Nampally Railway Station
-
ఉదయం నాంపల్లిలో ప్రమాదం.. సాయంత్రానికి మళ్లీ చార్మినార్ కూత
-
రైలు ప్రమాదంలో ప్రయాణికుల పరిస్థితి..!
-
నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్
-
నాంపల్లి: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లకు మినహాయించి.. ఇతర ఏ సర్వీసులకు ఇబ్బంది కలగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద రైలు కోచ్ లని టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు తెలిపారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ఉదయం ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో.. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్ సైడ్వాల్ను ఢీకొట్టింది. రైలు స్లోగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పగా, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో రైలు డెడ్ ఎండ్‌కు వచ్చిన తర్వాతే ప్రమాదం జరిగిందని సీపీఆర్వో రాకేష్ తెలిపారు. డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతోనే రైలు పట్టాలు తప్పిందన్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలోని రైల్వే అధికారుల బృందం సహాయ, పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ సంఘటనపై చట్టబద్దమైన విచారణను నిర్వహిస్తుందని తెలిపారు. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు నాంపల్లి రైల్వేస్టేషన్లో సహాయక చర్యల దృష్ట్యా పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు నాంపల్లి-మేడ్చల్, మేడ్చల్-హైదరాబాద్, హైదరాబాద్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫారమ్ 1,2 వైపు నుంచి రైళ్ల రాకపోకలు సాగాయి. ఈ రోజు షెడ్యూల్లో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడిపారు. ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. పట్టాలు కొద్దిగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇదీ చదవండి: సంక్రాంతికి మరో ఆరు ప్రత్యేక రైళ్లు -
నాంపల్లి, యాదాద్రి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి షురూ
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: నిజాంకాలం నాటి చారిత్రక నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.309 కోట్ల నిధులతో చేపట్టిన నాంపల్లి రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ప్రధాని లాంఛనంగా పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ అధికారి భరతేశ్కుమార్ పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 12 కొత్త ప్రాజెక్టులకు రైల్వేశాఖ రూ. 8,494 కోట్లు మంజూరుచేసిందని చెప్పారు. త్వరలో రూ.350 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మరో రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.700 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడేళ్లలో అధునాతన సికింద్రాబాద్ స్టేషన్ వినియోగంలోకి వస్తుందన్నారు చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి, విస్తరణ తుది దశకు చేరుకుందని, 2024లో సేవలు ప్రారంభమవుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్టీసీ విలీనం చేయాల్సిందే కానీ... ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. ఆర్టీసీకి ఉన్న రూ.వేల కోట్ల విలువైన స్థలాలను కాజేసేందుకే ఆగమేఘాల మీద విలీనం చేస్తున్నట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. రూ.25.24 కోట్లతో యాదాద్రి స్టేషన్ అభివృద్ధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలోని యాదాద్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.25.24 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని చిత్ర పటానికి భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పాలాభిషేకం చేశారు. -
నాంపల్లి రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
నాంపల్లి: హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ఓ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్, బూస్పేర్ ప్రాంతానికి చెందిన గర్భిణి ఆసియా ఖాతూన్, భర్త అసబుద్దీన్‌తో కలిసి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమై నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ఫారం–3 మీద రైలు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అక్కడే విధుల్లో ఉన్న జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు ఈ విషయం గమనించారు. అంబులెన్స్‌లో నిలోఫర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే ఆమె మూడు కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళా కానిస్టేబుల్ కళ్యాణి.. ఆసియా ఖాతూ న్ వెంట ఉండి అన్ని రకాల సేవలు అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. -
‘స్కానింగ్’ అయ్యాకే రైళ్లలోకి పార్శిళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రైళ్లలో రవాణా చేసే పార్శిళ్లను తనిఖీ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటుచేసి, పరిశీలించాకే పార్శిళ్లను రైళ్లలోకి ఎక్కించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి పార్శిళ్ల స్కానర్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఏర్పాటైంది. త్వరలో మిగిలిన ప్రధాన స్టేషన్లలోనూ ఏర్పాటు కానున్నాయి. దర్భంగా పేలుడుతో.. గతేడాది బిహార్‌లోని దర్భంగా స్టేషన్లో పార్శిల్ వ్యాగన్లో తీవ్రవాదులు అమర్చిన బాంబు పేలిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రయాణికుల రైళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పార్శిళ్లను వినియోగించాలని పథకాలు రచిస్తున్నట్టు కేంద్రం గుర్తించింది. ప్రయాణికుల రైళ్లలో తీసుకెళ్లే పార్శిళ్ల కోసం తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రైల్వేని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రయాణికుల రైళ్లలో పార్శిళ్లు పెద్దమొత్తంలో తరలే స్టేషన్లలో నాంపల్లి తొలి స్థానంలో ఉంటుంది. దీంతో తొలి స్కానర్ ఏర్పాటుకు ఈ స్టేషన్‌నే ఎంపిక చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో.. స్కానర్ల ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే దిశగా రైల్వే యోచిస్తోంది. ఇదే తరహాలో నాంపల్లి రైల్వే స్టేషన్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ యూనిట్‌ను ఇటీవలే ప్రారంభించింది. తాజాగా పార్శిల్ స్కానర్‌నూ ఏర్పాటు చేయించింది. ఇందుకు ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. నాంపల్లి నుంచి టన్నుల కొద్ది పార్శిళ్లు వెళ్తాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా వ్యాగన్ మొత్తాన్ని పార్శిల్ కోసం బుక్ చేసుకుంటాయి. వీటిని లీజ్డ్ వ్యా న్లుగా పేర్కొంటారు. ఇలాంటి లీజ్డ్ వ్యాన్లలో తరలే పార్శిల్‌కి రూ.5, లీజ్డ్ కాని వ్యాన్లలో తీసుకెళ్లే ప్రతి పార్శిల్‌కి రూ.10 చార్జ్ చేస్తారు. ఈ మొత్తం ఆ ప్రైవేటు సంస్థ తీసుకుంటుంది. స్కానింగ్ తరువాతే లోడింగ్.. భారతీయ రైల్వేలోని న్యూఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్‌లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. స్కానర్ ద్వారా తనిఖీ చేసిన పార్శిళ్లపై ప్రత్యేకం గా స్టిక్కర్లు అతికిస్తారు. వాటిని మాత్రమే లోడింగ్‌కు అనుమతిస్తారు. కంప్యూటర్ ఆధారిత స్కానర్ల వల్ల పార్శిళ్లలో ఉన్న వస్తువులను, ప్రమాదకర పదార్థాలను గుర్తించటం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. నాంపల్లి స్టేషన్లో స్కానర్లు అమర్చటంలో కీలకంగా ఉన్న సికింద్రాబాద్ డీఆర్ఎం అభయ్‌కుమార్ గుప్తా, సిబ్బందిని దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు. -
సికింద్రాబాద్, నాంపల్లి: మాకొద్దీ స్టేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి అంశం మరోసారి వెనక్కి వెళ్లింది. రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు సరికదా కనీసం ఆసక్తి కూడా చూపకపోవడం గమనార్హం. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను విమానాశ్రయం తరహాలో పునరభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు గత నాలుగేళ్లుగా నానుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్ఎస్డీసీ) రెండుసార్లు, గతంలో దక్షిణమధ్య రైల్వే రెండుసార్లు ఇన్వెస్టర్లను ఆహ్వానించాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. మొదట్లో కొన్ని కన్సార్టియంలు ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ బిడ్డింగ్ దశలో వెనుకంజ వేశాయి. ఇటీవల ఐఆర్ఎస్డీసీ మరోసారి బిడ్డింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోవిడ్ దృష్ట్యా ఇన్వెస్టర్లు, కన్సార్టీయంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. మరోవైపు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు రైల్వేస్టేషన్ల పునరభివృద్ధిలో కూడా ఇలాంటి అనాసక్తి వ్యక్తం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను పెండింగ్ జాబితాలో పెట్టినట్లు పేర్కొన్నారు. ఎందుకీ అనాసక్తి. ►రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగానే స్టేషన్ల రీడెవలప్మెంట్ ముందుకు వచి్చంది. ఐఆర్ఎస్డీసీ సైతం అదే లక్ష్యంతో ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లను ‘డిజైనింగ్, బిల్డింగ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్’ అనే పద్ధతిలో ప్రైవేట్‌సంస్థలకు అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ►దక్షిణమధ్య రైల్వేలో మొదటి దశలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ స్టేషన్ల రీ డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడి సంస్థలు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం లభిస్తుంది. పైగా రైల్వే సొంతంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదు. ►కింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను 45 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత నిర్మాణాలతో సహా స్టేషన్లను రైల్వేకు అప్పగించవలసి ఉంటుంది. కానీ ఈ లీజు కాలపరిమితికి బడా కన్సార్టియంలు విముఖతను వ్యక్తం చేశాయి. లీజు గడువును పెంచాలని కోరాయి. కానీ రైల్వేశాఖ అంగీకరించకపోవడంతో రీ డెవలప్మెంట్ వాయిదా పడింది. ఇప్పుడు కోవిడ్... ►మొదట్లో లీజు గడువు తక్కువగా ఉందనే కారణంతో ఇన్వెస్టర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాగా ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంచుమించు గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. ►ఒక్క ఢిల్లీ రైల్వేస్టేషన్ల రీడెవలప్మెంట్ మాత్ర మే పట్టాలెక్కింది. మిగతా చోట్ల అటకెక్కింది. ►సాధారణంగా 7 నుంచి 12 మంది ఇన్వెస్టర్లు లేదా నిర్మాణ సంస్థలు ముందుకు వస్తే అనూహ్యమైన స్పందన ఉన్నట్లుగా భావిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు 2 నుంచి 3 సంస్థల కంటే ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం. మూడంచెల్లో నిర్మాణం... ఐఆర్ఎస్డీసీ ప్రతిపాదించినట్లుగా స్టేషన్లను పునరభివృద్ధి చేస్తే ఇప్పుడు ఉన్న స్టేషన్‌కు ఏ మాత్రం విఘాతం కలగకుండా కింద మూడు వరుసల్లో పార్కింగ్, పైన మూడు వరుసల్లో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫామ్‌లపైన డోమ్ ఆకారంలో పై కప్పు ఏర్పాటు చేస్తారు. దీంతో ఇది పూర్తిగా ఎయిర్‌పోర్టు తరహాలో కనిపిస్తుంది. -
ఏం కష్టమొచ్చిందో పాపం.. రైలులో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నాంపల్లి: హుబ్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ఓ రైలులోని ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ప్లాట్ఫారం మీదకు వచ్చిన రైలు బోగీలో ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యాన్ని చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని నాంపల్లి (హైదరాబాదు) రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాదు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్ఫారం–1 మీద నిల్చున్న రైలులోని ప్రయాణికులందరూ దిగిపోయారు. కానీ వస్తు రవాణా కోసం ఉంచిన పార్శిల్ బోగీలో 60 ఏళ్ల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హైదరాబాదు రైల్వే స్టేషన్లో ఆగిన రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తరలించే ముందు రైల్వే సిబ్బంది బోగీలను పరిశీలించారు. ఎస్ఎల్ఆర్ పార్శిల్ బోగీలో వేలాడుతూ మృతదేహం కనిపించడంతో రైల్వే సిబ్బంది స్థానిక జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి భద్రపరిచారు. -
Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్ కాడా...
సాక్షి, హైదరాబాద్ : ఓవైపు కోవిడ్ విజృంభణ... మరోవైపు ప్రజల్లో మళ్లీ లాక్డౌన్ భయాలు... వెరసి నగరం నుంచి చాలామంది సొంతూళ్లకు బయల్దేరి వెళ్లిపోతున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేయించుకుని రైళ్లలో వెళ్లిపోయేవారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు కానీ తత్కాల్ టికెట్ల ద్వారా బుక్‌చేసుకుని వెళ్లానుకునే ప్రయాణికులకు మాత్రం ‘తత్కాల్ టికెట్ల దందా’చుక్కలు చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)లో తత్కాల్ టికెట్ల దందా అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. గతంలో తత్కాల్ టికెట్‌ను పొందేందుకు రైల్వే రిజర్వేషన్ కేంద్రానికి వచ్చిన వారికి టోకెన్లను అందజేసేది. ఈ టోకెన్ల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్ వద్ద రాత్రంతా జాగారం చేసేవారు. అయితే ఈ టోకెన్ల విధానానికి హైదరాబాద్ రైల్వే స్టేషన్ స్వస్తి పలికింది. తత్కాల్ టికెట్ జారీ చేసే సమయానికి క్యూలో నిలబడిన వారిని తోసుకుని ఎవరెవరో ముందుకొచ్చేసి టికెట్ తీసేసుకుంటున్నారు. క్యూలో నిలబడిన వారందరికీ టికెట్ మాత్రం లభించడం లేదు. దీంతో ఎలాగైనా ప్రయాణం చేయాలనుకునేవారు తత్కాల్ టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల అవసరాన్ని అదునుగా తీసుకున్న దళారులు రెట్టింపు ధరలతో వారి నుంచి వసూలు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధి కారులు తత్కాల్ టికెట్ల జారీపై దళారుల ప్రమేయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! -
శభాష్ పోలీస్..
సాక్షి, నాంపల్లి: కదులుతున్న రైలు నుంచి దిగుతూ కిందపడిన ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్లాట్ఫారం-రైలుకు మధ్యన ఇరుక్కుపోయే సమయంలో అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు శ్రవణ్ చాకచక్యంగా ప్రమాదపు అంచుల్లో ఉన్న ప్రయాణికుడిని కాపాడాడు. ఈ సంఘటన నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రయాణికుడిని హోంగార్డు కాపాడుతున్న సీపీ పుటేజి (దృశ్యాలు) పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే... నగరంలో నివాసం ఉంటున్న ఆర్మీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ బంధువు రాహుల్(23) హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి నగరానికి బయలుదేరాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 11.20 గంటల సమయంలో రైలు బేగంపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. సెకండ్ ఏసీలో ప్రయాణిస్తున్న రాహుల్ (దిగాల్సిన స్టేషన్లో) దిగకుండా రైలు ఆగి కదిలే సమయంలో దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్ఫారం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో కింద పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న నాంపల్లి ఆర్పీఎఫ్ హోంగార్డు శ్రవణ్ అప్రమత్తమై రాహుల్‌ను ఒక్కసారి పట్టుకుని పక్కకు లాగడంతో అతను ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు కాపాడిన హోంగార్డు శ్రవణ్‌కు రాహుల్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రయాణికుడిని కాపాడిన హోంగార్డు శ్రవణ్‌ను జీఆర్పీ ఇన్స్పెక్టర్ జనార్దన్ చౌదరి అభినందించారు. విధుల పట్ల, ప్రయాణికుల పట్ల అతడికి ఉన్న బాధ్యతను మెచ్చుకున్నారు. -
సులభ్ కాంప్లెక్స్‌లో తపంచాల కలకలం
నాంపల్లి: హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో రెండు రివాల్వర్లు దొరికాయి. శుక్రవారం రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వా«దీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్నవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆధారాలతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. శనివారం మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్, సైఫాబాదు డివిజన్ ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్లు ఖలీల్ పాష, అదనపు ఇన్స్పెక్టర్ కిషోర్, ఎస్సై రెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దోపిడీదారులు, రౌడీ షీటర్లు,నక్సలైట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు నగరానికి వచ్చి, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అలాగే విక్రయించడం కోసం ఎవరైనా తీసుకువచ్చారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్పోర్ట్ లుక్కు.. నాంపల్లి తళుక్కు!
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణ, ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు, ఫుడ్‌కోర్టులు, వినోద కార్యక్రమాలు, మల్టీలెవల్ కారు పార్కింగ్ వంటి సదుపాయాలతో విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుత స్టేషన్ నమూనాను మార్చకుండానే కొత్తరూపునిచ్చేందుకు ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) ప్రణాళికలను రూపొందించింది. ‘లష్కర్’ వెనక్కి.. ‘నాంపల్లి’ ముందుకు రోజూ 1.8 లక్షల మందికిపైగా రాకపోకలు సాగించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దక్షిణ మధ్య రైల్వే గతంలో ప్రణాళికలు రూపొందించింది. కానీ నిర్మాణ సంస్థలు ముందుకు రాలేదు. దీంతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి, విస్తరణ, నిర్వహణ లక్ష్యంతో నోడల్ ఏజెన్సీగా ఏర్పాటైన ఐఆర్ఎస్డీసీ.. సికింద్రాబాద్ బదులు నాంపల్లి స్టేషన్‌కు ప్రాధాన్యతనిచ్చింది. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో నాంపల్లి రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా 5 స్టేషన్ల ఎంపిక చారిత్రక, సాంస్కృతిక, వారసత్వ కట్టడాలున్న నగరాల్లో రైల్వేస్టేషన్లను పర్యాటక హంగులతో తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉం ది. ఈ క్రమంలో ఐఆర్ఎస్డీసీ దక్షిణమధ్య రైల్వే పరిధిలోని నాంపల్లితో పాటు, సికింద్రాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, జాల్నా స్టేషన్లను అభివృద్ధికి ఎంపిక చేసింది. అజం తా, ఎల్లోరా గుహలు ఉన్న ఔరంగాబాద్ స్టేషన్ విస్తరణకు మొదట ప్రాధాన్యమిచ్చింది. 400 ఏళ్ల నాటి చారిత్రక హైదరాబాద్‌ను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకొనేలా అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశారు. నాటి ప్రాభవానికి మళ్లీ వెలుగులు నిజాం పాలకులు నాంపల్లిలో ‘హైదరాబాద్ దక్కన్ రైల్వేస్టేషన్’ను కట్టించారు. పబ్లిక్‌గార్డెన్స్‌ను ఇష్టపడే నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్.. దానికి ఆనుకొని ఈ స్టేషన్‌ను నిర్మించారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలపడంలో ఇది కేంద్రబిందువు. అయితే దీని ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. నిత్యం ఇక్కడినుంచి 65 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. అయితే నాంపల్లి స్టేషన్ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న 28 ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను నిర్మించి భారీ షాపింగ్ మాల్స్, సూపర్బజార్లు, హోటళ్లు వంటి వాటి కోసం అద్దెకివ్వాలని భావిస్తున్నారు. ఇవీ కొత్త హంగులు - ఇప్పుడున్న స్టేషన్‌కు రెండు వైపులా విస్తరణ.. వాక్‌వేల ఏర్పాటు - స్టేషన్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో రైళ్లు ఆగి, బయలుదేరుతాయి. మొదటి అంతస్తులో ప్రయాణికుల వెయిటింగ్ హాళ్లు.. - స్టేషన్ బయట మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం - ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో 4 అంతస్తుల భవన సముదాయాలను నిర్మించి అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు -
క్షణం ఆలస్యంగా వస్తే పరిస్థితి ఏమయ్యేదో!?
-
క్షణం ఆలస్యమైనా.. శవమయ్యేవాడే!
సాక్షి, హైదరాబాద్ : కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసు కానిస్టేబుల్ రక్షించారు. రైలుతో పాటు ఈడ్చుకుపోతున్న అతడిని సురక్షితంగా బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషనులో గురువారం చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన 12 సెకన్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుడిని చాకచక్యంగా బయటికి లాగిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే విధంగా..‘క్షణం ఆలస్యం అయి ఉంటే అతడు శవమయ్యేవాడు. కాబట్టి రైలు ఎక్కేపుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ’అని సూచిస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు జరిగినపుడు విలువైన ప్రాణాలు కాపాడేందుకు రైల్వే పోలీసులు వెంటనే స్టేషన్ మాస్టర్ లేదా డ్రైవర్‌ను వెనువెంటనే అప్రమత్తం చేసేలా అలెర్ట్ డివైజ్‌లు తెచ్చే ఆలోచన చేయాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ట్వీట్ చేస్తున్నారు. -
నాంపల్లిలో భయం..భయం..
నాంపల్లి: హైదరాబాదు రైల్వే స్టేషన్ ఎదుట పోకిరీల బెడద ఎక్కువైపోంది. నానాటికి వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అటు సందర్శకులను ఇటు పోలీసులను బెంబేలెత్తిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్, పబ్లిక్‌గార్డెన్ గేటును అడ్డాగా చేసుకుని జీవిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిలోఫర్ ఆసుపత్రి వద్ద దాతలు వడ్డించే భోజనాలు స్వీకరిస్తారు. భోజనాలు ఆరగించిన పోకిరీలు నాంపల్లి సరాయికి చేరుకుంటారు. అక్కడే చెట్ల కింద సేదతీరుతూ వచ్చి పోయే వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. సరాయి పక్కనే ఉండే మోతి వైన్స్ దగ్గర ప్రయాణికుల జేబులు, ఎండ వేడిమికి చెట్ల కింద సేదతీరే సందర్శకుల జేబులను కొట్టేస్తుంటారు. ఇలా కొట్టేసిన డబ్బు పంచుకునే క్రమంలో విభేదాలు వచ్చి హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతారు. గడచిన ఏడాది కాలంలో మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు జరిగాయి. హత్యలు చేసిన పోకిరీలు పరావుతుంటారు. పరారైన వారిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక రాత్రి వేళల్లో ట్యాక్సీ స్టాండ్ కేంద్రంగా హిజ్రాలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తమ దగ్గరకు వచ్చిన విటులను ఒళ్లును గుల్ల చేసి పంపుతున్నారు. కాదు కూడదంటే దౌర్జాన్యాలకు పాల్పడి చంపేస్తున్నారు. మితిమీరిపోతున్న పోకిరీలు, హిజ్రాలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. వీరి స్థావరాలపై దాడులు చేసి నాంపల్లిలో నిలువకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే నిలోఫర్ ఆసుపత్రి ఎదుట అన్నదానాలు చేసే దాతలు రోగి సహాయకులకు కాకుండా పోకిరీలకు అన్నం వడ్డించకుండా చర్యలు తీసుకోవాలి. అంతేకా>కుండా నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదుట అధునాతన భవన నిర్మాణం పేరుతో కూల్చివేసిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్, లా అండ్ ఆర్డర్ ఔట్ పోస్టు ఉండేందుకు భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. స్టేషన్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తిపై కత్తితో దాడి... ఆదివారం మధ్యాహ్న పోకిరీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యారు. గాయాలపాలైన వ్యక్తిని హుటా హుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి కోసం నాంపల్లి పోలీసులు గాలిస్తున్నారు. దాడిలో గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంఎంటీఎస్ రైలు ఢీకొని సాక్షి విలేకరి మృతి
హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో ‘సాక్షి’విలేకరి దుర్మరణం చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ ప్రాంతానికి చెందిన బాల మైసయ్య(40) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో బోరబండ–హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. దీంతో బాల మైసయ్య దుర్మరణం చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మైసయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు బాల మైసయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రం ‘సాక్షి’విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వరూప, కుమారులు వసంత్(10), రిషిత్(7) ఉన్నారు. శనివారం మంచిర్యాలలో జరిగే తన అక్క కుమార్తె వివాహానికి హైదరాబాద్‌లో ఉండే బంధువులను తీసుకెళ్లేందుకు వచ్చి మృత్యువాతపడ్డారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రేగొండ కంట్రిబ్యూటర్ దుర్మరణం
సాక్షి, భూపాలపల్లి : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. మృతుని జేబులో ఉన్న అక్రిడిటేషన్ కార్డు ఆధారంగా అతన్ని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల న్యూస్ కంట్రిబ్యూటర్ మైస బాలయ్యగా గుర్తించారు. బాలయ్య సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారు. రైల్వే పోలీసులు భూపాలపల్లి రిపోర్టర్‌కు సమాచారం అందించారు. -
అట్టపెట్టెలో అరవైఐదు లక్షలు!
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ సాయంత్రం 4 కావస్తోంది. ముంబై వెళ్లేందుకు నలుగురు వ్యక్తులు ప్లాట్‌ఫాంపై కొన్ని అట్టపెట్టెలతో నిలుచుని ఉన్నారు. పది నుంచి ఇరవై బాక్సులను రైల్లో ఎక్కించేందుకు సిద్ధపడుతుండగా రైల్వే పోలీసులు వచ్చి వాటిల్లో రెండు బాక్సులను తెరచి చూశారు. అట్టపెట్టెల్లో పైన ఎల్ఈడీ బల్బులు వాటి కింద నోట్ల కట్టల్ని చూసి షాక్ అయ్యారు. తర్వాత అన్ని బాక్సుల్లో ఉన్న రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. జనరల్ రైల్వే పోలీసు విభాగం ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాజేంద్రప్రసాద్ వెంటనే రంగంలోకి దిగారు. హవాలా కాదు..: ఈ నెల 5న వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై రైల్వే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముందు హవా లా డబ్బుగా భావించినా విచారణలో ఆసక్తికరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన పలు ఫైనాన్స్ సంస్థలు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో జీరో దందా చేస్తున్న వ్యాపారులకు ఏటా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు అప్పులిచ్చాయి. వీటికి సంబంధించి ప్రతి నెలా చెల్లించాల్సిన వడ్డీ డబ్బులను ఈ విధంగా పంపిస్తున్నారు. ముంబైకి చెందిన 4 ప్రధాన ఫైనాన్స్ కంపెనీలు బేగంబజార్ నుంచి వడ్డీ సొమ్మును రెండున్నరేళ్లుగా ఇదే రీతిలో తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. ఎలాంటి సందేహం రాకుండా ఉండేందుకు వడ్డీ వ్యాపార మాఫియా ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు బయటపడింది. వడ్డీకిచ్చిన సొమ్ముకు లీగల్‌గా లెక్కాపత్రం లేకపోవడంతో తిరిగి వసూలు చేసుకునే వ్యవహారాన్నీ చీకటి మార్గం లోనే చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రా పార్శిల్స్ కేంద్రంగా.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బాలపై ఉస్మాన్‌గంజ్‌లోని ఆంధ్రా పార్శిల్స్ సర్వీసెస్‌కు చెందిన ప్యాకింగులుండటం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు ఏజెన్సీ వ్యక్తులు బిహార్‌కు చెందిన వారు కావడం, వీరంతా ఆంధ్రా పార్శిల్స్ సర్వీస్‌లో పనిచేస్తుండటం వడ్డీ మాఫియా వ్యవహారంలో కీలకంగా మారింది. ఆంధ్రా పార్శిల్స్ పేరుతో హవాలా సొమ్ము రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా పార్శిల్స్ మేనేజర్ లాల్జీ పరారీలో ఉండటంతో కేసులో అతడే కీలక సూత్రధారి అని భావిస్తున్నారు. అతడు నేరుగా వెళ్లకుండా వడ్డీ డబ్బులను ఈ రకంగా ముంబై ఫైనాన్స్ కంపెనీలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచే కాకుండా ఆంధ్రా పార్శిల్స్ పేరుతో దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి దందా సాగుతుందో విచారణలో తెలుసుకుంటామని, లాల్జీ కోసం తమ బృందాలు వెతుకుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఫైనాన్షియర్లు, బేగంబజార్‌కు చెందిన వ్యాపారుల జాబితా కూడా తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. -
కూ.. చుక్.. చుక్
1907.. నాంపల్లి రైల్వే స్టేషన్.. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను 1907లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. అయితే 1921 వరకు ప్రయాణికులను ఇందులోకి అనుమతించలేదు. స్టేషన్‌ను గూడ్స్ రైళ్ల కోసమే వినియోగించారు. బొంబాయి తదితర ప్రదేశాల నుంచి వచ్చే సరుకులను సికింద్రాబాద్ నుంచి నాంపల్లి వరకు తీసుకురావడానికి ఈ స్టేషన్ అనుకూలంగా ఉండేది. ఆ రోజుల్లో.. కచ్రం ఎడ్ల బండ్లు, జట్కాలే దిక్కు.. ఈ రోజుల్లో ఉన్నట్టుగా ప్రభుత్వ రవాణా వ్యవస్థ అ రోజుల్లో ఉండేది కాదు.. జమిందారులు, ప్రభుత్వ అధికారులు సొంత గుర్రాలు, ఎడ్లబండ్లలో ప్రయాణం చేసేవారు.. లేదంటే ప్రభుత్వం కేటాయించిన గుర్రాలు, గుర్రపు బగ్గీలపైనే వెళ్లే వారు. సాధారణ ప్రజల పరిస్థితి దారుణంగా ఉండేది. కాస్తో కూస్తో ఉన్న వారు సొంత ఎడ్ల బండ్లపై రోజుల తరబడి ప్రయాణం చేసి గమ్యానికి చేరుకునేవారు.. అదే పేదలైతే కాలినడకనే ప్రయాణం సాగించేవారు. మారుమూల గ్రామలు, తాలుకాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు వచ్చినా.. లేక పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వేరే జిల్లాలకు, ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినా.. కచ్రం ఎడ్ల బండ్లు అద్దెకు తీసుకుని వేళ్లావారు. హైదరాబాద్ సంస్థానంలోని దాదాపు అన్ని గ్రామాల్లో కచ్రాలు అద్దెకు లభించేవి. ఆ రోజుల్లో దొరలు, జమిందారులు, భుస్వాములు, ధనికుల వద్ద సొంత కచ్రాలు ఉండేవి. వాటిని వారు రోజుల చొప్పున అద్దెకు ఇచ్చే వారు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే.. ఊళ్లో జనమంతా ప్రణాళిక వేసుకుని అందరూ కలసి కచ్రం అద్దెకు తీసుకుని వెళ్లే వారు. ప్రపంచంలోనే తొలి స్వతంత్ర రైల్వే వ్యవస్థ హైదరాబాద్ స్టేట్. ఈ పేరు వింటే ఘనమైన గతమంతా కళ్ల ముందు కదులుతుంది. దేశంలోనే సుసంపన్నమైన హైదరాబాద్ రాష్ట్రంలో అన్నీ అద్భుతాలే. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాంల హయాంలో ప్రతిదీ ప్రత్యేకమే. నిజానికి అదో దేశం. బ్రిటిష్ వలస నీడకు దూరంగా ఎదిగిన రాజ్యం. కరెన్సీ, పోస్టల్, ఎయిర్వేస్ ఇలా అన్నీ స్వతంత్రమే. వీటికి తోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్ సొంతం చేసుకుంది. అదే స్వతంత్ర రైల్వే. అవును.. ఈ దేశంలో సొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది హైదరాబాదే. 1857 తర్వాత బ్రిటిష్ వారు హైదరాబాద్‌ను కలుపుతూ గ్రేట్ ఇండియన్ రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదించారు. అయితే అందుకు నిజాం పాలకులు ఒప్పుకోలేదు. తమ రాజ్యంలో బ్రిటిష్ వారి చొరబాటును, ఆధిపత్యాన్నీ అంగీకరించలేదు. అయితే అభివృద్ధికి, ఆధునిక అవసరాలనూ గుర్తించిన నిజాం సర్కార్ సొంత రైల్వేను నెలకొల్పాలని నిర్ణయించింది. హైదరాబాద్ రైల్వే.. 143 ఏళ్ల ఘన చరిత్ర.. హైదరాబాద్ స్టేట్ రైల్వేది 143 ఏళ్ల ఘన చరిత్ర. స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో ఉన్నదంతా బ్రిటిష్ రైల్వేనే. దాని పేరు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. కానీ హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం బ్రిటిష్ వారికి సంబంధం లేని సొంత రైల్వే ఉండేది. అదే నిజాం స్టేట్ రైల్వే. 1870లో నిజాం స్టేట్ రైల్వే పురుడు పోసుకుంది. ఆ రోజుల్లో ఆరో నిజాం పాలనలో ప్రధానమంత్రిగా ఉన్న సాలార్ జంగ్.. నిజాం రైల్వేకు ప్రాణంపోశారు. ఇందుకోసం లండన్ మనీ మార్కెట్ నుంచి నేరుగా రుణం తీసుకున్నారు. రూ.4.3 కోట్లను మూడు విడతల్లో 6 శాతం గ్యారంటీ ఇచ్చి మరీ మూలధనాన్ని సేకరించారు. భారత పాలకులతో సంబంధం లేకుండా నేరుగా లండన్ మనీ మార్కెట్‌కు వెళ్లడం ఆ రోజుల్లో పెను సంచలనం. ఈ వార్తతో భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలకు నిజాం సంస్థానం పరిపాలన, వ్యవహార శైలి తెలిసింది. 1916.. కాచిగూడ రైల్వే స్టేషన్.. కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 1916లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌గా దీనిని వినియోగించారు. మోడ్రన్ హైదరాబాద్‌కు పునాది.. ఐదో నిజాం మీర్ తహీనియత్ అలీఖాన్ అఫ్జలుద్దౌల్లా పాలనా కాలంలో హైదరాబాద్ అభివృద్ధి బాట పట్టింది. ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఉన్న మీర్ తురా»Œ అలీఖాన్ సాలార్ జంగ్–1 నగరాభివృద్ధికి కారణం. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధితో పోటీ పడుతూ.. హైదరాబాద్ సంస్థానంలో సొంతంగా పోస్టల్, టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్తో పాటు స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. మోడ్రన్ హైదరాబాద్ నిర్మాణానికి సాలార్ జంగ్ ఆధునిక ఆలోచనా విధానమే నాంది. ఐదో నిజాం మరణానంతరం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. ఈయన హయాంలో కూడా ప్రధానమంత్రిగా సాలార్జంగ్ 1 ఉన్నారు. మోడ్రన్ హైదరాబాద్ కోసం సిద్ధం చేసిన ప్రణాళికల్లో రవాణా వ్యవస్థ ఏర్పాటు కూడా ఉంది. హైదరాబాద్‌లో తొలి రైల్వే లైన్.. కర్ణాటకలో ఉన్న బ్రిటిష్ రైల్వే జంక్షన్ వాడితో హైదరాబాద్ సంస్థానాన్ని అనుసంధానం చేసేలా 1871లో సికింద్రాబాద్–వాడి రైల్వే లైన్ పనులు మొదలై 1874 నాటికి పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి 1874 అక్టోబర్ 8న తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలు.. 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టింది.(హైæదరాబాద్ నుంచి వాడికి 115 మైళ్లు, 185 కిలోమీటర్లు). అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది. దీంతో స్వతంత్రంగా ఏర్పాటైన తొలి రైల్వేగా నిజాం రైల్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వేగా కూడా మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు అప్పట్లో సిద్ధమైనవే. కీలకమైన హైదరాబాద్–కాజీపేట–బెజవాడ లైన్ కూడా 1891 నాటికి రెడీ అయ్యింది. దీంతో మద్రాస్ రాష్ట్రంతో నిజాం స్టేట్‌కు దగ్గరి దారి కలిసింది. బొగ్గు రవాణా కోసం నల్ల బంగారు లోకం సింగరేణి పుట్టిల్లు ఇల్లెందుకు కూడా అప్పట్లోనే ట్రాక్ వేశారు. మద్రాస్‌లో తొలి గూడ్స్ రైల్ బ్రిటిష్ పాలిత భారతదేశంలో మద్రాస్‌లో రైలు రవాణా వ్యవస్థ కోసం 1832లో ప్రణాళికలు రచించారు. తొలిసారి 1837లో మద్రాస్ రెడ్ హిల్స్ రైల్వేస్టేషన్ నుంచి చింతాద్రిపేట్ వరకు రైలు నడిపించారు. విలియమ్స్ ఎవిరీ రూపొందించిన రోటరీ స్టీమ్ ఇంజన్ ద్వారా సర్ ఆర్థర్ కాటన్ ఈ రైలును రూపొందించారు. తొలి రోజుల్లో మద్రాస్‌లో రోడ్లు, భవనాల నిర్మాణం కోసం గ్రానైట్, రాళ్లు తరలించేందుకు గూడ్స్ రైలుగా నడిపించారు. ఆ తర్వాత 1845లో ధవళేశ్వరంలో రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. అదే ఏట ఆర్థర్ కాటన్ గోదావరి వంతెన నిర్మాణం కూడా ప్రారంభించారు. వంతెన నిర్మాణానికి రాళ్లను రైల్ ద్వారా తీసుకెళ్లారు. ఇదే ఏడాది మే 8న మద్రాస్ రైల్వే ఏర్పాటైంది. స్వాతంత్య్రానికి పూర్వమే అన్ని ప్రాంతాలకూ రవాణా 1891 నాటికి నిజాం స్టేట్ రైల్వే వేసిన బ్రాడ్ గేజ్ లైన్ 467 మైళ్లు. 1901 వచ్చే సరికి 391 మైళ్ల మీటర్ గేజ్ లైన్స్ నిర్మించారు. 1884లో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది. ఈ సంస్థ 1930లో తిరిగి పూర్తిగా హైదరాబాద్ స్టేట్ అధీనంలోకి వచ్చింది. నిజాం స్టేట్ రైల్వేకు అనుబంధంగా మరో సంస్థ ఉండేది. అదే గోదావరి వ్యాలీ రైల్వే. మహారాష్ట్రలోని మన్మాడ్‌ను లింక్ చేసే ప్రధాన లైన్ 1897లో మంజూరైంది. మూడేళ్లలో పనులన్నీ పూర్తై 1900 సంవత్సరంలో హైదరాబాద్–మన్మాడ్ మధ్య రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని కలిపే మరో లైన్ కాజీపేట–బలార్షా. అత్యంత కీలకమైన ఈ లైన్ పనులు 1921లో ప్రారంభమై దశలవారీగా పూర్తవుతూవచ్చాయి. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్లను కలుపుతూ 1928 నాటికి సంపూర్ణంగా వినియోగంలోకి వచ్చింది ఈ మార్గం. ఇక 117 మైళ్ల సికింద్రాబాద్–గద్వాల్ లైన్ 1914లో ప్రారంభమై 1916 నాటికి వినియోగంలోకి వచ్చింది. కారేపల్లి–కొత్తగూడం లైన్ 1925 నాటికి పని చేయడం ప్రారంభించింది. ముధ్ఖేడ్–ఆదిలాబాద్ లైన్ 1931లో వాడుకలోకి వచ్చింది. ఇలా హైదరాబాద్ నుంచి నలువైపులా పరుచుకున్న పట్టాలన్నీ అప్పట్లో నిర్మించినవే. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ఉన్న స్టేషన్లన్నీ ఆనాడు నిర్మించినవే. ఉమ్మడి రైల్, రోడ్ వ్యవస్థ మరో ప్రత్యేకత నిజాం రైల్వేకు ఉన్న మరో ప్రత్యేకత ఉమ్మడి రైల్, రోడ్డు వ్యవస్థ. 1932 జూన్ 15న రోడ్డు, రైలును లింక్ చేస్తూ జాయింట్ స్టీమ్‌ను తయారు చేశారు. దేశంలో అది తొలి ప్రయోగం. 1930లోనే మిచెల్ కార్కిక్ కమిటీ దేశంలో రోడ్డు, రైల్ రవాణా వ్యవస్థలను ఒకే సంస్థ నిర్వహణలో ఉంచాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఈ సిఫార్సుల అమలు సాధ్యం కాలేదు. హైదరాబాద్ స్టేట్ మాత్రం వెంటనే అమలులో పెట్టి అద్భుత ఫలితాలను సాధించింది. మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర, దక్షిణ భారతదేశాలతో కలిపే రైల్వే లైన్ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1950 నాటికి 2,353 కిలోమీటర్ల పట్టాలను పరిచింది నిజాం రైల్వే. నిజాం స్టేట్ రైల్వేను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్ రైల్వేలో కలిపేసింది. అది 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మారింది. బొంబాయిలో తొలి ప్యాసింజర్ రైలు దేశంలో తొలి ప్యాసింజర్ రైలు బొంబాయి(బొరిబందర్) నుంచి థానే వరకూ 1853 ఏప్రిల్ 8న నడిచింది. 14 బోగీలతో మూడు స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్లు సాహెబ్–సింధ్–సుల్తాన్ పేర్లతో 34 కిలోమీటర్లు 400 మంది ప్యాసింజర్లతో నడిపించారు. 1854 ఆగస్టు 15న కలకత్తా హౌరా నుంచి హుబ్లీ వరకూ 24 మైళ్లు ప్యాసింజర్ రైలు నడిపించారు. 1884లోనే బొంబాయి–థానే నుంచి కళ్యాణ్ వరకు రైల్వే లైన్ పొడిగించారు. ఇందుకోసం ఉల్లాస్ నదిపై దేశంలోనే తొలి రైలు వంతెన దపూరీ వయాడక్ట్‌ను నిర్మించారు. దక్షిణాదిన 1856 జూలై 1న మద్రాస్‌లోని రాయపురం/వేయసరపాడి నుంచి వల్లజా రోడ్(ఆర్కాట్) వరకు 60 మైళ్ల దూరం నడిపించారు. ప్రత్యేక రైలు బోగీ నిజాం పాలకులు ప్రయాణించడానికి ప్రత్యేక రైలు బోగీని తయారు చేయించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1904లో ఢిల్లీ దర్బార్‌కు వెళ్లేటప్పుడు ఈ ప్రత్యేక రైలు బోగీలోనే బయలుదేరారు. ఈ రైలులో నిజాం పాలకుల కోసం బెడ్రూమ్, కిచెన్, సెలూన్, బాత్రూమ్ ఉండేవి. సికింద్రాబాద్ గూడ్స్ రైలు గ్యారేజ్‌లో ఈ బోగీ ఉండేది. 2003లో ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం(ఎంఎంటీఎస్). ఇది సబర్బన్ రైల్వే వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశాయి. నగరంలోని 43 కిలోమీటర్ల(27 మైళ్లు) పరిధిలోని 27 స్టేషన్లను కలుపుతూ 2003 ఆగస్టు 9న అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఎంఎంటీఎస్‌ను ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు రూ.178 కోట్లు ఖర్చు చేశారు. తొలి దశలో ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–సికింద్రాబాద్, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– నాంపల్లి రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నా యి. రెండో దశలో ఫలక్‌నుమా నుంచి ఉందానగర్, సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు పొడిగించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. -
28 బంగారు బిస్కెట్లు స్వాధీనం
హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13 రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్న జీఆర్పీ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే, రోడ్ సేఫ్టీ డీజీపీ వివరాలు తెలిపారు. గత మూడేళ్లలో 17 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగరానికి ఇంత బంగారం ఎక్కడి నుంచి స్మగుల్ అవుతుందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పట్టాలు తప్పిన హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాదు నుంచి ముంబాయికి వెళ్లాల్సిన హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటిఎస్ రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. వివరాలు.. హైదరాబాదు రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరిన హుస్సేన్ సాగర్ రైలు ప్లాట్ఫారం 4 నుంచి రివర్స్ తీసుకువస్తుండగా.. రెండు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీ నంబరు 8, 9లు రెండూ పక్కకు ఒరిగి పోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దించారు. సికింద్రాబాదు నుంచి రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక రైలులో నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరమ్మత్తులు చేపట్టారు. పట్టాలు తప్పిన రైలును తొలగించేందుకు చాలా సమయంలో పట్టడంతో హైదరాబాదుకు చేరుకోవాల్సిన, హైదరాబాదు నుంచి వెళ్లాల్సిన రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. మద్రాసు వెళ్లాల్సిన చెన్నై, విశాఖపట్నం వెళ్లాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. లింగంపల్లి నుంచి హైదరాబాదు సర్వీసు ఎంఎంటిఎస్ రైలు సైతం ఆలస్యంగా నడిచింది. రాత్రి 9.30 గంటలకు హుస్సేన్‌సాగర్ రైలు బయలుదేరడంతో ప్రయాణికులు తీవ్ర అసంతప్తికి గురయ్యారు. కాగా.. గత ఐదేళ్లకాలంలో ఇక్కడ రైళ్లు పట్టాలు తప్పడం మూడవసారి. -
డిటెండ్ చేశారని...
కళాశాల యాజమాన్యం డిటెండ్ చేసిందని మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా మెడ్చెల్లోని సీఎమ్మార్ కళాశాలలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న భార్గవ్(20) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల నుంచి డిటెండ్ చేయడంతోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తోటి విద్యార్థులు అరోపిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆగ్రహించిన తోటి విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. కళాశాల యాజమన్యం తీరు వల్లే భార్గవ్ చనిపోయాడని వారు ఆరోపించారు. -
రూ. 40 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి ఆధారాలు లేకుండా తీసుకుపోతున్న రూ. 40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు అతడిని పక్కనే ఉన్న రైల్వే పోలీసు స్టేషన్‌కు తరలించారు. కూకట్పల్లి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు సదరు వ్యక్తి నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం శబరి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న వెండిని పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. -
ఫేమస్త్.. ఝాన్సీకి వాణి
రాతి కట్టడాల్లోని రాజసం నేటి అద్దాల మేడల్లో ఏదీ..? అలనాటి ఆ వైభవానికి ప్రతీకగా ఇప్పటికీ దృఢంగా నిలిచి ఉన్న పురాతన కట్టడాల్లో మన మొజాంజాహి మార్కెట్ ఒకటి. ఏడో నిజాం కాలంలో వెలసిన ఈ విపణి నాలుగు వీధుల మధ్య ఠీవీగా నిలబడి ఎన్ని రకాల వ్యాపారాల కళ కళలను చూసిందో. గత కాలానికి గుర్తుగా మొజాంజాహి మార్కెట్ బురుజులోని క్లాక్ టవర్ బూజు పట్టి ఆగిపోయినట్టు కనిపించింది. రాతి గోడలు.. గోపురాలకు నీడపట్టే గొడుగులాంటి బురుజులు.. ‘ఏ మార్కెట్ హమారా హై’ అంటూ రెక్కలు విదిలిస్తూ ఎగిరే పావురాలు.. ఇవన్నీ మొజాంజాహి మార్కెట్‌ను హుందాగా మార్చేశాయి. చిన్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్ దాటి బస్‌లో ప్రయాణం చేస్తున్న ప్రతిసారీ ఈ మార్కెట్ నన్ను ప్రత్యేకంగా ఆకర్షించేది. అప్పట్లో చేతికి గడియారం ఉండేది కాదు. అందుకే క్లాక్ టవర్ రాగానే టైం ఎంతైందో ఉత్సాహంగా చూసేదాన్ని. క్లాక్ టవర్ పక్కనే నన్ను ఊరిస్తూ మురిపించిన మరో ప్రధానమైన ఆకర్షణ ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’! ఒకసారా రెండుసార్లా, మార్కెట్ దాటిన ప్రతిసారీ నన్ను ఆకర్షించేది ఆ బోర్డు. దిల్సే బనాతా హై.. ఐస్‌క్రీమ్ తిందామని లోపలికి వెళ్తే కేవలం ఒక్క షాపు మాత్రమే కాదు అది ఏకంగా ఐస్‌క్రీమ్ కాంప్లెక్ ్స అని అర్థమవుతుంది. దాదాపు 80 ఏళ్ల నుంచి హ్యాండ్ మేడ్ ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్న 4 షాపులు పక్కపక్కనే కనిపిస్తాయి. ఫేమస్‌గా కనిపించే రెండు ‘ఫేమస్ ఐస్‌క్రీమ్’ షాపులు (ఇద్దరు అన్నదమ్ములవి). ఇటుపక్క ‘షా’ ఐస్‌క్రీమ్, అటుపక్క బిలాల్ ఐస్‌క్రీమ్. ఏ షాపులోకి వెళ్లినా.. చల్లని, చిక్కని హ్యాండ్‌మేడ్ ఐస్‌క్రీమ్ స్వాగతం పలుకుతుంది. నాకు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న..! వీళ్లంతా పక్కపక్కనే ఉంటూ ఇంత పోటీలో ఎలా వ్యాపారం చేస్తున్నారా అని. ఎవరి రుచి మరొకరితో తీసిపోదు. ఇంత చిక్కగా, ఇంత రుచిగా అరగంటలో ఒక బ్యాచ్ ఐస్‌క్రీమ్ ఎలా తాయారు చేస్తారు..? అని అడిగి చూడండి..! ‘హాత్ సే నహీ దిల్సే బనాతే హై..!’ అని సమాధానం వస్తుంది. పక్క పక్కనే ఇన్ని షాపులున్నా అన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. రాత్రి పన్నెండయినా ఇక్కడ జోరు తగ్గదు. ఇక రంజాన్ నెలలో అయితే రాత్రి రెండు దాటినా హడావుడి కొనసాగుతూనే ఉంటుంది. ఒకరి షాపులో మ్యాంగో, మరొకరి షాప్‌లో చికూ.. ఇంకొకరి షాపులో అంజీర్.. ఇలా నేచురల్ ఫ్రూటీ ఫ్లేవర్స్ చవులూరిస్తూనే ఉంటాయి. బ్రాండ్.. బ్యాండ్.. ఈ మధ్య కాలంలో ఎన్నో బహుళ జాతి ఐస్‌క్రీమ్ పార్లర్లు సిటీలో మనకు దర్శనమిస్తున్నాయి. నగరంలోని బ్రాండ్ పూజారులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. సంపన్న ప్రాంతాల్లో, మాల్స్‌లో ఐస్‌క్రీమ్‌ల హవా జోరుగా ఉంది. బిల్లు బ్యాండ్ బజాయించినా.. ఫర్వాలేదంటూ క్యూ కడుతున్నారు. అలా వేచి ఉండలేని వారి కోసం రోడ్డు పక్కనున్న కారు వద్దకే సర్వీసు అందించే సంస్కృతి ప్రారంభమైంది. డ్రెయిన్ ఇన్ సిస్టం పుణ్యమా అని ట్రాఫిక్ సమస్యలూ తలెత్తుతున్నాయి. ఐస్‌క్రీమ్ టైం అయిపోయాక.. అంటే ఏ తెల్లవారుజామునో అటుగా వాకింగ్‌కు వెళ్తే.. రాత్రి తాలూకు హిమక్రీమ్ ఫ్లేవర్స్ ఖాళీ కప్పుల రూపంలో కనిపిస్తాయి. ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాలు కింద పెట్టకపోయినా పర్లేదు.. కానీ, తినేసిన తర్వాత ఆ అంతర్జాతీయ బ్రాండ్ ఐస్‌క్రీమ్‌కు తగ్గట్టు ఇంటర్నేషనల్ సివిక్ సెన్స్ పాటించి రెండడుగులు వేసి చెత్తబుట్ట వరకు వెళ్తే.. పెద్ద ఖర్చు కాదు.. కొన్ని కేలరీల శక్తి తప్ప. లోకల్ ఫ్లేవర్.. అసలు నన్నడిగితే రాతి మీద చేసే ఆ కొత్త తరం ఐస్‌క్రీమ్‌లతో పోలిస్తే మన పాతరాతి మార్కెట్లోని లోకల్ ఫ్లేవర్ మాజానే వేరు. మన లోకల్ డైరీ పాలతో, మన వ్యక్తుల చేతుల్లో.. మన మొజాంజాహి మార్కెట్లో మన ఇండియన్ ఫ్లేవర్స్‌తో తయారైన లోకల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాదీ భావనను పెంపొందిస్తుంది. ఎలాంటి సీజన్ అయినా, ఎలాంటి మూడ్ అయినా ఐస్‌క్రీమ్ ఎప్పుడూ సూపర్ిహ ట్టే. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎవరైనా ఇష్టపడేది ఐస్‌క్రీమ్. ఇవన్నీ ఆలోచిస్తూ నేను కాసేపు కేలరీల గొడవ మరచిపోయి మొజాంజాహి మార్కెట్లో ‘త్రీ ఇన్ వన్ స్పెషల్’ ఐస్‌క్రీమ్ ఎంజాయ్ చేసేశాను. ఒక్కసారి ఐస్‌క్రీమ్ చుట్టూ ఉన్న జ్ఞాపకాలన్నీ కదిలాయి. అసలు ఐస్‌క్రీమ్ అంటే చిన్నప్పుడు ఎంత గొప్పో. ఎండాకాలంలో ఐస్ అబ్బాయి గంట వినిపిస్తే బండి చుట్టూ మూగిపోయే రోజులు గుర్తొచ్చాయి. పది పైసలకు పుల్ల ఐస్, పావలాకి పాల ఐస్, అందులోనూ స్పెషల్‌గా సేమియా ఐస్. రూపాయికి కప్పైస్. ఇప్పుడా చారాణా, ఆఠాణా, బారాణాలే లేవు.. రూపాయలు పదులైతే కానీ విలువ లేదు. అయినా ఐస్‌క్రీమ్‌కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే మొజాంజాహిలో ఫేమస్ ఐస్ అయినా బారాదరిలో స్టోన్ ఐస్ అయినా.. పదులైనా వందలైనా ఐస్‌క్రీమ్ పదికాలాలు చల్లగానే ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎన్ని ఐస్‌లు రుచి చూసినా మన హైదరాబాదీ లోకల్ ఫ్లేవర్‌ని మాత్రం మిస్‌కాకండి.