సాక్షి,హైదరాబాద్:నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బుధవారం(డిసెంబర్ 11) పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఉత్పన్నమైన రాపిడ్ ఫోర్స్‌తో మంటలంటుకున్నాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నం చేశారు.
ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసింది. బంక్ పక్కనే నాంపల్లి రైల్వేస్టేషన్ ఉండడంతో స్థానికులు కంగారు పడ్డారు. అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment