contributor
-
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఎంఎంటీఎస్ రైలు ఢీకొని సాక్షి విలేకరి మృతి
హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో ‘సాక్షి’విలేకరి దుర్మరణం చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ ప్రాంతానికి చెందిన బాల మైసయ్య(40) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో బోరబండ–హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. దీంతో బాల మైసయ్య దుర్మరణం చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మైసయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు బాల మైసయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రం ‘సాక్షి’విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వరూప, కుమారులు వసంత్(10), రిషిత్(7) ఉన్నారు. శనివారం మంచిర్యాలలో జరిగే తన అక్క కుమార్తె వివాహానికి హైదరాబాద్‌లో ఉండే బంధువులను తీసుకెళ్లేందుకు వచ్చి మృత్యువాతపడ్డారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రేగొండ కంట్రిబ్యూటర్ దుర్మరణం
సాక్షి, భూపాలపల్లి : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు ప్రమాదంలో మరణించాడు. మృతుని జేబులో ఉన్న అక్రిడిటేషన్ కార్డు ఆధారంగా అతన్ని భూపాలపల్లి జిల్లా రేగొండ మండల న్యూస్ కంట్రిబ్యూటర్ మైస బాలయ్యగా గుర్తించారు. బాలయ్య సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నారు. రైల్వే పోలీసులు భూపాలపల్లి రిపోర్టర్‌కు సమాచారం అందించారు. -
ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు
దుబాయ్: వాషింగ్టన్ పోస్ట్ కంట్రిబ్యూటర్ జమాల్ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్ పోస్ట్‌లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు. ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్‌లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు. -
బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం
న్యూఢిల్లీ: తమ పార్టీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకమని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ హాయంలో కుంభకోణాలు జరగకుంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండేవని అన్నారు. 'లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. నరేంద్ర మోడీ ప్రచార సారథ్యం బీజేపీకి బాగా కలసివచ్చింది. అయితే మా విజయానికి ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా దోహదపడ్డాయి. ఈ విషయాన్ని విస్మరించలేం' అని తన నివాసంలో జెండావిష్కరణ అనంతరం అద్వానీ అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ 282 లోక్‌సభ సీట్లు నెగ్గగా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడు లేనంతగా చిత్తుగా ఓడిపోయి 42 సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి ఓటు వేశారని, ఇందులో వ్యక్తుల ప్రమేయం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.