కాంగ్రెస్ ఓటమి ముందే నిశ్చయం: అద్వానీ | Affirmation before the defeat of the Congress: Advani | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఓటమి ముందే నిశ్చయం: అద్వానీ

Published Wed, Mar 26 2014 3:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

కాంగ్రెస్ ఓటమి ముందే నిశ్చయం: అద్వానీ - Sakshi

కాంగ్రెస్ ఓటమి ముందే నిశ్చయం: అద్వానీ

 న్యూఢిల్లీ: గత 15 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ముందే నిశ్చయమైపోయిందని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఎద్దేవా చేశారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఏర్పడేందుకు పదేళ్లపాటు అసమర్థ పాలనతో బాటలు వేసిన ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తమ పార్టీ రుణపడి ఉంటుందంటూ తన బ్లాగ్‌లో చురకలంటించారు.

‘యూపీఏ సర్కారు పాలనలో జరిగినన్ని కుంభకోణాలు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. అవినీతే యూపీఏ ప్రభుత్వ లక్షణంగా మారింది. ఈ ప్రభుత్వాన్ని త్వరగా గద్దె దించేందుకు ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 1952 నుంచి నేను అన్ని సాధారణ ఎన్నికల్లో పాల్గొన్నా. ప్రస్తుతం కాంగ్రెస్ ఓటమి నిశ్చయమైనట్లుగా గత 15 సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు’’ అంటూ దుయ్యబట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement