హైదరాబాద్: లింగంపల్లి-ఫలక్నుమా ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయింది. రెండవ నంబర్ ప్లాట్ పామ్ డెడ్ ఎండ్ను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమయింది.
క్యాబిన్లో ఇరుక్కునపోయిన డ్రైవర్ను సహాయక సిబ్బంది కాపాడారు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
ఎంఎంటీఎస్ రైలుకు ప్రమాదం
Published Wed, Oct 9 2013 9:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement