారణకు వస్తారని తెలుసుకున్న ఇద్రీస్ స్థలం చుట్టూ ఉన్న చెట్లను కొట్టివేయడంతో పాటు మరికొంత నిర్మాణం చేసేందుకు యత్నించాడు. దీనిని గమనించిన ఫలక్‌నుమా పోలీసులు మార్చి 3వ తేదీన ఇద్రీస్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఇద్రీస్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసు శాఖ స్థలానికే పొగబెట్టాడు!
Published Wed, Apr 1 2015 11:42 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement