
సాక్షి, భూపాలపల్లి : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. మృతుని జేబులో ఉన్న అక్రిడిటేషన్ కార్డు ఆధారంగా అతన్ని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల న్యూస్ కంట్రిబ్యూటర్ మైస బాలయ్యగా గుర్తించారు. బాలయ్య సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారు. రైల్వే పోలీసులు భూపాలపల్లి రిపోర్టర్‌కు సమాచారం అందించారు.