28 బంగారు బిస్కెట్లు స్వాధీనం
Published Fri, Sep 15 2017 2:05 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM
హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13 రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపడుతున్న జీఆర్పీ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే, రోడ్ సేఫ్టీ డీజీపీ వివరాలు తెలిపారు. గత మూడేళ్లలో 17 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగరానికి ఇంత బంగారం ఎక్కడి నుంచి స్మగుల్ అవుతుందో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Advertisement
Advertisement