బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం | Congress biggest contributor to BJP's win: L.K. Advani | Sakshi
Sakshi News home page

బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం

Published Fri, Aug 15 2014 2:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం - Sakshi

బీజేపీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకం

న్యూఢిల్లీ: తమ పార్టీ విజయంలో కాంగ్రెస్ పాత్ర కీలకమని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ వ్యాఖ్యానించారు. యూపీఏ హాయంలో కుంభకోణాలు జరగకుంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండేవని అన్నారు.

'లోక్సభ ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. నరేంద్ర మోడీ ప్రచార సారథ్యం బీజేపీకి బాగా కలసివచ్చింది. అయితే మా విజయానికి ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా దోహదపడ్డాయి. ఈ విషయాన్ని విస్మరించలేం' అని తన నివాసంలో జెండావిష్కరణ అనంతరం అద్వానీ అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ 282 లోక్సభ సీట్లు నెగ్గగా, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడు లేనంతగా చిత్తుగా ఓడిపోయి 42 సీట్లకు  పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి ఓటు వేశారని, ఇందులో వ్యక్తుల ప్రమేయం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement